సాక్షి, నంద్యాల: టీడీపీ అధినేత చంద్రబాబు తన హయాంలో చేసిన లక్షల కోట్ల అప్పులు తానే కడతారా అని ప్రశ్నించారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఎన్నికల నామినేషన్‌ను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, బుగ్గన నంద్యాలలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బుగ్గన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అప్పు ఆయన కడతారా?. 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. కోట్ల సూర్యప్రకాశ్ ఒక్కరోజు నాతో పాటు వచ్చి డోన్‌లో తిరగండి. పుష్కర కాలం ఎంపీ పదవి అనుభవించి మీరేం సాధించారో చెప్పండి.
ప్రతీ దానికి ట్యాక్స్‌లు కట్టిన నేడు ఆర్థిక నేరుస్థుడినా? అయితే మరి మిమ్మల్ని ఏమనాలి. ఎన్నికల్లో వేసిన నామినేషన్‌ను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారా?. ఆస్తులు సహా అని వివరాలు, దానికి సంబంధించిన పత్రాలను పక్కాగా రిటర్నింగ్ ఆఫీసర్‌కి సమర్పించాం. అప్లికేషన్‌లో రాయనంత మాత్రాన తప్పుడు నామినేషన్ అవుతుందా?. నాకు సంబంధించిన వివరాలన్నీ జతపరిచాం.
ఇదే సమయంలో కోట్లకు చురకలంటించారు. రైల్వే సహాయ మంత్రిగా ఉండి.. పేకాట ఆడటమేనా అందుబాటులో ఉండటం అంటే? అని ప్రశ్నించారు. స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ప్రతిపక్షాలకు మేలు జరిగేది కాదా?. డోన్‌ను కర్నూలులో కలుపుతారా అని అంటున్నారే నంద్యాలలో కలుస్తున్నప్పుడు ఏం చేశారు. మిమ్మల్ని, చంద్రబాబును ప్రజలు నమ్మేపరిస్థితి లేదు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment