Photo: IPL Website
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఆర్‌సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ అనుభంలో మరోసారి మెరిశాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ నితీశ్ రాణా ఔట్ విషయంలో దినేశ్ కార్తిక్ చూపించిన స్మార్ట్‌నెస్‌కు అభిమానులు ముగ్దులయ్యారు.
విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ మైకెల్ బ్రాస్‌వెల్ వేశాడు. ఓవర్ తొలి బంతిని నితీశ్ రానా రివర్స్‌స్వీప్‌కు యత్నించాడు. అయితే బంతి గ్లోవ్స్‌కు తాకి కీపర్ కార్తిక్ చేతుల్లో పడింది. అయితే బ్రాస్‌వెల్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. ఇక్కడే కార్తిక్ తన తెలివిని ఉపయోగించాడు. ఎల్బీకి కాకుండా క్యాచ్ అప్పీల్ కోసం రివ్యూకు వెళ్లాడు. రిప్లేలో బంతి గ్లోవ్స్‌ను తాకినట్లు తేలింది.
దీంతో అంపైర్ నితీశ్ రానా ఔటైనట్లు ప్రకటించాడు. రివ్యూ విషయంలో కార్తిక్ స్మార్ట్‌గా వ్యవహరించడంతో సహచరుల చేత అభినందనలు అందుకున్నాడు. అటు అభిమానులు కూడా ''కీపింగ్‌లో అనుభవం.. ఆ మాత్రం ఉంటుందిలే.. నీ కాన్ఫిడెంట్‌కు ఫిదా కార్తిక్'' అంటూ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment