భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఫుల్‌ క్రేజ్‌.. టికెట్ క‌నీస ధ‌ర‌ రూ. 1.8 కోట్లు? | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఫుల్‌ క్రేజ్‌.. టికెట్ క‌నీస ధ‌ర‌ రూ. 1.8 కోట్లు?

Published Mon, Mar 4 2024 11:50 AM

Ticket Prices Of IND-PAK T20 World Cup 2024 Match In New York Sets Internet On Fire - Sakshi

వరల్డ్‌ క్రికెట్‌లో పాకిస్తాన్‌- భారత్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజు గురి​ంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దాయాదుల జట్లు ఎప్పుడు తలపడతాయా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు. చిర‌కాల ప్ర‌త్య‌ర్థులైన ఇండియా, పాకిస్తాన్‌లు ఎక్క‌డ త‌ల‌ప‌డినా ఇరుదేశాల ఫ్యాన్స్‌తో స్టేడియం నిండిపోతుంది.

ఇప్పుడు మరోసారి విశ్వవేదికపై దాయాదుల పోరుకు రంగం సిద్దమైంది. టీ20 వరల్డ్‌కప్‌-2024లో పాక్‌-భారత్‌ జట్లు తాడోపేడో తెల్చుకోన్నాయి. జూన్‌ 9న న్యూయర్క్‌ వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. 

వామ్మో ఇంత ధర?
అయితే దాదాపు ఏడాది తర్వాత చిరకాల ప్రత్యర్ధిలు తలపడనుండడంతో టిక్కెట్లకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక్కో టిక్కెట్‌ ధర అత్యధికంగా రూ. 1.8 కోట్లు పలుకుతోంది. అవును మీరు విన్నది నిజమే. టీ20 వరల్డ్‌కప్‌ టిక్కెట్లను ఐసీసీ ప‌బ్లిక్ బ్యాల‌ట్ ద్వారా విక్రయిస్తోంది.

ఈ క్రమంలో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు టికెట్ల‌ ధ‌రను 6 డాల‌ర్ల‌ నుంచి 400 డాల‌ర్లుగా నిర్ణ‌యించింది. భార‌తీయ క‌రెన్సీలో క‌నీస టికెట్ ధ‌ర రూ.497 కాగా అత్య‌ధిక ధ‌ర రూ.33148. అయితే సెకెండరీ మార్కెట్‌లలో మాత్రం టిక్కెట్ల ధరలు ఆకాశన్నంటాయి.

స్టబ్‌హబ్‌, సీట్‌గీక్‌ వంటి ఆన్‌లైట్‌ ప్లాట్‌ఫారమ్స్‌ భారత్‌-పాక్‌ మ్యాచ్‌ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకుంటున్నాయి. అధికారికంగా 400 డాల‌ర్లు ఉన్న టిక్కెట్‌ సెకెండరీ మార్కెట్‌లో 40,000 డాల‌ర్లు పలుకుతున్నట్లు తెలుస్తోంది. టాక్స్‌తో కలిపి ఏకంగా 50,000 డాలర్లు చెల్లాంచిల్సి ఉంటుంది. అంటే భారత కరెన్సీలో రూ.40లక్షల పైమాటే.

యూఎస్‌ఏ టూడే రిపోర్ట్‌ ప్రకారం.. ఆన్‌లైన్‌  ప్లాట్‌ఫారమ్ సీట్‌గీక్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ టిక్కెట్ల ధరలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. సీట్‌గీక్‌లో అత్య‌ధిక ఖరీదైన టికెట్ ధర 175,000 డాలర్లగా నిర్ణయించినట్లు యూఎస్‌ఏ టూడే తమ కథనంలో పేర్కొంది. అంటే భారత కరెన్సీలో రూ.1.4 కోట్లు. అద‌న‌పు చార్జీ రూ. 4 ల‌క్ష‌లు క‌లిపి మొత్తంగా టికెట్ ధ‌ర రూ. 1.86 కోట్లు.
 

Advertisement
Advertisement