-
మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థం లేని వాగుడు: సౌతాఫ్రికా స్టార్ పోస్ట్ వైరల్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఐదో పరాజయాన్ని నమోదు చేసింది. రాజస్తాన్ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయి పరాభవాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ విఫలమై ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాటర్‌గా వైఫల్యం.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కాదని తానే బౌలింగ్ అటాక్ ఆరంభించడం.. ప్రత్యర్థి పరుగులు రాబడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నపుడైనా బుమ్రాను బరిలోకి దించకపోవడం వంటివి ఇందుకు కారణం. ఇదంతా ఒక ఎత్తైతే రాజస్తాన్ చేతిలో ఓటమి తర్వాత విషయాన్ని తేలిక చేసేలా హార్దిక్ పాండ్యా నవ్వుతూ మాట్లాడటం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు కూడా చిరాకు తెప్పించింది. తమ జట్టులోని ఆటగాళ్లంతా ప్రొఫెషనల్స్ అని.. వారికి తానేమీ కొత్త నేర్పించాల్సిన అవసరం లేదనడం.. ఆటగాళ్లకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొనడం.. తానేదో కెప్టెన్‌గా అంతా సరిగ్గానే చేశానన్నట్లుగా మాట్లాడటం ఒకింత ఆగ్రహం కూడా తెప్పించాయి. ఓడినా.. మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థం లేని వాగుడు ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘తమ మనసులో ఏముందో దానిని మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా ఆటగాళ్లు బయటికి చెప్పే రోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నా. మౌనంగా ఉంటూ.. అంతా బాగానే ఉందనే భావన కల్పించేలా రక్షణాత్మక ధోరణి అవలంభించకుండా కుండబద్దలు కొట్టాలి. తదుపరి ఓటమి. మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థంలేని వాగుడు’’ అంటూ డేల్ స్టెయిన్ ఘాటు విమర్శలు చేశాడు. తన పోస్ట్‌లో నేరుగా హార్దిక్ పాండ్యా పేరు ప్రస్తావించకపోయినా ఈ సౌతాఫ్రికా స్టార్ అతడిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఓటమి నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మాట్లాడిన తర్వాత డేల్ స్టెయిన్ ఈ మేరకు ట్వీట్ చేయడం ఇందుకు కారణం. I really look forward to the day players might say what’s honestly on their mind. Instead we some how dumbed ourselves and our minds into saying the usual safe thing, lose the next game, smile and then repeat that nonsense again. 🙄 PS. Qdk, I love you — Dale Steyn (@DaleSteyn62) April 22, 2024 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ స్కోర్లు: ►వేదిక: సవాయి మాన్సింగ్ స్టేడియం, జైపూర్ ►టాస్: ముంబై.. బ్యాటింగ్ ►ముంబై స్కోరు: 179/9 (20) ►రాజస్తాన్ స్కోరు: 183/1 (18.4) ►ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో ముంబైపై రాజస్తాన్ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సందీప్ శర్మ(5/18)- రాజస్తాన్ ►టాప్ స్కోరర్: యశస్వి జైస్వాల్(60 బంతుల్లో 104 నాటౌట్)- రాజస్తాన్. THAT 💯 moment! ☺️ Jaipur is treated with a Jaiswal special! 💗 Scorecard ▶️ https://t.co/Mb1gd0UfgA#TATAIPL | #RRvMI | @ybj_19 pic.twitter.com/i0OvhZKtGI — IndianPremierLeague (@IPL) April 22, 2024 -
ధనాధన్ ధోని కథ వేరు.. అందుకే కాస్త ముందుగానే: డేల్ స్టెయిన్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఐసీసీ టైటిళ్ల(3) వీరుడికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడుతూ అభిమానుల అలరిస్తున్న తలా.. 42 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నాడు. వింటేజ్ ధోనిని గుర్తుచేస్తూ ఐపీఎల్-2024లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడుతున్నాడు. నిజానికి ధోనిని చూసేందుకే చాలా మంది స్టేడియాలకు వెళ్తుండగా.. ధోని బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే టీవీలకు అతుక్కుపోయేవాళ్లు కోకొల్లలు. అందులో నేనూ ఒకడినే అంటున్నాడు సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్. ‘‘ఐపీఎల్‌తో ఇక్కడ మాత్రమే కాదు.. సౌతాఫ్రికాలో నాలాంటి ఎంతో మందికి ఎనలేని సంతోషాన్నిస్తున్నాడు. నిజం చెప్పాలంటే నేను టీవీ ఎక్కువగా చూడను. అయితే, ఐపీఎల్ సమయంలో మాత్రం సీటుకు అతుక్కుపోయి మరీ కళ్లప్పగించి చూస్తుంటా. కానీ నా గర్ల్‌ఫ్రెండ్ టీవీ పగిలిపోతుందని అంటూ ఉంటుంది. ఎందుకంటూ ఎప్పుడూ అది.. ఐపీఎల్‌కు స్టక్ అయిపోయింది ఉంటుందిలెండి. ఎంఎస్ షాట్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా. ఓ అభిమానిగా ఆ కోణంలోనే ధోని ఆటను చూస్తున్నా. అతడు కొట్టే ప్రతీ షాట్‌ను ఆస్వాదిస్తున్నా. నిజం చెప్తున్నా తన ఇన్నింగ్స్ చూసినప్పుడల్లా నాకు ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. కాబట్టి ధోనిని మిడిలార్డర్లో తీసుకువస్తే ఇంకా బాగుంటుంది కదా’’ అని స్టెయిన్ గన్ డేల్ స్టెయిన్ జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై శుక్రవారం నాటి మ్యాచ్ నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక స్టెయిన్ వ్యాఖ్యలకు ఫిదా అవుతున్న ధోని ఫ్యాన్స్.. ‘‘మా మనసులోని మాట నువ్వు చెప్పావు.. తలా ఫినిషర్‌గా కాకుండా మిడిలార్డర్లో వస్తే మరిన్ని మెరుపులు చూడవచ్చు’’ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే, అదే సమయంలో ధోని మోకాలి నొప్పిని గుర్తుచేసుకంటూ .. ‘‘తలా అలా క్రీజులోకి వచ్చి ఒక్క షాట్ ఆడినా సంతోషమే. తను బాగుండటమే ముఖ్యం’’ అని సర్దిచెప్పుకొంటున్నారు. #Dhoni can reach anything and everything. 🔥💪 pic.twitter.com/bAaxqdezgb — Satan (@Scentofawoman10) March 31, 2024 కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోని.. కేవలం 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అదే విధంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆరో స్థానంలో వచ్చి 4 బంతుల్లోనే 20 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. సీఎస్కే ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వారెవ్వా.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు?: సౌతాఫ్రికా దిగ్గజం
ఐపీఎల్ తాజా సంచలనం మయాంక్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ‘ఢిల్లీ ఎక్స్‌ప్రెస్’ స్పీడుకు మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. మయాంక్ పేస్ నైపుణ్యాలు అద్భుతమని కొనియాడాడు. వేగంగా బంతిని విసరడంతో పాటు లైన్ అండ్ లెంగ్త్‌పై కూడా మయాంక్ పూర్తి నియంత్రణ కలిగి ఉండటం ముచ్చటగొలుపుతోందని బ్రాడ్ హర్షం వ్యక్తం చేశాడు. అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవడం పట్ల సాటి ఫాస్ట్‌బౌలర్‌గా ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అంతేగాకుండా త్వరలోనే మయాంక్ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని.. రానున్న టెస్టు సిరీస్‌లో అతడు గనుక ఆడితే.. జాగ్రత్తగా ఉండాలని స్టీవ్ స్మిత్‌కు ఇప్పటికే సందేశం పంపినట్లు బ్రాడ్ పేర్కొన్నాడు. మరోవైపు.. సౌతాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ సైతం మయాంక్ యాదవ్ సూపర్‌ఫాస్ట్ డెలివరీలు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ‘‘గంటకు 155.8 కిలో మీటర్ల వేగం. మయాంక్ యాదవ్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు!’’ అంటూ ఎక్స్ వేదికగా మయాంక్‌ను అభినందించాడు. ఇక భారత మాజీ బ్యాటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ అంటూ అతడిపై ప్రశంలస వర్షం కురిపించాడు. 𝗦𝗽𝗲𝗲𝗱𝗼𝗺𝗲𝘁𝗲𝗿 goes 🔥 𝟭𝟱𝟱.𝟴 𝗸𝗺𝘀/𝗵𝗿 by Mayank Yadav 🥵 Relishing the raw and exciting pace of the debutant who now has 2️⃣ wickets to his name 🫡#PBKS require 71 from 36 delivers Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL |… pic.twitter.com/rELovBTYMz — IndianPremierLeague (@IPL) March 30, 2024 155,8 KPH Mayank Yadav where have you been hiding! — Dale Steyn (@DaleSteyn62) March 30, 2024 కాగా ఐపీఎల్-2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 21 ఏళ్ల మయాంక్ యాదవ్ శనివారం అరంగేట్రం చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో తన తొలి మ్యాచ్ ఆడిన ఈ రైటార్మ్ పేసర్.. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తూ ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు. తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సొంతమైదానంలో పంజాబ్‌పై లక్నో విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా మయాంక్ యాదవ్ దేశవాళీ క్రికెట్లో సొంత జట్టు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్.. తాజాగా పంజాబ్‌పై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. తదుపరి మంగళవారం ఆర్సీబీతో తలపడనుంది. చదవండి: #Mayank Yadav: నేను ఆరాధించే ఫాస్ట్ బౌలర్ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్‌గన్’ -
IPL 2024: సన్‌రైజర్స్ కోచ్‌గా దూరం.. ఆ ‘టీమ్’లో స్పీడ్‌గన్!
ఐపీఎల్ తాజా సీజన్ ఆరంభానికి తరుణం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా మార్చి 22న క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌కు తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరుగనుంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి దశలో 21 మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఓవైపు క్రికెటర్లు ఆటతో అలరిస్తుంటే.. వారి ఆటను విశ్లేషిస్తూ మాటల గారడితో అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమైన కామెంటేటర్లు సిద్ధమవుతున్నారు. ఇందులో టీమిండియా మాజీ హెడ్‌కోచ్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి, దిగ్గజం సునిల్ గావస్కర్ సహా భారత్ నుంచి తరలివెళ్లి అమెరికాకు ఆడుతున్న ఉన్ముక్త్ చాంద్ వరకు లిస్టు పెద్దదిగానే ఉంది. ఇక వ్యక్తిగత కారణాల దృష్ట్యా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా తప్పుకొన్న సౌతాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. ఇంటర్నేషనల్: స్టీవ్ స్మిత్, స్టువర్ట్ బ్రాడ్, డేల్ స్టెయిన్, జాక్వెస్ కలిస్, టామ్ మూడీ, పాల్ కాలింగ్‌వుడ్. ఇంగ్లిష్ కామెంట్రీ: సునిల్ గావస్కర్, రవి శాస్త్రి, బ్రియన్ లారా, మాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్, మైఖేల్ క్లార్క్, సంజయ్ మంజ్రేకర్, ఆరోన్ ఫించ్, ఇయాన్ బిషప్, నిక్ నైట్, సైమన్ కటిచ్, డ్యారీ మోరిసన్, క్రిస్ మోరిస్, క్యాటీ మార్టిన్, సామ్యూల్ బద్రి, గ్రేమ్ స్వాన్, దీప్‌దాస్ గుప్తా, హర్షా భోగ్లే, పుమెలెలో ముబాంగ్వా, అంజుమ్ చోప్రా, మురళి కార్తిక్, డబ్ల్యూవీ రామన్, నటాలీ జెర్మనోస్, డారెన్ గంగ, మార్క్ హొవార్డ్, రోహన్ గావస్కర్. తెలుగు: మిథాలీ రాజ్, ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు, టి. సుమన్, కళ్యాణ్ కృష్ణ, జ్ఞానేశ్వర్రావు, రాకేశ్ దేవా రెడ్డి, డానియల్ మనోహర్, రవి రాక్లే, శశికాంత్ ఆవులపల్లి, ఎం ఆనంత్ శ్రీక్రిష్ణ, వింధ్య మేడపాటి, గీతా భగత్, అంబటి రాయుడు. హిందీ: హర్భజన్ సింగ్ ఇర్ఫాన్ పఠాన్ అంబటి రాయుడు రవిశాస్త్రి సునీల్ గవాస్కర్ వరుణ్ ఆరోన్ మిథాలీ రాజ్ మహ్మద్ కైఫ్ సంజయ్ మంజ్రేకర్ ఇమ్రాన్ తాహిర్ వసీం జాఫర్ గురుకీరత్ మన్ ఉన్ముక్త్ చంద్ వివేక్ రజ్దాన్ రజత్ భాటియా దీప్ దాస్‌గుప్తా రామన్ భానోట్ పదమ్జెట్ సెహ్రావత్ జతిన్ సప్రు. -
IPL 2024: సన్‌రైజర్స్ కొత్త బౌలింగ్ కోచ్ అతడే.. కోచింగ్ సిబ్బంది పూర్తి వివరాలు
రానున్న ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం బౌలింగ్ కోచ్‌గా ఉన్న డేల్ స్టెయిన్ వ్యక్తిగత కారణాల చేత 2024 సీజన్ మొత్తానికి దూరంగా ఉండనుండటంతో ఎన్‌ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ ఫ్రాంక్లిన్‌ను ఎంపిక చేసింది. అయితే ఫ్రాంక్లిన్ ఈ విధుల్లో తాత్కాలికంగా మాత్రమే కొనసాగనున్నాడు. స్టెయిన్ తిరిగి రాగానే ఫ్రాంక్లిన్ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు. స్టెయిన్ 2022లో ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. Dale Steyn will not be joining us this season due to personal reasons and James Franklin will be the Pace Bowling Coach for this season. Welcome on board, James! 🙌🧡#IPL2024 pic.twitter.com/CefHEbVSLy — SunRisers Hyderabad (@SunRisers) March 4, 2024 ఫ్రాంక్లిన్ ట్రాక్ రికార్డు విషయానికొస్తే.. బౌలింగ్ కోచ్‌గా ఇవే అతనికి తొలి బాధ్యతలు. గతంలో అతను డర్హమ్ కౌంటీ జట్టుకు, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. ఫ్రాంక్లిన్‌కు బౌలింగ్ కోచ్‌గా అనుభవం లేనప్పటికీ.. అతను ఐపీఎల్‌కు సుపరిచితుడే. 2011, 2012 సీజన్లలో అతను ఆటగాడిగా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఫ్రాంక్లిన్.. సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరీకి రిపోర్ట్ చేయనున్నాడు. వెటోరీ కూడా న్యూజిలాండ్ దేశస్తుడే. ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్‌గా వెటోరీకి కూడా ఇవే తొలి బాధ్యతలు. గత ఐపీఎల్ సీజన్ ముగిసిన అనంతరం వెటోరీ సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌గా నియమించబడ్డాడు. వెటోరీ, ఫ్రాంక్లిన్ గతంలో మిడిల్సెక్స్ కౌంటీకి, హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్హమ్ ఫీనిక్స్కు కలిసి పని చేశారు. ఫ్రాంక్లిన్ కెరీర్ విషయానికొస్తే.. ఇతను 2001-2013 మధ్యలో న్యూజిలాండ్ తరఫున 31 టెస్ట్‌లు, 110 వవ్డేలు, 38 టీ20లు ఆడి 183 వికెట్లు సాధించాడు. ఫ్రాంక్లిన్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 20 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇవాళ ఉదయమే కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్ పేరును ప్రకటించింది. మార్క్రమ్ నుంచి కమిన్స్ బాధ్యతలు చేపడతాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్ వివరాలు.. హెడ్ కోచ్: డేనియల్ వెటోరీ బ్యాటింగ్ కోచ్: హేమంగ్ బదానీ స్పిన్ బౌలింగ్ మరియు స్ట్రాటజిక్ కోచ్: ముత్తయ్య మురళీథరన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్: జేమ్స్ ఫ్రాంక్లిన్ (తాత్కాలికం) అసిస్టెంట్ కోచ్: సైమన్ హెల్మట్ ఫీల్డింగ్ కోచ్: ర్యాన్ కుక్ సన్‌రైజర్స్ జట్టు వివరాలు.. అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు అన్మోల్ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు (కెప్టెన్) భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement