గుంటూరు, సాక్షి: తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో జరిగిన ఘటనపై యెల్లో మీడియా ఇష్టానుసారం కథనాలు ఇస్తోంది. అయితే ఆ ప్రచారాన్ని ఖండించారు శివకుమార్. గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి తనను వ్యక్తిగతంగా దుర్భాషలాడానని, అందుకే ఆ గొడవ జరిగిందని ఆయన తెలియజేశారు.
‘‘ఐతానగర్‌లో నేను నా భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లాం. ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి నన్ను నానా దుర్భాషలాడాడు. వైఎస్సార్‌సీపీపై ద్వేషంతో రగిలిపోతూ.. నా భార్య ముందే నన్ను తిట్టాడు.
పోలింగ్ బూత్‌లోకి వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడూ దుర్భాషలాడుతూనే ఉన్నాడు. గొట్టిముక్కల సుధాకర్ బెంగళూరులో ఉంటున్నారు. టీడీపీకి చెందిన కమ్మ సామాజిక వర్గం వ్యక్తి. ‘‘నువ్వు అసలు కమ్మొడివేనా? అంటూ నన్ను దూషించాడు.
‘‘పోలింగ్ బూత్ వద్ద మద్యం మత్తులో అందరి ముందు చాలా దురుసుగా ప్రవర్తించారు. పోలింగ్ బూత్‌లో ఉదయం నుండి అతడు హల్‌చల్ చేస్తున్నట్లు అక్కడి ఓటర్లే చెప్పారు. టీడీపీ జనసేన వాళ్లు ఎక్కడెక్కడి నుండో వాళ్ల మనుషులను దింపారు. వాళ్ల ద్వారా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారు అని శివకుమార్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment