
జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా వెటరన్ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ తాను ఎదుర్కొన్న ఆటగాళ్లు, తనతో కలిసి ఆడిన 11 మంది అత్యుత్తమ ఆటగాళ్లను ప్రకటించాడు. ఈ 11మంది ఆటగాళ్లలో ఇద్దరు విదేశీయులు తప్ప మిగతావారంతా ప్రొటీస్ జట్టుకు ఆడినవారే కావడం గమనార్హం. ఇందులో టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమి స్మిత్, శ్రీలంక మాజీ వికెట్‌కీపర్ కుమార సంగక్కరలు ఓపెనర్లుగా, ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన మాజీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ నాలుగో స్థానంలో, వరల్డ్ బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తుంపుపొందిన జాంటీ రోడ్స్ ఐదో స్థానంలో ఉన్నారు. 6వ స్థానంలో దక్షిణాఫ్రికా ప్రస్తుత వన్డే వికెట్ కీపర్‌గా ఉన్న క్వింటన్ డికాక్‌ను ఎంపిక చేశాడు. బౌలర్ల జాబితాలో ఆసీస్ నుంచి మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ చోటు సంపాధించగా మిగతావారంతా దక్షిణాఫ్రికాకు చెందిన బౌలర్లే ఉన్నారు. వీరిలో దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ అలెన్ డొనాల్డ్ కూడా ఉన్నాడు.
స్టెయిన్ అత్యుత్తమ జట్టు : గ్రేమి స్మిత్, కుమార సంగక్కర, డేవ్ హాకిన్, జాక్ కలిస్, జాంటీ రోడ్స్, క్వింటన్ డికాక్, బ్రెట్ బార్గియాచి, పీటర్ లాంబార్డ్, బ్రెట్ లీ, పాల్ హరిస్, అలెన్ డొనాల్డ్
Comments
Please login to add a commentAdd a comment