war
-
ఉక్రెయిన్‌పై ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్:రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధానికి సంబంధించి తాము జరిపే చర్చల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్ను భాగస్వామిని చేస్తామని చెప్పారు. ఆదివారం(ఫిబ్రవరి16) ఫ్లోరిడాలో జరిగిన డేటోనా 500 కార్ రేసులకు విచ్చేసిన సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు.అయితే ఈ వారం సౌదీ అరేబియాలో జరిగే చర్చలకు జెలెన్స్కీ లేదా ఆయన ప్రతినిధులు హాజరవుతారా అన్నదానిపై ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు. గత వారం రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ ఫోన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సుదీర్ఘచర్చలు జరిపారు.దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో స్పందించారు.రష్యాతో జరిపే చర్చల్లో అమెరికా తమను కూడా భాగస్వామిని చేస్తే బాగుండేదన్నారు. అమెరికా మద్దతు లేకుండా తాము రష్యాను ఎదుర్కోలేమని, తాము ఎక్కువ కాలం జీవించలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ కేవలం యుద్ధానికి విరామం ఇచ్చి ఇంకా శక్తి కూడగట్టుకుంటున్నారని చెప్పారు. యూరప్‌కు ఎప్పటికైనా రష్యాతో ముప్పు పొంచి ఉందని జెలెన్స్కీ హెచ్చరించారు. కాగా, గత అమెరికా అధ్యక్షుడు బైడెన్ హయాంలో రష్యాతో యుద్ధం చేయడానికిగాను ఉక్రెయిన్‌కు భారీ సాయం అందిన విషయం తెలిసిందే. -
చెర్నోబిల్ మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తుందా?
-
ఉక్రెయిన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్:రెండోసారి అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనిలో భాగంగా రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్దాన్ని ఆపేస్తానని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావొచ్చు..కాకపోవచ్చు అని ట్రంప్ అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయినియన్లు.. రష్యన్లు కావొచ్చు..కాకపోవచ్చన్నారు. ఈ విషయంలో ఆ రెండు దేశాలు ఒక ఒప్పందానికి రావొచ్చు రాకపోవచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రష్యా,ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న తన రాయబారి కీత్ కెల్లాగ్ను త్వరలో ఉక్రెయిన్‌కు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చేవారం మ్యానిచ్‌లో జెలెన్స్కీతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఉక్రెయిన్‌పై తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా,సుమారు మూడేళ్లుగా ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. -
తెలంగాణ రాజకీయాలో పద్మ వార్ : KSR
-
నల్లగొండ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
యమ రావణ యుద్ధం
రావణుడు తన అన్న కుబేరుడిని తరిమికొట్టి, లంకను వశపరచుకున్నాడు. అతడి పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు సహా దిక్పాలకులను జయించాడు. నవగ్రహాలను తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకున్నాడు. తనకిక తిరుగులేదనే గర్వంతో లంకను పాలిస్తూ, నానా విలాసాలను అనుభవించసాగాడు.ఒకనాడు రావణుడి సభకు నారదుడు వచ్చాడు. రావణుడు నారదుడికి అతిథి మర్యాదలు చేసి, కుశల ప్రశ్నలు వేశాడు. నారదుడు రావణుడి ఘనతను ప్రశంసిస్తూ, ఇలా అన్నాడు: ‘రావణా! నువ్వు ఇంద్రాది దేవతలను జయించావు. భూలోకంలోని మానవమాత్రులెవరూ నీకు సాటిరారు. భూలోకవాసుల మీద నీ ప్రతాపం చూపించడం శోభస్కరం కాదు. నరకాధిపతి యముడిని కూడా జయించావంటే, నీకు ఇంకెక్కడా ఎదురుండదు, మృత్యుభయం కూడా ఉండదు’ అన్నాడు.రావణుడు నారదుడిని సాగనంపిన తర్వాత, మంత్రులతో చర్చించి, సైన్యాన్ని సిద్ధం చేసుకుని నరకంపై యుద్ధానికి బయలుదేరాడు. నరకానికి చేరుకున్న రావణుడు అక్కడ యమభటుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్న పాపుల కష్టాలు చూశాడు. యమభటుల చేతిలో హింసలు అనుభవిస్తున్న పాపులు ఆ బాధలకు ఆర్తనాదాలు చేస్తున్నారు. వారు ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. రావణుడికి వారిపై జాలి కలిగింది. యమభటుల చెర నుంచి వారిని విడిపించడం ప్రారంభించాడు. రావణుడు చేస్తున్న పనిని గమనించిన యమభటులు అతడిపైకి ఆయుధాలతో దూసుకొచ్చారు.వారిని చూసి, రావణుడు వెంటనే పుష్పక విమానంలోకి చేరుకున్నాడు. పుష్పకవిమానం పైకెగిరింది. యమభటులు శూలాలు, గదలు, తోమరాలు, పరిఘలు వంటి నానా ఆయుధాలను పుష్పక విమానం మీదకు విసిరారు. ఆ ఆయుధాల తాకిడికి పుష్పక విమానంలోని ఆసనాలు, వేదికలు, స్తంభాలు ధ్వంసం అయిపోయినా, క్షణాల్లోనే మళ్లీ అవి యథాతథ స్థితికి వచ్చాయి. అక్షయమైన పుష్పక విమానం మహిమకు యమభటులు నివ్వెరపోయారు.రావణుడికి, యమభటులకు మధ్య ఈ రభస కొనసాగుతుండగా, నారదుడు నేరుగా యుముడి వద్దకు చేరుకున్నాడు. ‘యమధర్మరాజా! లంకాధిపతి రావణుడు నీ మీదకు యుద్ధానికి వస్తున్నాడు. నీ కాలదండం ఏం కానుందో!’ అన్నాడు. యుముడితో నారదుడు మాట్లాడుతుండగానే, దూరాన ఆకాశంలో ధగధగలాడుతూ ఎగురుతున్న పుష్పక విమానం కనిపించింది. యమభటులతో కొంతసేపు యుద్ధం సాగించిన రావణుడు, వారి ధాటి శ్రుతి మించుతుండటంతో వారిపై పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అగ్నిజ్వాలలను చిమ్ముతూ దూసుకొచ్చిన పాశుపతాస్త్రం యమభటులను మిడతల్లా మాడ్చేసింది. నరకంలోని చెట్లను, పొదలను బూడిద చేసింది. యమభటులు అంతం కావడంతో రావణుడు, అతడి మంత్రులు పెద్దపెట్టున సింహనాదాలు చేశారు. వాటిని విన్న యముడు యుద్ధంలో రావణుడు గెలిచాడని అర్థం చేసుకున్నాడు.ఇక తానే రంగంలోకి దూకాలని నిశ్చయించుకుని, తన సారథిని పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. క్షణాల్లో రథం సిద్ధమైంది. యముడు తన యమపాశాన్ని, కాలదండాన్ని, ముద్గరాన్ని తీసుకుని రథాన్ని అధిరోహించాడు. రథం పుష్పక విమానం దిశగా ముందుకు ఉరికింది. యముడు యుద్ధానికి స్వయంగా బయలుదేరడంతో ముల్లోకాలూ కంపించాయి. యముడి రథం వాయువేగ మనోవేగాలతో నేరుగా రావణుడి పుష్పక విమానం ఎదుట నిలిచింది. యముడి రథాన్ని చూడగానే రావణుడి మంత్రులు భయభ్రాంతులయ్యారు. యుద్ధరంగంలో నిలిచేందుకు ధైర్యం చాలక వారు తలో దిక్కు పారిపోయారు. రావణుడు మాత్రం భయపడకుండా, యముడికి ఎదురు నిలిచాడు. ఇద్దరికీ ఏడు పగళ్లు, ఏడు రాత్రులు ఏకధాటిగా యుద్ధం జరిగింది. యముడు అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించి, రావణుడిని తీవ్రంగా గాయపరచాడు.రెచ్చిపోయిన రావణుడు కూడా యముడి మీదకు శరపరంపర కురిపించి, గాయపరచాడు. యముడి సారథిని కూడా తీవ్రంగా బాధించాడు. యమ రావణుల యుద్ధాన్ని గమనిస్తూ వచ్చిన మృత్యుదేవత యముడి ముందుకు వచ్చి నిలిచింది. ‘యమధర్మరాజా! నువ్వెందుకు శ్రమించడం? వీడితో యుద్ధానికి నన్ను ఆదేశించు! క్షణాల్లో వీడిని చంపేస్తాను’ అంది. ‘నువ్వు ఊరికే చూస్తూ ఉండు. వీణ్ణి నేనే చంపేస్తాను’ అంటూ యముడు తన కాలదండాన్ని పైకెత్తాడు. కాలదండం నిప్పులు చిమ్ముతూ భయంకరంగా ఉంది. యముడు కాలదండాన్ని రావణుడి మీదకు విసరబోతుండగా, బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ‘యమధర్మరాజా! కాలదండాన్ని ప్రయోగించకు. నీ కాలదండంతో వీడు మరణిస్తే, నేను వీడికిచ్చిన వరం వ్యర్థమవుతుంది’ అన్నాడు. బ్రహ్మదేవుడి మాట మన్నించిన యముడు తన కాలదండాన్ని ఉపసంహరించుకున్నాడు. రావణుణ్ణి చంపడానికి అవకాశం లేకపోవడంతో యుద్ధరంగంలో ఏం చేయాలో తోచక రథంతో సహా అదృశ్యమై, బ్రహ్మదేవుడి వెంట సత్యలోకానికి వెళ్లిపోయాడు.యముడు అదృశ్యం కావడంతో రావణుడు తాను నరకాన్ని జయించినట్లు ప్రకటించుకున్నాడు. అక్కడి నుంచి పుష్పక విమానంలో బయలుదేరి లంకకు చేరుకున్నాడు.∙సాంఖ్యాయన -
ఇవాల్టి నుంచి కాల్పుల మిరమణ ఒప్పందం అమలు
-
యుద్ధ విషాద గీతం.. గాజా కన్నీటి గాథ
-
గాజా పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 10 మంది మృతి
-
World Year Ender 2024: నిత్యం వెంటాడిన మూడో ప్రపంచ యుద్ధ భయం
2024.. ప్రపంచమంతటినీ యుద్ధ భయం వెంటాడింది. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాందిగా నిలిచాయి. దీనికితోడు భీకర విధ్వంసాన్ని సృష్టించే అణ్వాయుధాల ముప్పు కూడా తొంగిచూసింది. 2024లో ప్రపంచాన్ని అనునిత్యం భయానికి గురిచేసిన యుద్ధాలివే..రష్యా-ఉక్రెయిన్ 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2024లో మరింత తీవ్ర స్థాయికి చేరింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు రష్యా అంతర్భాగంలో యూఎస్ఏ ఆయుధాలను ఉపయోగించడానికి అనుమతించడం ద్వారా మూడవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే హైపర్సోనిక్ ఐసీబీఎం క్షిపణిని ఉక్రెయిన్‌పై ప్రయోగించడం ద్వారా రష్యా అవసరమైతే అణుదాడికి కూడా వెనుకాడబోదన్న సందేశాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్‌కు సహాయం చేస్తున్న నాటో, అమెరికా, బ్రిటన్లపై దాడి చేస్తామని రష్యా పలుమార్లు హెచ్చరించింది. ఇది మూడో ప్రపంచ యుద్ధ భయాన్ని మరింతగా పెంచింది.ఇజ్రాయెల్-హమాస్ 2023 అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం క్రమంగా లెబనాన్, యెమెన్, ఇరాన్, సిరియాలను చుట్టుముట్టింది. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా యెమెన్ హౌతీలు.. ఏడెన్ గల్ఫ్‌లోని ఓడలను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ హమాస్‌తో పాటు హౌతీలతోనూ పోరాడాల్సి వచ్చింది. హౌతీల దాడులను అరికట్టేందుకు అమెరికా, బ్రిటన్ కలిసి యెమెన్‌పై పలుమార్లు భారీ వైమానిక దాడులు నిర్వహించి, హౌతీల కీలక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ కూడా హౌతీలపై బలమైన ప్రతీకార దాడులను చేపట్టింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, యాహ్యా సిన్వార్‌లను హతమార్చడం ద్వారా ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు 45 వేల మందికి పైగా జనం మృతిచెందారు.ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఇజ్రాయెల్ దళాలు హమాస్ నేతలను హతమార్చిన దరిమిలా ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడి చేపట్టింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఈ వైమానిక దాడిలో మరణించాడు. దీని తరువాత, కొత్త చీఫ్ సఫీద్దీన్ కూడా ఇజ్రాయెల్ సైన్యం చేతుల్లో హతమయ్యాడు. తరువాత గాజా తరహాలో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లో భూ ఆక్రమణకు పాల్పడింది. పేజర్లు, బ్యాటరీ బ్లాస్ట్లను ఉపయోగించి వేలాది మంది హెజ్బొల్లా యోధులను ఇజ్రాయెల్ అంతమొందించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది.ఇజ్రాయెల్-ఇరాన్ ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణకు ముందు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, యాహ్యా సిన్వార్, హిజ్బుల్లా చీఫ్‌లు హసన్ నస్రల్లా, హషీమ్ సఫీద్దీన్లను అంతమొందించడంతో ఇరాన్ షాక్‌నకు గురయ్యింది. 2024 అక్టోబర్‌లో ఇరాన్ అకస్మాత్తుగా 180 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇది ప్రపంచమంతటినీ కలవరానికి గురిచేసింది. ఈ దాడి తరువాత, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న ప్రత్యక్ష యుద్ధం ముప్పు మధ్యప్రాచ్యాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేసింది. ఇప్పటికే యూరప్‌లో జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధ ప్రమాద ముప్పును మరింత పెంచింది. ఈ తరుణంలోనే ఇజ్రాయెల్.. ఇరాన్‌పై వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్ సైనిక స్థావరాలను నాశనం చేసింది.సూడాన్- బంగ్లాదేశ్2024లో సూడాన్- బంగ్లాదేశ్‌లలో జరిగిన తిరుగుబాట్లు చరిత్రలో నిలిచిపోతాయి. ఏప్రిల్ 2023 నుంచి సూడాన్ భీకర అంతర్యుద్ధంలో మునిగితేలుతోంది. జుంటా సైన్యం తిరుగుబాటు దరిమిలా సూడాన్ పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగాయి. ఈ రెండింటి మధ్య సంవత్సరాల తరబడి భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు వేలాది మంది సైనికులు, ప్రజలు మరణించారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం సూడాన్‌లో జరిగిన ఈ అంతర్యుద్ధంలో 27 వేల మందికి పైగా జనం మరణించారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం కారణంగా ప్రధాని షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి మొహమ్మద్ యూనస్ సారధ్యం వహిస్తున్నారు. అదిమొదలు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగాయి.సిరియాలో.. సిరియాలో సాయుధ తిరుగుబాటుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. వారు సిరియా రాజధాని డమాస్కస్‌తో సహా అనేక స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశం నుండి పారిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపధ్యంలో రష్యా అసద్‌కు ఆశ్రయం ఇచ్చింది. అనంతరం ఇజ్రాయెల్ సిరియాలోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి, ఆ దేశంలోని బఫర్ జోన్‌ను స్వాధీనం చేసుకుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: భారతీయులు అలెక్సాను అడిగిన ప్రశ్నలివే.. జాబితా షేర్ చేసిన అమెజాన్ -
రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్
-
గాజాలో మరణాలు 45 వేలు
డెయిర్ అల్–బలాహ్: గాజాలో ఇజ్రాయెల్ ఆర్మి–హమాస్ సాయుధ శ్రేణుల మధ్య 14 నెలలుగా సాగుతున్న పోరులో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 45 వేలకు చేరుకుంది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో అల్ జజీరా జర్నలిస్ట్ సహా 52 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు సగానికి పైగానే ఉంటారన్నారు. వీరిలో హమాస్ సాయుధులు, సాధారణ పౌరుల సంఖ్యను స్పష్టంగా చెప్పలేమని కూడా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 17 వేల మంది మిలిటెంట్లను చంపినట్లు చెప్పుకుంటున్న ఇజ్రాయెల్ మిలటరీ ఇందుకు తగ్గ ఆధారాలను మాత్రం చూపడం లేదు. హమాస్, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరిగిన పోరులో 45,028 మంది అసువులు బాయగా 1,06,962 మంది క్షతగాత్రులుగా మిగిలారని సోమవారం పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. సహాయక సిబ్బంది సైతం చేరుకోలేని స్థితిలో ఇప్పటికీ వందలాదిగా మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయని, వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మరణాలు మరింతగా పెరిగే అవకాశముందని చెప్పింది. యుద్ధానికి ముందు గాజాలో 23 లక్షల మంది పాలస్తీనియన్లలో కనీసం 2 శాతం మంది చనిపోయి ఉంటారని అంచనా వేసింది. అయితే, మిలిటెంట్లే లక్ష్యంగా తాము దాడులు చేపడుతున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది. జనావాసాల మధ్యనే మిలిటెంట్ల స్థావరాలు ఉండటం వల్లే సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతోంది. మృతుల్లో అల్ జజీరా టీవీ జర్నలిస్ట్ ఖాన్‌యూనిస్ నగరంలోని ఓ నివాసంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిగిన దాడిలో నలుగురు చనిపోయారని నాసర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో ఒకరు గాజాకు చెందిన అల్ జజీరా టీవీ ప్రతినిధి అహ్మద్ బకెర్ అల్–లౌహ్(39)కాగా, ముగ్గురు పౌర రక్షణ సిబ్బందివీరిలో ఒకరు అని తెలిపాయి. అంతకుముందు జరిగిన బాంబు దాడిలో గాయపడిన కుటుంబాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన దాడిలో బకెర్ ప్రాణాలు కోల్పోయారని అల్ జజీరా తెలిపింది. అదేవిధంగా, గాజా నగరంలోని షిజైయా ప్రాంతంలోని ఓ నివాసం భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో ఒకే కుటుంబంలోని నలుగురు సహా 10 మంది మృతి చెందారు. ఖాన్ యూనిస్ నగరంలో శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాల భవనంపై జరిగిన మరో దాడిలో ఆరుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా 13 మంది చనిపోయారని నాసర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ జర్నలిస్ట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులు 105 మంది కాగా, వీరి సగం మంది గాజాలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇజ్రాయెల్ భూభాగంపై మెరుపు దాడి చేసి వందల సంఖ్యలో పౌరులను హమాస్ శ్రేణులు అపహరించుకుపోవడంతో 2023 అక్టోబర్ 7న యుద్ధం మొదలవడం తెలిసిందే. ఈ పోరులో 55 మంది పాలస్తీనా మీడియా సిబ్బంది సహా మొత్తం 138 మంది చనిపోయినట్లు ఈ సంస్థ పేర్కొంది. అయితే, జర్నలిస్టుల ముసుగులో హమాస్ శ్రేణులు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఇజ్రాయెల్ ఆర్మీ వాదిస్తోంది. -
Vijay Diwas: ‘చనిపోయానని ఇంటికి టెలిగ్రాం పంపారు’: నాటి సైనికుని అనుభవం..
అది 1971, డిసెంబర్ 16.. భారతదేశ చరిత్ర పుటల్లో గర్వకారణంగా నిలిచిన రోజు. ఆ రోజున భారతదేశం యుద్ధంలో పాకిస్తాన్‌కు ఘోరమైన ఓటమి ఎలా ఉంటుందో చూపింది. నాటి యుద్ధంలో సుమారు 3,900 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందగా, 9,851 మంది గాయపడ్డారు. యుద్ధం అనంతరం 93 వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఈ నేపధ్యంలోనే తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది.నాటి యుద్ధంలో బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన పలువురు వీర సైనికులు పాకిస్తాన్ సేనను ధైర్యంగా ఎదుర్కొని, వారిని మట్టికరిపించారు. ప్రతీయేటా డిసెంబర్ 16 రాగానే.. నాటి యుద్ధంలో పాల్గొని, పాక్ సైనికులను ఓడించిన వీర జవాన్లకు నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి.నాటి యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు మీడియాతో మాట్లాడుతూ ‘నేను యుద్ధం ప్రారంభమైనప్పుడు లక్నోలో వైర్లెస్ ఆపరేటర్‌గా పని చేశాను. నాడు నన్ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు పంపారు. అక్కడ మా ఎనిమిది మంది సైనికుల బృందం పాకిస్తాన్ సైనికుల కాన్వాయ్‌పై మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో పలువురు పాకిస్తానీ సైనికులు మరణించారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మేము స్పృహ కోల్పోయాం. నేను చనిపోయానని సైన్యం భావించి, మా ఇంటికి టెలిగ్రామ్ పంపింది. అయితే ఆ తర్వాత నేను స్పృహలోకి రాగానే, నేను బతికే ఉన్నానంటూ మా ఇంటిలోనివారికి సైన్యం తిరిగి మరో సందేశం పంపింది’ అని తెలిపారు.మరో సైనికుడు తన యుద్ధ అనుభవాలను మీడియాతో పంచుకుంటూ ‘యుద్ధం జరుగుతున్న సమయంలో నేను ఢాకాలో ఉన్నాను. రాత్రంతా వైర్లెస్ బ్యాటరీని ఛార్జ్ చేసేవాడిని. కరెంటు లేకపోవడంతో జనరేటర్‌తో పని చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మేము నిత్యం అప్రమత్తంగా ఉన్నాం. పాకిస్తాన్ సైనికులు ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భావనతో ఉండేవాళ్లం’ అని తెలిపారు. నాడు భారత సైనికులు ప్రదర్శించిన ధైర్యం అందరికీ ఎనలేని స్ఫూర్తినిస్తుంది. నాటి యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందిన సైనికులకు ప్రతి ఏటా డిసెంబర్ 16న దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తారు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: లక్షలాది రుద్రాక్షలు ధరించి ప్రయాగ్‌రాజ్‌కు.. -
ముందున్న సవాలు
21వ శతాబ్దంలో అత్యంత దీర్ఘకాలం సాగిన యుద్ధం... లక్షలాది ప్రజల ప్రాణాలు తీసి, మరెందరినో వలస బాట పట్టించి, శరణార్థులుగా మార్చిన యుద్ధం... ఎట్టకేలకు ఒక ముగింపునకు వచ్చింది. సంక్షుభిత సిరియా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. అధ్యక్షుడు బషర్ – అల్ – అసద్ పాలనకు ఆదివారం ఆకస్మికంగా తెరపడడంతో సిరియాలో అంతర్యుద్ధం కొత్త మలుపు తిరిగింది. అలెప్పో, హమా, హామ్స్ల తర్వాత డమాస్కస్ సైతం తిరుగుబాటు శక్తుల వశం కావడంతో సిరియా రాజకీయ, సైనిక దృశ్యం సమూలంగా మారిపోనుంది. ఈ పరిణామాల ప్రభావం ఆ ప్రాంతమంతటా కనిపించనుంది. దాదాపు 53 ఏళ్ళ పైచిలుకు నిరంకుశ కుటుంబ పాలన పోయినందుకు సిరియన్లు సంబరాలు చేసుకుంటున్నా, తరువాతి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. తిరుగుబాటు తర్వాత డమాస్కస్‌లో సాగుతున్న విధ్వంసం, లూటీ దృశ్యాలు 2021లో అఫ్ఘానిస్తాన్‌లో జరిగిన సంఘటనల్ని తలపిస్తున్నాయి. అక్కడ తాలిబన్ల లానే ఇక్కడ ఇస్లామిస్ట్ బృందాలు సైతం గద్దెనెక్కాక వెనకటి గుణం మానక నిజ స్వభావం చూపిస్తాయని భయాందోళనలు రేగుతున్నాయి. వెరసి, అసలే రగులుతున్న పశ్చిమాసియా కుంపటికి కొత్త సెగ వచ్చి తోడైంది. చరిత్ర గమనిస్తే, ప్రజాగ్రహ ఉద్యమం 2011 మార్చిలోనే సిరియాను తాకింది. ఎప్పటికప్పుడు కూలిపోవడం ఖాయమని భావించినా, అసద్ ఏలుబడి వాటన్నిటినీ తట్టుకొని, దాటుకొని వచ్చింది. జనాగ్రహాన్ని ఎదుర్కొనేందుకు ఆయన తీవ్ర హింసకు పాల్పడ్డారు. స్వదేశీయులపైనే ఒక దశలో రసాయన ఆయుధాలు వాడినట్లు ఆరోపణలూ వచ్చాయి. సిరియాకు ఆయన పీడ ఎప్పుడు వదులుతుందా అని ఎదురుచూస్తున్న పరిస్థితి తెచ్చాయి. దాదాపు దశాబ్ద కాలం దూరం పెట్టాక, అరబ్ ప్రపంచం గత ఏడాది మళ్ళీ చేరదీయడం అసద్‌కు కలిసొస్తుందని భావించారు. అయితే, అరబ్ రాజ్యాలు తమ స్వలాభం కోసమే ఆ పని చేశాయి. అసద్ పోతే వచ్చే తెలియని దేవత కన్నా తెలిసిన దయ్యం మేలని భావించాయి. వారం రోజుల క్రితం దాకా ఈ పాలనకు చరమగీతం తథ్యమని ఎవరూ ఊహించ లేదు. రష్యా, ఇరాన్, హెజ్బుల్లాల అండతో అసమ్మతిని అణచివేస్తూ, అసద్ అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే, కొద్ది రోజుల క్రితం ఒక్కసారిగా మళ్ళీ తిరుగుబాటు బృందాలు విజృంభించడంతో నాటకీయంగా కథ అడ్డం తిరిగింది. ఒక పక్క ఉక్రెయిన్‌తో పోరాటం నేపథ్యంలో రష్యా వైమానిక సాయం ఉపసంహరించుకోగా, మరోపక్క ఇజ్రాయెల్‌తో యుద్ధం వల్ల హెజ్బొల్లా వనరులు క్షీణించాయి. ఇదే అదనుగా ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ – తహ్రీర్ అల్ – షామ్ (హెచ్‌టీఎస్) సారథ్యంలోని తిరుగుబాటుదారులు చకచకా ముందుకు చొచ్చుకువచ్చారు. అసద్‌కు పట్టున్న ప్రాంతాలన్నీ కైవసం చేసుకుంటూ, ఆఖరికి అధికార పీఠానికి ప్రతీక అయిన డమాస్కస్‌ను చేజిక్కించుకోవడంతో ఏళ్ళ తరబడి సాగుతున్న నియంతృత్వానికి తెరపడింది. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు విమానంలో పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. అసద్ పదవీచ్యుతి ప్రభావం ప్రాంతీయంగా గణనీయమైనది. ఆ ప్రాంతంలో ఇంతకాలంగా స్నేహంగా మెలిగిన కీలక దేశం సిరియాలో అనుకూల పాలన పోవడం ఇరాన్‌కు వ్యూహాత్మకంగా ఇబ్బందికరమే. మరోపక్క హెజ్బుల్లా భవిష్యత్తూ అనిశ్చితిలో పడింది. తిరుగుబాటుదారులకు తెర వెనుక అండగా నిలిచిన టర్కీ ఇప్పుడిక అక్కడ చక్రం తిప్పే సూచనలున్నాయి. అయితే, టర్కీ ప్రయోజనాలకూ, ప్రాంతీయ శక్తులకూ మధ్య వైరుద్ధ్యం తలెత్తితే ఉద్రిక్తతలు పెరుగుతాయి. మానవ హక్కులను సైతం కాలరాస్తున్న నియంతృత్వంపై పోరాటం ఎవరు, ఎక్కడ చేసినా అది సమర్థనీయమే. ప్రపంచం సంతోషించాల్సిన అంశమే. నియంతృత్వం పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తాం. కానీ, అసద్ పాలన స్థానంలో రానున్న పాలన ఏమిటన్నది ప్రశ్న. ఒకటికి పది సంస్థలు ఈ సాయుధ తిరుగుబాటును నడిపాయని విస్మరించలేం. అసద్‌ను గద్దె దింపడం సరే కానీ, అనేక వైరుద్ధ్యాలున్న ఇవన్నీ ఒకతాటిపైకి రావడం, రేపు సజావుగా పాలన సాగించడం సాధ్య మేనా అన్నది బేతాళప్రశ్న. తీవ్రవాద అల్‌ఖైదాకు ఒకప్పటి శాఖ అయిన హెచ్‌టీఎస్ లాంటి తీవ్ర వాద సంస్థలు తమను తాము జాతీయవాద శక్తులుగా చెప్పుకుంటున్నా, అవి తమ వెనకటి స్వభా వాన్ని వదులుకుంటాయా అన్నదీ అనుమానమే. అదే గనక జరగకపోతే... దశాబ్దాలుగా అల్లాడు తున్న సిరియా, అక్కడి సామాన్యుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది. ఒకప్పటి సంపన్న సిరియా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై, అంతర్యుద్ధంలో మగ్గుతూ శిథిలాల కుప్పగా మారింది. అసద్ హయాంలో దాదాపు 1.2 కోట్లమంది దేశం విడిచి పోవాల్సి వచ్చింది. ఉద్రిక్తతా నివారణ జోన్లలో అతి పెద్దదైన ఒక్క ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోనే సుమారు 20 లక్షల మంది శరణార్థులుగా బతుకీడుస్తున్నారు. తాజా పరిణామాలతో ఆ దేశాన్ని రాజకీయంగా, సామాజికంగా ఒక గాడిన పెట్టాల్సిన తరుణమిది. స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న సిరియన్లు సైతం ఈ భగీరథ ప్రయత్నంలో భాగస్వాములవ్వాలి. అలాగే, ఆంక్షల విధింపుతో అసద్ పతనానికి దోహద పడ్డ పాశ్చాత్య దేశాలు సైతం సిరియా వాసుల కష్టాల తొలగింపుపై దృష్టి పెట్టాలి. తద్వారా వేలాది సిరియన్ శరణార్థులు స్వచ్ఛందంగా స్వదేశానికి వచ్చి, దేశ పునర్నిర్మాణంలో భాగమయ్యే వీలు చిక్కుతుంది. అసద్ పదవీచ్యుతితో సిరియా పునర్నిర్మాణానికి అవకాశం అంది వచ్చినా, అందుకు సవాలక్ష సవాళ్ళున్నాయి. మితవాద, అతివాద బృందాల సమ్మేళనమైన ప్రతిపక్షం సైనిక విజయం నుంచి సమర్థమైన పరిపాలన వైపు అడుగులేయడం ముఖ్యం. అందులో జయాపజయాలను బట్టే సిరియా భవితవ్యం నిర్ణయం కానుంది. అందుకే, రానున్న కొద్ది వారాల పరిణామాలు కీలకం. -
చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే..
బీజింగ్: చైనా.. గత కొన్నేళ్లుగా అధునాతన టెక్నాలజీ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించింది. తాజాగా డెత్ స్టార్ ఆఫ్ ది స్టార్ వార్స్ సినిమా స్ఫూర్తితో తాము అత్యంత ప్రమాదకరమైన ఆయుధాన్ని రూపొందించామని చైనా శాస్త్రవేత్తలు బాంబులాంటి వార్తను ప్రపంచంముందు ఉంచారు. చైనా దీనికి ‘బీమ్ వెపన్’ అనే పేరు పెట్టింది. స్టార్ వార్స్ సినిమా చూడని వారికి ‘బీమ్ వెపన్’ ఎటువంటిదో అర్థం కాదు. అందుకే ఆ వివరాలు మీకోసం..స్టార్ వార్స్ చిత్రంలో ఎనిమిది వేర్వేరు లేజర్ కిరణాల కలయికతో ఒక తీవ్రమైన కాంతిపుంజం ఏర్పడుతుంది. ఈ కాంతిపుంజాన్ని శత్రువుపై దాడి చేసేందుకు వినియోగిస్తారు. ఈ అత్యంత శక్తివంతమైన కాంతిపుంజం ఒక గ్రహాన్నే నాశనం చేయగలదు. ఇదొక లేజర్ వెపన్. సరిగ్గా ఇలాంటి పవర్ఫుల్ ఆయుధాన్నే చైనా తయారుచేసింది.బీమ్ వెపన్ అనేది లేజర్‌తో కూడిన అధునాతన సాంకేతిక ఆయుధం. ఇది విడుదల చేసే శక్తివంతమైన కాంతి పుంజం లక్ష్యాన్ని అత్యంత వేగంగా ధ్వంసం చేస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ వ్యవస్థలను క్షణాల్లో నిర్వీర్యం చేస్తుంది. బీమ్ వెపన్ రూపకల్పన సులభమేమీ కాదు. లేజర్ కిరణాలను నియంత్రిస్తూ, వాటిని శత్రువు వైపు ఎక్కుపెట్టడం అంత తేలికైన ప్రక్రియ కాదని శాస్త్రవేత్తలు తెలిపారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం మైక్రోవేవ్ బీమ్ ఆయుధాన్ని వినియోగంచేందుకు ఏడు వాహనాలు అవసరమవుతాయి. బీమ్ ఆయుధం భారీ పరిమాణంలో ఉంటూ, అధిక స్థలాన్ని ఆక్రమించినప్పటికీ లక్ష్యాన్ని ఛేదించడంలో అత్యున్నత సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఇప్పటివరకూ ఈ స్థాయిలో లక్ష్యాన్ని ఛేదించగల ఆయుధం అందుబాటులో లేదని చైనా మోడరన్ నావిగేషన్ జర్నల్ పేర్కొంది. బీమ్ వెపన్ అధిక ఖచ్చితత్వాన్ని సాధించేందుకు, దానికి మైక్రోవేవ్ ట్రాన్స్‌మిటింగ్ వాహనాలను కనెక్ట్ చేయడానికి ఆప్టికల్ ఫైబర్‌ను ఉపయోగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.బీమ్ తరహా ఆయుధాల అభివృద్ధిలో అనేక సాంకేతిక, ఆచరణాత్మక సవాళ్లు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే అధిక శక్తి వనరులు అవసరమన్నారు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ చైనా ఈ తరహా ఆయుధాల తయారీలో పురోగతి సాధిస్తోంది. భవిష్యత్తులో బీమ్ ఆయుధాలను విస్తృతంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ యుద్ధాల సమయంలో ఈ తరహా సాంకేతికత కీలకంగా మారనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌కు శాంతి పరిరక్షక దళం?.. ఏం జరగనుంది? -
ఉక్రెయిన్‌కు ట్రంప్ పరిష్కారం?
లెబనాన్‌లో కాల్పుల విరమణ జరిపించి, గాజాలోనూ ఆ ప్రయత్నం చేయగలనన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉక్రెయిన్ యుద్ధం గురించి మాత్రం ఎటువంటి ప్రస్తావన చేయకపోవటం గమనించదగ్గది. పైగా, కొత్త అధ్యక్షుడు ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించి ఆ విషయమై తన శాంతి ప్రయత్నాలు ఆరంభించేలోగా, రష్యాతో చర్చలలో ఉక్రెయిన్ బేరసారాల బలాన్ని వీలైనంత పెంచే పనిలో ఉన్నారు. తాను గెలిచినట్లయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధ సమస్యను ఇరవై నాలుగు గంటలలో పరిష్కరించగలనని ఎన్నికల ప్రచార సమయలో ప్రకటించిన ట్రంప్ శాంతి పథకమేమిటో అంచనా వేయటం అవసరం. మరి ఆయన గెలిచి మరొక యాభై రోజులలోనే పదవిని స్వీకరించనుండగా ఈ విషయమై ఏదైనా ఆలోచిస్తున్నట్లా?రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి ఎన్నికల సమయంలో ట్రంప్ ఎటువంటి పథకాన్ని సూచించలేదంటూ చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. అయితే, ఆయన దాని గురించి ఆలోచించటమే కాదు, రష్యా – ఉక్రెయిన్ సమస్యపై తన ప్రతినిధిగా రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ కీత్ కెల్లోగ్ను 28వ తేదీన నియమించారు కూడా. జనరల్ కెల్లోగ్తో పాటు, ట్రంప్ ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తన వ్యవహరణను గమనించి నట్లయితే, సమస్యకు ట్రంప్ ప్రభుత్వం సూచించే పరిష్కారమేమిటో కొంత అవగతమవుతుంది. ట్రంప్ మాటలను ఇప్పటికే చూశాం గనుక, కొత్తగా రంగంలోకి వస్తున్న జనరల్ కెల్లోగ్ వైఖరిని గమనిద్దాం. ఆయన ట్రంప్ మొదటి పాలనా కాలంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు. ఉక్రెయిన్ సమస్యపై కొంతకాలం క్రితమే తన ఆలోచనలను వివరిస్తూ ఒక పత్రాన్ని ప్రకటించారు. ఇతరత్రా టెలివిజన్ చర్చ వంటి వాటిలో పాల్గొన్నారు.ముందు కాల్పుల విరమణకెల్లోగ్ ప్రకారం, ముందుగా రష్యా, ఉక్రెయిన్లు కాల్పుల విరమణ పాటించాలి. ఉభయుల సేనలు ఆ విరమణ రోజుకు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆగిపోవాలి. తర్వాత చర్చలు మొదలు కావాలి. దీనంతటికీ ఉక్రెయిన్ అంగీకరించకపోయినట్లయితే వారికి సహాయం నిలిపివేయాలి. రష్యా కాదన్న పక్షంలో ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగించాలి. పోతే, రాజీ కోసం ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని రష్యాకు వదలుకోవలసి రావచ్చు. అదేవిధంగా, నాటోలో సభ్యత్వ విషయం నిరవధికంగా వాయిదా పడుతుంది. ట్రంప్ ఈ మాటలు ఇంత నిర్దిష్టంగా చెప్పలేదుగానీ, ఉక్రెయిన్‌కు సహాయంపై నియంత్రణలు, వారు తమ భూభాగాన్ని కొంత వదులు కోవలసి రావటం గురించిన ప్రస్తావనలు స్పష్టంగానే చేశారు. అవి యూరప్ అంతటా కలవరం సృష్టించాయి. ట్రంప్ వైఖరిని మార్చేందుకు జెలెన్స్కీ చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు.ఇదే పథకం అమలుకు ట్రంప్ ప్రయత్నించినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉండవచ్చు? భూభాగం వదులుకునేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు అంగీకరిస్తారా? ఒకవేళ అంగీకరిస్తే ఏ మేరకు అనే కీలకమైన ప్రశ్నను అట్లుంచితే, మొదట కాల్పుల విరమణకు, సేనలను యథాతథ స్థితిలో నిలిపివేయటానికి సమ్మతించటంలో ఎవరికీ సమస్య ఉండకపోవచ్చు. ట్రంప్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చర్చలకు సిద్ధమని జెలెన్స్కీతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. చర్చల సందర్భంగా జనరల్ కెల్లోగ్ ప్రతిపాదనలు ఏ దశలో ముందుకు వచ్చేదీ చెప్పలేము గానీ, మొదట మాత్రం రష్యా, ఉక్రెయిన్ దేని షరతులు అది విధిస్తుంది. ఆ షరతులేమిటో మనకు ఇప్పటికే తెలుసు. 2014 నుంచి తమ ఆక్రమణలో గల క్రిమియాను ఉక్రెయిన్ తిరిగి కోరకపోవటం, ఉక్రెయిన్ తూర్పున రష్యన్ జాతీయులు ఆధిక్యతలో గల డోన్బాస్ ప్రాంతాన్ని తమకు వదలటం, నాటోలో చేరకుండా తటస్థంగా ఉండటమన్నవి రష్యా షరతులు. నాటో సభ్యత్వం సంగతి ఎట్లున్నా తమ భూభాగాలన్నింటిని తమకు తిరిగి అప్పగించటం, తమ రక్షణకు పూర్తి హామీలు లభించటం ఉక్రెయిన్ షరతులు.భూభాగాలను వదులుకోవాల్సిందే!నల్ల సముద్రంలోని క్రిమియా తమ అధీనంలో లేనట్లయితే రష్యా సముద్ర వాణిజ్యం శీతాకాలం పొడవునా స్తంభించి పోతుంది. కనుక ఆ ప్రాంతాన్ని 2014లో ఆక్రమించిన రష్యా, దానిని వదలుకునేందుకు ససేమిరా అంగీకరించదు. ఈ వాస్తవ స్థితిని అప్పటినుంచే గ్రహించిన ఉక్రెయిన్, అమెరికా శిబిరాలు బయటకు కాకున్నా అంతర్గతంగా రాజీ పడిపోయాయి. పోతే, డోన్బాస్ ప్రాంతంలోని రష్యన్లను ఉక్రెయిన్ రకరకాలుగా వేధించటం ఎప్పటినుంచో ఉంది గనుకనే ఆ భూభాగాలను రష్యాలో విలీనం చేసుకుని తీరగలమని పుతిన్ ప్రకటించారు. ప్రస్తుత యుద్ధ కాలంలో అందులో అధిక భాగాన్ని ఆక్రమించారు కూడా. మరొకవైపున కనిపించే ఆసక్తికరమైన అంశాలు మూడున్నాయి. తమ ప్రభుత్వ వైఖరి ఏమైనప్పటికీ రష్యాతో శాంతి కోసం కొంత భూభాగం వదులు కోవచ్చుననే ఉక్రెయిన్ ప్రజల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఒకవైపు ఉక్రెయిన్‌కు యుద్ధంలో మద్దతిస్తూనే యూరోపియన్ దేశాలు కూడా ఇదే మాట పరోక్షంగా సూచిస్తున్నాయి. యుద్ధానికి నిరవధికంగా సహాయం చేసేందుకు అవి పైకి అవునన్నా వాస్తవంలో సిద్ధంగా లేవు. ఇదంతా పరిగణించినప్పుడు, ఉక్రెయిన్ ఈ రాజీకి సిద్ధపడవలసి ఉంటుందనిపిస్తుంది. అయితే, ఎంత భూభాగమన్నది ప్రశ్న.ఒకసారి యుద్ధం ముగిసినట్లయితే రష్యా నుంచి ముప్పు అన్నదే ఉండదు గనుక, ఉక్రెయిన్‌కు తను కోరుతున్న ప్రకారం రక్షణలు కల్పించటం సమస్య కాకపోవచ్చు. అయితే, నాటో సభ్యత్వ ప్రశ్న చిక్కుల మారిది. సభ్యత్వం కావాలన్నది ఉక్రెయిన్ కోరిక. రష్యా నుంచి ఎప్పటికైనా ఉక్రెయిన్‌కే గాక తక్కిన యూరప్‌కు సైతం ప్రమాదం ఉండవచ్చునని, కనుక ఉక్రెయిన్‌కు సభ్యత్వమిస్తూ నాటోను మరింత శక్తిమంతం చేసుకోవాలన్నది యూరోపియన్ యూనియన్ కోరిక. నిజానికి అది అమెరికాకు మొదటినుంచీ ఉన్న వ్యూహం. ఒకప్పటి సోవియెట్ యూనియన్‌తో పాటు వారి నాయకత్వాన ఉండిన వార్సా సైనిక కూటమి 1991లోనే రద్దయినా, రష్యాను దిగ్బంధంలోనే ఉంచేందుకు అమెరికన్లు తమ సైనిక కూటమి నాటోను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే 1991 తర్వాత మరొక 12 యూరోపియన్ దేశాలను నాటోలో చేర్చుకుని రష్యా సరిహద్దుల వైపు విస్తరించారు. ఆ సరిహద్దుల వెంటగల చివరి దేశం ఉక్రెయిన్ కావటం వల్లనే రష్యా తన భద్రత పట్ల ఇంత ఆందోళన చెందుతూ ప్రస్తుత యుద్ధానికి సమకట్టింది. వార్సా కూటమి రద్దయిన దరిమిలా నాటోను విస్తరించబోమంటూ ఇచ్చిన హామీని అమెరికా ఉల్లంఘిస్తూ ఇదంతా చేయటమన్నది వారి ఆగ్రహానికి కారణం.నాటో సభ్యత్వం ఉండదా?ఉక్రెయిన్ నాటో సభ్యత్వ విషయం నిరవధికంగా వాయిదా పడగలదని జనరల్ కెల్లోగ్ అంటున్నారు గానీ, అసలు ఉండబోదని, రష్యా కోరుకున్నట్లు ఉక్రెయిన్ తటస్థంగా ఉండగలదని మాత్రం అనటం లేదు. చర్చల సమయలో రష్యా ఈ షరతును తీసుకురాగలదు. అందుకు ట్రంప్, తద్వారా యూరోపియన్ యూనియన్ అంగీకరించినట్లయితే తప్ప, ఈ నిర్దిష్ట సమస్యపై రాజీ సాధ్యం కాదు. పోతే, ప్రస్తుత యుద్ధం ప్రపంచ యుద్ధానికి, అణుయుద్ధానికి దారితీయవచ్చుననే ఊహాగానాలు కొద్ది కాలం పాటు సాగి ఆందోళనలు సృష్టించాయి. పరిణామాలను గమనించినపుడు అటువంటి అవకాశాలు లేవని అర్థ్థమైంది. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్ అనుమతించటంగానీ, అందుకు ప్రతిగా రష్యా మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించటం గానీ, కర్స్క్ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చిన ఉక్రెయిన్ సేనల నిర్మూలనకు ఉత్తర కొరియా సేనలను రష్యా మోహరించటం గానీ, చర్చల సమయానికి తమది పైచేయిగా ఉండాలనే చివరిదశ ప్రయత్నాలు తప్ప మరొకటికాదు. ఇటువంటి వ్యూహాలు ఏ యుద్ధంలోనైనా సాధారణం. ఇదే వ్యూహానికి అనుగుణంగా, చర్చల కాలం వరకు యుద్ధం మరింత తీవ్రరూపం తీసుకున్నా ఆశ్చర్యపడనక్కర లేదు. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఆయుధ పరిశ్రమ ఆదాయం రూ.53 లక్షల కోట్లు
స్టాక్‌హోం: యుద్ధాలు, ప్రాంతీయ ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ ఆయుధ పరిశ్రమ ఆదాయం 2023లో 632 బిలియన్ డాలర్లకు (రూ.53 లక్షల కోట్లు) పెరిగింది. 2022తో పోలిస్తే ఇది 4.2 శాతం అధికం. ఆయుధ రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతోంది. లాక్‌హీడ్ మార్టిన్, రేథియోన్ వంటి యూఎస్ ఆయుధ కంపెనీలే అధికాదాయం పొందాయి. స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) నివేదిక ప్రకారం టాప్ 100 కంపెనీల్లో 41 కంపెనీలు 317 బిలియన్ డాలర్ల ఆదాయం పొందాయి. ఇది గతేడాది కంటే 2.5 శాతం ఎక్కువ. ఆయుధ పరిశ్రమలో రెండో అతి పెద్ద దేశమైన చైనా టాప్ 100 జాబితాలోని తొమ్మిది కంపెనీల నుంచి 103 బిలియన్ డాలర్లను ఆర్జించింది. అయితే ఆర్థిక పరిమితులు, ఇతర సవాళ్లతో దాని వృద్ధి 0.7 శాతం తగ్గింది. స్వావలంబన దిశగా భారత్ భారత ఆయుధ పరిశ్రమకు 2023లో 6.7 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. 2022తో పోలిస్తే ఇది 5.8 శాతం ఎక్కువ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రయోజనం పొందాయి. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన, విదేశీ ఆయుధ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం స్వయం సమృద్ధికి ఆజ్యం పోశాయి. భారత్, తుర్కియే దేశీయ ఆయుధోత్పత్తిని విస్తరించి స్వావలంబనపై దృష్టి సారించాయి. ఘర్షణల నేపథ్యంలో పెరిగిన ఉత్పత్తి రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆయుధ ఉత్పత్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషించింది. డిమాండ్‌కు అనుగుణంగా యూరప్, అమెరికా, తుర్కియేలోని రక్షణ సంస్థలు ఆయుధ తయారీని పెంచాయి. పలు దేశాల రక్షణ సంస్థల్లో ఆయుధాల అమ్మకాలు పెరిగాయి. తుర్కియే రక్షణ సంస్థ బేకర్ ఆదాయం 25 శాతం పెరిగి 1.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ఎక్కువగా డ్రోన్లను ఎగుమతి చేసింది. చైనాతో ఉద్రిక్తతల మధ్య తైవాన్ రక్షణ వ్యయాన్ని పెంచడంతో ఆ దేశ ఎన్సీఎస్ఐఎస్టీ ఆదాయం 27 శాతం పెరిగి 3.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. యూకే సంస్థ అయిన అటా మిక్ వెపన్స్ ఎస్టాబ్లి‹Ùమెంట్ ఆదాయం 16 శాతం పెరిగి 2.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆయుధ ఆదాయాన్ని ఎలా నడిపిస్తున్నాయో సిప్రి నివేదిక ఎత్తిచూపింది. -
పాక్‌లో తెగల వైరం.. 130 మంది మృత్యువాత
పెషావర్: పాకిస్తాన్‌లోని కల్లోలిత ఖైబర్ ప్రావిన్స్‌లో రెండు తెగల మధ్య కొనసాగుతున్న ఘర్షణల్లో కనీసం 130 మంది ప్రాణాలు కోల్పోయారు. కుర్రం జిల్లాలోని అలిజాయ్, బగాన్ తెగల మధ్య నవంబర్ 22వ తేదీన ఘర్షణలు మొదలయ్యాయి. అంతకుముందు రోజు, జిల్లాలోని పరాచినార్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్లపై దాడులు జరిపి 57 మంది చంపేయడంపై ఈ ఘర్షణలకు ఆజ్యం పోసింది. సున్నీ, షియా గ్రూపుల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఆ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని పోలీసులు అంటున్నారు. ఆదివారం జరిగిన ఘర్షణల్లో మరో ఆరుగురు చనిపోగా, 8 మంది గాయపడ్డారు. దీంతో మరణాల సంఖ్య 130కి, క్షతగాత్రుల సంఖ్య 186కు చేరిందన్నారు. దీంతో, ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేసింది. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను ఆపేసింది. పెషావర్–పరాచినార్ రహదారిని, పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లోని ఖర్లాచి పాయింట్ వద్ద రాకపోకలను నిలిపివేసింది. దీంతో, చమురు, నిత్యావసరాలు, మందులు దొరక్క సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఖైబర్ ప్రభుత్వ యంత్రాంగం అంటోంది. -
రష్యా రక్షణ బడ్జెట్ రూ.10 లక్షల కోట్లు!
కీవ్: ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రక్షణ వ్యయాన్ని రికార్డు స్థాయిలో పెంచారు. 2025 బడ్జెట్లో 32.5శాతాన్ని జాతీయ రక్షణకు కేటాయించారు. రక్షణ వ్యయంగా 13.5 ట్రిలియన్ రూబుల్స్ (రూ.పది లక్షల కోట్లు) కేటాయించినట్లు ఆదివారం ప్రకటించారు. గత ఏడాది మొత్తం బడ్జెట్లో 28.3శాతం రక్షణకు కేటాయించగా.. ఈ ఏడాది 32.5శాతానికి చేరింది. రష్యా పార్లమెంటు ఉభయ సభలు, స్టేట్ డ్యూమా, ఫెడరేషన్ కౌన్సిల్ బడ్జెట్ ప్రణాళికలను ఆమోదించాయి. -
ఆగర్భ శ్రీమంతుల భూగర్భ స్వర్గాలు
వర్తమాన ప్రపంచం శాంతిధామంగా ఏమీ లేదు. ఇప్పటికే చాలా దేశాలు యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ఘర్షణలతో రావణకాష్ఠంలా రగులుకుంటున్నాయి. అణ్వాయుధాలను అమ్ములపొదిలో దాచుకున్న ధూర్తదేశాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించడానికైనా వెనుకాడబోమని అడపా దడపా హెచ్చరికలు చేస్తూ, మిగిలిన దేశాలకు దడ పుట్టిస్తున్నాయి. ఈ పరిస్థితులు మరింతగా ముదిరితే, మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చినా రావచ్చు. యుద్ధంలో ఏ దేశమైనా తెగబడి అణ్వాయుధాలను ప్రయోగిస్తే, జరగరాని అనర్థాలు జరగవచ్చు. అణ్వాయుధ దాడులు జరిగిన చోట సామాన్యులు బతికి బట్టకట్టే అవకాశాలు కల్ల! అయితే, అణ్వాయుధాల దాడులు జరిగినా, క్షేమంగా బతికి బట్టకట్టడానికి వీలుగా ఆగర్భ శ్రీమంతులు ముందస్తుగా భూగర్భ స్వర్గాలను నిర్మించుకుంటున్నారు.గడచిన శతాబ్దం స్వల్ప వ్యవధిలోనే రెండు ప్రపంచ యుద్ధాలను చవి చూసింది. ఈ రెండు యుద్ధాలు గడచిన శతాబ్ది పూర్వార్ధంలోనే జరిగాయి. రెండు యుద్ధాలు ముగిసిన తర్వాత కూడా వివిధ దేశాల మధ్య అనేక యుద్ధాలు, కొన్ని దేశాల్లో అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా ముంచుకు రావచ్చనే ముందుచూపుతో కొందరు ఆగర్భ శ్రీమంతులు ఇప్పటికే భూగర్భ దుర్గాలను నిర్మించుకున్నారు. మరికొందరు శ్రీమంతులు అదే పనిలో ఉన్నారు. బయటి నుంచి చూస్తే, అవి మామూలు నేలమాళిగల్లాగానే కనిపిస్తాయి. లోపలికి అడుగుపెడితే తెలుస్తుంది, వాటి అసలు సంగతి. అవి మామూలు నేలమాళిగలు కావు, కట్టుదిట్టమైన భూగర్భ దుర్గాలు. అణ్వాయుధాలకు కూడా చెక్కుచెదరవు. భూకంపాల వంటి పెను విపత్తులు సంభవించినా, అవి తట్టుకోగలవు. వాటి లోపల ఉన్న వారికి ఎలాంటి ముప్పు ఉండదు. ప్రళయం వచ్చి, ప్రపంచం అంతమైపోయినంత పని జరిగినా, వాటిలో ఉండేవారు నిక్షేపంగా, క్షేమంగా ఉండగలరు. ఈ భూగర్భ దుర్గాల లోపలి సౌకర్యాలను, విలాసాలను పరిశీలిస్తే, ఇవి భూగర్భ దుర్గాలు మాత్రమే కాదు, భూగర్భ స్వర్గాలు అనక తప్పదు.ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి భూగర్భ స్వర్గాలు ఎన్ని ఉన్నాయో కచ్చితమైన లెక్క ఏదీ లేదు. కొందరు సంపన్నులు బాహాటంగా ఇలాంటివి నిర్మించుకుంటుంటే, మరికొందరు అత్యంత గోప్యంగా రహస్య ప్రదేశాలలో నిర్మించుకుంటున్నారు. పలు దేశాలు అత్యవసర పరిస్థితుల్లో అణ్వాయుధాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో కొన్ని బహిరంగ నిర్మాణాలనే కట్టుదిట్టం చేశాయి. ఉదాహరణకు ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లోని భూగర్భ మెట్రో మార్గంలో ఉన్న మెట్రో స్టేషన్లన్నింటినీ అణ్వాయుధ దాడులను తట్టుకునేలా నిర్మించారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికన్ ప్రభుత్వం రాజధాని వాషింగ్టన్ డీసీ పరిసరాల్లో అణ్వాయు«ధ దాడులను తట్టుకునే భూగృహ స్థావరాలను నిర్మించింది. దేశంలోని అత్యున్నత వ్యక్తులకు రక్షణ కల్పించేందుకు వీటిని నిర్మించింది. అమెరికాలోని జంట భవంతులపై 2001 సెప్టెంబర్ 11న ఉగ్రవాద దాడి తర్వాత ‘కంటిన్యూయిటీ ఆఫ్ గవర్నమెంట్’ (ప్రభుత్వ కొనసాగింపు) పథకం కింద ఇలాంటి మరిన్ని భూగృహ స్థావరాల నిర్మాణానికి నిధుల కేటాయింపులు ప్రారంభించింది. ప్రమాదాలు ఎదురైనప్పుడు పౌరుల సంగతి పట్టించుకోకుండా, ప్రభుత్వం తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తూ, గారెట్ గ్రాఫ్ అనే జర్నలిస్టు ‘రేవెన్ రాక్: ది స్టోరీ ఆఫ్ యూఎస్ గవర్నమెంట్స్ సీక్రెట్ ప్లాన్ టు సేవ్ ఇట్సెల్ఫ్– వైల్ ది రెస్ట్ ఆఫ్ అజ్ డై’ అనే పేరుతో పుస్తకం రాశాడు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని రేవెన్ రాక్ మౌంటెయిన్ కాంప్లెక్స్‌లో అమెరికా ప్రభుత్వం ‘కంటిన్యూయిటీ ఆఫ్ గవర్నమెంట్’ పథకం కింద ఇలాంటి భూగృహ స్థావరాలను నిర్మించింది. ఇవి జనాలకు తెలిసిన స్థావరాలు. ఇలాంటి రహస్య భూగృహ స్థావరాలు కూడా ఉండి ఉండవచ్చనే అనుమానాలు కూడా జనాల్లో ఉన్నాయి. అణ్వాయుధ యుద్ధాలు సంభవిస్తే, ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను గాలికొదిలేస్తాయనే ఎరుక కలిగిన అపర కుబేరులు కొందరు ముందు జాగ్రత్తగా ప్రళయ భీకర పరిస్థితుల్లోనూ చెక్కు చెదరకుండా, బతికి బయటపడటానికి వీలుగా భూగర్భ స్వర్గాలను సొంత ఖర్చులతో నిర్మించుకుంటున్నారు. వీటి కోసం వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి భూగర్భ స్వర్గాలను నిర్మించుకున్న ఆగర్భ శ్రీమంతుల కథా కమామిషూ ఒకసారి చూద్దాం..బిల్ గేట్స్ ఇళ్లన్నింటిలోనూ భూగృహాలుమైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్ మెడీనా ప్రాంతంలోని 66,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకున్న భవంతిలో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటితో పాటు ఆయనకు దాదాపు అరడజనుకు పైగా విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెల్ మార్, రాంకో శాంటా ఫే, ఇండియన్ వెల్స్ ప్రాంతాల్లోను; ఫ్లోరిడాలోని హోబ్ సౌండ్, వెల్లింగ్టన్ ప్రాంతాల్లోను; మోంటానా బిగ్స్కై ప్రాంతంలోను బిల్ గేట్స్‌కు సొంత భవంతులు ఉన్నాయి. ఈ భవంతులు అన్నింటిలోనూ సమస్త సౌకర్యాలతో అత్యంత విలాసవంతమైన సురక్షిత భూగృహాలు ఉన్నాయి. అణ్వాయుధ దాడులు జరిగినా, బయటి ప్రపంచంలో మహమ్మారులు వ్యాపించినా, భూకంపాలు, సునామీలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు తలెత్తినా చెక్కుచెదరని విధంగా వీటిని నిర్మించుకున్నారు. ఎలాన్ మస్క్ సైబర్ హౌస్ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, ‘టెస్లా’, ‘స్పేస్ ఎక్స్’ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తన కోసం అత్యంత సురక్షితమైన ‘సైబర్ హౌస్’ నిర్మించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సైబర్ హౌస్‌ను ఎప్పుడు ఎక్కడ నిర్మించ నున్నారనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అయితే, ఎలాన్ మస్క్ ఆలోచనలకు అనుగుణంగా రష్యన్ డిజైనర్ లెక్స్ విజెవ్స్కీ సైబర్ హౌస్ నమూనాకు రూపకల్పన చేశారు. అత్యంత దృఢమైన, స్వయం సమృద్ధి కలిగిన బహుళ అంతస్తుల భూగృహంగా దీనిని డిజైన్ చేశారు. అణ్వాయుధ దాడులకు చెక్కు చెదరకుండా ఉండటం ఒక్కటే దీని విశేషం కాదు, వైరస్లు, బ్యాక్టీరియాలు వంటి సూక్ష్మజీవుల నుంచి కూడా పూర్తి రక్షణ కల్పించేలా తీర్చిదిద్దారు. విద్యుదుత్పాదన కోసం సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్ వంటి వసతులతో పాటు, మంచినీటి సరఫరా కోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, ఎలాంటి ఆయుధాలకైనా చెక్కుచెదరని ఎయిర్‌లాక్ డోర్స్, మెటల్ రోల్ షట్టర్స్ తదితర వసతులతో సైబర్ హౌస్‌ను నిర్మించనున్నారు. సైబర్ హౌస్ డిజైన్ మూడేళ్ల కిందటే పూర్తయినా, దీని వాస్తవ నిర్మాణం ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది.హవాయి దీవిలో జూకర్బర్గ్ భూగృహం‘ఫేస్బుక్’ అధినేత మార్క్ జూకర్బర్గ్ హవాయి దీవుల్లోని ఒకటైన కావాయి దీవిలో 1400 ఎకరాల స్థలాన్ని 100 మిలియన్ డాలర్లకు (రూ.843 కోట్లు) కొనుగోలు చేశారు. ఇందులోని ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సురక్షితమైన భూగర్భ స్థావరాన్ని నిర్మించుకుంటున్నారు. ఈ నిర్మాణాన్ని అత్యంత రహస్యంగా చేపట్టినా, నిర్మాణంలో ఉన్న భూగృహం ఫొటోలు మీడియాకు చిక్కాయి. ఈ స్థలంలోనే నిర్మిస్తున్న రెండు వేర్వేరు భవంతుల నుంచి ఈ భూ గృహానికి చేరుకోవడానికి సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార సరఫరాకు అంతరాయం లేనివిధంగా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు, నిరంతర మంచినీటి సరఫరా కోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, కీబోర్డు ద్వారా పనిచేసే సౌండ్‌ప్రూఫ్ తలుపులు, ద్వారాలు, హైస్పీడ్ ఎలివేటర్లు, మెకానికల్ రూమ్, స్విమింగ్ పూల్, జిమ్, సినిమా థియేటర్ వంటి విలాసవంతమైన సౌకర్యాలతో దీని నిర్మాణం సాగిస్తున్నట్లు సమాచారం. అన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షణ కల్పించగల ఈ భూగృహ నిర్మాణానికి 270 మిలియన్ డాలర్లు (రూ.2,278 కోట్లు) ఖర్చు కాగలదని అంచనా.జెఫ్ బెజోస్ ఇళ్లలో భూగృహాలు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇప్పటికే ఫ్లోరిడా పరిధిలోని ఇండియన్ క్రీక్ దీవిలో మూడు భవంతులను నిర్మించుకున్నారు. ఈ మూడింటిలోనూ ఆయన సురక్షితమైన భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. వీటి కోసం బెజోస్ 237 మిలియన్ డాలర్లు (రూ.1,999 కోట్లు) ఖర్చు చేశారు. ఇదే దీవిలో ఇవాంకా ట్రంప్, ట్రాన్స్‌ఫార్మర్‌కో వ్యవస్థాపకుడు, సియర్స్ మాజీ సీఈవో అమెరికన్ అపర కుబేరుల్లో ఒకరైన ఎడ్డీ లాంపెర్ట్, అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు టామ్ బ్రాడీ, గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మీడ్, ఏకాన్ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు కార్ల్ ఏకాన్ తదితరులు సైతం ఇండియన్ క్రీక్ దీవిలో జెఫ్ బెజోస్ తరహాలోనే భూగర్భ స్థావరాలతో కూడిన ఇళ్లను నిర్మించుకున్నారు.భూగృహ నిర్మాణరంగంలో కంపెనీల పోటాపోటీభూగృహ నిర్మాణరంగంలో పలు కంపెనీలు పోటాపోటీగా నిర్మాణాలు సాగిస్తున్నాయి. అణ్వాయుధ దాడులు, ప్రకృతి విపత్తులు సహా ఎలాంటి ముప్పునైనా తట్టుకుని నిలిచే భూగర్భ గృహాల నిర్మాణానికి కొత్త కొత్త నమూనాలకు రూపకల్పన చేస్తూ, అమిత సంపన్నులను తమ వైపుకు ఆకట్టుకుంటున్నాయి. న్యూక్లియర్ బంకర్ కంపెనీ, ఓపిడమ్ బంకర్స్, అట్లాస్ సేఫ్ సెల్లార్, సీబీఆర్ఎన్ షెల్టర్స్, స్పార్టమ్ సర్వైవల్ సిస్టమ్స్, యూఎస్ఏ బంకర్ కంపెనీ, రైజింగ్ ఎస్ బంకర్స్ వంటి కంపెనీలు కట్టుదిట్టమైన భూగర్భ నిర్మాణాలకు ప్రసిద్ధి పొందాయి. ఇవి భారీ ఎత్తున దేశ దేశాల్లో నిర్మాణాలను సాగిస్తున్నాయి. రైజింగ్ ఎస్ బంకర్స్ ఇటీవలి కాలంలో దాదాపు పది బంకర్లను న్యూజీలండ్‌లో ఏర్పాటు చేసింది. మిగిలిన కంపెనీలు కూడా ఇందుకు దీటుగా దేశ దేశాల్లో భూగర్భ స్థావరాల నిర్మాణాలను సాగిస్తున్నాయి. యుద్ధాలు, విపత్తులపై భయాందోళనలు ఉన్న సంపన్నులు కోట్లాది డాలర్లు వెచ్చిస్తూ వీటి ద్వారా తమ కోసం ప్రత్యేకమైన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.ఆ దేశంలో ఇంటింటా భూగృహంప్రపంచవ్యాప్తంగా భూగృహాల సంఖ్యలో స్విట్జర్లండ్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆ దేశంలో దాదాపు ప్రతి ఇంటా సురక్షితమైన భూగృహం ఉంటుంది. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్ బంకర్లు, నివాస భవనాల్లోని ప్రైవేటు బంకర్లు సహా స్విట్జర్లండ్లో 3.70 లక్షలకు పైగా బంకర్లు ఉన్నట్లు అంచనా. అనుకోకుండా దేశంపై అణ్వాయుధ దాడులు జరిగితే, దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడానికి వీలుగా స్విట్జర్లండ్ ప్రభుత్వం ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకుంది. స్విట్జర్లండ్‌లోని ప్రతి భూగర్భ స్థావరం అత్యంత కట్టుదిట్టమైన రక్షణ కల్పిస్తుంది. దాదాపు ఏడువందల మీటర్ల దూరంలో 12 మెగాటన్నుల అణుబాంబులు పేలినా చెక్కుచెదరని రీతిలో వీటిని నిర్మించడం విశేషం. సురక్షితమైన బంకర్ల నిర్మాణంలో స్విట్జర్లండ్కు దాదాపు ఆరు దశాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో– 1963 నుంచి స్విట్జర్లండ్ ప్రభుత్వం అణ్వాయుధ దాడులను తట్టుకునే భూగర్భ స్థావరాల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, విరివిగా నిర్మాణాలను చేపట్టింది. అణ్వాయుధ దాడుల పట్ల మరే దేశంలోనూ లేని సంసిద్ధతను కేవలం స్విట్జర్లండ్లో మాత్రమే చూడవచ్చు. విపత్కర పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలకు కూడా భరోసా కల్పించే ఏకైక దేశం స్విట్జర్లండ్ మాత్రమేనని చెప్పుకోవచ్చు.భూగర్భ స్వర్గాల నిర్మాతఅమెరికన్ వ్యాపారవేత్త ల్యారీ హాల్ భూగర్భ స్వర్గాల నిర్మాణంలో ప్రసిద్ధుడు. భవన నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న ల్యారీ హాల్, సంపన్నుల కోసం అణ్వాయుధాలను తట్టుకునే భూగృహాలను కొన్నేళ్లుగా నిర్మిస్తున్నారు. ఆయన తన కోసం కాన్సస్ ప్రాంతంలో స్వయంగా భూగర్భ స్వర్గాన్ని నిర్మించుకున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కాన్సస్ ప్రాంతంలో అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూగర్భ క్షిపణి స్థావరాన్ని ల్యారీ హాల్ 2008లో 20 మిలియన్ డాలర్లకు (రూ.168.75 కోట్లు) కొనుగోలు చేశారు. తర్వాత దీనిని తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. బయటి నుంచి చూస్తే, గుమ్మటంలా కనిపించే ఈ భూగృహంలో నేలకు దిగువన పదిహేను అంతస్తుల భవంతిని నిర్మించారు. ఇందులో హైస్పీడ్ ఎలివేటర్లు, నిత్యావసర సరుకులతో కూడిన జనరల్ స్టోర్, సినిమా థియేటర్, పిల్లలు చదువుకోవడానికి తరగతి గది, లైబ్రరీ, స్విమింగ్ పూల్, జిమ్, స్పా, వంట గదులు, భోజనశాలలు, కూరగాయలను పండించుకోవడానికి తగిన పొలం, చేపలు, రొయ్యల పెంపకానికి ఒక కొలను వంటి సమస్త సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం విశేషం. విలాసవంతమైన సురక్షిత భూగృహాలను నిర్మించడంలో ల్యారీ హాల్ నైపుణ్యం తెలుసుకున్న సంపన్నులు చాలామంది ఆయన ద్వారానే తమ కోసం ప్రత్యేక భూగృహాలను ఇప్పటికే నిర్మించుకున్నారు. ఇంకొందరు నిర్మించుకుంటున్నారు.సంపన్నుల చూపు.. న్యూజీలండ్ వైపుప్రపంచంలోని అమిత సంపన్నుల్లోని చాలామంది భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు న్యూజీలండ్ను ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికన్ వ్యాపారవేత్త, పేపాల్ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ న్యూజీలండ్ దక్షిణ ప్రాంతంలోని దీవిలో 73,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భూగర్భ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి స్థలాన్ని కూడా ఎంపిక చేసుకున్నారు. దీనివల్ల దీవిలోని పరిసరాల సౌందర్యం దెబ్బతింటుందనే కారణంగా న్యూజీలండ్ ప్రభుత్వం 2022లో పీటర్ థీల్కు అనుమతి నిరాకరించింది. న్యూజీలండ్‌లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్, ఓపెన్ ఏఐ అధినేత శామ్ ఆల్ట్‌మన్ వంటి వారు సైతం న్యూజీలండ్‌లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీరే కాకుండా, అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, హాలీవుడ్ గాయని జూలియో ఇగ్లేసీయస్ సహా పలువురు సంపన్నులు న్యూజీలండ్‌లో భూగర్భ స్థావరాల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. -
Russia Ukraine War: నాటోలో చేర్చుకోండి.. యుద్ధం ఆపేస్తాం
కీవ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం రెండున్నరేళ్లుగా కొనసాగుతోంది. ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇరుదేశాల సైనికులు నీరసించిపోతున్నారు. శత్రుదేశంలో ఇక పోరాడలేమంటూ ఉక్రెయిన్, రష్యా జవాన్లు తేల్చిచెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి ముగింపు పలకాలని రెండు దేశాలూ యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన రష్యా సైన్యం అక్కడే తిష్టవేసింది. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ భూభాగాలు రష్యా నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఉక్రెయిన్‌లో ఐదింట ఒక వంతు భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. సాంకేతికంగా, చట్టపరంగా ఇది ఉక్రెయిన్ పరిధిలోనిదే. అయినప్పటికీ ప్రస్తుతం దానిపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి పట్టులేదు. మరోవైపు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) కూటమిలో చేరికపట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉత్సాహం చూపిస్తున్నారు. కనీసం ఇప్పుడు తమ నియంత్రణలో ఉన్న భూభాగాన్ని అయినా నాటోలో చేర్చుకుంటే యుద్ధంతో అత్యంత కీలక దశను ముగించే అవకాశం ఉందని చెప్పారు. ఇదంతా చాలా వేగంగా జరగాలని అభిప్రాయపడ్డారు. తాజాగా స్కైన్యూస్ సంస్థకు జెలెన్స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ అ«దీనంలో ఉన్న ప్రాంతానికి పూర్తి భద్రత కల్పిస్తామంటూ హామీ ఇవ్వాలని నాటోను కోరారు. అలాగైతే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని తెలిపారు. ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం భూభాగాన్ని.. రష్యా ఆక్రమించిన ప్రాంతాలతో సహా నాటోలో చేర్చుకోవాలని చెప్పారు. దాంతో రష్యా ఆక్రమించిన భూమిని దౌత్య మార్గాల్లో మళ్లీ తాము స్వా«దీనం చేసుకొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కల్పిస్తే రష్యాతో యుద్ధాన్ని ఆపేయడానికి సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ స్పష్టంచేశారు. కానీ, సభ్యత్వం విషయంలో నాటో దేశాల నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ను ఇప్పటికిప్పుడు తమ కూటమిలో చేర్చుకోవడానికి నాటోలోని కొన్ని దేశాలు ఇష్టపడడం లేదని సమాచారం.ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ -
ప్రపంచాన్ని వల్లకాడు చేస్తారా..!
-
విమానాల పైనుంచి దూసుకెళ్లిన మిసైల్స్..ఏం జరిగిందంటే..
వాషింగ్టన్:ఇజ్రాయెల్‌పై ఈ ఏడాది అక్టోబర్‌లో ఇరాన్ జరిపిన మిసైళ్ల దాడికి సంబంధించి సంచలన విషయం ఒకటి తాజాగా బయటికి వచ్చింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ప్యాసింజర్ విమానాలకు ముప్పుగా మారిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇరాన్ ప్రయోగించిన దాదాపు 200 బాలిస్టిక్ మిసైల్స్ ప్రయాణికులతో నిండిన విమానాలపై నుంచి నిప్పులు చిమ్ముకుంటూ ఎగురుతూ వెళ్లినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది.ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయెల్ దిశగా దూసుకు వెళ్లిన మార్గంలో అదే సమయంలో సుమారు డజను ప్యాసింజర్ విమానాలు ఎగురుతున్నట్లు కథనంలో పేర్కొన్నారు. విమానాల్లోని ప్రయాణికులు, పైలట్లు తమపై నుంచి నిప్పులు చిమ్ముతూ వెళుతున్న ఇరాన్ మిసైల్స్‌ను చూసినట్లు కథనంలో రాసుకొచ్చారు. సాధారణంగా బాలిస్టిక్ మిసైల్స్ ప్యాసింజర్ విమానాల కంటే ఎత్తులో ఎగురుతాయి.అయితే ప్యాసింజర్ విమానాలు తమ అవసరాల మేరకు పైకి కిందికి వెళ్లేటపుడు మిసైల్స్ ప్రమాదకరంగా మారతాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేసే సమయంలో పౌర విమానాలకు ఇరాన్ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకపోవడం గమనార్హం. అక్టోబర్ మొదటి వారంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించింది.ఈ దాడులను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ కూడా పూర్తిగా అడ్డుకోలేకపోయింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు కొంతమేర దెబ్బతిన్నాయి. -
పశ్చిమ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్
-
ఉక్రెయిన్ను రష్యా ఏం చేయబోతోంది.? ఖాళీ అవుతున్న ఎంబసీలు
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా మున్ముందు ఎలాంటి దాడులు చేస్తుందోనని పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రాయబార కార్యాలయాన్ని మూసేసిన అమెరికా బాటలోనే పలు దేశాలు కూడా నడుస్తున్నాయి.ఇటలీ ,గ్రీస్,స్పెయిన్లు కూడా కీవ్‌లోని తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. కీవ్‌లోని తమ ఎంబసీపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం అందడంతో వెంటనే దానిని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. నవంబర్ 20న దాడి జరగబోతోందని తమకు అందిన కచ్చితమైన సమాచారంతోనే ఎంబసీ ఖాళీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇటలీ, గ్రీస్, స్పెయిన్లు తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేశాయి.కాగా,రష్యా అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేసిన సంగతి తెలిసిందే.అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే రష్యా పరిగణించనుంది. -
టెన్షన్..టెన్షన్: హాట్‌లైన్‌పై రష్యా సంచలన ప్రకటన
మాస్కో:అమెరికా-రష్యా మధ్య అత్యవసర కమ్యూనికేషన్‌కు కీలకమైన హాట్‌లైన్ వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అమెరికా,రష్యాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తితే రెండు దేశాల అధ్యక్షులు చర్చించేందుకు ఓ సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందని,ఇది వీడియో కూడా ప్రసారం చేయగలదని పెస్కోవ్ గతంలో చెప్పారు.అయితే ప్రస్తుతం ఇది వినియోగంలో లేదని తాజాగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పెస్కోవ్ సమాధానమిచ్చారు. కాగా,రష్యాపై అమెరికా తయారీ లాంగ్రేంజ్ మిసైల్స్ వాడేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుమతివ్వడంతో యూరప్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.దీనికి ప్రతిగా అణ్వాయుధాల ప్రయోగంపై నిబంధనలను రష్యా సరళతరం చేసింది.ఈ పరిణామాల నడుమ మంగళవారం(నవంబర్ 19) కీవ్ దళాలు రష్యా ప్రధాన భూభాగంపై క్షిపణులతో దాడులు చేశాయి.ఇందుకు ప్రతీకారంగా ఉక్రెయిన్‌పై మాస్కో దళాలు దాడి చేయవచ్చనే భయాలు పెరిగిపోయాయి. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తన దౌత్య కార్యాలయాన్ని అమెరికా ఖాళీ చేసింది.ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా,రష్యా మధ్య హాట్‌లైన్ వాడకంలో లేదన్న వార్త మరింత భయాందోళనలకు కారణమవుతోంది. -
ఉక్రెయిన్‌లో అమెరికా ఎంబసీ మూసివేత
కీవ్ : రష్యాతో యుద్ధంతో ఉక్రెయిన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఉక్రెయిన్‌లో అమెరికా రాయబార కార్యాలయాన్ని (ఎంబసీ) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధులు వెల్లడించారు.ఇటీవల అమెరికా ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్‌కు సరఫరా చేసింది. ఆ క్షిపణులను ఉక్రెయిన్.. శత్రుదేశంపై ప్రయోగించింది. అయితే, ఉక్రెయిన్ క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా సిద్ధమైంది. కీవ్‌పై ఊహించని విధంగా వైమానిక దాడులు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. వెంటనే ఉక్రెయిన్‌లో తమ ఎంబసీని మూస్తువేస్తున్నట్లు ఎంబసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఎంబీసీలో పనిచేసే ఉద్యోగులు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. దీంతో పాటు ఉక్రెయిన్‌లో ఉన్న అమెరికన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది. అమెరికా అందించిన ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించింది. ఈ దాడులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్‌కు తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. గత నెలలో ఉత్తర కొరియా అందిస్తున్న క్షిపణలతో దాడులు చేస్తామని స్పష్టం చేశారు. -
ఆ మహా విపత్తుకు... 1,000 రోజులు!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సోమవారంతో అక్షరాలా వెయ్యి రోజులు నిండాయి. ఎక్కడ చూసినా శిథిలమైన భవనాలు. వాటికింద నలిగి ముక్కలైన జ్ఞాపకాలు. కమ్ముకున్న బూడిద, పొగ చూరిన గ్రామాలు. లక్షల్లో ప్రాణనష్టం. లెక్కకు కూడా అందనంత ఆస్తి నష్టం. ఉక్రెయిన్ ఏకంగా నాలుగో వంతు జనాభాను కోల్పోయింది. వెరసి ఈ యుద్ధం 21వ శతాబ్దపు మహా విషాదంగా మారింది. నానాటికీ విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలన్నింటినీ భయపెడుతున్నాయి.రావణకాష్టంలా... 2022 ఫ్రిబవరి 24. ఉక్రెయిన్‌పై రష్యా ఆకస్మికంగా దాడికి దిగిన రోజు. నాటినుంచి రావణకాష్టాన్ని తలపిస్తూ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అంతులేని ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తూనే ఉంది. ఇప్పటిదాకా కనీసం 80,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక అంచనా వేసింది. మరో 400,000 మందికి పైగా గాయాపడ్డట్టు పేర్కొంది. రష్యా అయితే ఏకంగా 2 లక్షల మంది సైనికులను కోల్పోయిందని సమాచారం. లక్షలాది మంది గాయపడ్డారని చెబుతున్నారు. ఐరాస మానవ హక్కుల మిషన్ గణాంకాల ప్రకారం గత ఆగస్టు 31 నాటికి ఉక్రెయిన్‌లో 11,743 మంది సామాన్య పౌరులు మరణించారు. 24 వేల మందికి పైగా గాయపడ్డారు. అయితే వాస్తవ గణాంకాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఐరాస అధికారులే అంటున్నారు. ఉక్రెయిన్‌లో జననాల రేటు కూడా రెండేళ్లుగా మూడో వంతుకు పడిపోయింది. ఏకంగా 60 లక్షల మంది ఉక్రెయిన్‌వాసులు శరణార్థులుగా విదేశాల్లో తలదాచుకుంటున్నారు.చిరకాలంగా రష్యా కన్ను 1991లో సోవియట్ యూనియన్ విచి్ఛన్నమయ్యే దాకా ఉక్రెయిన్ రష్యన్ సామ్రాజ్యంలో భాగంగానే ఉండేది. కనుక దాన్ని తిరిగి రష్యా సమాఖ్యలో విలీనం చేయడమే లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎన్నోసార్లు చెప్పారు. స్లావిక్, ఆర్థోడాక్స్ క్రైస్తవులైన ఉక్రెయిన్ ప్రజలు వాస్తవానికి రష్యన్లేనన్నది ఆయన వాదన. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందున యుద్ధానికి త్వరలో తెర పడవచ్చన్న ఆశలు కూడా అడియాసలే అయ్యేలా ఉన్నాయి. అమెరికా అనుమతితో రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేయడంతో తాజాగా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ట్రంప్ బాధ్యతలు స్వీకరించేందుకు ఇంకా రెండు నెలల గడువుంది. ఆలోగా పరిణామాలు మరింతగా విషమిస్తాయా? పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతాయా? ఇప్పుడు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్న ప్రశ్నలివి.ఆర్థిక వ్యవస్థ పతనం.. యుద్ధం దెబ్బకు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా పతనమైంది. 2023లో స్వల్పంగా పుంజుకున్నా, రాయిటర్స్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ కమిషన్, ఐరాస, ఉక్రెయిన్ ప్రభుత్వ అంచనాల ప్రకారం యుద్ధ నష్టం 2023 చివరికే ఏకంగా 152 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. రష్యా దాడుల్లో దేశ మౌలిక సదుపాయాలన్నీ నేలమట్టమయ్యాయి. విద్యుత్ తదితర రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పునర్నిర్మాణ, పునరుద్ధరణ పనులకు కనీసం 500 బిలియన్ డాలర్లు కావాలని ప్రపంచ బ్యాంకు, ఉక్రెయిన్ ప్రభుత్వం అంచనా వేశాయి. దీనిముందు పాశ్చాత్య దేశాల నుంచి అందిన 100 బిలియన్ డాలర్లకు పై చిలుకు ఆర్థిక సాయం ఏ మూలకూ చాలని పరిస్థితి. పైగా అందులో అత్యధిక మొత్తం యుద్ధ అవసరాలపైనే వెచి్చంచాల్సి వస్తోంది. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌కు సగటున రోజుకు 14 కోట్ల డాలర్ల చొప్పున నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. ఆహార ధాన్యాల ఎగుమతిదారుల్లో ఉక్రెయిన్ ముందు వరుసలో ఉంటుంది. యుద్ధం దెబ్బకు అక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోవడం అంతర్జాతీయంగా ఆహార సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది. -
కమ్ముకొస్తున్న అణుమేఘాలు. శరవేగంగా నాటకీయ పరిణామాలు. రష్యాపైకి ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వెయ్యి రోజుల యుద్ధం
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి నేటికి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఈ యుద్ధం ఐరోపాలో అత్యంత ఘోరమైన సంఘర్షణగా రూపుదిద్దుకుంది. పలు నివేదికలలోని వివరాల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక మిలియన్(10 లక్షలు)కు పైగా జనం మరణించడమో, తీవ్రంగా గాయపడటమో జరిగింది.2022లో ప్రారంభమైన 21వ శతాబ్దపు ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌లోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టం, ఆస్తి నష్టం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. యుద్ధంలో దెబ్బతిన్న దేశం నుంచి నిరంతరం హృదయాన్ని కదిలించే వార్తలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ఆ దేశం ఎంతో బలహీనంగామారింది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం యుద్ధంలో 80 వేల మంది ఉక్రేనియన్ సైనికులు మరణించారు. నాలుగు లక్షల మందికి పైగా సైనికులు గాయపడ్డారు. పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన వివరాల ప్రకారం రష్యన్ సైనికుల మరణాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని నివేదికలలో మరణించిన సైనికుల సంఖ్య సుమారు రెండు లక్షలు, గాయపడిన వారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలుగా పేర్కొన్నారు. రెండు దేశాల జనాభా ఇప్పటికే క్షీణించింది. యుద్ధానికి ముందే ఇరు దేశాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా సంభవించిన భారీ మరణాల ప్రభావం ఇరు దేశాల జనాభా గణాంకాలపై కనిపిస్తోంది.మరణించిన సైనికుల డేటా గోప్యం?ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మిషన్ తెలిపిన వివరాల ప్రకారం ఉక్రెయిన్‌లో ఆగస్టు 2024 నాటికి 11,743 మంది పౌరులు మరణించారు. 24,614 మంది గాయపడ్డారు. ముఖ్యంగా మారియుపోల్ వంటి రష్యన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ఈ మరణాలు సంభవించాయి. ఇదేకాకుండా ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 589 మంది చిన్నారులు కూడా మరణించారు. యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, గ్రౌండ్ దళాలు నిరంతరం దాడులు చేస్తున్నాయి. జాతీయ భద్రత కోసం యుద్ధంలో మరణించిన తమ సైనికుల డేటాను ఇరుపక్షాలు గోప్యంగా ఉంచాయని, పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఇచ్చిన అంచనాలలో చాలా తేడా ఉందని ఒక ఈ మీడియా నివేదిక పేర్కొంది. సైనిక ప్రాణనష్టం విషయంలో కూడా రష్యాకు భారీ నష్టం వాటిల్లిందనే అంచనాలున్నాయి ఈ భీకర యుద్ధంలో ఒక్క రోజులో వెయ్యి మందికి పైగా రష్యన్ సైనికులు మరణించారు. ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ 2024, ఫిబ్రవరిలో 31 వేలకు పైగా ఉక్రేనియన్ సైనికులు మృతిచెందారని తెలిపారు.ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం మృతియుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో జననాల రేటు రెండున్నరేళ్ల క్రితం ఉన్న దానికంటే ఇప్పుడు మూడో వంతుకు పడిపోయింది. ఉక్రెయిన్‌లో దాదాపు నాలుగు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఆరు మిలియన్లకు పైగా ఉక్రేనియన్ పౌరులు విదేశాల్లో ఆశ్రయం పొందారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ జనాభా 10 మిలియన్లకు పైగా తగ్గింది. ఇది అక్కడి జనాభాలో నాలుగింట ఒక వంతు. అంటే ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం తుడిచిపెట్టుకుపోయింది. యుక్రేనియన్ ప్రభుత్వం యుద్ధంలో రోజువారీ ఖర్చు 140 మిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ అని అంచనా వేసింది. ఉక్రెయిన్ 2025 ప్రతిపాదిత బడ్జెట్లో రక్షణ కోసం 26 శాతం అంటే 53.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావంయుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 2022లో 33 శాతం క్షీణించింది. 2023లో ఈ పరిస్థితి కాస్త మెరుగుపడి నష్టం 22 శాతానికి పరిమితమైంది. హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, ఇంధనం, వ్యవసాయ రంగాలు యుద్ధానికి అమితంగా ప్రభావితమయ్యాయి. ఉక్రెయిన్‌లోని రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రష్యా లక్ష్యంగా చేసుకోవడంతో ఉక్రెయిన్ ఇంధన రంగం తీవ్రంగా దెబ్బతింది.ఉక్రెయిన్‌లో కొంతభాగం రష్యా స్వాధీనంరాయిటర్స్ నివేదిక ప్రకారం ఉక్రెయిన్‌లో ఐదవ వంతును రష్యా స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతాలను తన అదుపులో ఉంచుకుంది. ఈ భాగం గ్రీస్ దేశ పరిమాణంతో సమానం. రష్యన్ దళాలు 2022 ప్రారంభంలో ఉక్రెయిన్‌లోని ఉత్తర, తూర్పు, దక్షిణ భాగాలలో దాడి చేసి, ఉత్తరాన కీవ్ శివార్లకు చేరుకుని, దక్షిణాన డ్నిప్రో నదిని దాటాయి. రష్యా దాదాపు ఉక్రెయిన్‌లోని తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని, దక్షిణాన అజోవ్ సముద్ర తీరాన్ని స్వాధీనం చేసుకుంది.పుతిన్‌కు గిట్టని ఉక్రేనియన్ గుర్తింపు ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యన్ సామ్రాజ్యంలో భాగం. తరువాత సోవియట్ యూనియన్‌లో భాగమైంది. ఉక్రెయిన్ను మళ్లీ రష్యాలో విలీనం చేయడమే తన లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు సందర్భాల్లో చెప్పారు. పుతిన్ ఉక్రేనియన్ రాష్ట్ర హోదాను, గుర్తింపును తిరస్కరించారు. ఉక్రేనియన్లు నిజానికి రష్యన్లేనని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లక్షలాది మంది ప్రాణాలను బలిగొనడమే కాకుండా ఇరు దేశాల జనాభా, ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ యుద్ధం ప్రపంచ సంక్షోభానికి కూడా దారితీసింది. ఇది కూడా చదవండి: భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం -
షాకిస్తున్న ట్రంప్ ఎంపికలు!
అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ఏలుబడి ఎలా ఉండబోతున్నదన్న చర్చలు ఒకపక్క సాగుతుండగా ఆయన తన టీం సభ్యుల పేర్లను వరసబెట్టి ప్రకటిస్తున్నారు. ఆ పేర్లు కొందర్ని ఆశ్చర్యపరుస్తుంటే, మరికొందర్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తుతున్నాయి. తొలి బోణీ స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ కాగా, ఆయనతోపాటు వరసగా వివేక్ రామస్వామి, తులసీ గబార్డ్, మార్కో రుబియో, మాట్ గెట్జ్ వంటివారు కీలక పదవుల్లో కుదురుకోబోతున్నారని తేలింది. వీళ్లంతా వ్యాపారవేత్తలు, ఐశ్వర్యవంతులు... అన్నిటికన్నా మించి ‘వెలుపలివారు’ అయినందువల్ల తన ప్రభుత్వం సమర్థవంతమైన కార్పొరేట్ దిగ్గజంగా వెలిగిపోతుందని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడు తోంది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అరుణ్ శౌరి ఆధ్వర్యంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖ ఉండేది. దాని పని నష్టజాతక పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటం. ఆ క్రమంలో సవ్యంగా నడుస్తున్న సంస్థలు సైతం ప్రైవేటుకు దక్కాయన్న విమర్శలుండేవి. ఇప్పుడు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలతో ట్రంప్ అటువంటి పనే చేయించబోతున్నారు. మస్క్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సామర్థ్య విభాగం(డీఓజీఈ) ఏర్పడుతుంది. దానికి వివేక్ ‘వెలుపలి సలహాదారు’గాఉంటారు. వచ్చే ఏడాది జూలైకల్లా ప్రభుత్వ వ్యయంలో 2 లక్షల కోట్ల డాలర్లు కోత పెట్టడమే ధ్యేయంగా వీరిద్దరూ నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వోద్యోగుల సంఖ్య అపరిమితంగా ఉన్న దనీ, ఇందులో భారీగా కోతపెట్టడంతోపాటు ఉద్యోగాలన్నీ తాత్కాలిక ప్రాతిపదికనే ఉండటం అవసరమనీ తొలి ఏలుబడిలోనే ట్రంప్ తరచు చెప్పేవారు. అయితే సహచరుల హెచ్చరికతోముందడుగేయ లేకపోయారు. అందుకే కావొచ్చు... గతానుభవం లేనివారినే ఎంచుకున్నారు. అయితే ట్రంప్–మస్క్‌ల సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్నది అనుమానమే. ప్రభుత్వోద్యోగుల పని తీరుపై ట్రంప్, మస్క్‌లకు ఏకాభిప్రాయం ఉంది. అయితే కార్పొరేట్ సంస్థలు అన్యాయంగా సిబ్బందిని తొలగిస్తున్నాయన్న ట్రంప్ అభిప్రాయానికి మస్క్ వ్యతిరేకం. కార్మిక హక్కులు కాలరాయడాన్ని నిరసిస్తూ ప్రచారపర్వంలో చేసిన ప్రసంగాల వల్ల పలు కార్మిక సంఘాలు ట్రంప్‌కు అనుకూలంగా మారాయి. ఆయన విజయానికి దోహదపడిన అనేక అంశాల్లో ఇదొకటి. మస్క్ విష యానికొస్తే ఆయన ట్విట్టర్ (ఎక్స్)లోనూ, అంతకుముందు టెస్లాలోనూ భారీ యెత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. దానిపై జాతీయ కార్మిక సంబంధాల బోర్డులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇక చైనాపై మస్క్‌కున్న ప్రేమ ఎవరికీ తెలియంది కాదు. 2020లో షాంఘైలో టెస్లా విద్యుత్ కార్ల కర్మాగారం మొదలయ్యాక ఒక్క చైనాలోనే మస్క్ ఆరు లక్షల కార్లు విక్రయించారు.పర్యావరణ పరిరక్షణ పేరిట పెట్రోల్, డీజిల్ కార్లకు బదులు విద్యుత్ కార్లు తీసుకురావటం పెద్ద కుట్రని ట్రంప్ అభిప్రాయం. దానికితోడు ఆయనకు చైనాపై ఉన్న వ్యతిరేకత మస్క్ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. విదేశాంగమంత్రిగా ఎంపిక చేసుకున్న మార్కో రుబియో చైనాకు తీవ్ర వ్యతిరేకి, ఇజ్రాయెల్ అనుకూలుడు.ట్రంప్ హయాంలో వేధింపులు దండిగా ఉంటాయని అటార్నీ జనరల్‌గా మాట్ గెట్జ్ ఎంపిక వెల్లడిస్తోంది. తన ప్రత్యర్థి కమలా హ్యారిస్ మొదలుకొని ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ, 2021 నాటి మూకదాడి కేసు విచారణలో ప్రముఖపాత్ర పోషించిన లిజ్ షెనీ వరకూ చాలామందిపై ఆయన ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. అందుకే మైనర్లతో లైంగిక కార్యకలా పాలు, మాదకద్రవ్యాల వినియోగంవంటి ఆరోపణలున్నా ఉద్దేశపూర్వకంగా గెట్జ్‌ను ట్రంప్ ఎంపిక చేశారు. ట్రంప్‌పై నేరారోపణలు ముసురుకొని కేసులు వచ్చిపడిన తరుణంలో ఆయన వెనకదృఢంగా నిలబడటం గెట్జ్కున్న ఏకైక అర్హత. రిపబ్లికన్లలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఎంపిక సెనేట్‌లో గట్టెక్కుతుందా అన్న సందేహాలున్నాయి. అమెరికా త్రివిధ దళాధిపతుల కమిటీ చైర్మన్‌తో సహా సైనిక జనరళ్లను తొలగించాలని కోరే ఫాక్స్ న్యూస్ ప్రెజెంటర్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా ఎంపిక చేయడం కూడా అత్యధికులకు మింగుడుపడటం లేదు. వైవిధ్యత పేరిట సైన్యంలో మైనారిటీ వర్గాలకూ, స్త్రీలకూ ప్రాధాన్యత పెరగటాన్ని చాలాకాలంగా హెగ్సెత్ ప్రశ్నిస్తు న్నారు. గతంలో సైన్యంలో పని చేసిన హెగ్సెత్వల్ల ప్రభుత్వంతో సైన్యానికి ఘర్షణ తప్పదని అనేకుల అంచనా. ఇక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసిన తులసి గబార్డ్ వెనిజులా, సిరియా, ఉక్రెయిన్, రష్యా వ్యవహారాల్లో అమెరికా విధానాలు తప్పని అంటారు. ఆమెకు ఏకంగా 18 నిఘా సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించే నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బాధ్యతలు అప్పజెప్పటాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ట్రంప్ ఏలుబడిలో వలసదారులను శ్వేతజాతి దురహంకారం బెడదతో సహా అనేకం చుట్టు ముడతాయి. దానికితోడు వీసా సమస్యలు, ఉద్యోగాల కోత తప్పవు. ఇక ‘అమెరికా ఫస్ట్’ అమలైతే వాణిజ్యయుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు గనుక చైనాతో సహా అనేక దేశాలు ఆత్మరక్షణ విధానాలకు సిద్ధపడుతున్నాయి. డాలర్ దూకుడు అంచనాతో అమెరికా మార్కెట్లు వెలిగిపోతుంటే విదేశీ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ట్రంప్ టీంలో మార్కో రుబియో, హెగ్సెత్, ఉపాధ్యక్షుడు కాబోతున్న జేడీ వాన్స్తోసహా అందరూ ఉక్రెయిన్ యుద్ధం ఆపటమే తమ తొలి లక్ష్యమని ఇప్పటికే ప్రకటించారు గనుక ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి గత్యంతరం లేదు. నాటో దేశాలు ట్రంప్తోగతంలో ఉన్న అనుభవం వల్ల ఇప్పటికే దిక్కుతోచక ఉన్నాయి. మొత్తానికి ట్రంప్ రాకతో ఇంటా బయటా యధాతథ స్థితి తలకిందులు కాబోతోంది. -
ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ట్రంప్ మరో కీలక నిర్ణయం
వాషింగ్టన్ డీసీ : తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిలిపి వేస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రగల్భాలు పలికిన డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ సైన్యాల మధ్య 800 మైళ్ల బఫర్ జోన్‌ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ట్రంప్ ఆదేశాలపై రష్యా మద్దతివ్వగా.. రష్యా నిర్ణయాన్ని గౌరవించేలా నాటోలో చేరకుండా సుధీర్ఘకాలం దూరంగా ఉండేందుకు ఉక్రెయిన్ అంగీకరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బదులుగా అమెరికా.. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సంపత్తిని సమకూర్చనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు జోబైన్ ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఆర్ధికంగా,ఆయుధాల్ని అందించడంపై ట్రంప్ పలు మార్లు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే ట్రంప్ ఉక్రెయిన్‌కు ఆయుధ సంపత్తిని సమకూర్చనుండడం ఆసక్తికరంగా మారింది.ట్రంప్‌పై జెలెన్స్కీ ప్రశంసలుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడారు. అనంతరం ‘ మా ఇద్దరి మధ్య సంభాషణ సన్నిహితంగా జరిగింది. అమెరికా-ఉక్రెయిన్ దేశాల మధ్య సహాయ సహకారాలు కొనసాగించేందుకు అంగీకరించాం. బలమైన, తిరుగులేని అమెరికా నాయకత్వం ప్రపంచానికి, న్యాయమైన శాంతికి చాలా అవసరం’ అని ఎక్స్ వేదికపై జెలెన్స్కీ ట్వీట్ చేశారు. -
పురుగుల మందు డబ్బాలు, పెట్రోల్ సీసాలతో రోడ్డుపై బైఠాయింపు
-
ఇజ్రాయెల్‌పై ప్రతిదాడికి ఇరాన్ ప్లాన్..?
టెహ్రాన్:ఇటీవల ఇజ్రాయెల్ తమ సైనిక స్థావరాలపై చేసిన వైమానిక దాడులకు ప్రతిదాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు సిద్ధం చేయాలని ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేని తన దళాలను ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు సంబంధించి ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులు తాజాగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు ఏర్పాట్లు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అలీఖమేనీ తన ముఖ్య సైనికాధికారులను ఈ చర్చల సందర్భంగా ఆదేశించినట్లు సమాచారం.ఇందులో భాగంగా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్‌కు చెందిన సైనిక స్థావరాల జాబితాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఇరాక్ భూభాగం నుంచి ఇరాన్ తన అనుకూల మిలిటెంట్ గ్రూపుల ద్వారా దాడికి పాల్పడొచ్చని ఇజ్రాయెల్ నిఘావర్గాలు భావిస్తున్నాయి.కాగా, అక్టోబర్ మొదటి వారంలో తొలుత ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి చేయగా ఈ దాడులకు ప్రతీకారంగా ఇటీవలే ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రం ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.ఇదీ చదవండి: హెజ్బొల్లా దాడులతో ఇజ్రాయెల్‌లో బీభత్సం -
హెజ్బొల్లా దాడులతో ఇజ్రాయెల్‌లో బీభత్సం! తాజాగా..
జెరుసలేం: లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపు గురువారం ఇజ్రాయెల్‌పైకి భారీ సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మెటులా ప్రాంతంలో ఆలివ్ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే నలుగురు విదేశీ కారి్మకులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన కార్మికులు ఏ దేశస్తులో అధికారులు వెల్లడించలేదు. అక్టోబర్ మొదట వారంలో ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్‌పై భూతల దాడులకు దిగాక హెజ్బొల్లా చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో రాకెట్లు ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని హైఫా పైకి దూసుకొచ్చినట్లు సమాచారం. ఇలా ఉండగా, ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లే రాకెట్ ఒకటి బుధవారం లెబనాన్‌లోని తమ శాంతి పరిరక్షక దళం బేస్‌పై పడిందని ఐర్లాండ్ ప్రభుత్వం తెలిపింది. ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఆ రాకెట్ దానంతటదే పడిందా, లేక ఇజ్రాయెల్ ఆర్మీ కూల్చిందా అనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. గాజాలో 25 మంది మృతి: డెయిర్ అల్–బలాహ్: గాజాలోని నుసెయిరత్ శరణార్ధి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ గురు, శుక్రవారాల్లో జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 25కు చేరుకుంది. వీరిలో ఐదుగురు చిన్నారులున్నట్లు అల్ అక్సా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో పదేళ్ల చిన్నారి, 18 నెలల వయస్సున్న ఆమె సోదరుడు ఉన్నారు. దాడి తర్వాత వీరి తల్లి ఆచూకీ కనిపించడం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. చిన్నారుల తండ్రి నాలుగు నెలల క్రితం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడని వారు చెప్పారు. ఐరాస కార్యాలయం ధ్వంసం వెస్ట్‌బ్యాంక్‌లోని నూర్షమ్స్ శరణార్ధి శిబిరంలో ఉన్న ఐరాస శరణార్థి విభాగం కార్యాలయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం బుల్దోజర్లతో ధ్వంసం చేసింది. కార్యాలయ భవనం పాక్షికంగా దెబ్బతిందని పాలస్తీనా మీడియా తెలిపింది. కార్యాలయం వెలుపలి గోడ ధ్వంసమైంది. తాత్కాలిక హాల్ మొత్తం నేలమట్టమైంది. పైకప్పు దెబ్బతింది. భవనం ప్రాంగణం మట్టి, శిథిలాలతో నిండిపోయిట్లు కనిపిస్తున్న వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసింది. లెబనాన్‌లో 24 మంది మృతి లెబనాన్‌లోని బీరుట్, బాల్బెక్–హెర్మెల్, దహియే ప్రాంతాలపై ఇజ్రాయెల్ ఆర్మీ శుక్రవారం జరిపిన దాడుల్లో 24 మంది చనిపోయారు. లెబనాన్–సిరియా సరిహద్దుల్లోని హెజ్బొల్లా ఆయుధ డిపోలు, స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం భీకర దాడులకు పాల్పడింది. తమ యుద్ధ విమానాలు కుసాయిర్ నగరంలోని పలు లక్ష్యాలపై బాంబులు వేశాయని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.చదవండి : మీకు రిటర్న్ గిఫ్ట్ పక్కా -
గాజాలో పంటలు నాశనం... పశువుల మృత్యువాత!
గాజా–ఇజ్రాయెల్ మధ్య ఎడతెగని యుధ్ధం గాజాలోని అనేక పదుల సంఖ్యలో మనుషులను బలిగొంది. అంతేకాదు, అక్కడి రైతులు, పశుపోషకుల జీవితాలను యుద్ధం ఛిద్రం చేసింది. కొనసాగుతున్న యుద్ధం స్థానిక ఆహారోత్పత్తి అడుగంటడంతో గాజాలో ఆహార భద్రత వేగంగా క్షీణించింది. గాజాలో దాదాపు 86 శాతం జనాభా (18.4 లక్షల) మంది ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. యావత్ గాజా స్ట్రిప్‌లో తిండి దొరకని తీవ్ర క్షామ పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది.ఎఫ్.ఎ.ఓ. ఉపగ్రహ కేంద్రం ఇటీవల సేకరించిన ఒక అధ్యయనంలో ఉపగ్రహ డేటా ప్రకారం.. గాజాలోని పంట భూమిలో మూడింట రెండొంతుల భూమి నాశనమైంది. గాజా వాసులకు చెందిన దాదాపు 15 వేల (95 శాతం) పశువులు చనిపోయాయి. దాదాపు దూడలన్నీ వధించబడ్డాయి. సుమారు 25 వేల గొర్రెలు (సుమారు 43 శాతం), కేవలం 3 వేల మేకలు (సుమారు 37 శాతం) మాత్రమే సజీవంగా మిగిలాయి. పౌల్ట్రీ రంగానికి కూడా అపార నష్టం జరిగింది. 99% కోళ్లు చనిపోయాయి. కేవలం 34 (1 శాతం) వేలు మాత్రమే మిగిలాయి.సగానికి సగం జీవాలు మృతిభయానక యుద్ధం వల్ల గాజాకు చెందిన పశుపోషకురాలు హక్మా ఎల్–హమీది తన కుటుంబ జీవనాధారమైన గొర్రెలు, మేకలు సహా దక్షిణ భాగాంలోకి వలస పోయింది. ఈ కుటుంబం కనీసం సగం జీవాలను కోల్పోయింది. పశువుల పనులు ఆమెకు చిన్నప్పటి నుండి అలవాటే. రోజుకు మూడు పూటలా వాటి బాగోగులు చూసుకుంటుంది. ‘యుద్ధ కాలంలో ఆహారం లేదు, బార్లీ లేదు, మేత లేదు, నీరు కూడా లేదు. మాకు నలభైకి పైగా పశువులు ఉండేవి. ఇప్పుడు ఇరవై కంటే తక్కువే మిగిలాయి’అని సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని అల్–జువైదా నివాసి హక్మా చెప్పారు.ఈ నష్టాలు ఆమె కుటుంబ జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగించాయి. ‘ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) మాకు పశువుల మేతను అందించి చాలా సహాయం చేసింది. దేవునికి ధన్యవాదాలు. ఈ జీవాలైనా చనిపోకుండా మిగిలాయి. ఆరోగ్యంగా ఉన్నాయి..’ అన్నారామె. ఎఫ్.ఎ.ఓ. అందించిన వెటర్నరీ కిట్ కూడా ‘నాకు చాలా సహాయపడింది. విటమిన్లతో కూడిన దాణాతో పాటు దోమలు/ ఈగల బాధ లేకుండా చేసే స్ప్రే ఆ కిట్‌లో ఉన్నాయి. జీవాలను ఈగలు కుట్టకుండా దీన్ని పిచికారీ చేస్తున్నాను. ఇది నిజంగా బాగుంది’ అన్నారామె.పశుగ్రాసం, వెటర్నరీ కిట్ల పంపిణీభద్రత, ప్రయాణ సంబంధ సవాళ్లను అధిగమించి గాజా ప్రజలకు అనేక సంస్థలు మానవతా సహాయాన్ని అందించాయి. గాజాలోని డెయిర్ అల్–బలా, ఖాన్ యూనిస్, రఫా గవర్నరేట్లలోని 4,400కు పైగా పశు పోషణే జీవనాధారంగా గల కుటుంబాలకు ఎఫ్.ఎ.ఓ. పశుగ్రాసాన్ని పంపిణీ చేసింది. జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, గాజా అంతటా జీవనోపాధులను కాపాడేందుకు దాదాపు 2,400 కుటుంబాలకు వెటర్నరీ కిట్లు అదనంగా అందించారు. మల్టీవిటమిన్లు, క్రిమిసంహారకాలు, సాల్ట్ బ్లాక్‌లు, అయోడిన్ గాయం స్ప్రేలు వంటి జంతువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చాలా అవసరమైన వస్తువులను అందించటం విశేషం. వాస్తవానికి, హక్మా వంటి పశుపోషకులకు ఈ మహా సంక్షోభ కాలంలో ఈ సహాయం సరిపోదు. తన జంతువులను రక్షించుకోవడానికి ఇంకా ఎక్కువ మేత, మరిన్ని మందులు, మరిన్ని గుడారాలు అవసరమని ఆమె చెప్పారు.ఈ సాయం చాలదుబాధాకరమైన గత సంవత్సర కాలంలో అపారమైన నష్టాన్ని చవిచూసిన మరొక పశు పోషకుడు వార్డ్ సయీద్. వాస్తవానికి గాజాలోని పాత నగరంలో ఎల్–జెటూన్స్ కు చెందిన మహిళా పశుపోషకురాలు. యుద్ధం నుంచి ప్రాణాన్ని కాపాడుకోవడానికి డెయిర్ అల్–బలాహ్‌కు వలస వెళ్లి ఆశ్రయం పొందారు. ‘యుద్ధం కారణంగా మేం దక్షిణాదికి తరలివచ్చాం. మా పశువులను కూడా తోలుకొచ్చాం. సగానికి సగాన్ని కోల్పోయాం. వాటిలో చాలా వరకు దారిలోనే చనిపోయాయి. ఈ మిగిలిన జీవాలే మాకు ఏకైక జీవనాధారం’ అన్నారామె. క్షిపణులు తరచూ పడే యుద్ధ ప్రాంతంలో ఆమె తన కుటుంబానికి ఆహారం, పశువులకు మేత కోసం ప్రాణాలను పణంగా పెట్టి మరీ శ్రమిస్తున్నారు. ‘ఎఫ్.ఎ.ఓ. పశువుల మేత, వెటర్నరీ కిట్ ఇచ్చింది. ఈ సాయం సరిపోదు. పశువుల మేత, భద్రత కలిగిన గూడు, ఆహారం ఇంకా కావాలి’ అన్నారామె. యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం కాక ముందు దాదాపు 650 ట్రక్కుల మేత ప్రతి నెలా గాజా స్ట్రిప్‌లోకి తెప్పించుకునేవారు. ఎఫ్.ఎ.ఓ., బెల్జియం, ఇటలీ, మాల్టా, నార్వే ప్రభుత్వాల మద్దతుతో పాలస్తీనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రభుత్వేతర సంస్థలతో కలిసి గాజా పశువుల సంరక్షకులకు మేత, వెటర్నరీ కిట్లను పంపిణీ చేస్తుంది. అయినా, అది అరకొరగానే మిగిలింది. యుద్ధం వల్ల ఆహారం, దాణా తదితరాలను రవాణా చేయటంలో సహాయక సంస్థలు అష్టకష్టాలను ఎదుర్కొంటున్నాయి. పరిస్థితులు మెరుగుపడితే ఫీడ్ కాన్స్ సెంట్రేట్, గ్రీన్స్ హౌస్ ప్లాస్టిక్ షీట్లు, ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు, వ్యాక్సిన్స్ లు, ఎనర్జీ బ్లాక్‌లు, ప్లాస్టిక్ షెడ్లు, జంతు షెల్టర్లు, మరిన్ని వెటర్నరీ కిట్లను అందించడానికి సిద్ధమని ఎఫ్.ఎ.ఓ. చెబుతోంది. గాజా నుంచి ప్రాణాలు అరచేత పట్టుకొని వలస పోయిన హక్మా, వార్డ్ వంటి పశు పోషక కుటుంబాలకు మరింత మెరుగైన సహాయం అందే రోజు కోసం వారు ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదు.గ్రీన్‌హౌస్‌లు ద్వంసంగాజా స్ట్రిప్ ప్రాంతంలో గల పంట పొలాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి 68 శాతం, అంటే 10,183 హెక్టార్లలో పంట పొలాలు యుద్ధం వల్ల నాశనమయ్యాయని ఎఫ్.ఎ.ఓ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 43% పొలాలు నాశనం కాగా, మే నాటికి అది 57%కి పెరిగింది. 71% తోటలు, చెట్లు, 67% స్వల్పకాలిక పంటలు, 59% వరకు కూరగాయ పంటలు నాశనమయ్యాయి. యుద్ధం వల్ల గాజాలోని వ్యవసాయ మౌలిక సదుపాయాలు సర్వనాశనం అయ్యాయి. 1,188 (52%) వ్యవసాయ బావులు దెబ్బతిన్నాయి. 578 హెక్టార్ల (44%)లోని గ్రీన్ హౌస్‌లు నేలమట్టం అయినట్లు అంచనా.∙గాజా స్ట్రిప్ నుంచి దక్షిణాదికి వలస వచ్చి జీవనోపాధి కోల్పోయిన హక్మా, వార్డ్ వంటి పశుపోషకులకు పశుగ్రాసం, వెటర్నరీ కిట్లు ఎఫ్.ఎ.ఓ. పంపిణీ చేసింది. మరిన్ని జంతువులు చనిపోకుండా కాపాడుకోవడానికి, వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి సహాయపడ్డాయి. -
బుల్లెట్ గాయంతో ప్రాణాలు కోల్పోయిన ఫాంటమ్
-
రెండు దేశాలుగా బతకడమే దారి
హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా, ఇరాన్, లెబనాన్ ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. 75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసియాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. యుద్ధం వల్ల దయనీయంగా మారిన పాలస్తీనా ప్రజానీకం పట్ల సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? అది రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు.పాలస్తీనాలోని గాజా విముక్తి దళం అని పిలవబడే హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఒక వేడుకలో పాల్గొన్న 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ దళాలు దారుణంగా వధించడంతో ఇది ప్రారంభమైంది. 2023 అక్టోబర్ 7న జరిగిన ఆ అనాగరిక దాడిలో ఇజ్రాయెల్ పిల్లలు, మహిళలు, పురుషులు దారుణంగా చంపబడ్డారు. ఏ నిర్వచనం ప్రకార మైనా, ఇది ఉగ్ర వాద దాడి. ప్రతీకారంగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌పై భారీ యుద్ధాన్ని ప్రారంభించింది. పాలస్తీనాలో పిల్లలు, మహిళలు సహా వేలాదిమంది చనిపోయారు. వెస్ట్‌బ్యాంక్ దాదాపు శిథిలావస్థకు చేరుకుంది.2023 అక్టోబర్ 7 నాటి మారణకాండను ఖండించకుండా ఇరాన్, లెబనాన్ కూడా హమాస్‌కు మద్దతుగా ఈ యుద్ధంలోకి ప్రవే శించాయి. ఆ విధంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. కానీ అవి ఇజ్రాయెల్ బలంతో సరిపోలగలవా? ఇజ్రా యెల్ తన అత్యంత అధునాతన సాంకేతికత, యుద్ధ వ్యూహంతో హమాస్ ఆయుధ శక్తిని, ప్రధాన నాయకత్వాన్ని నాశనం చేసింది.దక్షిణ గాజాలోని రఫా లక్ష్యంగా సాగించిన గ్రౌండ్ ఆపరేషన్ లో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) అక్టోబర్ 17న ప్రకటించింది. సిన్వార్ హత్య హమాస్‌కు చావుదెబ్బ. ఇరాన్, లెబనాన్ ఈ యుద్ధంలో తమ పౌర, సైనిక సిబ్బందిని పణంగా పెట్టడానికి సాహసించక పోవచ్చు.రెండు దేశాల పరిష్కారంసమస్యకు పరిష్కారం రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు. ఇజ్రా యెల్ ఆ సూత్రాన్ని అంగీకరించింది. కానీ హమాస్, ఇరాన్ వ్యతిరేకించాయి. ఇజ్రాయెల్ 1948లో ఆధునిక దేశంగా ఆవిర్భవించినప్పటికీ, తన ప్రజల సుదీర్ఘ ప్రవాస జీవితం తర్వాత, ఎడారి భూమిలో ఆధునిక ప్రజాస్వామ్య, వ్యవసాయ, పారిశ్రామిక దేశంగా తనను తాను నిర్మించుకుంది. కానీ పాలస్తీనా పాలకులు వ్యక్తి స్వేచ్ఛ, ఓటు హక్కులు అమలులోకి వచ్చే ప్రజాస్వామ్యాన్ని సాధ్యమైన వ్యవస్థగా ఎన్నడూ అంగీకరించలేదు. ఇతర ముస్లిం మత నిరంకుశ దేశాల కంటే అధ్వానంగా, పాలస్తీనా, ఇరాన్, ఈజిప్ట్, లెబనాన్ వంటి దేశాలు ఉగ్రవాద కేంద్రాలుగా మారాయి.ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తిగత హక్కుల క్రమబద్ధమైన ప్రక్రియను అంగీకరించే ఏ దేశమూ ఆధునిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో స్వీయ విధ్వంస స్థితిని సృష్టించదు. హమాస్, హిజ్బుల్లా, ముస్లిం బ్రదర్హుడ్ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచం మొత్తానికి సమస్యలను సృష్టించాయి.ఇవి ప్రజల ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టవు. ప్రజలు శాంతియుతంగా వ్యవసాయ లేదా పారిశ్రామిక పనిలో పాల్గొనడానికి అనుమతించవు. స్త్రీ వ్యతిరేక ఆధ్యాత్మిక సైద్ధాంతిక చర్చలకు పూనుకుంటాయి. తాలిబన్ రూపంలో ఇలాంటి బలగం కారణంగా అఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతోందో మనకు తెలుసు.75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసి యాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1948కి ముందు దాని ప్రజలు పదేపదే దేశభ్రష్టులైనప్పటికీ, ఇజ్రాయెల్ ఉనికిని తిరస్కరించడాన్ని చరిత్ర అంగీకరించదు.సామాజిక–ఆర్థిక పరిస్థితులు2019లో నేను ఇజ్రాయెల్, పాలస్తీనాలో విస్తృతంగా పర్యటించి రెండు దేశాల సామాజిక–ఆర్థిక పరిస్థితులను గమనించాను. ఇజ్రా యెల్ వైభవాన్ని, గొప్ప పచ్చని ఉత్పత్తి క్షేత్రాలలో సర్వత్రా చూడ వచ్చు. వారు ఎడారులను ఉత్పాదక భూములుగా మార్చారు. పేదరి కంతో కొట్టుమిట్టాడుతున్న పాలస్తీనా ప్రజలు, అక్కడి ఏ శ్రామిక ప్రజానీకం... పురుషులు, మహిళలు కూడా ఎడారిలోని పాక్షిక సాగు పొలాల్లో కనిపించరు. వారి వ్యవసాయ భూములలో ఒక్క స్త్రీని కూడా మనం చూడలేము. ఇజ్రాయెల్ స్త్రీలు భారతీయ శూద్ర, దళిత స్త్రీల లాగే నిత్యం పని చేస్తూనే ఉంటారు.యూదుల కష్టపడి పనిచేసే సంస్కృతి, ఆధ్యాత్మిక తత్వశాస్త్రం వారికి సహాయపడ్డాయి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక సహాయం ఉన్నప్ప టికీ, అర్థవంతమైన విద్యాసంస్థలను అభివృద్ధి చేయకుండా పాలస్తీనా పేద దేశంగా మిగిలిపోయింది. వారి ఏకైక ఆశ మతం. ఉత్పత్తి లేకుండా మతం వారికి సహాయం చేస్తుందా?ఇజ్రాయెల్ రాజకీయ వ్యవస్థ సెక్యులరిజం సూత్రాలపై ఆధార పడి నడుస్తుంది. కానీ, పాలస్తీనా, ఇరాన్, లెబనాన్, ఈజిప్టులలో ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయా? అవి మత నియంతృత్వాలని మనకు తెలుసు.కొత్త ఒప్పందాలు అవసరమా?1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. రెండవది 1994 నాటి అబ్రహాం ఒప్పందం. ఇది అబ్రహామిక్ సంస్కృతికి చెందిన పిల్లలుగా యూదులు, ముస్లింల ఉమ్మడి చారిత్రక వారసత్వంతో రెండు దేశాల సహజీవనం గురించి మాట్లాడుతుంది. పాలస్తీనా, ఇరాన్ ఆ ఒప్పందాలను తిరస్క రించాయి.పాలస్తీనా సాధారణ ప్రజానీకం పట్ల, ప్రత్యేకించి పిల్లలు, మహిళలు, శరణార్థుల దుఃస్థితి పట్ల మనమందరం సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? పాలస్తీనా, ఇజ్రాయెల్ ఆ రెండు ఒప్పందాలను గౌరవించాలా లేక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవాలా? పాలస్తీనా దైవపాలనా సూత్రాల ఆధారంగా పనిచేస్తోంది. ఇజ్రాయెల్‌కు ప్రజాస్వామ్యం పట్ల ఉన్నంత గౌరవం పాలస్తీనా నాయకులకు లేదు. నా ఉద్దేశంలో వారు ఆ చిన్న భూమిలో రెండు చిన్న దేశాలుగా జీవించాలి. వేరే అవకాశమే లేదు.ఉభయ దేశాలలోని, ముఖ్యంగా పాలస్తీనాలోని కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల సానుభూతి చూపుతున్న ప్రపంచ మేధావులు ముస్లిం ప్రపంచంలో సంస్కరణల గురించి మాట్లాడుతూనే ఉండాలి. ముస్లిం దేశాలు సరైన ఎన్నికల ఆధారిత ప్రజాస్వామ్యాల వైపు వెళ్లాలి. మత నిరంకుశ రాజ్యాలలో ఉండకూడదు. యూదులు ఆ భూమిని విడిచి పెట్టి, 1948కి ముందున్న చోటికి తిరిగి వెళ్లాలంటున్న పాలస్తీనా, ముఖ్యంగా హమాస్, ఇరాన్ డిమాండ్‌ను వారు అంగీకరిస్తున్నట్ల యితే, అలాంటి మేధో అజ్ఞానం మానవ విలువలకు మరింత వినాశ నాన్ని తెస్తుంది.పాలస్తీనియన్లను ఆ భూభాగం నుండి బయటకు వెళ్ళమని ఇజ్రాయెలీలు కోరినట్లయితే వారికి కూడా అదే విషయం వర్తిస్తుంది. ఇలాంటి ఘోరమైన సమస్యలన్నింటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే రెండు దేశాల పౌరుల్లోనే పరిష్కారాలు కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఇజ్రాయెల్ నుండి వారి సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాలను వింటున్నాము. యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రా యెల్ పౌరులు ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును పదవి నుంచి దించేయవచ్చు. యాహ్యా సిన్వార్ బతికి ఉంటే పాలస్తీ నియన్లు అలా చేసి ఉండేవారా?ఉక్రెయిన్, రష్యా సమస్యలా కాకుండా ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్య నాగరికతా సమస్య. కాబట్టి మనమందరం ముస్లిం దేశాలు మొత్తంగా ప్రజాస్వామ్యం వైపు మారడం గురించి ఆలోచించాలి. పాలస్తీనా తన సొంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హమాస్ పట్టు నుండి బయటపడాలి. రెండు దేశాల పరిష్కారాన్ని అంగీకరిస్తూ, ప్రపంచానికీ, దాని సొంత ప్రజలకూ మేలు చేయాలి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయం
సియోల్: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయం చేస్తోంది. ఇప్పటికే 1,500 మంది సైనికులను రష్యాకు పంపిందని దక్షిణ కొరియా నిఘా సంస్థ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసు (ఎన్ఐఎస్) శుక్రవారం వెల్లడించింది. స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్‌కు చెందిన 1,500 సైనికులను ఈనెల 8 నుంచి 13 వరకు రష్యాకు పంపిందని తెలిపింది. రష్యా తీరప్రాంత నగరం వ్లాదివోస్టోక్‌కు వీరు చేరుకున్నారని పేర్కొంది. ఉత్తరకొరియా సైనికులకు రష్యా సైనిక దుస్తులను ఇచ్చారని, ఆయుధాలను అందజేశారని, నకిలీ ధ్రువపత్రాలను సమకూ ర్చారని ఎన్ఐఎస్ వెల్లడించింది. ఉత్తర కొరి యా మరింత మంది సైనికులను రష్యాకు పంపనుందని వివరించింది. నిఘా సమాచా రం మేరకు 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొననున్నట్లు తనకు తెలిసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించడం గమనార్హం. ఉత్తరకొరియా మొత్తం 12 వేల మందిని కదనరంగానికి పంపనుందని దక్షిణకొరియా మీడియా తెలిపింది. ఉత్తరకొరియా చోంగ్జిన్ పోర్టులో రష్యా నావికాదళం నౌకలు మొహరించడం, ఉసురియిస్క్, ఖబరోస్క్లలో ఉత్తరకొరియా సైనికులు గుమిగూడిన ఉపగ్రహ చిత్రాలను ఎన్ఐఎస్ తమ వెబ్సైట్లో పొందుపర్చింది. విదేశీయుద్ధంలో ఉత్తరకొరియా నేరుగా పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలగాల్లో ఉత్తరకొరియా ఒకటి. మొత్తం 12 లక్షల మంది సైన్యం ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కింగ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల్లో దేనిపై దాడి జరిగినా.. మరో దేశం సైనికంగా సాయపడాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సక్ యోల్ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భద్రతపై సమీక్షించారు. అంతర్జాతీయ సమాజం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు చేరొచ్చు: జెలెన్స్కీబ్రస్సెల్స్: పదివేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా సైన్యంలో చేరవచ్చని తమకు నిఘా సమాచారం ఉందని ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. వీరిని రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో మొహరించనున్నారని తెలిపారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధంలో మూడోదేశం జోక్యం చేసుకుంటే అది ప్రపంచయుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. -
కమాండర్లే చేతులెత్తేస్తే.. ట్రైనీ సైనికులు సిన్వార్‌ను మట్టుబెట్టారు
ఇజ్రాయెల్ దళాలు హమాస్ మాస్టర్‌మైండ్ యహ్యా సిన్వర్‌ను హతమార్చాయి. అయితే సిన్వర్ తర్వాత హమాస్‌కు ఎవరు సారథ్యం వహిస్తారు? అనే చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో సిన్వర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ ఆర్మీ గురించి ఆసక్తికర విషయంలో వెలుగులోకి వచ్చింది.గతేడాది పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 1,200 మంది పౌరులు మరణించారు. 200 మందికి పైగా ప్రజలు కూడా బందీలుగా ఉన్నారు. ఈ దాడి ఇజ్రాయెల్ చరిత్రలో ఈ దాడి అత్యంత ఘోరమైనదని ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది. నాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అగ్రనేత యహ్యా సిన్వర్ కోసం అన్వేషిస్తుంది.సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ ఆర్మీ, ఇతర నిఘూ వర్గాలు సిన్వార్ జాడ కనిపెట్టలేకపోయాయి. అయితే గురువారం ఇజ్రాయెల్‌కు చెందిన ట్రైనీ సైనికులు దక్షిణ గాజాలో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో ఓ భవంతిలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ట్రైనీ సైనిక సిబ్బంది డ్రోన్‌తో దాడులు జరిపారు. అనంతరం అక్కడికి వెళ్లి చూడగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో సిన్వార్ సైతం ఉన్నారు. ఏడాది కాలంలో ఆర్మీలో ఆరితేరిన సైనికులు సాధించలేని విజయాన్ని ట్రైనీ సైనికులు సాధించడంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది. -
హమాస్ కు చావు దెబ్బ.. హమాస్ చీఫ్ సిన్వర్ హతం
-
హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి
దియర్ అల్–బలాహ్ (గాజా స్ట్రిప్): వరుసబెట్టి అగ్రనేతలకు కోల్పోతున్న హమాస్‌కు గురువారం మరో శరాఘాతం తగిలింది. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ తమ దాడుల్లో మృతి చెందాడని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. గాజాపై తాము జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందారని ఇజ్రాయెల్ తెలిపింది. వీరిలో ఒకరు యాహ్యా సిన్వర్ అని డీఎన్ఏ టెస్టు తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించింది. సిన్వర్‌ను అంతమొందించామని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడికి సూత్రధారి సిన్వర్. ఈ దాడిలో 1,200 ఇజ్రాయెల్ దేశస్తులు చనిపోగా, 250 మందిని హమాస్ బందీలుగా పట్టుకుంది. అప్పటినుంచి సిన్వర్.. ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యంగా మారారు. మోస్ట్ వాంటెడ్ లిస్టులో అగ్రభాగాన ఉన్నారు. మిలటరీ వ్యూహకర్త సిన్వర్ మరణం హమాస్‌కు కోలుకోలేదని దెబ్బని చెప్పొచ్చు. అయితే సిన్వర్ మరణాన్ని హమాస్ ఇంకా ధ్రువీకరించలేదు. ఈ ఏడాది జూలైలో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇరాన్ రాజధాని టెహరాన్‌లో ఇజ్రాయెల్ మట్టుబెట్టిన విషయం తెలిసిందే. హనియా మరణం తర్వాత సిన్వర్ హమాస్ పగ్గాలు చేపట్టారు. ‘సిన్వర్‌ను మట్టుబెట్టడం ఇజ్రాయెల్ సైనిక, నైతిక విజయమని విదేశాంగ మంత్రి కట్జ్ అభివరి్ణంచారు. కాగా గాజాలో జబాలియాలోని స్కూలులో నిర్వహిస్తునున్న శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 28 మంది మరణించారు. శరణార్థి శిబిరం నుంచి... యాహ్యా సిన్వర్ 1962లో గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో పుట్టారు. 1987లో హమాస్ ఏర్పడ్డప్పటి తొలినాటి సభ్యుల్లో ఒకరు. సంస్థ సాయుధ విభాగాన్ని చూసుకునేవారు. 1980ల్లోనే ఆయనను ఇజ్రాయెల్ అరెస్టు చేసింది. ఇద్దరు ఇజ్రాయెలీ సైనికులను హత్య చేసిన నేరంలో నాలుగు జీవిత ఖైదులు విధించింది. జైల్లో పరిస్థితుల మెరుగుదల కోసం ఉద్యమం లేవదీసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. 2011లో ఒక్క ఇజ్రాయెలీ సైనికునికి ప్రతిగా విడుదల చేసిన వేలాది మంది పాలస్తీనా ఖైదీల్లో భాగంగా విముక్తి పొందారు. గాజాకు తిరిగొచ్చి హమాస్ అగ్రనేతగా ఎదిగారు. ఏమాత్రం దయాదాక్షిణ్యాల్లేని తీరుతో ‘ఖాన్ యూసిస్ బుచర్’గా పేరుపొందారు. 2023 అక్టోబర్ 7న 1,200 మందికి పైగా ఇజ్రాయెలీలను పొట్టన పెట్టుకున్న హమాస్ మెరుపుదాడి వెనక సంస్థ సాయుధ విభాగం చీఫ్ మొహమ్మద్ దెయిఫ్తో పాటు సిన్వర్ కీలకంగా వ్యవహరించారంటారు. -
రతన్ టాటా లవ్ స్టోరీ
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరొందారు. అయితే రతన్ టాటా ఏనాడూ తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడలేదు. కానీ 1997లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా అసంపూర్ణంగా మిగిలిపోయిన తన ప్రేమకథ గురించి ప్రస్తావించారు.తాను 1960లలో అమెరికాలో చదువుకున్న తర్వాత అక్కడే ఉద్యోగం చేయడం ప్రారంభించానని రతన్ టాటా నాటి ప్రముఖ నటి సిమి గ్రేవాల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమయంలో రతన్ టాటా తాను ప్రేమలో పడిన అమ్మాయిని కలుసుకున్నారు. అయితే ఇంతలోనే అతనిని నాన్నమ్మ అతనిని ఇండియాకు తిరిగి రావాలని కోరారు.దీంతో రతన్ తాను లాస్ ఏంజెల్స్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి భారత్‌కు తిరిగి వచ్చేశారు. రతన్‌టాటా భారత్‌కు తిరిగి రావడానికి ప్రధాన కారణం అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం. ఆ సమయంలో రతన్ టాటా సోదరుడు చాలా చిన్నవాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆయన నాన్నమ్మ మాటను కాదనలేక భారత్ తిరిగి వచ్చారు.తాను భారత్‌కు వచ్చిన తర్వాత తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కూడా ఇక్కడికి వస్తుందని భావించానని రతన్ టాటా ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే 1962లో భారత్-చైనా యుద్ధం కారణంగా రతన్ టాటా భావించినట్లు జరగలేదు. భారత్-చైనా యుద్ధం కారణంగా, రతన్ టాటా ప్రేమించిన అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు భారతదేశానికి పంపడానికి ఇష్టపడలేదు. ఈ వివాహానికి వారు సమ్మతించలేదు. ఫలితంగా రతన్ టాటా ప్రేమ కథ అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఇది కూడా చదవండి: రతన్ టాటాకు ప్రధాని మోదీతో పాటు ప్రముఖుల నివాళులు -
అభద్రతను పెంచుతున్న యుద్ధం
హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాలను నిరోధించ వలసిన ఐక్యరాజ్య సమితి లాంటివి నిర్వీర్యమైపోతున్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఐరాస సిబ్బందికే రక్షణ లేని పరిస్థితి. ఇక అంతర్జాతీయ న్యాయస్థానాన్ని నెతన్యాహూకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలు ఆంక్షల విధింపు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. వైరి పక్షాలను చర్చల వేదికపైకి తేగలిగిన మధ్యవర్తులు కానరాని పరిస్థితి! ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు తన శత్రువులపై దాడిచేసే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ... దాని పౌరులు రోజు రోజుకూ అభద్రతాభావంలో కూరుకుపోతుండటం గమనార్హం.ఒక సంవత్సరం క్రితం, అక్టోబర్ 7న జరిగిన ఘటన ఉక్రెయిన్‌లో యుద్ధం నుండి ప్రపంచం దృష్టిని మళ్లించింది. నేడు, హమాస్ తీవ్రవాద దాడిపట్ల ఇజ్రాయెల్ ప్రతిస్పందన చాలా తీవ్రంగా మారిపోయింది. దీనితో పోలిస్తే మిగతా వన్నీ అప్రధానంగానే ఉన్నాయి. దాదాపు 45,000 మంది, వీరిలో ఎక్కువగా పౌరులు మరణించారు. కనుచూపు మేర కాల్పుల విరమణ లేదు. పైగా వేగంగా పెరుగుతున్న సంఘర్షణ కారణంగా, పశ్చిమాసి యాను యుద్ధం చుట్టుముట్టే అవకాశం ఒక ప్రమాదకరమైన వాస్తవంగానే కనబడుతోంది. కొంత వరకు ఉక్రెయిన్ యుద్ధం, ప్రధానంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం... ప్రాంతీయ యుద్ధాలకు మధ్యవర్తిత్వం వహించే లేదా వాటికి ముగింపు పలికే సామర్థ్యం గల మధ్యవర్తులు కనిపించని ప్రపంచంలో మనం ఈ రోజు ఉన్నామనే వాస్తవాన్ని ఎత్తి చూపుతున్నాయి.ఇజ్రాయెల్, ఇరాన్ లేదా అమెరికాను చేరుకోగల ఉపయోగ కరమైన పరోక్ష మార్గాలు కానీ లేదా వారిని సంధానించేవారు కానీ ఇప్పుడు ఎవరూ లేరు. సైద్ధాంతికంగా చెప్పాలంటే, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించే లేదా పొడిగించే స్థితిలో అమెరికా ఉండవచ్చు, కానీ పశ్చిమాసియా విషయానికి వస్తే దాని నిస్సహాయత ఆశ్చర్యక రంగా ఉంది. ఈ ప్రాంతంలో పరిష్కారం కోసం ప్రపంచం వాషింగ్టన్ వైపు చూస్తూనే ఉంది, కానీ దాని స్వీయ అధ్యక్ష ఎన్నికల కారణంగా, అమెరికన్ బాడీ పాలిటిక్స్‌పై ఇజ్రాయెల్ ప్రభుత్వం చూపే ప్రభావం కారణంగా అమెరికాకు పరిష్కారం సాధ్యం కావడం లేదు.మరోవైపున అగ్రరాజ్య స్థాయి కోసం ఎదురుచూస్తున్న చైనా మౌనం కూడా ఆసక్తి గొల్పుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పక్షాన చైనా ఉండగా, ఎర్ర సముద్రం సంక్షోభం సమయంలో అది నిష్క్రియాపరత్వంతో వేచి ఉంటోంది. పైగా ఇతర చోట్ల ప్రపంచ సంక్షోభాలను తగ్గించే విషయంలో చైనా పాత్ర తక్కువే అని చెప్పాలి. ఇక పశ్చిమాసియా సంక్షోభంపై మధ్యవర్తిత్వం వహించడంలో చైనా ఏమాత్రం ఆసక్తి చూపలేదు. భారతదేశం ఇప్పటికీ అలాంటి కర్తవ్యా లను చేపట్టేంత శక్తిమంతమైన దేశంగా తనను తాను భావించడం లేదు. రెండో ప్రపంచ యుద్ధానంతర సంస్థలు ప్రపంచ స్థాయిలో నిర్మాణాత్మక అసమానతలను కొనసాగించినప్పటికీ, సంస్థలు,నిబంధనలు లేని ప్రస్తుత ప్రపంచం అధ్వానంగానే ఉంటుంది.ఐక్యరాజ్యసమితిని పరిశీలిస్తే... అది రోగలక్షణంతో అసమర్థ మంతంగానూ, నిస్సహాయంగానూ మారిపోయినట్లుంది. అందుకే యుద్ధంలో పాల్గొంటున్న పక్షాలు... ఐరాస సిబ్బంది ఉన్న ప్రాంతా లలో కూడా బాంబు దాడి చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. పోరాడుతున్న పక్షాలకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి చేసిన విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ఇటీవల ధిక్కరించినట్లుగానే, మీడియా కూడా దాన్ని సీరియస్‌గా పరిగణించడం లేదు.అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) ఉదంతాన్ని తీసుకోండి. ఇది ఇజ్రాయెల్ ఆగ్రహ జ్వాలలకు గురవుతూ ఉండడం మాత్రమే కాకుండా... అమెరికా, ఐరోపాలోని ఇజ్రాయెల్ సన్నిహిత మిత్రుల అగ్రహాన్ని కూడా చవిచూస్తూ ఉంది. హాస్యాస్పదంగా, రష్యా అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలనే విషయంపై ఆసక్తిగా ఉన్న దేశాలు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అదే విధంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు మాత్రం ఐసీసీపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి. రెండు యుద్ధాలూ నైతిక పరిగణనలు వాడుకలో లేని ప్రపంచం వైపు మనల్ని తీసుకెళ్తున్నాయి. ఇంకా, నైతిక రాజకీయం రోజువారీ ప్రభుత్వ ఆచరణలో చెడుకు చెందిన సామాన్యతను కొలిచేందుకు ఒక కొలమానాన్ని అందిస్తుంది. దేశీయ రాజకీయాలు లేదా అంతర్జాతీయ సంబంధాలలో, నైతిక ప్రమాణాలు లేనిదాని కంటే నైతిక ద్వంద్వ ప్రమాణాలు ఉత్తమం. ఆచరణలో లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ, కొలత కోసం మనకు ఒక టేప్ అవసరం. ఈ యుద్ధంలో చెడుకు సంబంధించిన సామాన్యత విషయంలో అత్యంత కలతపెట్టే ఉదా హరణ ఏదంటే హమాస్ టెర్రరిస్టులను గాజా ప్రజలతో సమానం చేయడం– అలాంటి చట్రాలను మనం మౌనంగా ఆమోదించడం!ఏ రకంగా చూసినప్పటికీ ఇజ్రాయెల్ మరింత ఒంటరిగా, అభద్రతతో ఉంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులు, దాని అసమాన ప్రతీకార చర్యలు జరిగి ఒక సంవత్సరమైంది. కానీ ఇజ్రాయెల్ అనుభూతి చెందుతున్న శాశ్వతమైన అభద్రతా భావం ఇప్పుడు పెరుగుతున్న ఒంటరితనంతో పాటు మరింత తీవ్రమైంది.ఇజ్రాయెల్‌కు తన శత్రువులను మరింత ఎక్కువ శక్తితో కొట్టే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ, ఈ ప్రాంతంలో సంపూర్ణ దుర్బ లత్వం కూడా స్పష్టంగా ఉంది. ఇరాన్ దాని ప్రాక్సీ గ్రూపులుగా గాజా, ఇరాక్, లెబనాన్, సిరియా గురించి ఇజ్రాయెలీలు పిలుస్తున్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అనేది ఇప్పుడు మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ పౌరులు కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు మరింత సురక్షితంగా ఉన్నారా అనేది సందేహమే. ఒక దేశం ఎంత శక్తిమంతమైన దేశమైన ప్పటికీ, నిశ్చయాత్మకమైన, సైద్ధాంతికంగా ప్రేరేపితులైన విరోధుల నుండి తనను తాను రక్షించుకోలేకపోతుంది, ప్రత్యేకించి దాని సొంత చర్యలు విరోధుల లక్ష్యాన్ని మరింతగా నిలబెడుతున్నప్పుడు అది అసలు సిద్ధించదు.నేడు ఇజ్రాయెల్ మరింత అభద్రతాభావంతో ఉండటమే కాకుండా ప్రపంచం సానుభూతిని కూడా కోల్పోతోంది. ఇజ్రాయెల్ ఇప్పుడు దాని మితిమీరిన చర్యలకూ, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినందుకూ, ప్రత్యేకించి గ్లోబల్ సౌత్‌లోని వారిచే వివిధ అంత ర్జాతీయ ఫోరమ్‌లలో సాధారణంగా ఆక్షేపించబడుతూ, విమర్శల పాలవుతోంది. గ్లోబల్ సౌత్ మద్దతుపై ఇజ్రాయెల్‌కు పెద్దగా పట్టింపు లేకపోయినా, ఇజ్రాయెల్ వైపు నిలిచిన యూరోపియన్, ఉత్తర అమె రికా మద్దతుదారులు కనీసం భౌగోళిక రాజకీయ కారణాల వల్ల దక్షి ణాదిని విస్మరించడం కష్టం. అమెరికా ఇప్పటికీ ఇజ్రాయెల్ కోసం బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో అమెరికా యువతరంలో ఇజ్రాయెల్‌కి చెందిన సమస్యపై, విభేదాలు పెరుగుతున్నాయి.మొత్తం మీద చూస్తే అబ్రహం ఒప్పందాలు ప్రమాదకరమైన స్థితిలో ఊగిసలాడుతున్నాయి, వీధుల్లో జనాదరణ పొందిన మనో భావాల ద్వారా నడపబడుతున్న యుద్ధ స్వభావం పెరుగుతున్న కొద్దీ అది ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది. ఫలితంగా, గల్ఫ్ దేశాలు, ప్రత్యేకించి, పాలస్తీనా ఉచ్చులోంచి బయటపడాలని కోరుకున్నప్ప టికీ అవి బలవంతంగా తిరిగి యుద్ధబాటలోకి వెళ్లవచ్చు కూడా.ఇజ్రాయెల్ ప్రభుత్వానికీ, ప్రజలకూ దీని అర్థం ఏమిటంటే పెరుగుతున్న అభద్రత, ప్రపంచ సానుభూతిని కోల్పోవడంతో పాటు కనికరం లేని విలన్లుగా ముద్ర వేయబడటమే. ఈ యుద్ధం నెతన్యా హుకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలను కప్పిపుచ్చడమే కాకుండా ఇజ్రాయెల్ ఉదారవాద, ప్రజాస్వామ్య విలువలను అణిచివేసే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు తమను తాము ప్రజలుగా ఊహించుకునే భవిష్యత్తు ఇదేనా? గాజా ప్రజలకు ఇజ్రాయెలీలు ఏమి చేస్తున్నారో అది ఇజ్రాయెల్ ప్రజలుగా వారిపై కూడా ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుంది.భారతదేశంలోని మనకు, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ’శ్వేత జాతీ యులు శ్వేతజాతీయులను చంపేస్తున్నారు’ అనేటటువంటి కేవల యూరోప్ సమస్యగా మాత్రమే విస్మరించడం సులభం. కానీ పశ్చి మాసియాలో యుద్ధం ప్రాథమికంగా భిన్నమైనది – అది ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఊహించని మార్గాల్లో మనపై ప్రభావం చూపుతుంది.హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్‌యూలో భారత విదేశీ విధాన బోధకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో...) -
మీరెన్ని చెప్పినా.. ఇరాన్‌పై మా యుద్ధం ఆగదు : ఇజ్రాయెల్ ప్రధాని
జెరూసలేం: ఎవరెన్ని ఏం చెప్పినా, ఏ దేశం తమకు మద్దతు ఇవ్వకపోయినా తాము ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో తమదే విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.దాదాపు 200 క్షిపణులతో (మిసైల్స్) ఇరాన్లో బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామని, దాడుల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్)ప్రకటించింది. ఆ ప్రతిపాదనలను ప్రధాని నెతన్యాహుకి పంపినట్లు వెల్లడించింది. నెతన్యాహు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తమ పనిని మొదలుపెడతామని ఐడీఎఫ్ తెలిపింది.ఈ ప్రకటన అనంతరం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ మాట్లాడుతూ..ఇజ్రాయెల్‌కు తాము సరఫరా చేస్తున్న అణ్వాయుధాలను నిలిపి వేస్తున్నట్లు అధికారంగా వెల్లడించారు. ఆ దిశగా ఆదేశాలు జారీ చేశారు. అయితే మాక్రాన్ నిర్ణయాన్ని నెతన్యాహు ఖండించారు. ఫాన్స్ అధ్యక్షుడి నిర్ణయాన్ని తాము అవమానకరంగా భావిస్తున్నట్లు ఓ వీడియోని విడుదల చేశారు. ఇరాన్ నేతృత్వంలోని అనాగరిక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడుతున్నప్పుడు, నాగరిక దేశాలన్నీ ఇజ్రాయెల్ వైపు నిలబడాలి’ అని నెతన్యాహు కోరారు. అయినా మాక్రాన్, ఇతర పాశ్చాత్య నాయకులు ఇప్పుడు ఇజ్రాయెల్‌పై ఆయుధాల ఆంక్షలు విధించాలని పిలుపునివ్వడం సిగ్గుచేటుగా అభివర్ణించారు.గాజాలో హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్ ,సిరియాలోని షియా మిలీషియా, వెస్ట్ బ్యాంక్‌లోని ఉగ్రవాదులతో చేస్తున్న ఇజ్రాయెల్ పోరాటాలను ఎత్తి చూపారు. ఇరాన్ తన మిత్రదేశాలకు ఆయుధాలను పరిమితం చేసిందా అని ప్రశ్నిస్తూ.. కాదు.. ఇరాన్‌ను వ్యతిరేకించే దేశాలు.. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాల్ని పంపడాన్ని ఆపేయడం ఎంత అవమానకరం అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ, నెతన్యాహు వారి మద్దతు ఉన్నా,లేకుండానే ఇజ్రాయెల్ గెలుస్తుందని పునరుద్ఘాటించారు. కాగా,ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాలు పంపడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఫ్రాన్స్‌కు పలుదేశాలు మద్దతు పలుకుతున్నాయి. -
యుద్ధం వస్తే.. ఏ దేశం ‘పవర్’ ఎంత?
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.ఇరాన్ మిసైల్ దాడులపై ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది.మిసైల్ దాడుల తర్వాత ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఇప్పటివరకైతే నేరుగా దాడి చేయలేదు.ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్‌పై మాత్రం దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ పెంచింది.వేల మంది హెజ్బొల్లా గ్రూపు మిలిటెంట్లతో పాటు లెబనాన్‌లోని సామాన్యులు ఇజ్రాయెల్ దాడుల్లో మరణిస్తున్నారు.అయితే ఇరాన్‌పై ఇజ్రాయెల్ నేరుగా దాడిచేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ దాడులు ఇరాన్ చమురు స్థావరాలపై ఉంటాయని కొందరు అణుస్థావరాలపై ఉండొచ్చని మరికొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ రెండింటిలో ఏది జరిగినా ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించే ఛాన్సుంది. ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాజాగా రాజధాని టెహ్రాన్‌లో జరిగిన నమాజ్ సభలో ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ కూడా హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్,ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర రూపం దాల్చనుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ రెండు దేశాలకు మద్దతుగా అమెరికా,బ్రిటన్,రష్యా లాంటి అగ్ర దేశాలు కూడా యుద్ధంలో పాల్గొని మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు లేకపోలేదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో మధ్య ప్రాచ్యం(మిడిల్ ఈస్ట్)లో ఏ దేశం సైన్యం బలం ఎంతో ఒకసారి తెలుసుకుందాం.మిడిల్ ఈస్ట్‌లో ఏ దేశ ఆర్మీ బలమెంత..?టర్కీ..మిడిల్‌ఈస్ట్‌లోని దేశాల్లోకెల్లా టర్కీ ఆర్మీ అత్యంత శక్తివంతమైనదని పవర్ ఇండెక్స్ స్కోరు చెబుతోంది. ఇండెక్స్‌లో 0.16971 స్కోరుతో టర్కీ నెంబర్‌వన్ స్థానంలో ఉంది. అత్యాధునిక ఆయుధాలు, వీటిని వాడే నైపుణ్యమున్న బలగాలతో టర్కీ ఆర్మీని పూర్తిగా ఆధునీకరించారు.ఇరాన్..పవర్ ఇండెక్స్ స్కోరులో టర్కీ తర్వాత మిడిల్ఈస్ట్లో ఇరాన్ రెండవ స్థానంలో ఉంది. అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉన్న బలగాలు,దేశ అమ్ములపొదిలో ఉన్న మిసైల్లు ఇరాన్ బలం. ఇరాన్ పవర్ ఇండెక్స్ స్కోరు 0.22691గా ఉంది.ఈజిప్టు..పది లక్షలకుపైగా ఉన్న బలగాలతో ఈజిప్టు మిలిటరీ శక్తివంతంగా ఉంది. 0.22831 స్కోరుతో పవర్ ఇండెక్స్‌లో ఈ దేశం మూడో స్థానంలో ఉంది.ఇజ్రాయెల్..ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఇజ్రాయెల్ 0.25961 స్కోరుతో పవర్ ఇండెక్స్‌లో నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. దేశంలో అమల్లో ఉన్న తప్పనిసరి మిలిటరీ సర్వీసు కారణంగా ఇజ్రాయెల్‌కు ఎక్కువ మంది సైనికులు రిజర్వులో అందుబాటులో ఉన్నారు. డిఫెన్స్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ ఈ దేశం సొంతం.సౌదీఅరేబియా..బలమైన ఆర్థిక వనరులు,అత్యాధునిక డిఫెన్స్ పరికరాలతో సౌదీ అరేబియా పవర్ ఇండెక్స్‌లో ఐదో స్థానంలో ఉంది. ఇండెక్స్‌లో ఈ దేశ స్కోరు 0.32351గా ఉంది.ఇరాక్..పవర్ ఇండెక్స్‌లో ఆరో స్థానంలో ఉన్న ఇరాక్ స్కోరు 0.74411.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)..సైనికులకు అత్యాధునిక శిక్షణతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో యూఏఈ పవర్ ఇండెక్స్‌లో ఏడో స్థానంలో ఉంది. ఇండెక్స్‌లో ఈ దేశం స్కోరు0.80831గా ఉంది.సిరియా..పవర్ ఇండెక్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న సిరియా స్కోరు 1.00261.ఖతార్..ఖతార్ 1.07891 స్కోరుతో ఖతార్ పవర్ ఇండెక్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉంది.కువైట్..మిడిల్ ఈస్ట్ దేశాల పవర్ ఇండెక్స్‌లో కువైట్ పదవ ప్లేస్‌లో ఉంది.ఇండెక్స్‌లో ఈ దేశం స్కోరు 1.42611.అసలు ‘పవర్’ ఇండెక్స్ స్కోరు ఏంటి.. ఎలా లెక్కిస్తారు..ఒక దేశం మిలిటరీ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పవర్ ఇండెక్స్‌ను కొలమానంగా వాడతారు. దేశాల సైన్యాలకు ఉన్న వివిధ రకాల సామర్థ్యాల ఆధారంగా పవర్ ఇండెక్స్ స్కోరును నిర్ణయిస్తారు.ఒక దేశం సైన్యంలో మొత్తం బలగాల సంఖ్య, పదాతి దళం, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రవాణా సదుపాయాలు, చమురు వంటి సహజ వనరుల లభ్యత, ఆర్థిక బలం, ప్రపంచపటంలో భద్రతా పరంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉందా లేదా అనే అంశాలన్నింటినీ పవర్ ఇండెక్స్ స్కోరు లెక్కించడానికి పరిగణలోకి తీసుకుంటారు.స్కోరు విషయంలో చిన్న ట్విస్టు..ఒక దేశ సైన్యం పవర్ ఇండెక్స్ స్కోరు లెక్కింపులో పైన పేర్కొన్న అంశాలన్నింటికీ సమాన వెయిటేజీ ఇస్తారు. ఉదాహరణకు ఒక దేశ ఆర్మీ అన్ని హంగులూ కలిగిన ఎయిర్‌ఫోర్స్ సామర్థ్యం కలిగి ఉందనుకుందాం. కానీ ఇదే దేశానికి నేవీ బలం అంతగా లేకపోతే పవర్ ఇండెక్స్ స్కోరు విషయంలో ఈ దేశం వెనుకబడుతుంది. పవర్ ఇండెక్స్ స్కోరును ఒక దేశ సైన్యానికి సంబంధించిన అన్ని సామర్థ్యాల మేళవింపుగా భావించొచ్చు. అయితే పవర్ ఇండెక్స్ స్కోరు విషయంలో చిన్న ట్విస్టుంది. ఈ స్కోరు ఎంత తక్కువగా ఉంటే దేశాల సైన్యాలు అంత బలంగా ఉన్నాయని అర్థం.ఇదీ చదవండి: నస్రల్లా వారసుడూ మృతి -
ఇరాన్ అణుస్థావరాలు పేల్చేయండి: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ అణుస్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.నార్త్ కరోలినాలో శుక్రవారం(అక్టోబర్4) జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ఈమేరకు వ్యాఖ్యానించారు.కాగా,ఇరాన్ అణు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందనే అంశంపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ను ఓ విలేకరి ప్రశ్నించగా బైడెన్ స్పందించలేదు.దీనిపై బైడెన్ వైఖరిని ట్రంప్ తప్పుబట్టారు. ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ జరిపిన మిసైల్ దాడులకు సమాధానంగా ఇరాన్ అణుస్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేయాలని ట్రంప్ సూచించారు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌కు మూడింది -
బీరుట్‌పై నిప్పుల వాన
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ శివార్లపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. గురువారం అర్ధరాత్రి తర్వాత భారీగా వైమానిక దాడులు నిర్వహించింది. క్షిపణుల దాడిలో పెద్ద సంఖ్యలో భవనాలు కంపించిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ దాడుల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టంపై వివరాలు ఇంకా తెలియరాలేదు. జనం కకావికలమై సురక్షిత ప్రాంతాలకేసి పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దక్షిణ లెబనాన్‌లో క్రైస్తవులు అధికంగా ఉండే మార్జయూన్ నగరంపైనా తొలిసారిగా దాడులకు దిగింది. బాంబు దాడుల్లో నలుగురు వైద్య సిబ్బంది మరణించినట్టు సమాచారం. లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. హెజ్బొల్లా నిఘా ప్రధాన కార్యాలయంపై భారీగా దాడి చేసినట్టు పేర్కొంది. గత 24 గంటల్లో 100 మందికి పైగా మిలిటెంట్లను హతమార్చినట్టు తెలిపింది. శుక్రవారం నాటి దాడుల్లో హెజ్బొల్లా కమ్యూనికేషన్స్ విభాగం చీఫ్ రషీద్ స్కఫీ మరణించినట్టు ప్రకటించింది. భూతల దాడులు కూడా కొనసాగుతున్నట్టు వివరించింది. స్కఫీ 2000 నుంచీ ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నాడు. గత 20 రోజుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 1,400 మందికి పైగా లెబనాన్‌వాసులు మరణించారు. 12 లక్షల మందికి పైగా నిర్వాసితులై శరణార్థులుగా మారారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా బీరుట్కు 50 కిలోమీటర్ల దూరంలోని లెబనాన్–సిరియా మాస్నా బోర్డర్ క్రాసింగ్‌ను మూసివేశారు. హెజ్బొల్లాకు ఇరాన్ నుంచి సిరియా గుండా ఆయుధాలు సరఫరా కాకుండా ఈ ప్రాంతంలో దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బొల్లా కూడా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత నుంచి పెద్ద ఎత్తున ప్రతి దాడులకు దిగింది. ఉత్తర ఇజ్రాయెల్‌పైకి భారీ సంఖ్యలో రాకెట్లు ప్రయోగించింది. దాంతో లోయర్ గలిలీ తదితర ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించినట్టు సమాచారం. పలుచోట్ల భారీగా మంటలు చెలరేగాయి. భూతల దాడుల్లో మరో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించినట్టు సైన్యం ధ్రువీకరించింది. మరోవైపు గాజాపైనా ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను పెంచింది. ఓ స్కూలు భవనంపై జరిగిన దాడికి పలువురు చిన్నారులు బలైనట్టు తెలుస్తోంది.హౌతీ లక్ష్యాలపై...అమెరికా, బ్రిటన్ దాడులువాషింగ్టన్: యెమన్లోని హౌతీ ఉగ్ర సంస్థపై అమెరికా, బ్రిటన్ భారీగా దాడులకు దిగాయి. ఆయుధ వ్యవస్థలు, స్థావరాలు తదితర 12 లక్ష్యాలపై యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు బాంబుల వర్షం కురిపించాయి. వీటిఇలో హొడైడా విమానాశ్రయం బాగా దెబ్బ తిన్నట్టు హౌతీ మీడియా ధ్రువీకరించింది. మరికొన్ని బాంబులు రాజధాని సనాలో తీవ్ర నష్టం కలిగించాయి. హౌతీ రెబెల్స్ గత వారం బాబ్ ఎల్ మందెబ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు అమెరికా నౌకలపై బాలిస్టిక్ మిసైళ్లు, యాంటీ షిప్ క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లు ప్రయోగించడం తెలిసిందే. వాటన్నింటినీ మధ్యలోనే అడ్డుకుని కూల్చేసినట్టు అమెరికా పేర్కొంది. తాజా దాడులు వాటికి ప్రతీకారమేనని భావిస్తున్నారు. -
అటు డోమ్..ఇటు ఫతాహ్!
ప్రాచీన మత సంబంధ కట్టడాల్లోకి పాలస్తీనియన్లను అనుమతించకపోవడంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య మొదలైన యుద్ధం లెబనాన్ మీదుగా ఇప్పుడు ఇరాన్‌ను తాకింది. హమాస్, లెబనాన్ కంటే ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు ప్రధాన యుద్ధక్షేత్ర పోటీదారుగా నిలిచింది. ఫతాహ్–2 హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించి ఇరాన్.. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థల సమర్థతను ప్రశ్నార్థకం చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్‌ల సైనికసత్తాపై మరోమారు చర్చ మొదలైంది. అనూహ్యంగా దూసుకొచ్చే శత్రు క్షిపణులను గాల్లోనే తుత్తునియలు చేసే గగనతల రక్షణ వ్యవస్థలకు ఇజ్రాయెల్ పెట్టింది పేరు. అలాంటి వ్యవస్థలనూ ఇరాన్‌కు చెందిన ఫతాహ్ క్షిపణులు చేధించుకుని రావడం రక్షణ రంగ నిపుణులనూ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ మొహరించిన భిన్న శ్రేణుల గగనతల రక్షణ వ్యవస్థలుసహా ఇరుదేశాల సైనికపాటవంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సైనిక బలగాల్లో ఇరాన్ పైచేయి ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇరాన్ సైనికబలం పెద్దది. ఇరాన్లో 3,50,000 మంది ఆర్మీ, 1,90,000 ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, 18వేల మంది నేవీ, 37 వేల మంది వాయుసేన, 15వేల మంది ఎయిర్‌డిఫెన్స్ సైనికులున్నారు. మరో 3,50,000 మంది రిజర్వ్ బలగాలున్నారు. ఇజ్రాయెల్‌లో కేవలం 1,26,000 మంది ఆర్మీ, 9,500 మంది నేవీ, 34,000 మంది ఎయిర్‌ఫోర్స్, 4,65,000 మంది రిజర్వ్బలగాలున్నాయి. రక్షణ బడ్జెట్లో ఇజ్రాయెల్ ముందంజ ఇరాన్ 2023 ఏడాదిలో రక్షణ కోసం 10.3 బిలియన్ డాలర్లు ఖర్చుచేస్తే ఇజ్రాయెల్ గత ఏడాది ఏకంగా 27.5 బిలియన్ డాలర్లు ఖర్చుచేసింది. 2022తో పోలిస్తే ఈ బడ్జెట్ 24% అధికం కావడం విశేషం.పదాతిదళంలో ఇరాన్ మేటి 10,513 యుద్ధట్యాంకులు, 6798 శతఘ్నులు, 640 ఆయుధాల రవాణా వాహనాలు, 55 సైనిక హెలికాప్టర్లు ఇరాన్ సొంతం. ఇజ్రాయెల్ వద్ద 400 యుద్ధట్యాంకులు, 530 శతఘ్నులు, 1,190 ఆయుధాల రవాణా వాహనాలున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌లో ఇజ్రాయెల్ హవా ఇజ్రాయెల్ వద్ద అమెరికా తయారీ అత్యాధునిక ఎఫ్రకం జెట్ యుద్ధవిమానాలున్నాయి. మొత్తంగా 345 యుద్ధవిమానాలున్నాయి. 43 ఆర్మీ హెలికాప్టర్లున్నాయి. ఇరాన్ వద్ద 312 యుద్ధవిమానాలు, 23 ఆర్మీ విమానాలు, 57 హెలికాప్టర్లున్నాయి. ఇరాన్ వద్ద అధిక జలాంతర్గాములు ఇరాన్ వద్ద 17 జలాంతర్గాములు, 69 గస్తీ, నిఘా నౌకలు, 7 యుద్ధనౌకలు, 23 విమానవాహక నౌకలున్నాయి. ఇజ్రాయెల్ వద్ద కేవలం ఐదు జలాంతర్గాములు, 49 గస్తీ/యుద్ధ నౌకలున్నాయి. విభిన్న గగనతల రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్‌లో మొత్తంగా 10 ఐరన్‌డోమ్ వ్యవస్థలున్నాయి. ఇవిగాక డేవిడ్స్ స్లింగ్, ఆరో సిస్టమ్స్ మొహరించాయి. ఇరాన్ వద్ద ‘పరారుణ’గుర్తింపు వ్యవస్థ ఉంది. వీటి సాయంతో ఎస్–200, ఎస్–300, దేశీయ 373 క్షిపణి వ్యవస్థలను ప్రయోగించి శత్రు క్షిపణులను నేలకూలుస్తుంది. ఇదిగాక ఎంఐఎం–23 హాక్, హెచ్‌క్యూ–2జే, కోర్డాడ్–15, చైనా తయారీ సీహెచ్–ఎస్ఏ–4, 9కే331 టోర్ ఎం1 క్షిపణులున్నాయి. అణ్వాయుధాలుఇజ్రాయెల్ వద్ద దాదాపు 90 దాకా అణ్వా్రస్తాలున్నాయి. అయితే ఇరాన్ వద్ద అణ్వయుధాలు ఉన్నాయో లేదో ఎవరికీ తెలీదు. కానీ అణ్వాయుధాల్లోని వార్‌హెడ్‌లో వాడే యురేనియంను మిలటరీ గ్రేడ్‌కు తెచ్చేందుకు ఆ మూలకం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వేగవంతంచేసింది. బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ వద్ద తాండార్ 69, ఖొరమ్షహర్, సెఝిల్ బాలిస్టిక్ క్షిపణులున్నాయి. ఇజ్రాయెల్ వద్ద లోరా, జెరికో పేర్లతో 150 కి.మీ.ల నుంచి 6,500 కి.మీ.లు దూసుకుపోయే విభిన్న బాలిస్టిక్ క్షిపణులున్నాయి.ఐరన్ డోమ్ (స్వల్పశ్రేణి)పరిధి4 నుంచి 70 కి.మీ.ల ఎత్తుదాకా దూసుకొచ్చిన క్షిపణులను ఈ వ్యవస్థ కూల్చేస్తుంది. స్వల్పదూర రాకెట్లు, బాంబులను తమిర్ క్షిపణులుఅడ్డుకుంటాయి. ఏమేం ఉంటాయి? ఐరన్‌డోమ్ వ్యవస్థలో తమిర్ క్షిపణులు, లాంఛర్, రాడార్, కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి డేవిడ్స్ స్లింగ్ (మధ్య శ్రేణి)పరిధి40 నుంచి 300 కి.మీ.ల ఎత్తుదాకా దూసుకొచ్చిన స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, పెద్ద రాకెట్లు, క్రూయిజ్ మిస్సైళ్లను ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది. ఏమేం ఉంటాయి? స్టన్నర్ ఇంటర్సెప్టార్ క్షిపణులు, నిట్టనిలువుగా ప్రయోగించే వేదిక, రాడార్, నియంత్రణ వ్యవస్థ ఇందులో ఉంటాయి ఆరో సిస్టమ్ (దీర్ఘ శ్రేణి)పరిధిఇజ్రాయెల్ నుంచి 2,400 కి.మీ.ల దూరంలో ఉండగానే శత్రువులకు చెందిన మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది. ఏమేం ఉంటాయి? తక్కువ ఎత్తులో సమాంతరంగా వస్తే ఆరో–2 మిస్సైళ్లు, ఎక్కువ ఎత్తులో వస్తే ఆరో–3 మిస్సైళ్లు అడ్డుకుంటాయి. లాంఛర్, కంట్రోల్ సెంటర్ ఉంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రమాదంలో ప్రపంచం
వరస సంక్షోభాలతో నిరంతరం నెత్తురోడే పశ్చిమాసియా అందరూ చూస్తుండగానే పూర్తి స్థాయి యుద్ధంలోకి జారుకున్నట్టు కనబడుతోంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, మరో ప్రధాన నగరం జెరూసలేంలపై మంగళవారం రాత్రి ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటం, ఆ వెంటనే హెజ్బొల్లా మిలిటెంట్లు టెల్‌అవీవ్‌లోని మొసాద్ ప్రధాన కార్యాలయంపై క్షిపణులతో దాడిచేయటం...ఇజ్రాయెల్‌కు దన్నుగా తాము సైతం రంగంలోకి దిగుతామని అమెరికా హెచ్చరించటం పరిస్థితులు వికటిస్తున్నాయన్న సంకేతాలిస్తున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్ నేరుగా తలపడటం ఇక లాంఛనం. ఒకపక్క తన కవ్వింపు చర్యలే ఇరాన్‌ను ప్రతీకారదాడికి పురిగొల్పాయని బట్టబయలైనా ఇరాన్ దాడిని వ్యతిరేకించలేదన్న కారణంతో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ను ‘అవాంఛిత వ్యక్తి’గా ప్రకటించి, తమ దేశంలో అడుగుపెట్టనీయబోమని నిషేధం విధించటం ఇజ్రాయెల్ తెంపరితనానికి నిదర్శనం. శరపరంపరగా వచ్చిపడుతున్న క్షిపణులను పూర్తిగా నిరోధించటం ఇజ్రాయెల్ గర్వంగా చెప్పుకునే రక్షణ ఛత్రం ఐరన్ డోమ్ వల్ల కూడా కాలేదంటే ఇరాన్ దాడి తీవ్రత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రాణనష్టం పెద్దగా లేకపోయినా భారీ భవనాలు నేలమట్టం కావటం, పౌరులు కకావికలై పరుగులు తీయటం, ప్రభుత్వాదేశాలతో పది లక్షలమంది ప్రజలు బంకర్లలో తలదాచుకోవటం ఇటీవలికాలంలో ఇదే మొదటిసారి. గాజాలో తన లక్ష్యం పూర్తిచేయగలిగానని భావిస్తున్న ఇజ్రాయెల్... రెండురోజుల క్రితం లెబనాన్‌పై పంజా విసరడం ప్రారంభించింది. హెజ్బొల్లా నేత నస్రల్లాను హతమార్చింది. ఆ సమయానికి ఆయనతో పాటున్న తమ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరుషాన్ సైతం ప్రాణాలు కోల్పోవటం ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అది తాజా దాడికి దిగింది. నిజానికి ఇరాన్‌ను ఏనాడూ ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉండనీయలేదు. అది అణ్వాయుధ దేశంగా మారవచ్చునన్న భీతితో గూఢచర్యం సాగిస్తూ పేరెన్నికగన్న శాస్త్రవేత్తలను... ప్రభుత్వంలో, సైన్యంలో కీలకపాత్ర పోషిస్తున్న వారిని హతమార్చటం ఇజ్రాయెల్ ఒక విధానంగా పెట్టుకుంది. మొన్న ఏప్రిల్‌లో సిరియాలోని డమాస్కస్‌లో ఇజ్రాయెల్ సాగించిన దాడిలో ఇరాన్‌కు చెందిన సైనిక నిపుణుడు, దౌత్యవేత్త మరణించారు. జూలైలో హెజ్బొల్లా నాయకుడు ఇస్మాయెల్ హనియేను ఇరాన్లో ఉండగా ఇజ్రాయెల్ హతమార్చింది. ఇలాంటి ఉదంతాలు జరిగిన ప్రతిసారీ డ్రోన్లతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినా వాటివల్ల ఏనాడూ ఇజ్రాయెల్ పెద్దగా నష్టపోలేదు. ఇరాన్ దాడి అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం ముడి చమురు ధర భగ్గున మండిన తీరు సమీప భవిష్యత్తులో ముంచుకురాబోతున్న ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తోంది. ఇజ్రా యెల్ దాదాపు ఏడాదికాలంగా అన్ని రకాల వినతులనూ బేఖాతరు చేసి గాజా, వెస్ట్‌బ్యాంక్‌లలో సాగిస్తున్న నరమేధం తొలుత పశ్చిమాసియానూ, ఆ తర్వాత ప్రపంచాన్నీ యుద్ధం అంచుల్లోకి నెడుతున్నదని విశ్లేషకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. నిరుడు అక్టోబర్ మొదటివారంలో ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 1,200 మంది పౌరులను హతమార్చి, మరో 695 మందిని అపహరించుకుపోవటం ద్వారా హమాస్ దుస్సాహసానికి పాల్పడింది. ఇది ఉగ్రవాద చర్యగా ప్రకటించిన దేశాలు సైతం అనంతర ఇజ్రాయెల్ దాడులను అంగీకరించలేదు. ఐక్యరాజ్య సమితి ఖండించింది. అమెరికా కూడా గాజా నరమేధం విరమించుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరిన మాట వాస్తవం. అలాగని అది ఏనాడూ ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా ఆపలేదు. ఫలితంగా ఇంతవరకూ దాదాపు 45,000 మంది గాజా పౌరులు మరణించారని అంటున్నారు. ఒకసారంటూ యుద్ధం మొదలైతే దాని గమనం, ముగింపు ఎవరి చేతుల్లోనూ ఉండవు. దాని తోవ అది వెదుక్కుంటుంది. రెండో ప్రపంచ యుద్ధ పర్యవసానాలు చూశాక మళ్లీ ఆ ఉత్పాతం జరగనీయరాదని ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. ఎందుకంటే ఆ యుద్ధంలో అయిదున్నర కోట్ల మంది సాధారణ పౌరులు, మరో రెండున్నరకోట్లమంది సైనికులు మరణించారు. కోట్లాదిమంది క్షతగాత్రులయ్యారు. ఒక్క సోవియెట్ యూనియన్లోనే దాదాపు రెండున్నర కోట్లమంది మరణించారు. మరో 90 లక్షలమంది వరకూ వ్యాధుల బారినపడ్డారు. కానీ విస్తరణ కాంక్షతో తహతహ లాడే అగ్రరాజ్యాలు తమ ౖ¯ð జం వదులుకోలేదు. ఆ వెనువెంటనే తమకు అలవాటైన యుద్ధ క్రీడ ప్రారంభించాయి. వర్తమాన పరిణామాలు దాని పర్యవసానమే. న్యూయార్క్ టైమ్స్ పరిశోధక పాత్రికేయురాలు అనీ జాకబ్సన్ యుద్ధం వల్ల మానవాళికి కలగబోయే హాని గురించి చెప్పిన అంశాలైనా అగ్రరాజ్యాల కళ్లు తెరిపించాలి. అణ్వాయుధ యుద్ధం కేవలం 72 నిమిషాల్లో భూగోళంపై 60 శాతం జనాభాను తుడిచిపెడుతుందని హెచ్చరించారామె. ఇజ్రాయెల్‌కు అమెరికా అండదండలున్నట్టే ఇరాన్‌కు రష్యా, చైనాల ఆశీస్సులున్నాయి. దానికి హమాస్, హిజ్బొల్లా గ్రూపులు, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్, సిరియాల్లోని షియా మిలిటెంటు సంస్థలూ మరింత దగ్గరవుతాయి. ఇజ్రాయెల్‌తో సాన్నిహిత్యం నెరపుతున్న ఈజిప్టు, జోర్డాన్లకూ, ఆ తోవనే వెళ్తున్న సౌదీ అరేబియాకూ సంకటస్థితి ఏర్పడుతుంది. ఈ వైరిపక్షాలన్నీ కొంత హెచ్చు తగ్గులతో ప్రపంచాన్ని సర్వనాశనం చేయగల మారణాయుధాలతో సంసిద్ధంగా ఉన్నాయి. అందుకే పాలస్తీనా ఆవిర్భావానికి సహకరించటం, దుందుడుకు విధానాలకు స్వస్తిపలకడం వంటి చర్యలే పశ్చిమాసియాకూ... మొత్తం ప్రపంచానికీ ప్రశాంతతనిస్తాయని ఇజ్రాయెల్ గుర్తించాలి. అమెరికా వివేకంతో మెలిగి సామరస్య ధోరణులకు తోడ్పాటునందించాలి. -
మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు.. మూడో ప్రపంచ యుద్ధం..?
-
పశ్చిమాసియాలో యుద్ధం ఆపే శక్తి భారత్‌కే ఉందా ?
-
ఇరాన్ అంతు చూస్తాం...రంగంలోకి అమెరికా
-
ఇజ్రాయెల్‌లోని భారతీయులకు అలర్ట్.. అడ్వైజరీ జారీ
టెల్అవీవ్: ఇరాన్ మిసైల్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులను అక్కడి భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. దాడుల నేపథ్యంలో భారతపౌరులు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించింది.ఇజ్రాయెల్ అధికార యంత్రాంగం సూచించించిన భద్రతా చర్యలన్నీ పాటించాలని కోరింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. మరోపక్క లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపుపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం చేయడంతో అక్కడ నివసిస్తున్న పౌరులకు కూడా ఇటీవల భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ దాడులు -
మీకు రిటర్న్ గిఫ్ట్ ఖాయం.. ఇరాన్‌కు ఇజ్రాయెల్ పీఎం హెచ్చరిక
Iran Attacks Israel Live Updatesజెరూసలెం: పశ్చిమాన యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై వైమానిక దాడులతో విరుచుకు పడుతుంది. టెల్ అవీవ్,జెరుసలేంతో పాటు ఇతర నగరాల్లో భారీ విధ్వంసం సృష్టిస్తుంది. తొలిసారిగా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్‌పై హైపర్సోనిక్ ఫట్టా క్షిపణులను ఉపయోగించాయి. దీంతో ఇజ్రాయెల్‌లో తాము చేసిన దాడులు 90 శాతం ఫలితాల్ని ఇచ్చినట్లు ఇరాన్ ఆర్మీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపిందిఈ తరుణంలో తమ దేశంపై వైమానిక దాడులు చేయడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఇరాన్,హెజ్బొల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. దాడులు ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సూచించారు. ‘ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంలో అధికారులతో భద్రతా కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న నెతన్యాహు ఇరాన్ చర్యలపై మండిపడ్డారు. ఇరాన్ పెద్ద ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని, తగిన మూల్యం చెల్లించుకుంటుందంటూ’ హెచ్చరించారు. కమ్ముకున్న యుద్ధ మేఘాలుఇజ్రాయెల్,ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత జులైలో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను, తాజాగా హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను, తమ జనరల్ అబ్బాస్ నిల్పొరుషన్ను హతమార్చినందుకు ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది.400 మిసైళ్లతో దాడిజెరూసలెం, టెల్ అవీవ్ నగరాలపై ఏకకాలంలో 400 మిసైళ్లతో దాడులు చేసింది. ఇరాన్‌కు దన్నుగా హెజ్బొల్లా సైతం బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లోని పలు నగరాల్లోని పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశం మొత్తం సైరన్ మోగించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది.ఓవైపు ఇజ్రాయెల్‌పై వైమానికి దాడులకు పాల్పడుతూనే టెల్అవీవ్లో ఇరాన్.. ఉగ్రవాదుల్ని రంగంలోకి దించింది. టెల్‌అవీవ్‌లోని ఓ మెట్రో స్టేషన్లో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన ఆర్మీ ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చింది.ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులకు భారత ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. టెల్అవీవ్లో జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.విమానాల రాకపోకలపై ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ ప్రభావం పడింది. ప్రపంచ దేశాలు పశ్చిమాసియా మీదిగా విమానాల రాకపోకలను రద్దు చేసుకున్నాయి. 👉ఇదీ చదవండి : టపాసుల్లా పేలిన హెజ్బొల్లా ఉగ్రవాదుల పేజర్లు -
ప్రమాదకర యుద్ధక్రీడ
ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడితో ఏడాది క్రితం అక్టోబర్ 7న పశ్చిమాసియాలో చెలరేగిన హింసాత్మక సంఘర్షణ ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. ముస్లిమ్‌లలోని షియా వర్గానికి చెందిన తీవ్రవాద హెజ్బొల్లా బృందానికి 32 ఏళ్ళుగా సారథ్యం వహిస్తున్న అధినేత హసన్ నస్రల్లాను భీకర గగనతల దాడుల ద్వారా ఇజ్రాయెల్ మట్టుబెట్టిన తీరు ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. లెబనాన్‌లోని ఇటీవలి పేజర్లు, వాకీటాకీల పేలుళ్ళ ఉదంతం మరువక ముందే ఇజ్రాయెల్ మరోసారి తన గూఢచర్య, సైనిక సత్తా చాటిన వైనం ముక్కున వేలేసుకొనేలా చేసింది. లెబనాన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా, ఫ్రాన్స్‌లు గురువారం పిలుపునిచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ దాన్ని సమర్థిస్తున్నారనే అందరూ భావించారు. ఒక్క రోజు గడిచిందో లేదో... ఒకపక్క న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశం సాగుతుండగానే, మరోపక్క నెతన్యాహూ మాత్రం బీరుట్‌పై వైమానిక దాడికీ, హెజ్బొల్లా అధినేతను మట్టుబెట్టడానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఎవరెన్ని చెప్పినా, ఐరాసలో ఎన్ని తీర్మానాలు చేసినా ఘర్షణను కొనసాగించాలనే ఇజ్రాయెల్ మంకుపట్టుతో ముందుకు పోతున్నట్టు తేటతెల్లమైంది. చిత్రమేమిటంటే, లెబనాన్‌లో కాల్పుల విరమణను బయట తోసిపుచ్చిన నెతన్యాహూ ప్రైవేటుగా మాత్రం అందుకు అంగీకరించారు. అమెరికా, ఫ్రాన్స్ అధికారులు సైతం చెప్పినమాట అదే. తీరా దాడులు మాత్రం నెతన్యాహూ కొనసాగించారు. కొన్ని నెలలుగా ఆయన తీరు అంతే. అమెరికాకు నచ్చే మాటలు పైకి చెబుతారు. కానీ, చివరకు మాత్రం తాను ఏదనుకుంటే అదే చేస్తున్నారు. అమెరికా సైతం పైకి శాంతి వచనాలు చెబుతున్నా, ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరా ఆపలేదు. ఆ ఆయుధాలను వాడుకుంటూ ఇజ్రాయెల్ పేట్రేగిపోతుంటే ఆపుతున్నదీ లేదు. ఇప్పటికే కొన్ని వేల మంది గాజాలో ప్రాణాలు కోల్పోయారు. గత వారంలో లెబనాన్‌లోనూ వెయ్యిమంది మరణించారు. అక్కడి జనాభాలో దాదాపు అయిదోవంతు మంది నిర్వాసితులయ్యారు. భవనాలపై బాంబు దాడులకు జడిసి, ప్రజలు వీధుల్లో నిద్రిస్తున్న పరిస్థితి. గగనతలం నుంచి బాంబులు ఆగలేదు. భూమార్గంలోనూ ముప్పు తప్పదన్న భయం తప్పడం లేదు. మరోపక్క ఇజ్రాయెల్ చేపట్టిన పని ఇంకా పూర్తి కాలేదని ఆ దేశ ప్రధాని ప్రకటించడంతో ఈ తలనొప్పి తగ్గేలా లేదు.అలాగని హెజ్బొల్లా అధినేత మరణానికి యావత్ లెబనాన్ బాధపడుతోందని అనలేం. తీవ్ర హింసకు పాల్పడి, ఎందరి మరణానికో కారణమైన నస్రల్లా పట్ల లెబనాన్, ఇజ్రాయెల్, సిరియా సహా పలు ప్రాంతాల్లో ప్రజానీకానికి పెద్దగా ప్రేమ ఏమీ లేదు. అరబ్ ప్రపంచంతో పాటు సాక్షాత్తూ లెబనాన్‌లో సైతం ఆయన మరణానికి సోషల్ మీడియాలో పెద్దయెత్తున ఆనందం వ్యక్తం కావడం గమనార్హం. సిరియన్ నియంత బషర్ అల్–అసద్‌తో చేతులు కలిపి తమ వద్ద ప్రజాస్వామ్య ఉద్యమాన్ని హెజ్బొల్లా అణిచివేయడంతో వారిలో ఆగ్రహం నెలకొంది. అందుకే ఈ రకమైన భావన వ్యక్తమైంది. లెబనీస్ ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి, తద్వారా లెబనీస్ సైన్యం హెజ్బొల్లా చేతుల్లోని దక్షిణ లెబనాన్‌పై నియంత్రణ సాధించి, సరిహద్దు వెంట శాంతి నెలకొల్పాల నేది వారి అభ్యర్థన. నిజానికి, ఇజ్రాయెల్‌తో యుద్ధం తాము కోరుకోకపోయినా, ఇరాన్ ఆదేశాలతో లెబనీస్‌ను నస్రల్లా దీనిలోకి లాగారని వారి వాదన. ఇలాగే సాగితే గాజా భూఖండం లాగా బీరుట్ సైతం ధ్వంసమవుతుందనీ, అంతర్యుద్ధం మళ్ళీ వస్తుందనీ లెబనీయుల భయం. ముందు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు సాధారణస్థితికి రావడం ముఖ్యం. అందుకు సౌదీలూ సిద్ధమే! కాకపోతే, రెండు దేశాల ఏర్పాటనే పరిష్కార సూత్రంతో పశ్చిమ తీరం లోని పాలెస్తీనా అథారిటీతో చర్చలు జరిపేందుకు ఇజ్రాయెల్ ముందుకు రావాలన్నది వారి షరతు. వ్యవహారం అక్కడే పీటముడి పడింది. ఇరాన్‌కు నెతన్యాహూ హెచ్చరిక, హెజ్బొల్లా నేత హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా ఖమేనీ ప్రతిజ్ఞ, ఇరాన్ అండతో పెచ్చరిల్లుతున్న ఇతర వర్గాల వ్యవహారం... అంతా చూస్తుంటే ఇక ఇది అంతులేని కథే! నిజానికి, లెబనాన్, గాజాల్లోని తీవ్రవాద వర్గాలను హతమార్చాలనే ఇజ్రాయెల్ సైనిక విధానం వల్ల తాత్కా లిక లాభాలే తప్ప, శాశ్వత ప్రయోజనం ఉండదు. ఆ మధ్య సాక్షాత్తూ ఇరాన్ రాజధాని టెహరాన్‌లో హమాస్ నేత ఇస్మాయిల్ హనీయే, ఇప్పుడు బీరుట్లో హెజ్బొల్లా అధినేత, వెంటనే అదే గ్రూపులోని మరో కీలక నేత నబిల్ కౌక్... ఇలా పలువురిని ఇజ్రాయెల్ చంపేసింది. కానీ ఇలాంటి సంస్థల్లో ఒకరు పోతే మరొకరొస్తారు. పైగా ఇజ్రాయెల్ దూకుడు వల్ల ఇరాన్‌లోని కొత్త సంస్కరణవాద సర్కారూ చేసేదేమీ లేక, తీవ్రంగా ప్రతిస్పందించక తప్పదు. అప్పుడు ముడి మరింత బిగుస్తుంది. అగ్రదేశాల స్వార్థం, ప్రపంచ శాంతికి కృషి చేయాల్సిన అంతర్జాతీయ సంస్థల సంపూర్ణ వైఫల్యం ఈ దీర్ఘకాలిక సమస్యకూ, ఏడాదిగా ఆగని మారణహోమానికీ కారణం. పాలెస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణకు వచ్చే ఏడాదిలోగా ముగింపు పలకాలని ఐరాస తీర్మానించిన కొద్దిరోజులకే ఇలా జరిగిందంటే ఏమనాలి! ఐరాసకు కోరలు లేని పరిస్థితుల్లో... ప్రపంచానికి సరికొత్త శాంతిసాధన వ్యవస్థ అవసరం కనిపిస్తోంది. నెతన్యాహూ ఇలాగే తన దూకుడు కొనసాగిస్తే, పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారుతుంది. లెబనాన్‌లో సైతం మరో గాజాను ఇజ్రాయెల్ సృష్టించక ముందే ప్రపంచ దేశాలు కళ్ళు తెరవాలి. నిర్బంధంగానైనా కాల్పుల విరమణను సాధించాలి. లేదంటే, పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు మరింత విస్తరిస్తాయి. ప్రపంచాన్ని చీకటితో కమ్మేస్తాయి. -
కాంగ్రెస్ పార్టీలో రాజుకుంటున్న వర్గపోరు
జనగామ: డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వర్సెస్ సీనియర్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. కొమ్మూరి తనను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చాడని కంచె రాములు చేసిన ఫిర్యాదుతో జిల్లాలో పార్టీ అడ్డంగా చీలిపోయే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు అంతా కలిసే ఉన్న నాయకత్వం.. లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తన ఓటమికి కారణమయ్యారంటూ కొంతమంది నాయకులపై ప్రతాప్‌రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించడంతో ఇరువురి మధ్య దూరం పెరిగింది. కొమ్మూరి నిర్లక్ష్యం, ఒంటెద్దు పోకడలతోనే ఓడిపోయారే తప్ప.. నాయకులు, కార్యకర్తల తప్పు లేదని మరోవర్గం అంటోంది. ఇద్దరి మధ్య రాజుకున్న వివాదం.. పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. రోజుకో ఫిర్యాదుతో రెండు వర్గాల వారు గాంధీభవన్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం ప్రతినిధులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. పార్టీ ఇచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహిస్తూ గ్రూపులకు ఆజ్యం పోస్తున్నా రు. దీంతో దిగువ శ్రేణి నాయకత్వం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.రెండు వర్గాలుగా విడిపోయి..పార్టీ నాయకులు, శ్రేణులు జనగామ నుంచి కొమురవెల్లి వరకు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రతిపక్షాన్ని తలపించేలా వ్యవహరిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేని ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ.. చించి వేసుకునే స్థాయికి దిగజారి పోతున్నారు. ప్రతిపక్షంలో పదేళ్లు ఉండి పార్టీని కాపాడుకుంటే.. కొమ్మూరి బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్లను పక్కన పెడుతున్నారన్న పంచాయితీ తెలిసిందే. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం కొమ్మూరి వర్సెస్ సీనియర్ల మధ్య మరింత దూరం పెంచగా, చినికి చినికి గాలివానలా మారింది. హత్య చేయించేందుకు డీసీసీ అధ్యక్షుడు సుపారీ ఆఫర్ చేశారంటూ ఆ పార్టీ నేత కంచె రాములు పోలీసులకు ఫిర్యా దు చేసుకునే వరకు వెళ్లింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంచె రాములును హత్య చేయించేందుకు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రాహుల శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తికి రూ.25లక్షలు ఆఫర్ చేసి కుట్ర పన్నారని డీసీపీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు రాములు చెప్పగా.. తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ డీసీసీ అధ్యక్షుడు కొట్టి పారేశారు. ‘అసలు శ్రీనివాస్‌రెడ్డి నా శత్రువు.. సోషల్ మీడియాలో నాకు వ్యతిరేఖంగా పోస్టులు పెడుతున్నాడు. అంభాడాలు వేస్తున్నాడు.. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని’ కొమ్మూరి కోరడం గమనార్హం.ఒకరిపై ఒకరు ఫిర్యాదులు..కొద్ది రోజులుగా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితోపాటు మరో వర్గానికి చెందిన సీని యర్ నాయకులు వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, కంచె రాములు వర్గీయులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు, సీఎం వద్దకు వెళ్లి జనగామ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఆశిస్తున్న కంచె రాములును కాదని డీసీసీ అధ్యక్షుడు మరో పేరును సూచించడంతో సీనియర్లు సీరియస్ అయ్యారు. అయినా కొమ్మూరి యువ నాయకు ల వైపే మొగ్గు చూపారు. ఈసారి బీసీ(ఏ) రిజర్వేషన్ ఉంది.. ఆ పదవి తనకే ఇవ్వాలని లోకుంట్ల ప్రవీణ్ పట్టు బడుతున్నాడు. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమంటూ సవాల్ విసురుతుండంతో అధిష్టానం మార్కెట్ చైర్మన్ పదవి విషయాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఏది ఏమైనా డీసీసీ అధ్యక్షుడు వర్సెస్ కంచె రాములు వర్గపోరు ఎటుదారి తీస్తుందో వేచిచూడాలి. -
ఇజ్రాయెల్ కొత్త యుద్ధ లక్ష్యాల ప్రకటన
గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మంగళవారం నూతన యుద్ధ లక్ష్యాలతో ముందుకు సాగుతామని ప్రకటిటిచారు. ‘‘రాజకీయ భద్రతా కేబినెట్ యుద్ధం లక్ష్యాలను నవీకరించింది. క్రాస్ బార్డర్లో హమాస్ అనుకూల మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాతో చోటుచేసుకున్న కాల్పుల కారణంగా పారిపోయిన ఉత్తరాది నివాసితులను సురక్షితంగా తిరిగి ఇజ్రాయెల్‌లోకి తీసుకొస్తాం’ అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.మరోవైపు.. గాజా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే కట్టుబడి ఉంటామని హిజ్బుల్లా ప్రతినిధులు తెలిపారు. అయితే లెబనాన్ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో మిలిటెంట్లను తాము అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఈ దాడుల్లో లెబనాన్‌కు చెందిన వందల ఫైటర్లు, ఇజ్రాయెల్ దేశానికి చెందిన పౌరులు, సైనికులు మరణించారు. ఈ దాడుల కారణంగా ఇరుదేశాలకు సంబంధించి సుమారు పదివేల మంది పౌరులు వలసవెళ్లారు.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ఇజ్రాయెల్‌ను సందర్శించిన అమెరికా రాయబారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ఉత్తర నివవాసితులను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి తీసుకురావడానికి మిగిలి ఉన్న ఏకైక మార్గం సైనిక చర్య మాత్రమేనని అన్నారు. రక్షణ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.చదవండి: భారత్‌లో ముస్లింలు బాధలు పడుతున్నారు -
గాజా యుద్ధం కొనసాగిస్తాం
గాజాలోని హమాస్ మిలిటెంట్లను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినా, ఎంత నష్టపోయినా తమ పోరాటం కొనసాగిస్తామని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్‌తో పోరాడటానికి తమకు తగినంత వనరులు ఉన్నాయని హమాస్ సీనియర్ నేత ఇస్తాంబుల్‌లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘‘ గాజాలో 11 నెలలకు పైగా యుద్ధం జరగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో నష్టపోయినప్పటికీ మా పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటానికి మా వద్ద తగినంత వనరులు ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిఘటన దాడులు కొనసాగించడానికి మేము అధిక సామర్థ్యాన్ని కలిగిఉన్నాం. అమరవీరులు ఉన్నారు, వారి త్యాగాలు ఉన్నాయి. ప్రతిఘటనలో కొత్త తరాలను చేర్చుకోవడం జరుగుతోంది. ఈ యుద్ధంలో మేము ఊహించిన దానికంటే.. ప్రాణనష్టం, యుద్ధ విస్తరణ తక్కువగానే జరిగింది’ అని అన్నారు.ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ.. ‘11 నెలలకు పైగా ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో హమాస్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయి. గతంలో మాదిరిగా గాజాలో హమాస్ సైనిక నిర్మాణం ఉనికిలో లేనట్టు భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ హమాస్ నేత స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.చదవండి: హమాస్ మిలిటరీ వ్యవస్థగా ఎక్కువ కాలం కొనసాగదు: ఇజ్రాయెల్ -
రానున్నది మరో మహమ్మారి.. బిల్‌గేట్స్ ఆందోళన
ప్రపంచం వచ్చే 25 ఏళ్లలో అత్యంత భారీ యుద్ధాన్నో లేక కోవిడ్ కంటే ప్రమాదకరమైన మరో మహమ్మారినో ఎదుర్కొనబోతోందని ఆందోళన చెందుతున్నారు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్. ఇవే ఆందోళనలు తనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఓ తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.వాతావరణ విపత్తులు, పెరిగిపోతున్న సైబర్ దాడులపై ప్రజలను హెచ్చరించిన బిల్‌గేట్స్.. తనను రెండు ఆందోళనలు అత్యంత కలవరపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అందులో ఒకటి రానున్న మహా యుద్ధం కాగా మరొకటి కోవిడ్‌ను మించిన మహమ్మారి.‘ప్రపంచంలో ప్రస్తుతం చాలా అశాంతి నెలకొంది. ఇది మహా యుద్ధాన్ని రేకెత్తించవచ్చు. ఒక వేళ ఆ యుద్ధం నుంచి బయటపడినా రాబోయే 25 సంవత్సరాలలో మరొక మహమ్మారి విజృంభించే అవకాశం ఉంటుంది’ అని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.ఒకవేళ మహమ్మారి విజృంభిస్తే.. కోవిడ్‌కు మించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉటుందని, దీనికి దేశాలు సిద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న తనను వేధిస్తోందన్నారు. అమెరికా విషయాన్ని తీసుకుంటే కోవిడ్ సమయంలో మిగిలిన దేశాల కంటే మిన్నగా ఉంటుందని, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అందరూ భావించారని కానీ అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి..బిల్ గేట్స్ 2022లో “తదుపరి మహమ్మారిని నివారించడం ఎలా ” అనే పుస్తకాన్ని కూడా రాశారు. 2020 కోవిడ్ సమయంలో వివిధ దేశాల సన్నద్ధత లోపాలను ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. బలమైన క్వారంటైన్ విధానాలు, వ్యాధి పర్యవేక్షణ, టీకా పరిశోధన, అభివృద్ధి వంటి వాటిపై దేశాలకు పలు సూచనలు సైతం చేశారు. -
రష్యా,ఉక్రెయిన్ మధ్య శాంతికి భారత్ పాత్ర కీలకం: ఇటలీ పీఎం
రోమ్: రష్యా-ఉక్రెయిన్ల మధ్య రెండేళ్లుగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా- ఉక్రెయిన్ల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి భారత్, చైనా కీలక పాత్ర పోషిస్తాయని మెలోని అన్నారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇటలీలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా జెలెన్స్కీ మెలోనితో సమావేశమయ్యారు. రష్యా, ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి ఇటలీ మద్దతుటుందని మెలోని తెలిపారు. రష్యా- ఉక్రెయిన్ల మధ్య శాంతి నెలకొనేందుకు భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు మధ్యవర్తిత్వం వహించగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవలే వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదీ చదవండి.. వాళ్లు సంక్షోభాన్ని పోగోట్టగలరు -
ఉక్రెయిన్ పర్యటనపై.. పుతిన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ప్రధాని మోదీ ఇటీవల ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఆ పర్యటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. ఈ మేరకు మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈరోజు పుతిన్‌తో మాట్లాడినట్లు ఎక్స్ వేదికగా తెలిపిన ప్రధాని మోదీ..భారత్-రష్యా దేశాల ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం దిశగా అడుగులు పడే చర్యలపై చర్చించారు. దీంతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత ఎప్పుడూ తటస్థంగా లేదని, తాము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉన్నామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో వివాదాన్ని శాతియుతంగా పరిష్కరించుకోవాలని, అక్కడ శాంతి-స్థిరత్వం కోసం భారత్ పూర్తి మద్దతు అందిస్తుందని చెప్పాము’అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. Spoke with President Putin today. Discussed measures to further strengthen Special and Privileged Strategic Partnership. Exchanged perspectives on the Russia-Ukraine conflict and my insights from the recent visit to Ukraine. Reiterated India’s firm commitment to support an early,…— Narendra Modi (@narendramodi) August 27, 2024 -
ఉక్రెయిన్‌లో శాంతి, సుస్థిరతకు చర్చలే మార్గం... ఉక్రెయిన్-రష్యా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి... భారత ప్రధానినరేంద్ర మోదీ విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సిద్దిపేటలో మొదలైన ఫ్లెక్సీ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు, సవాళ్లతో సిద్దిపేట శనివారం రణరంగంగా మారింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఇరుపార్టీలకు చెందిన నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నిరసన ర్యాలీ: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 కల్లా పూర్తి చేసినందున ఎమ్మెల్యే పదవికి హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని తొలగించాలంటూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం రాత్రి నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి, తెల్లవారుజామున వదిలి పెట్టారు. మరోవైపు శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే హరీశ్ క్యాంప్ కార్యాలయంలోకి చొరబడ్డాయి.అక్కడ కేసీఆర్, హరీశ్‌రావు చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీని చించేశాయి. దీంతో శనివారం సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి పాత బస్టాండ్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. హరీశ్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని దగ్ధం చేశారు. తర్వాత బీజేఆర్ చౌరస్తాలో ఉన్న ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నాయకులు చించివేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీలను ఝుళిపించారు. బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.ర్యాలీగా కాంగ్రెస్: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ శ్రేణులను బీజేఆర్ చౌరస్తాలో పోలీ సులు అడ్డుకున్నారు. పోలీసుల కన్నుగప్పి క్యాంప్ ఆఫీస్ వైపు చొచ్చుకొచ్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. క్యాంప్ ఆఫీస్ గేట్ వద్దకు చేరు కున్న కాంగ్రెస్ నాయకుడు మహేందర్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయ డంతో పరిస్థితి చేయిదాటిపోతుందనే ఆందోళన నెలకొంది. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇరుపార్టీలు పరస్పర ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేశారు. -
అణువిద్యుత్ కేంద్రంపై దాడి రష్యా పనే: జెలెన్స్కీ
కీవ్: తమ దేశంలోని జపోర్జియా అణువిద్యుత్ కేంద్రంపై రష్యా దళాలు పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. తమను బ్లాక్ మెయిల్ చేసేందుకే వారు ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. మరోవైపు రష్యా మాత్రం ఉక్రెయిన్ సైన్యం జరిపిన దాడుల వల్లే మంటలు వ్యాపించాయని చెబుతోంది. యూరప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రాల్లో ఒకటైన జపోర్జియా న్యూక్లియర్ పవర్‌ప్లాంటులో ప్రస్తుతం మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే ఇక్కడ ఎలాంటి రేడియేషన్ లీక్ కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సిబ్బంది తెలిపారు. మంటలు వ్యాపించిన ప్రదేశానికి తమను అనుమతించాలని వారు కోరుతున్నారు.కాగా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన 2022లోనే ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని రష్యాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. తాజాగా ఈ విద్యుత్కేంద్రం కూలింగ్టవర్లపై డ్రోన్ దాడి జరిగింది. -
ఉక్రెయిన్ రాజధానిపై మిసైల్ దాడులు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై శనివారం(ఆగస్టు10) అర్ధరాత్రి రష్యా మిసైల్ దాడులకు దిగింది. రష్యా నుంచి వచ్చిన బాలిస్టిక్ మిసైళ్లను ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకుంది. దాడుల విషయాన్ని కీవ్ నగర మేయర్ కిట్ష్కో నిర్ధారించారు. కీవ్‌పై ఎయిర్ రెడ్ అలర్ట్ కొనసాగుతుందని తెలిపారు. కీవ్ శివార్లలో రెండు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టమేమైనా జరిగిందా లేదా అనేది తెలియరాలేదు. కాగా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం 2022 నుంచి జరుగుతోంది. -
రణయంత్రాలు.. 'యుద్ధాన్ని మనం ముగించకుంటే యుద్ధం మనల్ని?'
‘యుద్ధాన్ని మనం ముగించకుంటే యుద్ధం మనల్ని ముగించేస్తుంది’ అన్నాడు ఇంగ్లిష్ రచయిత హెచ్‌జీ వెల్స్. చాలామంది దేశాధినేతలు ఇప్పటికీ ఈ సంగతిని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే కొత్త కొత్త యుద్ధాలను మొదలుపెడుతున్నారు. మానవాళి జీవనసరళిని సులభతరం చేయాల్సిన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని యుద్ధాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సునాయాసంగా సామూహిక జనహననం చేయగల అధునాతన ఆయుధాలను, యుద్ధ వాహనాలను తయారు చేసుకుంటున్నారు. చివరకు రోబో సైనికులను కూడా రంగంలోకి దించుతున్నారు. ‘యుద్ధం విధ్వంసశాస్త్రం’ అన్నాడు కెనడా మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు జాన్ అబట్. ఈ విధ్వంసశాస్త్ర పురోగతిపై ఒక విహంగ వీక్షణం...యుద్ధాలు ఎందుకు తలెత్తుతాయంటే, కచ్చితమైన కారణాలను చెప్పడం కష్టం. ప్రధానంగా నియంతల నిరంకుశ ధోరణి, జాత్యహంకారం, మతోన్మాదం, రాజ్యవిస్తరణ కాంక్ష వంటివి చరిత్రలో ప్రధాన యుద్ధ కారణాలుగా కనిపిస్తాయి. అయితే, ఇలాంటి పెద్దపెద్ద కారణాల వల్లనే యుద్ధాలు జరుగుతాయనుకుంటే పొరపాటే! చాలా చిల్లరమల్లర కారణాలు కూడా యుద్ధాలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి.చిల్లర కారణంతో జరిగిన యుద్ధానికి ఒక ఉదాహరణ ‘ద పిగ్ వార్’. ఇది ఒక పంది కోసం అమెరికన్లకు, బ్రిటిషర్లకు మధ్య జరిగిన యుద్ధం. ఇదెలా జరిగిందంటే– అమెరికా ప్రధాన భూభాగానికి, వాంకోవర్ దీవికి మధ్య శాన్ జువాన్ దీవి ఉంది. లైమాన్ కట్లర్ అనే అమెరికన్ రైతు తన పొలంలోకి ప్రవేశించిన పందిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ పంది బ్రిటిషర్ల అధీనంలోని హడ్సన్స్ బే కంపెనీకి చెందినది. ఈ సాదాసీదా సంఘటన శాన్ జువాన్ దీవిలో స్థిరపడ్డ అమెరికన్లకు, అక్కడ వలస వ్యాపారం సాగించే బ్రిటిషర్లకు మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం 1859లో ప్రారంభమై, 1872 వరకు కొనసాగింది. చరిత్రలో ఇలాంటి యుద్ధాలు మరికొన్ని కూడా జరిగాయి. సామరస్యంగా చర్చలతో పరిష్కరించుకోగలిగే చిన్నా చితకా కారణాల వల్ల తలెత్తిన యుద్ధాలు ప్రాణనష్టానికి, ఆస్తినష్టానికి దారితీశాయి.రణ పరిణామం..మొదటి ప్రపంచయుద్ధం నాటికి యుద్ధరంగంలోకి తుపాకులు, ఫిరంగులు, యుద్ధట్యాంకులు, బాంబులను జారవిడిచే యుద్ధవిమానాలు, జలమార్గం నుంచి దాడులు చేసే యుద్ధనౌకలతో పాటు ప్రమాదకరమైన రసాయనిక ఆయుధాలు కూడా వచ్చిపడ్డాయి. రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబులు అందుబాటులోకి వచ్చాయి. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికన్ బలగాలు జారవిడిచిన అణుబాంబుల పర్యవసానాలు తెలిసినవే! మొదటి రెండు ప్రపంచయుద్ధాలూ కోట్ల సంఖ్యలో ప్రాణాలను కబళించాయి. ఈ యుద్ధాలు మానవాళికి అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. అలాగని యుద్ధాలు సమసిపోలేదు. రెండు ప్రపంచయుద్ధాల తర్వాత కూడా అనేక యుద్ధాలు జరిగాయి, జరుగుతున్నాయి. కొన్ని అంతర్యుద్ధాలు, ఇంకొన్ని ప్రచ్ఛన్నయుద్ధాలు, మరికొన్ని ప్రత్యక్ష యుద్ధాలు– ఒక్కొక్క యుద్ధంలో సాంకేతిక ఆయుధాలు పదునెక్కుతూ వస్తున్నాయి. ఇప్పటి యుద్ధాల్లో రణయంత్రాలే రణతంత్రాలను నిర్దేశిస్తున్నాయి. కృత్రిమ మేధ యుద్ధాల తీరుతెన్నులనే మార్చేస్తోంది.రోబో సైనికులు..పాతకాలంలో సైనికులు పరస్పరం ఎదురుపడి తలపడేవారు. ఒక్కోసారి ఏ కొండల చాటునో, గుట్టల చాటునో మాటువేసి దొంగదాడులతో శత్రుబలగాల మీద విరుచుకుపడేవారు. ఇప్పుడు రోజులు మారాయి. యుద్ధరంగంలోకి రోబో సైనికులను దించుతున్నారు. వీటిని ఎక్కడో ఉంటూ రిమోట్ ద్వారా నియంత్రిస్తూ, శత్రువులను మట్టుబెట్టగలుగుతున్నారు. అలాగే, శత్రువుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను సమర్థంగా నిరోధించగలుగుతున్నారు. రోబో సైనికులు ఆయుధాలను ప్రయోగించడమే కాకుండా, శత్రువులు అమర్చిన మందుపాతరలను తొలగించడం, బాంబులను ఏరివేయడం వంటి పనులు కూడా చేయగలవు. అమెరికా, చైనా వంటి దేశాలు ఇప్పటికే రోబో సైనికులను రూపొందించుకున్నాయి.వీటిలో కృత్రిమ మేధతో పనిచేసేవి కూడా ఉండటం విశేషం. ఈ రోబోసైనికులు యుద్ధరంగంలో సైనికుల పనిని సులభతరం చేస్తాయి. దాడులకు తెగబడే శత్రుబలగాలను తిప్పికొట్టడం, శత్రువులపై కాల్పులు జరపడం, శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం వంటి పనులను సునాయాసంగా చేస్తాయి. దక్షిణ కొరియా సైన్యం కాపలా విధుల కోసం సెంట్రీ రోబోలను ఉపయోగిస్తోంది. అధునాతన తుపాకులను అమర్చిన ఈ సెంట్రీ రోబోలు సైనిక స్థావరాల వద్ద గస్తీ తిరుగుతుంటాయి. శత్రువులను గుర్తించినట్లయితే, కాల్పులు జరుపుతాయి. యుద్ధరంగంలో రోబో సైనికులతో పాటు చాలా దేశాలు వేర్వేరు పనుల కోసం వేర్వేరు రోబోలను కూడా వాడుతున్నాయి.యుద్ధరంగంలో భావి సాంకేతికత..ఇప్పటికే పలు అధునాతన ఆయుధాలు, సైనిక పరికరాలు అగ్రరాజ్యాల అమ్ములపొదిలోకి చేరాయి. ఈ దేశాలు మరిన్ని అధునాతన ఆయుధాలు, వాహనాలు, సైనిక పరికరాల కోసం పరిశోధనలు సాగిస్తున్నాయి. రిస్ట్మౌంటెడ్ డిస్ప్లే సిస్టమ్, హెల్మెట్ మౌంటెడ్ రాడార్ సిస్టమ్ వంటి పరికరాల రూపకల్పన ఇప్పటికే తుదిదశకు చేరుకుంది. వీటి నమూనాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. రిస్ట్మౌంటెడ్ డిస్ప్లే సిస్టమ్ యుద్ధరంగంలో పనిచేసే సైనికులకు బాగా ఉపయోగపడుతుంది. సౌరశక్తితో పనిచేసే ఈ సిస్టమ్‌లోని మూడున్నర అంగుళాల స్క్రీన్‌పై చుట్టుపక్కల వివిధ దిశల్లో ఏం జరుగుతోందో, శత్రువుల కదలికలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చూడవచ్చు. హెల్మెట్ మౌంటెడ్ రాడార్ సిస్టమ్ 360 డిగ్రీలలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు స్క్రీన్‌పై ప్రసారం చేస్తుంది.ఇందులోని మూవింగ్ టార్గెట్ ఇండికేటర్ (ఎంటీఐ) రాడార్ సెన్సర్ దుమ్ము ధూళి పొగ దట్టంగా కమ్ముకున్న చోట కూడా శత్రులక్ష్యాలను 50 మీటర్ల దూరం నుంచి స్పష్టంగా చూపగలుగుతున్నాయి. పలు దేశాలు ఇప్పటికే హైపర్సోనిక్ మిసైల్స్‌ను వినియోగంలోకి తెచ్చాయి. అయితే, ధ్వనివేగానికి ఇరవైరెట్ల వేగంతో దూసుకుపోయే హైపర్సోనిక్ మిసైల్స్ తయారీకి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అణుబాంబులను మోసుకుపోగలిగే హైపర్సోనిక్ మిసైల్స్ 2040 నాటికి అందుబాటులోకి రాగలవని అంచనా. రష్యా, చైనా, అమెరికా సైన్యాలు ఈ స్థాయి హైపర్సోనిక్ మిసైల్స్ తయారీకి పోటాపోటీగా ప్రయోగాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే ఈ దేశాల సైనికబలగాలు హైపర్సోనిక్ యుద్ధవిమానాలను వాడుకలోకి తీసుకొచ్చాయి. సైనిక ప్రయోగాల కోసం, హైటెక్ ఆయుధాల తయారీ కోసం అమెరికా భారీ స్థాయిలో ఖర్చు చేస్తోంది. ఈ కార్యక్రమాల కోసం అమెరికా చేసే ఖర్చు 2040 నాటికి ట్రిలియన్ డాలర్లను (రూ.83.50 లక్షల కోట్లు) అధిగమిస్తుందని అమెరికన్ రక్షణరంగ నిపుణుడు పీటర్సన్ చెబుతున్నారు.రష్యా, చైనాలు కూడా హైపర్సోనిక్ మిసైల్స్ రూపకల్పనలో ప్రయోగాలు సాగిస్తున్నాయి. భారీస్థాయిలో విధ్వంసాలు సృష్టించగల అణుబాంబులను మోసుకుపోయి ఖండాంతర లక్ష్యాలను ఛేదించగల మిసైల్స్ తయారీకి ఈ దేశాలు ముమ్మర యత్నాలు చేస్తున్నాయి. వీటికి తోడు దుందుడుకు అధ్యక్షుడు కిమ్‌జాంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదకర ఆయుధాల తయారీకి ప్రయోగాలను సాగిస్తోంది. వివిధ దేశాలు డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ తయారీకి ప్రయోగాలు సాగిస్తున్నాయి. రైల్ గన్స్ వంటి డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ప్రభావవంతంగా పనిచేసే ఆయుధాలే అయినప్పటికీ, విద్యుత్తు సరఫరా ఉంటేనే ఇవి పనిచేయగలవు. యుద్ధక్షేత్రంలో విద్యుత్తు సరఫరా కోసం అత్యధిక సామర్థ్యం గల హైడెన్సిటీ మొబైల్ పవర్స్టోరేజ్ సిస్టమ్స్, మినీ న్యూక్లియర్ రియాక్టర్స్ వంటి వాటి తయారీకి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.కొనసాగుతున్న యుద్ధాలు..ఇప్పటికే ఉక్రెయిన్–రష్యాల మధ్య, ఇజ్రాయెల్– పాలస్తీనా, ఇజ్రాయెల్–లెబనాన్, సూడాన్‌లోని రెండు వర్గాల సైన్యం మధ్య యుద్ధాలు కొనసాగుతున్నాయి. వీటి వల్ల ఇప్పటికే చాలా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. ఈ యుద్ధాలను నిలువరించేందుకు ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ శక్తులు చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇతర దేశాలు బాహాటంగా వీటిలో ఏదో ఒక పక్షం తీసుకున్నట్లయితే, దాని పర్యవసానంగా మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం లేకపోలేదు.ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలే కాకుండా, ఇథియోపియా, హైతీ వంటి దేశాల్లోని అలజడులు, ఆసియా–పసిఫిక్ ప్రాంతంపై పట్టు కోసం అమెరికా–చైనాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో చెప్పడం కష్టం. ఈ పరిస్థితులు అదుపు తప్పి మూడో ప్రపంచ యుద్ధమే గనుక జరిగితే, జరగబోయే బీభత్సం ఊహాతీతంగా ఉంటుంది. ‘మూడో ప్రపంచయుద్ధంలో ఏ ఆయుధాలతో పోరు జరుగుతుందో నాకు తెలీదు గాని, నాలుగో ప్రపంచయుద్ధంలో మాత్రం మనుషులు కర్రలు, రాళ్లతోనే కొట్టుకుంటారు’ అని ఐన్‌స్టీన్ ఏనాడో అన్నాడు. మూడో ప్రపంచయుద్ధమే గనుక సంభవిస్తే, దాని దెబ్బకు భూమ్మీద నాగరికత తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. యుద్ధంలో మరణించిన వాళ్లు మరణించగా, అరకొరగా మిగిలిన వాళ్ల మధ్య గొడవలు తలెత్తితే, వాళ్ల పోరాటానికి ఆధునిక ఆయుధాలేవీ మిగిలి ఉండకపోవచ్చు. అప్పుడు ఐన్‌స్టీన్ మాటలే నిజం కూడా కావచ్చు.రోబో వాహనాలు..దేశాల సైనిక బలగాలు రకరకాల రోబో వాహనాలను వాడుతున్నాయి. డ్రైవర్ లేకుండానే ఇవి ప్రయాణించగలవు. రిమోట్ కంట్రోల్‌తో వీటిని సుదూరం నుంచి నియంత్రించవచ్చు. వీటిలో కొన్నింటికి ఆయుధాలను అమర్చి యుద్ధరంగానికి పంపే వెసులుబాటు ఉంది. వీటి ద్వారా శత్రుస్థావరాలను ఇట్టే మట్టుబెట్టవచ్చు. కొన్ని రకాల రోబో వాహనాలను శత్రువులు అమర్చిన మందుపాతరలను, బాంబులను నిర్వీర్యం చేయడానికి కూడా వాడుతున్నారు. రోబో వాహనాల్లో యుద్ధట్యాంకుల స్థాయి వాహనాల నుంచి బాంబులు, మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసే ఆటబొమ్మల్లా కనిపించే చిన్న చిన్న రోబో వాహనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, అమెరికన్ బలగాలు ఉపయోగిస్తున్న ‘గార్డ్బో’ అనే రోబో వాహనం చూడటానికి బంతిలా ఉంటుంది. ఇది ఉభయచర వాహనం. నేల మీద, నీటిలోను ఇది సునాయాసంగా ప్రయాణించగలదు.ఇది గస్తీకి, నిఘా పనులకు ఉపయోగపడుతుంది. అమెరికన్ బలగాలు వాడుతున్న ‘మాడ్యులర్ అడ్వాన్స్డ్ ఆర్మ్డ్ రోబోటిక్ సిస్టమ్’ (మార్స్) మనుషులు నడిపే యుద్ధట్యాంకులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దీనిని మనుషులు నేరుగా నడపాల్సిన పనిలేదు. రిమోట్ కంట్రోల్‌తో దీనిని సుదూరం నుంచి నియంత్రంవచ్చు. దీనికి అమర్చిన ఫిరంగులతో శత్రుస్థావరాలపై దాడులు జరపవచ్చు. బ్రిటిష్ సైన్యం ఉపయోగించే డ్రాగన్ రన్నర్ చూడటానికి చిన్న పిల్లల ఆటబొమ్మలా ఉన్నా, ఇది చాలా సమర్థమైన రోబో వాహనం. రిమోట్‌తో నడిచే ఈ వాహనం మందుపాతరలను, పేలని బాంబులను ముప్పయి అడుగుల దూరం నుంచి గుర్తించి, అప్రమత్తం చేస్తుంది. చైనా సైన్యం రోబో ఆర్మ్డ్ డాగ్‌ను ఇటీవల రంగంలోకి దించింది. ఇది చూడటానికి ఆటబొమ్మలా కనిపిస్తుంది గాని, దీనికి అమర్చిన ఆటోమేటిక్ గన్ ద్వారా కాల్పులు జరపగలదు. దీనిని రిమోట్ ద్వారా సుదూరం నుంచి ఉపయోగించుకోవచ్చు.మన అమ్ములపొదిలోనూ ఏఐ ఆయుధాలు..- రాజ్యాలకు పోటీగా భారత్ కూడా రోబోటిక్ ఆయుధాలను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది.హైదరాబాద్‌కు చెందిన ‘జెన్ టెక్నాలజీస్’ భారత సైన్యం కోసం ‘ప్రహస్త’ పేరుతో రోబో జాగిలాన్ని, ‘హాక్ ఐ’ పేరుతో పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను సైతం గుర్తించగలిగే యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను, ‘స్థిర్ స్టాబ్–640’ పేరుతో నేలపై తిరిగే యుద్ధ వాహనాలతో పాటు యుద్ధనౌకల నుంచి ఆయుధాలను గురి తప్పకుండా ఉపయోగపడే పరికరాన్ని, ‘బర్బరీక్’ పేరుతో అల్ట్రాలైట్ రిమోట్ కంట్రోల్ కంబాట్ వెపన్ స్టేషన్‌ను రూపొందించింది. వీటన్నింటినీ దూరం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించవచ్చు. శత్రువుల దాడులను తిప్పికొట్టడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి ఇవి సమర్థంగా ఉపయోగపడతాయి.చిల్లర కారణంతో జరిగిన యుద్ధానికి ఒక ఉదాహరణ ‘ద పిగ్ వార్’. ఇది ఒక పంది కోసం అమెరికన్లకు, బ్రిటిషర్లకు మధ్య జరిగిన యుద్ధం. ఇదెలా జరిగిందంటే– అమెరికా ప్రధాన భూభాగానికి, వాంకోవర్ దీవికి మధ్య శాన్ జువాన్ దీవి ఉంది. లైమాన్ కట్లర్ అనే అమెరికన్ రైతు తన పొలంలోకి ప్రవేశించిన పందిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ పంది బ్రిటిషర్ల అధీనంలోని హడ్సన్స్ బే కంపెనీకి చెందినది. ఈ సాదాసీదా సంఘటన శాన్ జువాన్ దీవిలో స్థిరపడ్డ అమెరికన్లకు, అక్కడ వలస వ్యాపారం సాగించే బ్రిటిషర్లకు మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం 1859లో ప్రారంభమై, 1872 వరకు కొనసాగింది. చరిత్రలో ఇలాంటి యుద్ధాలు మరికొన్ని కూడా జరిగాయి. సామరస్యంగా చర్చలతో పరిష్కరించుకోగలిగే చిన్నా చితకా కారణాల వల్ల తలెత్తిన యుద్ధాలు ప్రాణనష్టానికి, ఆస్తినష్టానికి దారితీశాయి.స్మార్ట్ ఆయుధాలు..‘స్మార్ట్’యుగం. స్మార్ట్ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వచ్చిన తరుణంలోనే వివిధ దేశాల సైనిక బలగాలు తమ ఆయుధాగారాల్లోకి స్మార్ట్ ఆయుధాలను కూడా చేర్చుకుంటున్నాయి. వీటిలో స్మార్ట్ గ్రనేడ్ లాంచర్లు, డిజిటల్ రివాల్వర్లు వంటివి ఉన్నాయి. అమెరికన్ సైన్యం దశాబ్దం కిందటే స్మార్ట్ గ్రనేడ్ లాంచర్‌ను వినియోగంలోకి తెచ్చింది. ‘ఎక్స్ఎం25 కౌంటర్ డిఫిలేడ్ టార్గెట్ ఎంగేజ్మెంట్ సిస్టమ్’ (సీడీటీఈ) గ్రనేడ్ లాంచర్‌ను అఫ్గాన్ యుద్ధంలో ఉపయోగించింది. దీని నుంచి ప్రయోగించిన గ్రనేడ్లు లక్ష్యం వైపుగా దూసుకుపోయి సరిగా లక్ష్యంపైన లేదా లక్ష్యానికి అత్యంత చేరువలో గాల్లోనే పేలుతాయి. ఇవి 150 మీటర్ల నుంచి 700 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించ గలవు. డిజిటల్ రివాల్వర్లను స్మార్ట్‌వాచ్ ద్వారా లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. ఆటబొమ్మల్లా కనిపించే ఈ డిజిటల్ రివాల్వర్లను పలు దేశాల సైనిక బలగాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నాయి. సైన్స్‌ఫిక్షన్ సినిమాల్లో కనిపించేలాంటి చిత్రవిచిత్రమైన ఆయుధాలు కూడా ప్రస్తుతం విరివిగా వాడుకలోకి వస్తున్నాయి. ఉదాహరణకు హాలీవుడ్ సినిమా ‘మైనారిటీ రిపోర్ట్’లో పోలీసు బలగాలు ‘సిక్ స్టిక్స్’ అనే ఆయుధాలు ఉపయోగించిన దృశ్యాలు ఉన్నాయి.‘సిక్ స్టిక్స్’ ఎవరిని తాకినా వారికి వెంటనే వాంతులవుతాయి. ఈ సినిమా 2002లో విడుదలైతే, 2007 నాటికల్లా దాదాపు ఇలాంటి ఆయు«ధాలే ‘వోమిట్ గన్స్’ వాడుకలోకి వచ్చేశాయి. ఇవి ప్రాణాంతకమైన ఆయుధాలు కాకున్నా, అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ఉపయోగపడతాయి. వీటి నుంచి వెలువడే రేడియో తరంగాలు లక్ష్యం దిశగా ప్రయాణించి, చెవులు గింగుర్లెత్తి, తలతిరిగేలా చేస్తాయి. వీటి బారి నుంచి క్షణాల్లోనే తప్పించుకోకుంటే, ఇవి వాంతులయ్యేలా చేస్తాయి. అమెరికన్ నావికాదళం కోసం ‘ఇన్వోకాన్’ కంపెనీ ఈ ‘వోమిట్ గన్స్’ను రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే టాక్టికల్ డ్రోన్స్, అన్‌మేన్డ్ ఏరియల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్‌క్రాఫ్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ప్లేన్స్, అటానమస్ ట్యాంక్స్, అటానమస్ వెపన్స్ వంటివి కూడా స్మార్ట్ ఆయుధాల కోవలోకే వస్తాయి. సంపన్న దేశాలు పోగేసుకుంటున్న ఇలాంటి ఆయుధాలు భారీస్థాయిలో విధ్వంసాలను సృష్టించగలవు. – పన్యాల జగన్నాథదాసు -
ఇరాన్ Vs ఇజ్రాయెల్.. యుద్ధం షురూ
-
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు
-
ఇరాన్-ఇజ్రాయెల్ దాడులు.. వీళ్ల వైరం ఏనాటిది!
పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్య, అందుకు దీటైన ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలు అగ్గి రాజేశాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దూకుడు చర్యలకు దిగితే అడ్డుకునేందుకు అమెరికా అదనపు యుద్ధ నౌకలు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, ఎఫ్–22 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. అయితే.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఈ నాటిది కాదు! దాదాపు అర్ధ శతాబ్దం క్రితమే ఈ రెండు దేశాల మధ్య వైరం మొదలైంది.పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియే (62) వైమానిక దాడిలో హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి టెహ్రాన్‌లో ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇరాన్ దీన్ని తన బల ప్రదర్శనకు వేదికగా మలచుకుంది. అందులో భాగంగా గాజాను వీడి 2019 నుంచీ ఖతార్‌లో ప్రవాసంలో గడుపుతున్న హనియే తదితర హమాస్ నేతలతో పాటు పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హెజ్బొల్లా, యెమన్‌కు చెందిన హౌతీ తదితర ఉగ్ర సంస్థల అగ్ర నేతలంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఇజ్రాయెల్‌కు మరణం’ అంటూ మూకుమ్మడిగా నినాదాలు చేశారు. కార్యక్రమం ముగిసి హనియే టెహ్రాన్‌లోని తన ఇంటికి చేరుకున్న కాసేపటికే వైమానిక దాడికి దిగింది. ఇల్లు దాదాపుగా ధ్వంసం కాగా హనియే, బాడీగార్డు చనిపోయారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది.హనియేను ఇజ్రాయెల్ వైమానిక దాడితో పొట్టన పెట్టుకుందని మండిపడింది. ఇజ్రాయెల్‌పై దీటుగా ప్రతీకార చర్యలుంటాయని స్పష్టం చేసింది. దాడిపై ఇరాన్ స్పష్టత ఇవ్వకున్నా ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్స్ దర్యాప్తు చేపట్టింది. ఇది ఇజ్రాయెల్ పనేనని అమెరికా కూడా అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ మాత్రం దీనిపై స్పందించలేదు. అయితే, ‘‘మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవ్ గలాంట్ ప్రకటించారు.గతేడాది అక్టోబరు 7న తన గడ్డపై హమాస్ నరమేధానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడం తెలిసిందే. హనియేతో పాటు హమాస్ అగ్ర నేతలందరినీ మట్టుబెట్టి తీరతామని ఆ సందర్భంగానే ప్రతిజ్ఞ చేసింది. హమాస్ నేతలు ఎక్కడున్నా వెంటాడి వేటాడాలంటూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్‌కు బాహాటంగానే అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 7 నాటి దాడిలో హనియేకు నేరుగా పాత్ర లేదు. పైగా హమాస్‌లో మితవాద నేతగా ఆయనకు పేరుంది. అయినా నాటి దాడికి ఆయన ఆశీస్సులూ ఉన్నాయని ఇజ్రాయెల్ నమ్ముతోంది.హనియే మృతికి ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. అది తమ పవిత్ర బాధ్యత అని స్పష్టం చేశారు. ‘‘మా ప్రియతమ అతిథిని మా నేలపైనే ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకుంది. తద్వారా తనకు తానే మరణశాసనం రాసుకుంది’’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందన తీవ్రంగానే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బుధవారం మధ్యా హ్నం ఖమేనీ నివాసంలో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరగడం దీన్ని బలపరుస్తోంది. తమపైకి వస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు.మరోవైపు.. హెజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్‌ను ఇజ్రాయెల్ హతమొందించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లో హెజ్బొల్లా ఇటీవలి రాకెట్ దాడులతో చిన్నారులతో పాటు మొత్తం 12 మంది ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. దానికి ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ రాకెట్ దాడులకు దిగింది. ఈ దాడుల నుంచి షుక్ర్ తప్పించుకున్నట్టు హెజ్బొ ల్లా చెప్పుకున్నా, అతను మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 1983లో బీరూట్‌లో అమెరికా సైనిక స్థావరంపై దాడులకు సంబంధించి షుక్ర్ ఆ దేశ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.హనియే హత్యపై ప్రకటన వెలువడగానే బుధవారం ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. చాలా అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి సమావేశం నిర్వహిస్తారు. తాజా పరిణామాలపై ఈ భేటీలో ఖమేనీ సమీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడులకు దిగాలని సైనికాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పడానికి ఇక ప్రత్యక్ష యుద్ధం తప్పదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇదిలా ఉండగా, పూర్తిస్థాయి యుద్ధానికి తాము సైతం సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం దౌత్యమార్గాల్లో ఇరాన్‌కు సందేశం చేరవేసినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ‘చానెల్ 12’ తెలియజేసింది. తమ దేశంపై ఇరాన్ గానీ, దాని మిత్రదేశాలు గానీ దాడులకు దిగితే పూర్తిస్థాయి యుద్ధం మొదలైనట్లేనని ఇజ్రాయెల్ తేలి్చచెప్పినట్లు వివరించింది. ఇస్మాయిల్ హనియేను హత్య చేసింది ముమ్మటికీ ఇజ్రాయెల్ సైన్యమేనని ఇరాన్, హమాస్ ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా నోరువిప్పలేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తాజాగా స్పందించారు. తమ దేశం వైపు కన్నెత్తి చూస్తే శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తమకు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని భావిస్తున్నామని ‘అసోసియేటెడ్ ప్రెస్’తో మాట్లాడుతూ చెప్పారు.హమాస్ మిలటరీ విభాగం ‘ఖస్సం బ్రిగేడ్స్’ అధి నేత మొహమ్మద్ దీఫ్‌ను ఖతం చేశామని ఇజ్రాయెల్ సైన్యం గురువారం ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. జూలై 13న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ సిటీ శివారులో ఓ కాంపౌండ్‌పై నిర్వహించిన వైమానిక దాడులో అతడు హతమయ్యాడని వెల్లడించింది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను హత్య చేసిన మరుసటి రోజే మొహమ్మద్ దీఫ్ మృతిని ఇజ్రాయెల్ నిర్ధారించడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం!గతంలో అమెరికాతో జతకట్టిన పహ్లావీ రాజవంశం 1979లో ఇరాన్ విప్లవంతో అధికార పీఠాన్ని కోల్పోయింది. అనంతరం ఇరాన్ పాలనా పగ్గాలను చేపట్టిన అయతుల్లా ఖమేనీ వర్గం అమెరికా పట్ల దేశ వైఖరిని మార్చేసింది. 1979లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారిపోయింది. దాంతో ఇజ్రాయెల్, అమెరికాలు ఆ దేశానికి దూరం అయ్యాయి. సామ్రాజ్యవాదాన్నే తాము సపోర్ట్ చేస్తామంటూ ఇరాన్‌ను వ్యతిరేకించడం మొదలు పెట్టాయి. అమెరికాను ‘మహా సాతాను’గా, ఇరాన్ చివరి చక్రవర్తి మొహమ్మద్ రెజా పహ్లావీకి మద్దతు తెలుపుతున్న ఇజ్రాయెల్‌ను ‘చిన్న సాతాను’గా అభివర్ణించింది. నాటి నుంచి టెహ్రాన్-టెల్ అవీవ్ మధ్య శత్రుత్వం క్రమంగా పెరగడంతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నదని ఖమేనీ ఆరోపించారు.ఇజ్రాయెల్ పౌరుల పాస్‌పోర్టులను గుర్తించడం మానేసింది. టెహ్రాన్‌లోని ఇజ్రాయెలీ దౌత్య కార్యాలయాన్ని సీజ్ చేసి, దానిని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటుకు పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ)కు అప్పగించింది. 1990 వరకు కూడా ఇజ్రాయెల్‌కు ఇరాన్ మీద శ్రతుత్వం లేదు. కానీ కాలక్రమంలో ఇరాన్‌ను తన మనుగడకు ప్రమాదకారిగా ఇజ్రాయెల్ భావించడం మొదలుపెట్టింది. దీంతో వీరి మధ్య వైరం మాటల నుంచి చేతల దాకా వెళ్ళింది. ఇరాన్లో షియాలు మెజార్టీ కాగా, మిగిలిన అరబ్ దేశాలలో సున్నీలదే ఆధిపత్యం. దీంతో తాను ఏకాకిననే సత్యాన్ని ఇరాన్ ప్రభుత్వం గ్రహించింది. దీంతో ఏదో ఒకరోజు తన సొంత ప్రాంతంలోనే తన పై దాడి జరగవచ్చనే ఉద్దేశంతో ఇరాన్ హిజ్బుల్లాను పుట్టించింది.ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధాన్ని ‘షాడో వార్’ గా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో పరస్పరం దాడులకు దిగినప్పటికీ ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. ఈ షాడో వార్‌కు లెబనాన్, సిరియా యుద్ధవేదికలుగా ఆవిర్భవించాయి. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న హెజ్బొల్లా గ్రూపునకు ఇరాన్ అండగా నిలిచింది. మరోవైపు సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగడంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు కూడా ఇరాన్ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో 1967 యుద్ధం తర్వాత సిరియాలోని గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. నాటి నుంచి సిరియా, లెబనాన్‌పై దాడులు జరిపేందుకు గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఉపయోగించుకుంటుంది.1992లో ఇరాన్‌కు సంబంధించిన ఇస్లామిక్ జిహాదీ గ్రూపు బ్యూనస్ ఎయిర్స్‌లోని ఇజ్రాయెలీ ఎంబసీని పేల్చివేసి, 29మంది మృతికి కారణమైంది. దానికి కొన్నిరోజుల ముందే హిజ్బొల్లా నేత అబ్బాస్ అల్ ముసావి హత్యకు గురయ్యారు. ఈ హత్య ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌కు ఆపాదించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండేది. ఇరాన్ వద్ద అణుశక్తి ఉండకూడదనేది ఇజ్రాయెల్ కోరిక. ప్రజా అవసరాల కోసమే తాము అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనే ఇరాన్ మాటలను ఇజ్రాయెల్ నమ్మకపోవడం గమనార్హం. ఈక్రమంలో 2000 సంవత్సరంలో ఇరాన్ అణు సంపద మీద దాడి చేసింది ఇజ్రాయెల్. న్యూక్లియర్ ప్రాజెక్ట్ లో భాగస్వాములైన కీలక సైంటిస్టులపై దాడులకు ఇజ్రాయెలీ ఇంటలిజెన్స్‌దే బాధ్యత అని టెహ్రాన్ నిరసన వ్యక్తం చేసింది. 2020లో ఇరాన్ శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదెహ్ హత్యకు గురవడానికి కూడా ఇజ్రాయెలే కారణమని ఇరాన్ నమ్ముతోంది. మరోవైపు తమ ప్రాంతాల్లో రాకెట్, డ్రోన్ల దాడులకు కారణం ఇరానేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దాంతో పాటూ ఇజ్రాయెల్ సరిహద్దు దేశమైన సిరియాలో 2011లో మొదలైన అంతర్యుద్ధం కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలకు మరో కారణంగా నిలిచింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న షాడో వార్ 2021లో సముద్రంపైకి కూడా చేరింది. ఆ ఏడాది గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో తమ నౌకలపై జరిగిన దాడికి ఇరానే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించగా, ఎర్రసముద్రంలో తమ నౌకలపై దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది.గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన భీకర దాడుల్లో తమ పాత్ర లేదని ఇరాన్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ దాడిని స్వాగతించింది. మరోవైపు హమాస్‌కు మద్దతుగా లెబనాన్ నుంచి హెజ్బొల్లా దళాలు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 1న ఇజ్రాయెల్‌కు చెందినవిగా అనుమానిస్తున్న కొన్ని యుద్ధ విమానాలు సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేశాయి. ఈ దాడిలో సీనియర్ కమాండర్లు సహా ఏడుగురు అధిదారులు మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపిన విషయం తెలిసిందే. -
విస్తరిస్తున్న యుద్ధమేఘాలు
ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య యుద్ధం ఆగి, గాజా ప్రాంతంలో శాంతి నెలకొంటుందని నిన్నటి దాకా ఉన్న కొద్దిపాటి ఆశ ఇప్పుడు ఆవిరైపోయినట్టు అనిపిస్తోంది. హమాస్ సీనియర్ నేత ఇస్మాయిల్ హనియేను ఇరాన్ రాజధాని టెహరాన్‌లో బుధవారం గుట్టుచప్పుడు కాకుండా చంపిన తీరు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హనియేను చంపింది తామేనని ఇజ్రాయెల్ ప్రకటించలేదు కానీ, ఆయన చనిపోవాలని ఇజ్రాయెలీల కన్నా ఎక్కువగా మరెవరూ కోరుకోరన్నది నిజం. మరోపక్క ఆ హత్యకు కొద్ది గంటల ముందే మంగళవారం లెబనాన్ రాజధాని బీరుట్లో ఇరాన్‌కు మిత్రపక్షమైన హెజ్బొల్లా తీవ్రవాద గ్రూపు సీనియర్ మిలటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ ప్రాణాలు గాలిలో కలిశాయి. గత వారం (ఆక్రమిత) గోలన్ హైట్స్‌లో రాకెట్ దాడితో 12 మంది పిల్లల్ని పొట్టనబెట్టుకున్న ఆయనను మాత్రం అడ్డు తొలగించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అలా ఆ దేశ శత్రువులకు రెండు రోజుల్లో రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఇజ్రాయెల్ ఒప్పుదల మాటెలా ఉన్నా... ఇరాన్ నూతన అధ్యక్షుడి పదవీ స్వీకారోత్సవానికి హనియే వచ్చివుండగా జరిగిన ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధినాయకుడు అయతొల్లా ఖొమేనీ గర్జించారు. ప్రతిగా ఎవరు రెచ్చగొట్టే చర్యలకు దిగినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ హెచ్చరించారు. వెరసి, వ్యవహారం ఇజ్రాయెల్ – ఇరాన్‌ల మధ్య నేరు ఘర్షణకు దారి తీస్తోంది. మొత్తం గాజా కథ మరో ప్రమాదకరమైన మలుపు తిరిగింది.అసలే సంక్లిష్టంగా ఉన్న పశ్చిమాసియా సంక్షోభం కాస్తా హనియే హత్యోదంతంతో మరింత సంక్లిష్టంగా మారింది. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధానికి పరిష్కారం కనుగొనాలని చేస్తున్న శాంతి ప్రయత్నాలకు తాజా ఘటన విఘాతం కల్పించింది. ఇరుపక్షాల మధ్య రాజీ కుదర్చడానికి చర్చలు జరుగుతున్నప్పుడు... ఒక పక్షం వాళ్ళు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తినే చంపేస్తే ఇక మధ్యవర్తి త్వం ఏం సఫలమవుతుంది? రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తున్న ఖతార్ పక్షాన ఆ దేశ ప్రధాని సరిగ్గా ఆ మాటే అన్నారు. ఆ మాటలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. హనియేపై యుద్ధ నేరాలున్న మాట, అతనిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఇటీవలే వారెంట్ జారీ చేసిన మాట నిజమే. కానీ, హమాస్ గ్రూపులో మిలటరీ నేత యాహ్యా సిన్వర్ సహా ఇతర పిడివాదులతో పోలిస్తే రాజీ చర్చల విషయంలో రాజకీయ విభాగ నేత హనియే కొంతవరకు ఆచరణవాది అంటారు. ఇప్పుడు ఆయనే హత్యకు గురయ్యాడు గనక కథ మొదటికి వచ్చింది. కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందం కుదిరినంత మాత్రాన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లబడతాయని గ్యారెంటీ లేదు కానీ, అసలు ఒప్పందమే లేకపోతే ఉద్రిక్తతలు తగ్గే అవకాశమే లేదు. మొత్తంగా ఈ ఘటన ఆ ప్రాంత సుస్థిరతనే దెబ్బ తీస్తూ, గాజా యుద్ధాన్ని చివరకు పెను ప్రాంతీయ ఘర్షణ స్థాయికి తీసుకెళుతోంది. అతిథిగా వచ్చిన మిత్రపక్షీయుణ్ణి భద్రత ఎక్కువగా ఉండే సమయంలోనే సొంతగడ్డపై, స్వకీయ గూఢచర్య వైఫల్యంతో పోగొట్టుకోవడం ఇరాన్‌కు తీరని తలవంపులే. ఖొమేనీ గర్జించినట్టు ఇరాన్ దీనికి బదులు తీర్చుకోవచ్చు. అదే జరిగితే ఇజ్రాయెల్ ప్రతిచర్యా తప్పదు. నిజానికి, ఆ మధ్య ఏప్రి ల్లో డెమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీలో తమ జనరల్స్ ఇద్దరిని హత్య చేసినప్పుడు ఇరాన్ తొలి సారిగా నేరుగా ఇజ్రాయెల్‌పై సైనిక దాడి జరిపింది. వందలాది క్షిపణులు ప్రయోగించింది. అదృష్టవశాత్తూ అప్పట్లో అది పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంగా పరిణమించలేదు. ప్రతిసారీ అలా ఆగుతుందనుకోలేం.తాజా ఘటనలతో యెమెన్ నుంచి హౌతీలు ఎర్రసముద్రంలో దాడులు ఇబ్బడి ముబ్బడి చేస్తారు. హెజ్బొల్లా సైతం ఇజ్రాయెల్‌ను చూస్తూ ఊరుకోదు. అసలు నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూపు చేసిన దుర్మార్గమైన దాడి ఇక్కడికి తెచ్చింది. అప్పటి నుంచి మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధం తప్పదనే భయాందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి. చిత్రం ఏమిటంటే, ఏ పక్షమూ ఆ రకమైన యుద్ధం కోరుకోవడం లేదు కానీ, తమ చర్యలతో ఎప్పటి కప్పుడు కయ్యానికి కాలుదువ్వుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ యుద్ధం తీవ్రతరమయ్యే ముప్పు తప్పాలంటే ముందు గాజాలో కాల్పుల విరమణ జరగాలి.అయితే, వరస చూస్తుంటే హమాస్‌పై పూర్తి విజయమే లక్ష్యమన్న నెతన్యాహూ మాటలనే ఇజ్రాయెల్ ఆచరిస్తోందని అనిపిస్తోంది. పది నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఒక్క గాజాలోనే ఇప్పటికి 40 వేల మంది చనిపోయారు. ఇలాగే ముందుకు సాగితే యుద్ధం ఇతర ప్రాంతాలకూ విస్తరించి, మరింత ప్రాణనష్టం తప్పదు. మానవీయ సంక్షోభమూ ఆగదు. హనియే హత్యతో హమాస్ తల లేని మొండెమైంది. పగ తీర్చుకోవాలన్న ఇజ్రాయెల్ పంతం నెరవేరింది. ఇకనైనా ఆ దేశం ప్రతీకార మార్గం వీడి, రాజీ బాటను అనుసరించాలి. శాంతికి కట్టుబడ్డ మన దేశానికి సైతం ఆ ప్రాంతంలో యుద్ధంతో భారీ నష్టమే. అక్కడ 89 లక్షల మంది మన వలస కార్మికులున్నారు. పైగా, శాంతి, సుస్థిరత లేకుంటే నిరుడు ఢిల్లీ జీ–20 సదస్సులో ప్రకటించిన ‘ఇండియా– మిడిల్ ఈస్ట్ – యూరప్ ఎకనామిక్ కారిడార్’ (ఐఎంఈసీ) లాంటివి పట్టాలెక్కవు. ఇజ్రాయెల్, పాలెస్తీనాలు రెంటికీ మిత్రదేశంగా ఇరుపక్షాలనూ తిరిగి రాజీ చర్చలకు కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాలి. అధ్యక్ష ఎన్నికలతో తీరిక లేని అమెరికా సహా ఇతర దేశాలన్నీ ఒత్తిడి తెచ్చి అయినా సరే రెండువైపులవారినీ అందుకు ఒప్పించాలి. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు చిత్తశుద్ధితో నడుం బిగించాలి. ఎందుకంటే, ఏ యుద్ధంలోనూ విజేతలుండరు. ప్రతిసారీ ప్రజలు పరాజితులుగానే మిగులుతారు. -
రాజీ మార్గంలో జెలెన్స్కీ
షరతులన్నింటికీ రష్యా అంగీకరిస్తే తప్ప చర్చల ప్రసక్తి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాదిస్తూ వచ్చారు. స్విట్జర్లాండ్ శాంతి సమావేశాలకు రష్యాను ఆహ్వానించలేదు. అలాంటిది రష్యాతో చర్చలు అవసరం కావచ్చునని అన్నారు. అంతేనా? నవంబరులో నిర్వహించనున్న శాంతి శిఖరాగ్ర సమావేశానికి ప్రతినిధులను పంపవలసిందిగా రష్యాను కోరారు. ఆ రాయబారం కోసమే తన విదేశాంగ మంత్రిని చైనా పంపారు. ఇంతకూ జెలెన్స్కీ ఎందుకు చర్చలంటున్నారు? యుద్ధంలో రష్యాది పైచేయి అవుతోంది. ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. పాశ్చాత్య దేశాలు పైకి ఏమన్నా, అంతర్గతంగా విముఖత పెరుగుతోంది. ఈ తరహా సహాయాలకు వ్యతిరేకి అయిన ట్రంప్ అధికారానికి రావచ్చుననే అంచనాలు మరో కారణం.ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ రష్యాతో రాజీ మార్గం వైపు మళ్లుతున్నారనే మాట ఆశ్చర్యంగా తోస్తుంది. రెండున్నరేళ్లు రాజీలేని యుద్ధం చేసిన ఆయన నిజంగానే ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 20న తమ దేశ ప్రజలను ఉద్దేశించి, రష్యాతో చర్చలు అవసరమని సూచించటం. తాను వచ్చే నవంబరులో నిర్వహించనున్న శాంతి శిఖరాగ్ర సమావేశానికి ప్రతినిధులను పంపవలసిందిగా రష్యాను కోరటం. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఈ నెల 24 నుంచి నాలుగు రోజుల పర్యటన కోసం చైనా వెళ్లి, వారి విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమై, చర్చల కోసం రష్యాను ఒప్పించవలసిందిగా కోరటం.తమ షరతులన్నింటికి రష్యా అంగీకరిస్తే తప్ప చర్చల ప్రసక్తి లేదని జెలెన్స్కీ వాదిస్తూ వచ్చారు. షరతులు తాము విధిస్తాముగానీ, రష్యా ఎటువంటి షరతులు పెట్టరాదన్నారు. యుద్ధం మొదలైన కొత్తలో ఒకసారి జరిగిన చర్చలు రెండు వైపుల నుంచి ఇటువంటి వైఖరులు వల్లనే విఫలమయ్యాయి. ఆ తర్వాత రష్యాపై దౌత్య పరమైన ఒత్తిళ్ల కోసం ఉక్రెయిన్ అనేక ప్రయత్నాయి చేసింది. అమె రికా, యూరోపియన్ యూనియన్ల ద్వారా అనేక ఆర్థిక ఆంక్షలు విధింపజేశారు. యుద్ధానికి అమెరికా కూటమి ఆయుధ సరఫరాలు, ఆర్థిక సహాయాలు సరేసరి. జూన్ 15–16 తేదీలలో వాషింగ్టన్లో జరిగిన నాటో కూటమి 75 సంవత్సరాల ఉత్సవాలలో ఉక్రెయిన్‌కు తిరుగు లేని మద్దతు ప్రకటించింది. జెలెన్స్కీని అతిథిగా ఆహ్వానించి ప్రసంగింపజేసింది. ఆ తర్వాత జూలై 9న స్విట్జర్లాండ్‌లో జెలెన్స్కీ సుమారు 90 దేశాలతో శాంతి సమావేశాలు నిర్వహించి అక్కడ కూడా రాజీ లేకుండా మాట్లాడారు. అటువంటిది కేవలం 10 రోజులు గడిచేసరికి, రష్యాతో చర్చలు అవసరం కావచ్చునని అన్నారు. మరొక విశేషం ఏమంటే, తను స్వయంగా నిర్వహించిన స్విట్జర్లాండ్ శాంతి సమావేశాలకు రష్యాను అసలు ఆహ్వానించలేదు. ఆ విషయమై ప్రశ్నించిన వారిని అందువల్ల ఉపయోగమేమిటని ఎదురు ప్రశ్నించారు. సరిగా ఆ రోజులలో రష్యా పర్యటనకు వెళ్లి భారత ప్రధాని మోదీని, ఒక రక్త పిపాసిని ఆలింగనం చేసుకున్నారంటూ తీవ్రంగా ఆక్షేపించారు. మోదీని ఢిల్లీలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కూడా విమర్శించారు. తీరా జరిగిందేమిటి? రష్యాను ఆహ్వానించకపోవటం వల్ల ప్రయోజనం ఉండదంటూ చైనా కూడా పాల్గొనలేదు. పాల్గొన్న దేశాలలో ముఖ్యమైనవి అనేకం ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేయలేదు. ఆ విధంగా అ సమావేశం ఒక నిష్ఫలయత్నంగా మిగిలింది.ఇంత జరిగినాక ఇంతలోనే జెలెన్స్కీ రష్యాతో చర్చలని అంటూ, రష్యాను ఈసారి చర్చలకు రావలసిందిగా మౌఖికంగా అహ్వానిస్తు న్నారు. ఆ పని రానున్న రోజులలో లిఖిత పూర్వకంగా చేయగలరని భావించవచ్చు. అయితే, అందుకు మొదటి అడుగు నవంబర్ విస్తృత సమావేశాలలో రష్యా పాల్గొనటం అయితే, అంతా సజావుగా సాగిన పక్షంలో ఇరువురి మధ్య ముఖాముఖి చర్చలు రెండవ అడుగు అవుతాయి. ఈ రెండింటికి సన్నాహక ప్రయత్నాల సమయంలో ఇరువురూ ఏవైనా షరతులు ముందస్తుగానే పెడతారా? షరతులుఉంటే ఏమిటవి? అనేవన్నీ చిక్కుముడులు. ఈ రాజీ ప్రయత్నాల పట్ల అమెరికా కూటమి వైఖరి ఏమి కావచ్చుననేది అంతకన్న కీలకమైన ప్రశ్న. ఎందుకంటే, రష్యాను ఏ విధంగానైనా లొంగతీయాలన్నది ఉక్రెయిన్ యుద్ధంలోని అమెరికా పరమోద్దేశం. అందుకే నాటోను రష్యా సరిహద్దులకు విస్తరిస్తున్నందున, రాజీ మార్గాన్ని వారు సమ్మతి స్తారా అనే విషయమై చాలామందికి సందే హాలుంటాయి.ఇదిట్లుండగా, రష్యాతో చర్చలు అవసరమంటూ జెలెన్స్కీ చేసిన ప్రసంగానికి గానీ, ఆయన విదేశాంగమంత్రి కులేబా చైనా వెళ్లి వాంగ్ యీతో ప్రతిపాదించినడానికి గానీ, ఈ వ్యాసం రాసే సమయానికి రష్యా నుంచి ఇంకా ఎటువంటి స్పందనా లేదు. చైనా నుంచి కూడా! వారినుంచి రాగల రోజులలో కనిపించే స్పందనలను బట్టి, మును ముందు ఏమి జరగవచ్చుననే దానిపై కొంత సూచన లభిస్తుంది. చైనా వెళ్లిన కులేబా ఇంతకూ అన్నదేమిటి? వాంగ్‌తో సమావేశం తర్వాత మాట్లాడుతూ, ‘‘నిజాయితీగా, సమస్య పరిష్కారానికి దోహదంగా వ్యవహరించే ఉద్దేశం రష్యాకు ఉన్నట్లయితే చర్చలకు తాము సిద్ధమ’’న్నారు. రష్యా నుంచి అటువంటి సంసిద్ధత ఇంతవరకు కన్పించలేదని కూడా అన్నారు.ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత, సమస్య పరిష్కారానికి ప్రయత్నించవలసిందిగా జెలెన్స్కీ ఒకటిరెండుసార్లు చైనాను బహిరంగంగా కోరారు. కానీ ఆయన విదేశాంగ మంత్రి స్వయంగా వెళ్లటం ఇది మొదటిసారి. చైనా స్వయంగా చొరవ తీసుకుని 12 సూత్రాల పథకం ఒకటి నిరుడు ప్రతిపాదించింది. అది ఉభయులు ఎట్లా యుద్ధ విరమణ చేసి చర్చలు ఆరంభించాలనే దానిపైనే తప్ప, అసలు సమస్య పరిష్కారం గురించి కాదు. తమ భూభాగాల నుంచి రష్యా ఉపసంహరించుకోవాలనే మాట అందులో లేదంటూ ఉక్రెయిన్ అందుకు తిరస్కరించింది. పరిష్కార చర్చలు ఉభయుల మధ్య జరగాలి తప్ప బయటి జోక్యం ఉండరాదన్నది చైనా వైఖరి. చర్చలకు తామెప్పుడూ కాదనలేదని, కాని కొన్ని షరతులు తప్పవన్నది రష్యా వాదన. నిజానికి రష్యా, ఉక్రెయిన్ రెండు వైపుల నుంచి మొదటి నుంచి కొన్ని గట్టి షరతులే ఉన్నాయి. అమెరికా, నాటోలు తమను చుట్టు ముట్టేందుకు నాటోను విస్తరిస్తూ, ఉక్రెయిన్ను రెచ్చగొడుతున్నాయనీ, అ దేశాన్ని నాటోలో చేర్చుకొనజూస్తున్నాయనీ, కనుక తమ అత్మరక్షణ కోసం ఉక్రెయిన్ను నాటోకు బయట ఉంచాలన్నది రష్యా మొదటి షరతు. తమ నౌకలు చలికాలంలో ప్రయాణించేందుకు వీలయ్యే ఏకైక సముద్ర మార్గం బ్లాక్ సీ అయినందున ఆ మార్గం భద్రంగా ఉండేందుకు అక్కడి క్రిమియా ద్వీపం తమ అధీనంలో ఉండాలనేది రెండవ షరతు.ఉక్రెయిన్ తూర్పున రష్యా సరిహద్దులో గల డొనెటెస్క్, లూహానస్క్, ఖేర్సాన్, జపోరిజిజియా ప్రాంతాలలో రష్యన్ భాషా సంస్కృతుల వారు పెద్ద మెజారిటీ అయినందున తీవ్ర వివక్షలను ఎదుర్కొంటున్నారని, కనుక ఇప్పటికే పాక్షికంగా తమ ఆక్రమణలో గల ఈ ప్రాంతాలను పూర్తిగా తమకు బదిలీ చేయాలన్నది మూడవ షరతు. ఉక్రెయిన్ వీటన్నింటిని తిరస్కరించటమేగాక, తమ ఆక్రమిత ప్రాంతాలన్నీ తమ స్వాధీనం చేయాలనీ, తాము నాటోలో కూడా చేరగలమనీ షరతులు పెడుతున్నది. రెండు వైపుల నుంచి ఇవన్నీ చాలా చిక్కు షరతులే. ఇంతకూ జెలెన్స్కీ ఇప్పుడు అకస్మాత్తుగా చర్చలు, రాజీలంటూ మాట్లాడటం ఎందువల్ల? క్లుప్తంగా చెప్పాలంటే, యుద్ధంలో రష్యాది పైచేయి అవుతున్నది. పాశ్చాత్య దేశాలు ఎన్ని ఆయుధాలు, ఎంత ఆధునికమైనవి సరఫరా చేసినా చాలటం లేదు. అందులోనూ ఒక పరిమితిని మించితే అది నేరుగా రష్యాతో యుద్ధంగా మారవచ్చునని అమెరికా సందేహిస్తున్నది. ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితులు బాగా క్షీణించటమే గాక, సైనికులు పెద్దఎత్తున చనిపోతూ కొత్త రిక్రూట్మెంట్లు తగ్గుతున్నాయి. ఉక్రెయిన్‌కు అంతులేని సహాయాలు, అయినా ఉపయోగం లేకపోవడంతో అమెరికా సహా పాశ్చాత్య దేశాలు పైకి ఏమన్నా, అంతర్గతంగా విముఖత పెరుగుతున్నది. ఈ తరహా యుద్ధాలకు, సహాయాలకు బహిరంగ వ్యతిరేకి అయిన ట్రంప్ ఈసారి అధికారానికి రావచ్చుననే అంచనాలు కొత్త భయాలను కలిగిస్తు న్నాయి. ప్రపంచ దేశాలలో మద్దతు తగ్గుతున్నది. స్వయంగా జెలెన్స్కీ పట్ల అక్కడి సైన్యంలో, ప్రజలలో నిరసనలు పెరుగు తున్నాయి. ఈ పరిణామాలన్నింటి ఒత్తిడి వల్లనే, ఇక చర్చలు మినహా మార్గం లేదని ఆయన భావిస్తుంటే ఆశ్చర్యమక్కరలేదు. - వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- టంకశాల అశోక్ -
లెబనాన్‌లో యుద్ధమేఘాలు.. పౌరులకు భారత్ అడ్వైజరీ
న్యూఢిల్లీ: గాజాకు పరిమితమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తాజాగా లెబనాన్‌కూ పాకే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇజ్రాయెల్‌పై లెబనాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా దాడి చేయడమే ఇందుకు కారణం. హెజ్బొల్లా దాడికి ప్రతిగా లెబనాన్‌పై ఏ క్షణమైనా ఇజ్రాయెల్ దాడి చేయవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. లెబనాన్‌లోని బీరుట్ ఎయిర్‌పోర్టుకు విమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో లెబనాన్‌లోని భారత రాయబారకార్యాలయం అప్రమత్తమైంది. లెబనాన్‌లో ఉంటున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని బీరుట్‌లోని తమ కార్యాలయంతో టచ్‌లో ఉండాలని తాజా అడ్వైజరీ జారీ చేసింది. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే వాతావరణం ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌లోని మజదల్ షమ్స్‌పై హెజ్బొల్లా దాడి చేసింది. ఈ దాడిలో ఓ 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఇజ్రాయెల్ ఆగ్రహానికి కారణమైంది. ప్రతిగా ఇజ్రాయెల్ లెబనాన్‌పై సోమవారం(జులై 29) డ్రోన్లతో దాడి మొదలుపెట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. -
విజ్ఞత మరిచిన నాటో!
వ్యక్తిగా ఒక్కరు తీసుకునే నిర్ణయం కంటే సమష్టి నిర్ణయమే ఎప్పుడూ సరైందని పెద్దలు చెబుతారు. కానీ వాషింగ్టన్లో మూడు రోజులపాటు జరిగిన నాటో 75 ఏళ్ల వార్షికోత్సవాల్లో దేశాధినేతలు మాట్లాడిన తీరు చూసినా, చివరిలో ప్రకటించిన డిక్లరేషన్ గమనించినా పరిణతికన్నా పరమ మూర్ఖత్వమే కనబడుతుంది. మూడో ప్రపంచ యుద్ధం దిశగా ప్రపంచ దేశాలను కదిలించే ప్రయత్నం దర్శనమిస్తుంది. రష్యా దురాక్రమణపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు వచ్చే ఏడాదిలోగా సైనిక సాయం రూపంలో కనీసం 4,000 కోట్ల యూరోలు అందజేయాలని నాటో సంకల్పించింది. అంటే రెండున్నరేళ్లుగా వేలాదిమంది మరణాలకూ, కోట్లాది డాలర్ల ఆస్తుల విధ్వంసానికీ కారణమైన ఆ యుద్ధాన్ని మరింత ఎగదోస్తూ పోతారన్నమాట! ఇంకా విడ్డూరమేమంటే నెదర్లాండ్స్ భూభాగంలో ఎఫ్–16 యుద్ధ విమానాలను మోహరించి రష్యాపై దాడులకు ఉక్రెయిన్ను పురిగొల్పుతారు. అంతేకాదు... ఎన్నడూ లేనివిధంగా తొలిసారి చైనాపై నాటో నిప్పులు చెరిగింది. దురాక్రమణ యుద్ధం కొనసాగించేందుకు రష్యాకు దన్నూ, ధైర్యమూ ఇస్తున్నది చైనాయేనని డిక్లరేషన్ ఆరోపించింది. నాటో ఎప్పుడూ చైనా జోలికి పోలేదు. అయిదేళ్లుగా చైనా వ్యవహారశైలిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. అది కూడా చాలా మర్యాదైన, మృదువైన పదాలతోనే! ఇప్పుడేమైంది? నాటో కొత్త రాగం వెనకున్న కారణమేమిటి?నిజానికి నాటో సదస్సులో ఈసారి జో బైడెన్ ఆరోగ్యం, ఉక్రెయిన్ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ ప్రస్తావనకొస్తాయని అందరూ ఆశించారు. అమెరికా అధ్యక్ష పదవి రేసులో బైడెన్ ఆరోగ్యం ప్రధాన అంశంగా మారింది. ఆయన కొనసాగితే ఓటమి ఖాయమని డెమాక్రాట్లు నిర్ణయానికొచ్చారు. సర్వేలు సైతం రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ బలపడుతున్న వైనాన్ని ఏకరువు పెడుతున్నాయి. అందుకే నాటో స్వరం మారిందని విశ్లేషకుల ఆరోపణ. ట్రంప్ వస్తే నాటో ఉనికే ప్రశ్నార్థకం కావటం ఖాయం. ఉక్రెయిన్ భవిష్యత్తు అనిశ్చితం. గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ వల్ల ఇంతవరకూ 1,86,000 మంది పౌరులు మరణించారని లాన్సెట్ నివేదిక అంచనా. ఈ నేపథ్యంలో ఆ యుద్ధాన్ని నివారించటంపై నాటో దృష్టి పెడుతుందని అందరూ అంచనా వేయగా, తీరా దాని గురి చైనా వైపు మళ్లింది! మరోపక్క భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ... ఘర్షణల సమయంలో ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ ఉండదంటూ పరోక్షంగా మనల్ని హెచ్చరించారు. ‘అవసర సమయాల్లో’ భారత్, అమెరికాలు సమష్టిగా పనిచేయాల్సి వుంటుందని చెప్పారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై లోపాయికారీగా మన అధికారుల వద్ద అమెరికా అసంతృప్తి వ్యక్తంచేసినట్టు కథనాలొచ్చాయి. గార్సెటీ దాన్నే బహిరంగంగా చెప్పారు. రెండేళ్లక్రితం తాను చెప్పిందేమిటో అమెరికాకు గుర్తుందా? ఉక్రెయిన్‌కు చేయూతగా పోలాండ్ నుంచి మిగ్–29 యుద్ధ విమానాలను రంగంలోకి దించటానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తామని 2022 మార్చిలో అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్ చేసిన ప్రకటనను అమెరికా రక్షణ శాఖ తప్పుబట్టింది. ఇందువల్ల రష్యా తీవ్రంగా ప్రతిస్పందించే ప్రమాదం వుంటుందని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ హెచ్చరించారు. ఆ సమయంలోనే జో బైడెన్ సైతం ఉక్రెయిన్ గగనతలంపై నాటో నో ఫ్లైజోన్ విధించాలన్న ప్రతిపాదనను కొట్టిపడేశారు. దాన్ని అమలు చేయటానికి నాటో నేరుగా యుద్ధరంగంలోకి దిగాల్సివస్తుందని చెప్పారు. మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభించాలని అమెరికా భావించటం లేదని అన్నారు. ఆఖరికి నాటోలో ప్రధాన భాగస్వాములైన జర్మనీ, ఫ్రాన్స్ సైతం అదే ఉద్దేశంతో ఉన్నాయి. నిరుడు ఫిబ్రవరిలో ఒక విందు సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి జర్మనీ చాన్సలర్ ఓలోఫ్ షుల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియేల్ మేక్రాన్‌లు హితవు చెప్పారు. ‘ఈ యుద్ధంలో మీరు ఓడిపోబోతున్నారు. కనుక రష్యాతో చర్చలకు సిద్ధపడి సంధి చేసుకోవటం అత్యుత్తమం’ అని సలహా ఇచ్చారు. హిట్లర్ కాలంలో జర్మనీ తమ దేశాన్ని దురాక్రమించినా ఆ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్‌లు రెండూ పాత వైరాన్ని మరిచిపోయిన సంగతిని గుర్తుచేశారు. ‘నువ్వు గొప్ప యుద్ధ వీరుడివే కావొచ్చుగానీ... ఈ వైరంలో రాజనీతిజ్ఞత అవసరం.నొప్పి కలిగించినా కష్టమైన నిర్ణయం తీసుకోవటానికి సిద్ధపడాలి’ అని జెలెన్స్కీకి మేక్రాన్ హితబోధ చేశారు. అవన్నీ ఏమైనట్టు? నాటో పుట్టిననాటి నుంచి దాన్ని కొనసాగించటానికి అమెరికా సాకులు వెదుకుతూనే వుంది. సోవియెట్ యూనియన్ పెను భూతమనీ, అది యూరప్‌ను కబళించబోతున్నదనీ ఊదరగొట్టి ఏర్పరిచిన నాటో ఉనికిని కాపాడేందుకు పడరాని పాట్లు పడుతోంది. 1989లో పనామా పాలకుడు నొరీగా, 1999లో సెర్బియా పాలకుడు స్లోబోదన్ మైలోసెవిక్, 2003లో ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్‌లు ప్రపంచాన్ని కబళించటానికి సిద్ధంగావున్న హిట్లర్లుగా చిత్రీకరించి ఆ దేశాలపై అమెరికా, నాటో దళాలు విరుచుకుపడి గుల్లచేశాయి. లక్షలాదిమంది అమాయక పౌరులు బలయ్యారు. ఇన్నాళ్లకు నాటోకు యూరప్‌లో పుతిన్ రూపంలో శత్రువు ‘తారసపడ్డాడు’. ఆ లంపటంలోకి ప్రపంచ దేశాలన్నిటినీ దించి లోకరక్షకుడిగా ఆవిర్భవించాలని అమెరికా తలపోస్తున్నట్టు కనబడుతోంది. రష్యా అణ్వాయుధాల ప్రయోగానికి దిగదని అమెరికా, నాటోలు నమ్ముతున్నట్టున్నాయి. ఇలాంటి తప్పుడు సూత్రీకరణలతో, అసంబద్ధ అంచనాలతో ప్రపంచాన్ని యుద్ధంలోకి నెడితే ఊహకందని పర్యవసానాలు ఏర్పడే ప్రమాదముంది. అగ్రరాజ్యాలు విజ్ఞతతో మెలిగి ఉక్రెయిన్, రష్యాల మధ్య సంధికి ప్రయత్నించాలి. ఆ మేరకు ప్రపంచ ప్రజానీకం ఒత్తిడి తేవాలి. -
ఉక్రెయిన్‌తో సంక్షోభం.. శాంతి పునరుద్ధరణకు భారత్ సిద్ధం: పుతిన్‌తో మోదీ
మాస్కో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం మాస్కో చేరుకున్న ఆయనకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చారు. పుతిన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ భేటీలో రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారతీయుల విముక్తి, ఉక్రెయిన్ యుద్దం వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.ఉక్రెయిన్‌తో రస్యా కొనసాగుతున్న యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. యుద్ధం దేనికి పరిష్కారం అవ్వదని ప్రధాని మోదీ పుతిన్‌తో అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు పుతిన్‌కు చెప్పారు. భారత్ శాంతికి అనుకూలంగా ఉందని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి ఇద్దరూ ‘ఓపెన్ మైండ్’తో చర్చలు జరిపినట్లు మోదీ చెప్పారు.“ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి ఓపెన్ మైండ్‌తో చర్చించడం నాకు సంతోషంగా ఉంది. యుద్ధంపై ఒకరి ఆలోచనలను మరొకరు చాలా గౌరవంగా విన్నాం. యుద్ధమైనా, ఘర్షణలైనా, ఉగ్రదాడులైనా.. ఎవరికైనా ప్రాణహాని జరిగినప్పుడు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ బాధ కలుగుతుంది. అమాయక పిల్లలు చనిపోవడం చూస్తుంటే హృదయాన్ని కదిలిస్తుంది. ఆ బాధ వర్ణనాతీతం. దీనిపై కూడా నేను మీతో చర్చించాను," అని మోదీ పేర్కొన్నారు.రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి పునరుద్ధరణకు సహకరించేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని పుతిన్‌తో చెప్పారు.భారత్ శాంతికి అనుకూలంగా ఉందని మేము మీతో పాటు ప్రపంచానికి హామీ ఇస్తున్నానని తెలిపారు. ఇక శాంతిపై పుతిన్ మాట్లాడిన మాటలు ఆశాజనకంగా ఉన్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: పుతిన్‌కు మోదీ హగ్.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు -
అస్సాంలో రాహుల్.. కాంగ్రెస్, బీజేపీ ట్వీట్ వార్
గువహతి: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సోమవారం ఉయదం (జులై 8) అస్సాంలో పర్యటించారు. సిల్చార్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. అస్సాం నుంచి రాహుల్‌గాంధీ మణిపూర్‌కు పర్యటనకు బయల్దేరారు. ఈ సీజన్లో వచ్చిన వరదలకు అస్సాంలో కొన్ని లక్షల మంది ప్రభావితమయ్యారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం..నాన్ బయాలజికల్ ప్రధాని సోమవారం ఉదయం మాస్కో వెళ్లారని ఎక్స్(ట్విటర్)లో జైరాంరమేష్ ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ మాత్రం అస్సాంలో వరద బాధితులను పరామర్శిస్తున్నారన్నారు. మణిపూర్‌లో రాహుల్ పర్యటించడం ఇది మూడోసారని తెలిపారు. మరోపక్క బీజేపీ ఐటీ అమిత్ మాలవ్య జైరాంరమేష్ ట్వీట్‌పై స్పందించారు. అసలు మణిపూర్‌లో జాతుల మధ్య వైరానికి కాంగ్రెస్సే కారణమన్నారు. రాహుల్‌గాంధీది ట్రాజెడీ టూరిజం అని విమర్శించారు. -
వార్‌హెడ్‌తో క్షిపణి పరీక్ష: ఉ.కొరియా
సియోల్: అతిపెద్ద వార్‌హెడ్‌ను మోసుకెళ్ల గలిగిన వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా ప్రకటించుకుంది. సోమవారం పరీక్షించిన హువాసంగ్ఫొ–11 డీఏ–4.5 రకం క్షిపణికి నాలుగున్నర టన్నుల బరువున్న వార్‌హెడ్‌ను అమర్చినట్లు ఆ దేశ వార్తా సంస్థ మంగళవారం తెలిపింది.ఈ క్షిపణి గరిష్టంగా 500 కిలోమీటర్లు, కనిష్టంగా 90 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగలదని కూడా వెల్లడించింది. అయితే, ఉత్తర కొరియా సోమవారం ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఒకటి ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని నిర్జన ప్రాంతంలో కుప్పకూలినట్లు దక్షిణ కొరియా సైన్యం మంగళవారం తెలిపింది. -
బతుకు చితికి.. గూడు చెదిరి... వలస బాట
పుట్టిన నేల.. పెరిగిన ఊరు.. ఇవే మనిషి అస్తిత్వం. కానీ యుద్ధం, హింస ప్రజలను నిరాశ్రయులను చేస్తోంది. అధికార దాహం, అహంకార ధోరణి కోట్ల మందిని సొంత నేలకే పరాయివాళ్లుగా మారుస్తోంది. గత పదేళ్లలో ప్రపంచ జనాభాలో ప్రతి 69 మందిలో ఒకరు చొప్పున ఏకంగా 12 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది తలదాచుకునేందుకు కూడా దిక్కులేక శరణార్థులుగా మారాల్సి వస్తోంది. ప్రాణాలను చేతబట్టుకుని విదేశాల బాట పట్టాల్సిన దుస్థితి దాపురిస్తోంది...! – సాక్షి, నేషనల్ డెస్క్సంఘర్షణ, హింస, మానవ హక్కుల ఉల్లంఘనల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 11.7 కోట్ల మందికి పైగా నిరాశ్రయులైనట్టు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషన్ (యూఎన్‌హెచ్‌సీఆర్) వెల్లడించింది. వీరిలో 6.83 కోట్ల మంది సంఘర్షణలు, ఇతర సంక్షోభాల కారణంగా సొంత దేశాల్లోనే ఇతర ప్రాంతాలకు చెదిరిపోయారు. దాదాపు 4.5 కోట్ల మంది పొట్ట చేత పట్టుకుని శరణార్థులుగా విదేశాలకు వలస వెళ్లారు. 2024 తొలి నాలుగు నెలల్లో ఇది మరింత పెరిగింది.పదేళ్లకోసారి రెట్టింపు.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1951లో ఐరోపాలోని శరణార్థుల హక్కులను పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 1967లో శరణార్థుల కన్వెన్షన్ ఆవిర్భవించినప్పుడు 20 లక్షల మంది శరణార్థులున్నారు. ⇒ 1980 నాటికి కోటికి చేరిన శరణార్థులు ⇒ 1990 నాటికి రెండు కోట్లకు చేరిన సంఖ్య⇒ 2021 చివరి నాటికి 3 కోట్లను మించిన శరణార్థులు⇒ తాజాగా 11 కోట్లు దాటేసిన వైనం2020 నుంచి వేగంగా...⇒ 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక 2023 చివరి నాటికి 60 లక్షల మంది ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది దేశం విడిచి వెళ్లారు. ⇒ 2023లో సుడాన్లో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఘర్షణలు శరణార్థుల సంఖ్యను 10.5 లక్షలు పెంచాయి. ⇒ ఇక ఇజ్రాయెల్ దాడులతో గాజాలో గతేడాది చివరి మూడు నెలల్లో 10.7 లక్షల మంది నిరాశ్రయులై వలస వెళ్లారు.ఎక్కడి నుంచి వస్తున్నారు?⇒ ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 4.5 కోట్ల మంది శరణార్థులలో దాదాపు మూడొంతులు (72 శాతం) ఐదు దేశాల నుంచే వచ్చారు.అఫ్గానిస్తాన్ 64 లక్షలు సిరియా 64 లక్షలు వెనెజులా 61 లక్షలు ఉక్రెయిన్ 60 లక్షలు పాలస్తీనా 60 లక్షలుఆశ్రయమిస్తున్న దేశాలు?⇒ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది శరణార్థులు తమ స మీప పొరుగు దేశాల్లోనే బతుకీడుస్తున్నారు. ⇒ ఇరాన్, పాకిస్తాన్‌లోని శరణార్థులందరూ అఫ్గాన్లే. ⇒ టర్కీలో ఎక్కువ మంది శరణార్థులు సిరియన్లు.దేశం శరణార్థులు ఇరాన్ 38 లక్షలు తుర్కియే 33 లక్షలు కొలంబియా 29 లక్షలు జర్మనీ 26 లక్షలు పాకిస్తాన్ 20 లక్షలు -
ఎవరు వారు? ఎచటి వారు? తప్పదిక వార్..!
డెస్టిని 2 ఫ్రీ–టు–ప్లే ఫస్ట్ పర్సన్ షూటర్ వీడియో గేమ్. పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందించిన గేమ్ ఇది. ఒరిజినల్ మాదిరిగానే ఈ గేమ్‌లోని మూమెంట్స్ ప్లేయర్స్ వర్సెస్ ఎన్విరాన్మెంట్(పివిఇ), ప్లేయర్ వర్సెస్ ప్లేయర్(పివిపి)గా విభజించబడి ఉంటాయి.‘పివిఇ’లో ఆరు–ప్లేయర్ రైడ్స్ ఉంటాయి. ప్రతి గమ్యస్థానానికి పెట్రోలింగ్ మోడ్ అందుబాటులో ఉంది. వివిధ గ్రహాంతరవాసుల నుండి మానవజాతిని రక్షించడానికి ప్లేయర్స్ ‘గార్డియన్’ పాత్రను పోషించాల్సి ఉంటుంది.సిరీస్: డెస్టిని,ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్, విండోస్, స్టాడియా. ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్జానర్స్: ఫస్ట్–పర్సన్ షూటర్, ఎంఎంవోజీమోడ్: మల్టీ ప్లేయర్ఇవి చదవండి: Akanksha: ఇన్నోవేషన్.. పర్యావరణ హితం! -
Rahul Gandhi: యుద్ధాలను ఆపే మోదీ పేపర్ లీకేజీలు ఆపలేరా?
న్యూఢిల్లీ: నీట్–యూజీ, యూజీసీ–నెట్ పరీక్షల్లో అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్–రష్యా, హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాలను ఆపేసే శక్తి ఉందని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీకి మన దేశంలో పేపర్ లీకేజీలను ఆపే శక్తి లేదా? అని ప్రశ్నించారు. లీకేజీలను ఆపాలని మోదీ కోరుకోవడం లేదని ఆక్షేపించారు. దేశంలో ఉన్నత విద్యా సంస్థలను అధికార బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ చెరబట్టాయని, అందుకే పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితి మారనంత వరకు పేపల్ లీక్‌లు అగవని తేలి్చచెప్పారు. రాహుల్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. లక్షలాది మంది నీట్ అభ్యర్థుల ఆందోళనలను నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆయన దృష్టి మొత్తం ఇప్పుడు పార్లమెంట్లో స్పీకర్‌ను ఎన్నుకోవడంపైనే ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మోదీ మానసికంగా కుప్పకూలిపోయారని, ఇకపై ఆయన ప్రభుత్వాన్ని నడిపించేందుకు మరింత ఇబ్బంది పడుతారని చెప్పారు. పార్లమెంట్లో లేవనెత్తుతాం.. ‘‘నరేంద్ర మోదీకి ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. గతంలో ఆయన ఛాతీ 56 అంగుళాలు ఉండేది. ఇప్పుడది 32 అంగుళాలకు కుదించుకుపోయింది. భయపెట్టి, బెదిరించి పని చేయించుకోవడం మోదీకి అలవాటు. ఇప్పుడు ప్రజల్లో మోదీ అంటే భయం పోయింది. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉంది. ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతాం’’. అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నీట్‌పై ఆందోళన అవసరం లేదు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ: నీట్–యూజీ పరీక్ష విషయంలో ఆందోళన అవసరం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఎక్కడో జరిగిన చిన్నాచితక సంఘటనలు ఈ పరీక్ష సక్రమంగా రాసిన లక్షలాది మంది అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం చూపబోవని చెప్పారు. యూజీసీ–నెట్ ప్రశ్నపత్రం డార్క్‌నెట్‌లో లీక్ అయ్యిందని, అందుకే పరీక్ష రద్దు చేశామని ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు.