సంజయ్కు 30 రోజుల పెరోల్! | Sakshi
Sakshi News home page

సంజయ్కు 30 రోజుల పెరోల్!

Published Wed, Aug 26 2015 12:07 PM

అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో దోషిగా యేర్వాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు మరోసారి పెరోల్ మంజూరైంది. దత్‌కు ఇప్పటివరకు మూడుసార్లు పెరోల్ మంజూరుకాగా.. మరోసారి కూడా ఇచ్చారు. సంజయ్ కుమార్తె ముక్కుకు శస్త్ర చికిత్స చేయనున్న నేపథ్యంలో ఆమె మంచి చెడులు చూసుకునే ఉద్దేశంతో పెట్టుకున్న పెరోల్ బెయిల్కు తాజాగా కోర్టు అనుమతించింది. 30 రోజులపాటు సంజయ్ దత్ పెరోల్పై జైలు వెలుపల ఉండనున్నారు.