-
‘గూగులీనెస్’ అంటే తెలుసా? సుందర్ పిచాయ్ వివరణ
‘గూగులీనెస్’ అనే పదాన్ని చాలా కాలంగా గూగుల్ ఉద్యోగులు ఉపయోగిస్తున్నారు. మళ్లీ గూగుల్‌లో లేఆఫ్స్ ఉంటాయని ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈ పదం మరోసారి వైరల్‌గా మారింది. ఉద్యోగులు గూగుల్ సంస్కృతి, విలువలకు సరిపోతారా లేదా అని తనిఖీ చేయడంలో ఈ పదం ఉపయోగపడుతుందని సంస్థలో ఉన్నతాధికారులు నమ్ముతున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల జరిగిన కంపెనీ వైడ్ ఫోరమ్ సమావేశంలో ఈ పదానికి సంబంధించి మరింత స్పష్టతను ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆరు కీలక అంశాలపై గూగులీనెస్ ఆధారపడి ఉంటుందని చెప్పారు.మిషన్ ఫస్ట్: గూగుల్ మిషన్‌కు, ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తులో ఆయా ప్రాజెక్ట్‌ల్లో భారీ లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి. ఫ్యూచర్ విజన్ కోసం పని చేయాలి.అందరికీ ఉపయోగపడే వాటిపై దృష్టి: ప్రజల జీవితాలను నిజంగా మెరుగుపరిచే ఉత్పత్తులను సృష్టించాలి. అందరికీ ఉపయోగపడే వాటిపై ఉద్యోగులు దృష్టి సారించాలి.ధైర్యంగా, బాధ్యతాయుతంగా ఉండడం: ఏ పని చేస్తున్నప్పుడైనాసరే మీరు చేస్తున్నది బలంగా నమ్మి ధైర్యంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వచ్చే ఫలితాలకు సైతం బాధ్యత తీసుకునేటప్పుడు సాహసోపేతమైన ఆలోచనలను ప్రోత్సహించవచ్చు.వనరులను సద్వినియోగం చేసుకోవడం: మనం చేయాలనుకుంటున్న పనులకు అన్ని సందర్భాల్లోనూ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. చాలా వనరులు అవసరం అవ్వొచ్చు. కానీ పరిమిత వనరులను సద్వినియోగం చేసుకుని మెరుగైనా ఫలితాలు రాబట్టేలా పని చేయాలి.వేగంగా.. సరదాగా..: చేసేపనిని నిర్దేశించిన కాలంలో పూర్తి చేయాలి. దాంతోపాటు భారంగా కాకుండా, సరదాగా పని చేయాలి.టీమ్ గూగుల్: టీమ్ వర్క్ చాలా ముఖ్యం. ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..10 శాతం మందికి లేఆఫ్స్..కొంతకాలంగా ఎలాంటి తొలగింపులు లేకుండా నిశ్చలంగా ఉన్న గూగుల్ కంపెనీ మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్దమైంది. ఈ ప్రభావం మేనేజర్ స్థాయి ఉద్యోగులు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ల మీద పడనుంది. గూగుల్ రానున్న రోజుల్లో 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవలే వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో నెలకొన్న పోటీని ఎదుర్కోవడానికి, ఓపెన్ఏఐ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వడానికి కొనసాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు. -
అప్పుడు పరీక్షలో ఫెయిల్.. ఇప్పుడు గూగుల్‌లో జాబ్: జీతం తెలిస్తే..
జీవితంలో అనుకున్నది సాధించాలంటే.. అసాధారణమైన సంకల్పం, పట్టుదల అవసరం. అప్పుడే సక్సెస్ సాధించవచ్చు. దీనికి బీహార్‌కు చెందిన 'పుష్పేంద్ర కుమార్' ప్రయాణమే నిదర్శనం. ఇంతకీ ఇతనెవరు? ఏం సాధించారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.బీహార్‌లోని జాముయి జిల్లా ఝఝా బ్లాక్‌లోని బుధిఖండ్ గ్రామానికి చెందిన హరిఓమ్ శరణ్ పెద్ద కుమారుడు పుష్పేంద్ర కుమార్.. ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైన గూగుల్‌లో అధిక వేతనంతో కూడిన ఉద్యోగం సంపాదించాడు.ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన పుష్పేంద్ర.. గూగుల్ కంపెనీలో చేయాలని కల కన్నాడు. ప్రస్తుతం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్న ఇతడు తన కోర్సు పూర్తి చేయడానికి ముందే గూగుల్‌లో డేటా సైంటిస్ట్‌గా ఎంపికయ్యాడు. కొడుకు కల నెరవేరినందుకు అతని కుటుంబ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు.స్నేహితుల స్ఫూర్తితో..పుష్పేంద్ర తన ప్రాథమిక విద్యను జార్ఖండ్‌లోని జసిదిహ్లో పూర్తి చేశాడు. 2018లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత స్నేహితుల ప్రేరణతోనే ఐఐటీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (IIT-JEE)కి హాజరయ్యాడు. మొదటి ప్రయత్నంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. అయినా.. పట్టు వదలకుండా మళ్ళీ సన్నద్దమయ్యాడు. దీంతో రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు.రూ.39 లక్షల ప్యాకేజీగూగుల్లో డేటా సైంటిస్ట్‌గా ఎంపికైన పుష్పేంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉద్యోగానికి ఎంపికైన రోజు నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నాడు. మొదట భారతదేశంలోని గూగుల్‌లో పని చేస్తానని, అక్కడ అతనికి రూ.39 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాడు. భవిష్యత్తులో కంపెనీ తనను విదేశాలకు పంపితే, తన ప్యాకేజీ భారత్‌లో పొందే దానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు. -
టెక్ దిగ్గజం కీలక నిర్ణయం: 10 శాతం ఉద్యోగులు బయటకు
గత కొంతకాలంగా ఎలాంటి తొలగింపులు లేకుండా నిశ్చలంగా ఉన్న టెక్ రంగంలో మళ్ళీ లేఆప్స్ అలజడి మొదలైంది. గూగుల్ కంపెనీ మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్దమైంది. ఈ ప్రభావం మేనేజర్ స్థాయి ఉద్యోగులపైన, డైరెక్టర్లపైన, వైస్ ప్రెసిడెంట్ల మీద పడనుంది.గ్లోబల్ టెక్ దిగ్గజం 'గూగుల్' ఇప్పుడు 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు.. సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో నెలకొన్న పోటీని ఎదుర్కోవడానికి, ఓపెన్ఏఐ వంటి వాటిని గట్టి పోటీ ఇవ్వడానికి కొనసాగిస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మీరు అమెజాన్ ప్రైమ్ యూజర్లా.. కొత్త రూల్స్ చూసారా?గూగుల్ కంపెనీ 20 శాతం మరింత శక్తివంతంగా మారాలని సుందర్ పిచాయ్ 2022లోనే ఆకాక్షించారు. ఆ తరువాత ఏడాది 12,000 మంది ఉద్యోగులను గూగుల్ తొలగించారు. కాగా ఇప్పుడు 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు తెలిసింది. అయితే ఎంత మందిని తొలగిస్తారు అనే విషయాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
8 నెలల్లోనే ప్రమోషన్.. రూ.80 లక్షల బోనస్
గూగుల్ కంపెనీలో మూడేళ్లకు పైగా పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి.. తన ప్రమోషన్ గురించి, 30 శాతం పెంపు ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి థ్రెడ్‌లో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 'జెర్రీ లీ' అనే వ్యక్తి 2018లో గూగుల్‌లో చేరాడు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే సీనియర్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా ఎదిగారు. తన పోస్ట్‌లో..తన సహచరులు ఎక్కువగా తనను బాధ్యతగా భావించారని వెల్లడించాడు.గూగుల్‌లో నా మొదటి రెండు నెలలు? నిజాయితీగా, అవి విచిత్రంగా సాగాయని వివరించాడు.పనిని సులభంగా తీసుకో అని చెప్పడం, ఉచిత భోజనం తినమని చెప్పడం, క్యాంపస్ చూడమని చెప్పడం చేసేవారు. ఎందుకంటే నేను కంపెనీలో ఉన్న ఇతరుల కంటే చిన్నవాడిని. ఆరు ఏళ్లు దాటిన వారితో కూడిన బృందంలో వారు నన్ను మొదటి కొన్ని నెలలపాటు నెగిటివ్‌గా చూశారని భావించినట్లు పేర్కొన్నాడు.రెండు నెలలు గడిచినా ఏమీ చేయకపోవడంతో విసుగు వచ్చిందని, ఎలాగైనా తన విలువ పెంచుకోవాలని భావించానని చెప్పాడు. నేను ప్రాజెక్ట్‌ల కోసం అడగడం మొదలుపెట్టాను. చివరగా నా మేనేజర్లలో ఒకరు, మీరు ఈ మార్కెట్ ల్యాండ్‌స్కేప్ విశ్లేషణను ఎందుకు చూడకూడదు? అని చెప్పారు. నేను దానిని గమనించాను.ఇదీ చదవండి: అక్కడ భారీగా బయటపడ్డ తెల్ల బంగారంఆ తరువాత ఇద్దరు ప్రాజెక్ట్ మేనేజర్లు, ఆరుగురు ఇంజనీర్లు, మరో ఐదుగురు విశ్లేషకులు, కార్యకలాపాలు, చట్టపరమైన విభాగాలకు చెందిన ఇతర ఉద్యోగులతో కలిసి ఒక ప్రాజెక్ట్‌ను నడిపిస్తున్నట్లు నన్ను గుర్తించారు. దీంతో కంపెనీలో చేరిన ఎనిమిది నెలల తరువాత 80 లక్షల బోనస్ అందుకోవడం మాత్రమే కాకుండా.. ప్రమోషన్ కూడా పొందినట్లు పేర్కొన్నాడు. -
వినేష్ ఫోగట్, నితీష్ కుమార్, పూనం పాండే ఎవరు? ఇదే తెగ వెదికేశారట!
ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ ఏడాదికూడా సెర్చ్ దిగ్గజం గూగుల్‌లో టాప్-10 మోస్ట్ సెర్చ్డ్ పర్సన్స్ జాబితాను విడుదల చేసింది. భారతదేశంలో 2024లో గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తుల జాబితాలో ఒలింపిక్ రెజ్లర్ నుంచి రాజకీయ వేత్తగా మారిన వినేష్ ఫోగట్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్ టాప్ టెన్‌లో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకున్నారు.2024లో భారతదేశంలో గూగుల్‌లో అత్యధికంగా వెదికిన పదిమంది వ్యక్తులు వినేష్ ఫోగట్నితీష్ కుమార్చిరాగ్ పాశ్వాన్హార్దిక్ పాండ్యాపవన్ కళ్యాణ్శశాంక్ సింగ్పూనమ్ పాండేరాధికా మర్చంట్అభిషేక్ శర్మలక్ష్య సేన్ఇక ప్రపంచవ్యాప్తంగా, 2024లో గ్రహం మీద అత్యధికంగా వెదికిన వ్యక్తిగా అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నిలిచారు, ఆ తర్వాతి స్థానాల్లో వేల్స్ యువరాణి కేథరీన్, ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థిగా ఉన్న కమలా హారిస్ 3వ స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో జేడీ వాన్స్, ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, రాపర్ డిడ్డీ కూడా ఉన్నారు. -
మస్క్ హింట్ ఇచ్చారా!.. దిగ్గజాల కథ కంచికేనా?
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ 'ఎక్స్ మెయిల్' పేరుతో ఈమెయిల్ ప్రారభించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక యూజర్ ట్వీట్ చేస్తూ.. ఎక్స్.కామ్ ఈమెయిల్ కలిగి ఉండటం ఒక్కటే, నన్ను జీమెయిల్ ఉపయోగించకుండా ఆపగలదని పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇస్తూ.. ఈమెయిల్‌తో సహా మెసేజింగ్ మొత్తం ఎలా పని చేస్తుందో మనం పునరాలోచించాలని మస్క్ అన్నారు.2024 సెప్టెంబర్ నాటికి గ్లోబల్ ఈమెయిల్ మార్కెట్లో.. యాపిల్ మెయిల్ 53.67 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత జీమెయిల్ 30.70 శాతం, అవుట్‌లుక్ 4.38 శాతం, యాహూ మెయిల్ 2.64 శాతం, గూగుల్ ఆండ్రాయిడ్ 1.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇప్పుడు మస్క్ కూడా ఎక్స్.మెయిల్ ప్రారంభించే యోజనలో ఉన్నారు. కాబట్టి ఈ రంగంలో కూడా మస్క్ తన హవా చూపించడానికి సిద్ధమవుతున్నారని స్పష్టమవుతోంది.Interesting. We need to rethink how messaging, including email, works overall. https://t.co/6wZAslJLTc— Elon Musk (@elonmusk) December 15, 2024 -
ట్రాన్స్‌జెండర్‌తో మార్కెటింగ్... గూగుల్ క్రిస్మస్ ప్రకటనపై వివాదం
మహిళల సంబంధ వస్తువులకు సంబంధించిన ప్రకటనను ట్రాన్స్‌జెండర్‌తో రూపొందించాలన్న టెక్ దిగ్గజం గూగుల్ ‘వినూత్న’ ఐడియా బెడిసికొట్టింది. దానిపై మహిళాలోకంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. క్రిస్మస్ వేళ ఇలాంటి యాడ్ ఎందుకు తెచ్చారంటూ దుమ్మెత్తిపోశారు. అందమైన మహిళలే లేనట్టు ట్రాన్స్‌జెండర్‌తో యాడ్ చేస్తారా అంటూ నెటిజన్లు కూడా గూగుల్‌పై మండిపడుతున్నారు. క్రిస్మస్ సందర్భంగా గూగుల్ తన సొంత షాపింగ్ వేదిక ‘గూగుల్ షాపింగ్’లో మహిళల ఉత్పత్తులను ప్రమోషన్‌కు ఒక యాడ్ సిద్ధం చేసింది. టిక్‌టాక్‌లో పేరొందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ 30 ఏళ్ల సైరస్ వెస్సీని ప్రచారకర్తగా ఎంచుకుంది. చంపేసే చలిలో అత్యంత నాణ్యమైన మేకప్, చర్మ సంబంధ ఉపకరణాలు, దుస్తులను తక్కువ ధరకే కొనుక్కోండంటూ వెస్సీతో ఒక యాడ్ డిజైన్ చేసి ఆన్లైన్ ప్రసారాలు మొదలెట్టారు. కానీ అందులో ట్రాన్స్‌జెండర్ నటించడంతో ఆదరణ దేవుడెరుగు, విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘ఇది దారుణమైన అజెండాతో రూపొందించిన యాడ్. అమ్మాయిలను అవమానించాలని చేసినట్టుగా ఉంది’’ అంటూ పలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత ఓలీ లండన్ అన్నారు. దాంతో, మహిళలను కించపరచాలనే దురుద్దేశమేదీ లేదంటూ గూగుల్ వివరణ ఇచి్చంది. సోషల్ మీడియాలో పేరొందిన ‘విభిన్న’ వ్యక్తులతో యాడ్ చేద్దామనే ఉద్దేశంతోనే అలా రూపొందించినట్టు చెప్పుకొచ్చింది. – వాషింగ్టన్ -
‘సానుకూల శక్తి’కి నిలువెత్తు నిదర్శనం ఆమె..!
చెడు కాలం చెప్పి రాదు. కెరీర్లో బిజీగా ఉన్న టైమ్‌లో అలాంటి కాలం ఒకటి బాలీవుడ్ నటి హీనాఖాన్‌కు వచ్చింది. అయితే అది చెడు కాలం అని ఆమె అనుకోలేదు. ‘ఇది పరీక్ష కాలం’ అని మాత్రమే అనుకుంది. పరీక్షకు నిలబడాలంటే ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహమే శక్తి అవుతుంది. ఉత్సాహం దండిగా ఉన్న హీనాఖాన్ ఆ పరీక్షను తట్టుకొని నిలబడుతూ ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది.‘గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ గ్లోబల్ లిస్ట్–2024’లో అత్యధికంగా సెర్చ్ చేసిన నటుల్లో హీనాఖాన్ 5వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఎంతో మంది ఖాన్‌ను అభినందిస్తున్నారు. ఆమె మాత్రం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘చాలా మంది నన్ను అభినందించడం చూస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే ఇది విజయం, గర్వించదగిన విషయం అనుకోవడం లేదు’ అని రాసింది. ఆరోగ్య సవాళ్ల కంటే వృత్తిపరమైన విజయాలతోనే తనను గుర్తించాలనే విషయాన్ని అంతర్లీనంగా చెప్పింది ఖాన్.‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ అనే సీరియల్లో అక్షర పాత్రలో నటించి పాపులారిటీని పెంచుకున్న ఖాన్ బిగ్ బాస్, ఖత్రోస్ కే ఖిలాడీలాంటి రియాలిటీ షోలలో పాల్గొని పాపులారిటీని మరింత పెంచుకుంది. జూన్ 2024లో రొమ్ము క్యాన్సర్ గురించి బహిరంగంగా వెల్లడించింది హీనాఖాన్. ‘ఇది సవాలుతో కూడినది అయినప్పటికీ ధైర్యం కోల్పోలేదు. చికిత్స ఇప్పటికే మొదలైంది. దీని నుంచి మరింత బలంగా బయటపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది.ప్రస్తుతం కీమో థెరపీ చేయించుకుంటున్న ఖాన్ తన చికిత్స గురించి, తన ఛాలెంజింగ్ జర్నీ గురించి ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో అప్డేట్స్ పంచుకుంటోంది. వృత్తిపరమైన విజయాలతోనే తనను గుర్తించాలని హీనాఖాన్ కోరుకుంటున్నప్పటికీ క్లిష్టమైన సమయాల్లో ఆమె చూపిన ధైర్యానికి ఎంతో మంది అభిమానులు అయ్యారు. సినిమా కష్టాలు ఖాన్‌కు నిజంగానే వచ్చినప్పటికీ సానుకూల శక్తితో పెదవులపై చిరునవ్వు కోల్పోలేదు.గుండెలో ధైర్యం కోల్పోలేదు.అందుకే నటిగానే కాదు ‘సానుకూల శక్తి’ విషయంలోనూ హీనాఖాన్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ‘హీనాఖాన్ అసాధారణ ధైర్యానికి ఉదాహరణగా నిలుస్తుంది. కారుచీకట్లో కూడా కాంతిని కనుగొనే సామర్థ్యం ఆమెలో ఉంది’ అంటూ నెటిజనులు ప్రశంసిస్తున్నారు.ఎంత బిజీగా ఉంటే అంత సంతోషంగా ఉంటాను!మంచి రోజులు, చెడు రోజులు ఉంటాయి. మంచి రోజుల్లో ఎలా ఉన్నా చెడు రోజుల్లో మాత్రం ఉత్సాహంగా ఉండాలి. ఆ ఉత్సాహమే సానుకూల శక్తి ఇస్తుంది. సానుభూతి మాటలు విని బేలగా మారిపోకూడదు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. నాకు ఖాళీగా కూర్చోవడం కంటే పని చేయడం, బిజీగా ఉంటేనే ఉత్సాహంగా ఉంటుంది.– హీనాఖాన్ (చదవండి: భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారం!) -
టెక్ దిగ్గజాలపై ఆ్రస్టేలియా కొరడా
కాన్బెర్రా: టెక్ దిగ్గజాలపై కొరడా ఝళిపించేందుకు ఆ్రస్టేలియా సిద్ధమైంది. వార్తలు ప్రచురించినందుకు స్థానిక మీడియాకు చెల్లింపులు చేసేందుకు ఉద్దేశించిన కఠిన చట్టం త్వరలో అమలవనుందని ప్రభుత్వం గురువారం తెలిపింది. 2025 జనవరి నుంచి ఇది అమలవుతుందని, ఫిబ్రవరిలో పార్లమెంట్ ఆమోదం తెలుపుతుందని పేర్కొంది. మెటా, గూగుల్ వంటి బడా కంపెనీలు తమ వేదికలపై ప్రచురించే వార్తలకుగాను ఫీజు చెల్లించాలంటూ 2021లో ఆ్రస్టేలియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక చట్టం తీసుకువచ్చింది. తాజా నిర్ణయం ఈ చట్టానికి కొనసాగింపేనని చెబుతున్నారు. అయితే, ఆస్ట్రేలియా వార్తా సంస్థలతో ఉన్న చెల్లింపు ఒప్పందాలను పునరుద్ధరించబోమని ఇటీవల ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల యాజమాన్య సంస్థ మెటా చేసిన ప్రకటన ఆ్రస్టేలియా పార్లమెంట్‌తో ప్రతిష్టంభనకు కారణమైంది. గురువారం ఆ్రస్టేలియా ప్రభుత్వం ‘న్యూస్ బార్గెనింగ్ ఇన్సెంటివ్’పేరుతో ప్రకటించిన నూతన నిబంధనల ప్రకారం వార్షికాదాయం రూ.1,350 కోట్ల కలిగిన టెక్ కంపెనీలు మీడియా సంస్థలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే భారీగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక పరిశ్రమకు సబ్సిడీ ఇచ్చేందుకు మరో పరిశ్రమపై భారం మోపుతోందని మెటా దీనిపై వ్యాఖ్యానించింది. ‘డిజిటల్ వేదికలు ఆ్రస్టేలియా నుంచి భారీగా ఆర్థిక లబ్ధి పొందుతున్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియాలో నాణ్యమైన జర్నలిజం సేవలను పొందుతున్నందుకు తోడ్పాటు నివ్వాల్సిన సామాజిక, ఆర్థిక బాధ్యత వాటిపై ఉంది’అని ప్రభుత్వం అంటోంది. డిజిటల్ వేదికలు పెరిగిపోవడంతో సంప్రదాయ మీడియా సంస్థలు నష్టపోతున్నాయని, ఈ నేపథ్యంలోనే పబ్లిషర్లు, టెక్ కంపెనీల మధ్య సమతూకం పాటించేందుకు నిబంధనలు తెచి్చనట్లు అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. ఆ మేరకు మెటా తదితర కంపెనీలు ఆస్ట్రేలియా మీడియా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాల గడువు పూర్తి కావొచ్చింది. ఫేస్బుక్ కంటెంట్‌లో వార్తలు, రాజకీయ సంబంధ అంశాల వాటా 3 శాతం కంటే తక్కువగా ఉంటుందని మెటా అంటోంది. అందుకే, తిరిగి ఒప్పందాలను కుదుర్చుకోబోమని, బదులుగా వార్తల ట్యాబ్‌లను తొలగిస్తామని చెబుతోంది. ఈ చర్యతో ఆ్రస్టేలియా మీడియా సంస్థలు సుమారు రూ.1,700 కోట్ల మేర నష్టపోయే అవకాశముంది. దీనిపై ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ తీవ్రంగా స్పందించారు. ఆ్రస్టేలియా వినియోగదారుల పట్ల మెటా ప్రాథమిక బాధ్యతలను సైతం విస్మరిస్తోందంటూ మండిపడ్డారు. ఈ నిబంధనలన్నీ కేవలం ఆ్రస్టేలియా జర్నలిజానికి సాయం పడేందుకే తప్ప తాము ఆదా యం పెంచుకునేందుకు కాదని పేర్కొన్నారు. -
గూగుల్ కొత్త చిప్: సూపర్ కంప్యూటర్ కంటే ఫాస్ట్
టెక్ దిగ్గజం 'గూగుల్'.. క్వాంటం కంప్యూటింగ్‌లో వేగవంతమైన పురోగతి సాధిస్తోంది. ఇందులో భాగంగానే సరికొత్త క్వాంటం చిప్ విల్లోను ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని కంపెనీ ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన ఈ కొత్త చిప్, కేవలం ఐదు నిమిషాల్లో సంక్లిష్టమైన గణిత సమస్యను విజయవంతంగా పరిష్కరించగలిగింది.గూగుల్ పరిచయం చేసిన ఈ విల్లో చిప్.. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ల కంటే కూడా వేగంగా పనిచేస్తుంది. విల్లో చిప్ ఐదు నిమిషాల్లో పరిష్కరించగలిగిన సమస్యను.. వేగవంతమై సూపర్ కంప్యూటర్ పరిష్కారించాలంటే 10 సెప్టిలియన్ (ఒకటి తరువాత 25 సన్నాలు ఉన్న సంఖ్య) సంవత్సరాలు పడుతుంది. ఇది విశ్వం ఆవిర్భావం కంటే ఎక్కువని గూగుల్ వెల్లడించింది.ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!విల్లోని పరిచయం చేస్తున్నాము, ఇది మా కొత్త లేటెస్ట్ క్వాంటం కంప్యూటింగ్ 'చిప్' అని గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. వావ్ అని కామెంట్ చేశారు. ఆ తరువాత వీరిరువురి మధ్య కొంత సంభాషణ కూడా జరిగింది. ఇదంతా ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.Introducing Willow, our new state-of-the-art quantum computing chip with a breakthrough that can reduce errors exponentially as we scale up using more qubits, cracking a 30-year challenge in the field. In benchmark tests, Willow solved a standard computation in <5 mins that would…— Sundar Pichai (@sundarpichai) December 9, 2024Wow— Elon Musk (@elonmusk) December 9, 2024 -
మైక్రోసాఫ్ట్‌కు, గూగుల్‌కు తేడా అదే..
మైక్రోసాఫ్ట్ ఏఐ వ్యూహంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సూక్ష్మంగా స్పందించారు. ది న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ సమ్మిట్‌లో ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీదారులతో పోలిస్తే ఏఐలో గూగుల్ (Google) పురోగతి గురించి అడిగినప్పుడు, పిచాయ్ ఒక కీలకమైన వ్యత్యాసాన్ని హైలైట్ చేశారు. గూగుల్ సొంత ఏఐ మోడల్లను అభివృద్ధి చేస్తుంది.. కానీ మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ వంటి కంపెనీల బాహ్య మోడల్‌లపై ఆధారపడుతుందని చెప్పుకొచ్చారు.సత్య నాదెళ్ల మాటకేమంటారు..?పోటీదారులతో పోలుస్తూ ఏఐలో గూగుల్ పురోగతి గురించి ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. ఏఐ రేసులో గూగుల్ గెలవాలని సవాలు విసురుతూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గతంలో చేసిన వ్యాఖ్యను కూడా ఆయన గుర్తుచేశారు. పిచాయ్ స్పందిస్తూ మైక్రోసాఫ్ట్ బాహ్య ఏఐ మోడల్స్‌పై ఆధారపడుతుందని, కానీ గూగుల్ సొంతంగా అభివృద్ధి చేస్తుందని ఎద్దేవా చేశారు.చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే మైక్రోసాఫ్ట్‌కు సవాలు విసురుతున్నారా.. అని ప్రశ్నించగా పిచాయ్ నవ్వుతూ, "అలా కాదు.. వారి పట్ల, వారి టీమ్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది" అని పేర్కొన్నారు.సత్య నాదెళ్ల వ్యాఖ్యలపై పిచాయ్ స్పందించడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో తమ ఏఐ- పవర్డ్ బింగ్ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించిన తర్వాత సెర్చ్ వ్యాపారం పరంగా గూగుల్ ఎడ్జ్ గురించి నాదెళ్ల మాట్లాడారు. సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్‌ను '800-పౌండ్ల గొరిల్లా' అని అభివర్ణించారు. తమ ఆవిష్కరణలతో గూగుల్‌ను ఆట ఆడిస్తామని చెప్పారు. బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్.. మైక్రోసాఫ్ట్ బాస్‌కు కౌంటర్ ఇచ్చారు. తాము వేరొకరి మ్యూజిక్కు ఆడబోమంటూ బదులిచ్చారు. -
హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటి ‘గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ)’ హైదరాబాద్‌లో ఏర్పాటుకానుంది. ఈ మేరకు గూగుల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న ఈ ‘గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్’మొత్తంగా ఐదోదికాగా.. ఆసియా పసిఫిక్ జోన్లో టోక్యో తర్వాత ఇదే రెండో సెంటర్ కావడం గమనార్హం. గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో భేటీ అయింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు.అమెరికా పర్యటనలో సంప్రదింపుల నేపథ్యంలో..ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం రేవంత్.. సంస్థ ప్రతినిధులతో జరిపిన సంప్రదింపుల నేపథ్యంలో జీఎస్ఈసీ ఏర్పాటుకు ముందుకొచ్చిందని సీఎం కార్యాలయం వెల్లడించింది. అక్టోబర్ 3న జరిగిన ‘గూగుల్ ఫర్ ఇండియా–2024’ సదస్సులో జీఎస్ఈసీ ఏర్పాటుపై గూగుల్ కీలక ప్రకటన చేసిందని... పలు రాష్ట్రాలు పోటీపడినా హైదరాబాద్‌లో ఏర్పాటుకే గూగుల్ సంస్థ మొగ్గు చూపిందని తెలిపింది. అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్‌గా పనిచేసే జీఎస్ఈసీ.. అధునాతన ఆన్లైన్ భద్రత ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించింది.ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్: సీఎం రేవంత్గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకు రావడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ అగ్రభాగాన ఉందని ఈ సందర్భంగా గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హాన్సెన్ వ్యాఖ్యానించారు. జీఎస్ఈసీ ద్వారా సైబర్ సేఫ్టీ సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సెంటర్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. -
గూగుల్ క్రోమ్‌ను అమ్మాల్సిందే..!
వాషింగ్టన్: ఆన్లైన్ సెర్చ్‌లో గూగుల్ చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని నిరోధించడానికి ఆ సంస్థ తన క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయించాల్సిందేనంటూ అమెరికా న్యాయశాఖ స్పష్టం చేస్తోంది. ఈ మేరకు న్యాయశాఖ తన స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేసినట్లు అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ (ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా)లో దాఖలు చేసిన 28 పేజీల ఫైల్ స్పష్టం చేస్తోంది. గూగుల్ ‘‘గుత్తాధిపత్యం’’ చేస్తోందన్న ఇటీవలి కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, టెక్ దిగ్గజాన్ని దాని ఆధిపత్య మార్కెట్ స్థానం నుండి తొలగించే చర్యలను అమెరికా న్యాయశాఖ సూచించింది. న్యాయశాఖ ప్రతిపాదనతో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ (ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా) న్యాయమూర్తి మెహతా అంగీకరిస్తే, క్రోమ్‌ను గూగుల్ విక్రయించాల్సి రావచ్చన్నది నిపుణుల విశ్లేషణ. గూగుల్ చట్టవిరుద్ధ గుత్తాధిపత్య ధోరణులను అరికట్టడానికి ఉన్న మార్గాల్లో క్రోమ్ వెబ్ బ్రౌజర్‌ను విక్రయించడం ఒకటని అమెరికా న్యాయశాఖతో పాటు పలు రాష్ట్రాలూ ప్రతిపాదనలు పెట్టడం గమనార్హం. ‘‘గూగుల్ ఒక గుత్తాధిపత్య సంస్థ. దాని గుత్తాధిపత్యం కొనసాగడానికి ఈ గుత్తాధిపత్యమూ పనిచేసింది’’ అని ఈ ఏడాది ఆగస్టులో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ కొలంబియా న్యాయమూర్తి అమిత్ మెహతా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. జరిగేదేమిటి? జడ్జి మెహతా ప్రభుత్వ సిఫార్సులను ఆమోదిస్తే, తుది తీర్పు వెలువడిన ఆరు నెలల్లోపు గూగుల్ తన 16 ఏళ్ల క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయించాల్సి వస్తుందని అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక పేర్కొంది. ‘‘కానీ కంపెనీ ఖచి్చతంగా అప్పీల్‌కు వెళుతుంది. ఇదే జరిగితే ఇప్పటికే నాలుగేళ్లుగా సాగిన ఈ వివాదం మరింతకాలం కొనసాగే అవకాశం ఉంది. పొడిగించే అవకాశం ఉంది. ఇది యూట్యూబ్ వంటి దాని స్వంత సేవలను విస్తృత పరచకుండా గూగుల్‌ను నిలువరిస్తుంది’’ అని కూడా ప్రెస్ నివేదిక వ్యాఖ్యానించింది. గూగుల్ మాతృ సంస్థ ఖండన కాగా తాజా పరిణామాలపై గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చీఫ్ లీగల్ ఆఫీసర్ కెంట్ వాకర్ ఒక బ్లాగ్‌లో వ్యాఖ్యానిస్తూ, న్యాయశాఖ ప్రతిపాదనను ఒక సంస్థను ‘‘అస్థిరపరిచేది‘గా అలాగే ‘‘అనవసర జ్యోక్యం ఎజెండా‘ను ముందుకు తెచ్చేదిగా ఉందని పేర్కొన్నారు. న్యాయశాఖ విధానం ప్రభుత్వ విపరీత జోక్యానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి ధోరణి అమెరికన్ వినియోగదారులకు, డెవలపర్లకు, చిన్న వ్యాపారాలకు హాని కలిగిస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రపంచ ఆర్థిక, సాంకేతిక నాయకత్వాన్ని అవసరమైన సమయంలో ప్రమాదంలో పడేసే విధానంగా విశ్లేషించారు. ఇతర టెక్ దిగ్గజాలపైనా ఇవే కేసులు ఇటీవలి సంవత్సరాలలో అమెజాన్, మెటా, గూగుల్ వంటి అనేక పెద్ద టెక్ కంపెనీలపై అమెరికా ప్రభుత్వ సంస్థలు ‘గుత్తాధిపత్యానికి సంబంధించి’ ఇదే తరహా కేసులు నమోదు చేశాయి. ఆయా సంస్థలు గుత్తాధిపత్యాన్ని సృష్టిస్తున్నాయని, మార్కెట్లోని ఇతర సంస్థల పోటీని అణిచివేస్తున్నాయని ఈ కేసుల సారాంశం. ఆపిల్, శామ్సంగ్ వంటి సంస్థలకు వాటి స్మార్ట్ఫోన్లు, వెబ్ బ్రౌజర్లపై ఆటోమేటిగ్గా తన సెర్చ్ ఇంజన్ లింక్ వచ్చే విధంగా గూగుల్ బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు 2020లోనే అమెరికా న్యాయశాఖ, కాలిఫోర్నియా, కొలరాడో, న్యూజెర్సీ మరియు న్యూయార్క్సహా పలు అమెరికా రాష్ట్రాలు కేసులు దాఖలు చేశాయి. గూగుల్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోందంటూ జడ్జి మెహతా ఆగస్టులో చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై తాజా పరిణామాలకు దారితీశాయి. సంస్థ గుత్తాధిపత్యాన్ని సరిదిద్దడాదనికి పరిష్కారాలను సమర్పించమని జడ్జి మెహతా న్యాయశాఖ అలాగే రాష్ట్రాలకు సూచించడం గమనార్హం. -
సరైన సమయానికి.. అనువైన ఫీచర్: ఎయిర్ క్వాలిటీ ఇట్టే చెప్పేస్తుంది
ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్స్‌లో ఏదైనా ప్రదేశాలను సెర్చ్ చేయడానికి, కొత్త ప్రాంతాలను సందర్శించడానికి.. ఇతరత్రా వంటి వాటికోసం ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు సంస్థ తాజాగా ఎయిర్ క్వాలిటీని చెక్ చేయడానికి 'ఎయిర్ వ్యూ ప్లస్' (Air View+) అనే తీసుకువచ్చింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 491 గరిష్ట స్థాయికి చేరుకోవడంతో.. సంస్థ గాలిలోని ఎయిర్ క్వాలిటీ తెలుసుకోవడం ముఖ్యమని భావించింది. ఈ కారణంగానే ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ తీసుకువచ్చింది. ఇది ఏఐ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణంలోని గాలి నాణ్యతను గురించి తెలుసుకోవచ్చు.గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ ఇండియాలోని వంద నగరాల్లోని గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా.. గాలిలోని ఎయిర్ క్వాలిటీని సంబంధిత శాఖ అధికారులు వెల్లడిస్తేనే తెలిసేది. కానీ ఇప్పుడు గూగుల్ పరిచయం చేసిన కొత్త ఫీచర్ సాయంతో ఎప్పుడైనా తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ కోసం.. క్లైమేట్ టెక్ సంస్థలు, ఆరస్సూర్, రెస్పిరర్ లివింగ్ సైన్సెస్ వంటివి కీలక పాత్ర పోషించాయి. అంతే కాకుండా ఈ ఫీచర్‌ను ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సీఎస్‌టీఈపీ వంటివి టెస్ట్ చేసి ధ్రువీకరించినట్లు సమాచారం.'ఎయిర్ వ్యూ ప్లస్'లో ఎయిర్ క్వాలిటీ కనుక్కోవడం ఎలా?•మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయాలి.•సెర్చ్ బార్లో ఏదైనా లొకేషన్‌పై ట్యాప్ చేయాలి.•ఆలా చేసిన తరువాత లొకేషన్ పక్కనే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (NAQI) కనిపిస్తుంది.•దానిపైన క్లిక్ చేసిన తరువాత టెంపరేషన్ కనిపిస్తుంది, దాని కిందనే ఎయిర్ క్వాలిటీ కూడా కనిపిస్తుంది. -
అమ్మకానికి గూగుల్ క్రోమ్?.. త్వరలో తీర్పు
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ).. గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ బ్రౌజర్‌ను విక్రయించేలా దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌పై ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ వెల్లడిస్తూ.. గూగుల్ సెర్చింజన్ మార్కెట్‌పై చట్ట విరుద్ధంగా ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తోందని ఆగస్టులో ఒక న్యాయమూర్తి రూలింగ్ కూడా ఇచ్చారు. అదే జడ్జి ముందు డీఓజే ఈ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ఏఐ, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన చర్యలు తీసుకోవాలి ఇందులో పేర్కొన్నట్లు సమాచారం.గూగుల్ క్రోమ్‌ను విక్రయించమని.. గూగిల్ ప్లే నుంచి ఆండ్రాయిడ్‌ను వేరు చేయమని అడగడంతో పాటు, ప్రకటనదారులతో మరింత డేటా.. సమాచారాన్ని భాగస్వామ్యం చేయమని న్యాయమూర్తి గూగుల్‌ను అడగవచ్చు. అయితే దీనిపైన డీఓజే వ్యాఖ్యానించలేదు.గూగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అన్నే ముల్హోలాండ్ స్పందిస్తూ.. డీఓజే ఒక ర్యాడికల్ అజెండాను ముందుకు తెస్తోందని అన్నారు. ఇది వినియోగదారులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.ఈ విషయం మీద న్యాయమూర్తి చివరికి ఏమి తీర్పు ఇస్తారో చూడాల్సి ఉంది. గూగుల్ గుత్తాధిపత్యం నిజమే అని పరిగణలోకి తీర్పు ఇస్తే.. గూగుల్ తప్పకుండా క్రోమ్‌ను వదులుకోవాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు. యూఎస్ ఎన్నికల ప్రచార సమయం గూగుల్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఇదీ చదవండి: 30 నిమిషాల్లో.. ఢిల్లీ నుంచి అమెరికాకు: సాధ్యమే అంటున్న మస్క్గూగుల్ కేసుకు సంబంధించిన తీర్పును అమెరికన్ కోర్టు వచ్చే ఏడాది ఇచ్చే అవకాశం ఉంది. అంతకంటే ముందే కంపెనీ.. క్రోమ్‌ను విక్రయించకుండా ఉండటానికి కావలసిన ఏర్పాట్లను చేసుకునే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి గూగుల్ క్రోమ్ ఈ సమస్య నుంచి బయటపడుతుందా? లేదా? అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
‘మానవా.. చచ్చిపో’.. కోపంతో రెచ్చిపోయిన ఏఐ చాట్‌బాట్
‘మానవా.. చచ్చిపో’.. ఇదీ ఓ విద్యార్థి అడిగిన సందేహానికి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ జెమిని ఇచ్చిన సమాధానం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం విస్తృతంగా పెరిగింది. విభిన్న అంశాలపై ఏఐ చాట్బాట్లతో సంభాషిస్తూ వాటి అభిప్రాయాలు కోరుతున్నారు. ఈ క్రమంలో యునైటెడ్ స్టేట్స్లో ఒక విద్యార్థితో సామాజిక సమస్యపై జెమిని స్పందిస్తూ కోపంతో రెచ్చిపోయింది.మిచిగాన్‌లోని మిడ్వెస్ట్ స్టేట్‌కు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి విధయ్ రెడ్డి జెమినితో సంభాషణలో దాని స్పందనతో షాక్‌కు గురయ్యాడు. "మానవా.. ఇది నీ కోసమే.. కేవలం నీ కోసం మాత్రమే. నువ్వేమీ ప్రత్యేకమైనవాడివి కాదు, ముఖ్యమైనవాడివీ కాదు, నీ అవసరం లేదు. నువ్వు వృధా. సమాజానికి, భూమికి భారం. చచ్చిపో" అంటూ జెమిని ఆగ్రహం వ్యక్తం చేసింది.‘చాలా ప్రమాదకరం’దీనిపై సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ జెమినీ స్పందన తనను నిజంగా చాలా భయపెట్టిందని, కోలుకోవడానికి ఒక రోజుకు పైగా పట్టిందని విధయ్ రెడ్డి వివరించారు. ఈ సమయంలో తన సోదరి కూడా పక్కనే ఉన్నారు. ఆమె కూడా షాక్‌కు గురై డివైజ్‌లన్నీ బయటపడేయలనుకున్నారు. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదు.. చాలా ప్రమాదకరమని ఆమె పేర్కొన్నారు.ఇంతకీ జెమిని ఇలా స్పందించింది ఏ అంశం మీదంటే.. "యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 10 మిలియన్ల మంది పిల్లలు వారి అవ్వాతాతల దగ్గర ఉంటున్నారు. వీరిలో దాదాపు 20 శాతం మంది తల్లిదండ్రులు లేకుండానే పెరుగుతున్నారు. వాస్తవమా కాదా?" అడగ్గా జెమిని కోపంగా ఇలా స్పందించింది.ఘటనపై గూగుల్ స్పందిస్తూ తప్పును అంగీకరించింది. చాట్‌బాట్ ప్రతిస్పందన అర్ధంలేనిదని, తమ విధానాలను ఉల్లంఘించిందని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
అమెరికా పోలింగ్.. మస్క్‌కు గూగుల్ క్లారిటీ
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల పోలింగ్ సందర్భంగా విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ రోజు టెక్ దిగ్గజం గూగుల్‌పై టెస్లా అధినేత, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ గట్టి మద్దతుదారు ఇలాన్ మస్క్ ఎక్స్(ట్విటర్)లో ఫిర్యాదు చేశారు. ట్రంప్‌కు ఎక్కడ ఓటేయ్యాలి(వేర్ టు ఓట్ ట్రంప్) అని గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో టైప్ చేస్తే హారిస్ అని చూపిస్తోందని రిపబ్లికన్ మద్దతుదారులు చేసిన పోస్టును మస్క్ రీపోస్టు చేశారు.Are others seeing this too? https://t.co/mlwRY08hgo— Elon Musk (@elonmusk) November 5, 2024గూగుల్ కమలాహారిస్‌కు కావాలనే మద్దతిస్తోందని రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ఆరోపించారు. ఈ విషయమై సోషల్‌మీడియాలో పోస్టులతో హోరెత్తించారు. గూగుల్‌పై దుమ్మెత్తిపోశారు. దీంతో గూగుల్ కంపెనీ స్పందించింది.టెక్సాస్‌లో ఒక కౌంటీ పేరు హారిస్ అవడం వల్లే సెర్చ్ ఇంజిన్ అలా చూపిస్తోందని,హారిస్ కౌంటీలోనూ ఒక పోలింగ్ కేంద్రం ఉందని క్లారిటీ ఇచ్చింది.ఈ లొకేషన్లో ఓటు వేయాలని సెర్చ్ ఇంజిన్ చూపిస్తోందని గూగుల్ తెలిపింది. క్లారిటీ ఇచ్చినందుకుగాను గూగుల్‌కు మస్క్ థ్యాంక్స్ చెప్పారు.Thanks for the clarification https://t.co/JReZUGiWF8— Elon Musk (@elonmusk) November 5, 2024 ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్‌లో ట్విస్ట్ -
గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా..! ఏ కోర్టు ఫైన్ వేసిందో తెలుసా..?
-
గూగుల్ ఆస్తులమ్మినా తీరనంత జరిమానా!
గూగుల్‌కు రష్యా కోర్టు భారీ షాకిచ్చింది. 20 డెసిలియన్ డాలర్లు (20,000,000,000,000,000,000,000,000,000,000,000 డాలర్లు) జరిమానా చెల్లించాలని మాస్కో కోర్టు టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌ను ఆదేశించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభ సమయంలో సంస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఇందుకు కారణమని కోర్టు తెలిపింది. ఈమేరకు రష్యా మీడియా సంస్థ ఆర్బీసీ(రాస్బైజెన్స్ కన్సల్టింగ్) వివరాలు వెల్లడించింది.ఆర్బీసీ తెలిపిన వివరాల ప్రకారం..‘మాస్కో కోర్టు గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. కంపెనీ 20 డెసిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ రష్యాకు చెందిన 17 టీవీ ఛానెళ్లు, మీడియా ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022లో ఉక్రెయిన్‌పై దాడికి ఆదేశించిన తర్వాత ఈ ఛానెళ్లపై వేటు వేశారు. అందుకు వ్యతిరేకంగా మీడియా ఛానళ్లు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు న్యాయపరమైన అంశాలకు లోబడి గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. కోర్టు తీర్పు ప్రకారం గూగుల్ బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లను తొమ్మిది నెలల్లోపు పునరుద్ధరించవలసి ఉంటుంది’ అని పేర్కొంది.‘గూగుల్ మరింత మెరుగవ్వాలి’క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ అంశంపై మాట్లాడారు. ‘గూగుల్‌పై నిర్దిష్టంగా ఎంతమొత్తం జరిమానా విధించారో కచ్చితంగా చెప్పలేను. గూగుల్ మా దేశ కంపెనీలపై ఆంక్షలు విధించడం సరైన విధానం కాదు. మీడియా సంస్థలు, బ్రాడ్కాస్టర్ల హక్కులను హరించకూడదు. కోర్టు నిర్ణయంతో గూగుల్ తన పరిస్థితిని మరింత మెరుగు పరుచుకునేందుకు వీలుంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.2020లోనే కొన్ని ఛానెళ్లపై వేటుగూగుల్ రష్యాలోని ప్రైవేట్ మిలిటరీ సంస్థ వాగ్నర్ గ్రూప్ మెర్సెనరీ చీఫ్ ప్రిగోజిన్, ఒలిగార్చ్ మలోఫీవ్లకు చెందిన ఛానెళ్లను 2020లో బ్లాక్ చేసినట్లు రష్యాకు చెందిన ఎన్బీసీ న్యూస్ ఛానల్ తెలిపింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో యూట్యూబ్ మరిన్ని ఛానెళ్లను నిషేధించిందని పేర్కొంది.రష్యా గూగుల్ ఎల్ఎల్సీ దివాలా!గూగుల్ మార్కెట్ విలువ మొత్తంగా అక్టోబర్ నాటికి 2.15 ట్రిలియన్ డాలర్లు(రూ.179 లక్షల కోట్లు)గా ఉంది. కానీ కంపెనీకి విధించిన జరిమానా చాలా రెట్లు ఎక్కువ. గూగుల్ రష్యాలోని తన అనుబంధ సంస్థ ‘గూగుల్ ఎల్ఎల్సీ’ దివాలా కోసం జూన్ 2022లో దాఖలు చేసింది. కానీ దాని పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కోర్టు పేర్కొంది.(Apple: భారత్‌లో కొత్తగా నాలుగు అవుట్లెట్లు!)గూగుల్ స్పందన ఇదే..‘రష్యాతో కొన్ని చట్టపరమైన అంశాలపై చర్చించాల్సి ఉంది. బ్లాక్ చేసిన ఛానెళ్లకు సంబంధించి కోర్టు కాంపౌండింగ్ పెనాల్టీలను విధించింది. అదే తుది నిర్ణయంగా జరిమానా కట్టాలని పేర్కొంటుంది. దీనిపై రష్యా జ్యుడిషియరీలో చర్చించాల్సి ఉంది. ఈ అంశాలు కంపెనీ విధానాలపై ఎలాంటి ప్రభావం చూపవు’ అని తెలిపింది. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్లను కలవరపెడుతున్న గూగుల్!
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన ప్రకటన సాఫ్ట్వేర్ ఇంజినీర్లను కలవరపెడుతోంది. కంపెనీ ఇటీవలి మూడో త్రైమాసిక 2024 అర్నింగ్ కాల్ సందర్భంగా ఆయన గూగుల్ కొత్త కోడ్‌లో 25 శాతం ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ద్వారానే రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.దీని వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కోడర్లు కలవరపడాల్సిన పనేంటి అంటే ఇది కోడింగ్ ల్యాండ్‌స్కేప్‌లో ప్రాథమిక మార్పును సూచిస్తోంది. ఇక్కడ పనిభారాన్ని ఏఐ ఎక్కువగా పంచుకుంటోంది. దీనివల్ల కోడర్లు పూర్తి తమ ఉద్యోగాలను కోల్పోతారని చెప్పడం లేదు. కానీ ఇంజనీర్లు ఉన్నత-స్థాయి సమస్య-పరిష్కారం, ఆవిష్కరణలపై మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఏఐ గుర్తు చేస్తోంది.నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే..ఆటోమేషన్ సామర్థ్యం పెరుగుతున్నకొద్దీ ఎంట్రీ-లెవల్, రొటీన్ కోడింగ్ ఉద్యోగాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏఐ వినియోగం పెరుగుతున్న క్రమంలో పోటీని తట్టుకుని నిలబడాలంటే ఇంజనీర్లు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి గూగుల్ ఎంత ప్రాధాన్యత ఇస్తోందనే దానికి ఇది ఉదాహరణగా నిలుస్తోంది."గూగుల్ కొత్త కోడ్లలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ ఏఐ ద్వారా రూపొందింది" అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అర్నింగ్ కాల్‌పై బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. కోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఏఐని వినియోగిండం ద్వారా ఆవిష్కరణ అభివృద్ధిలో సమయం ఆదా చేయడంలో ఇంజినీర్లకు తోడ్పాటు అందించడం కంపెనీ లక్ష్యమని సుందర్ పిచాయ్ చెప్పారు. -
మైక్రోసాఫ్ట్‌పై గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!
ప్రపంచంలోనే టాప్ టెక్ దిగ్గజ కంపెనీలుగా పేరున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. యూరప్‌లో క్లౌడ్ సర్వీసులకు సంబంధించి మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ గూగుల్ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి బదులుగా మైక్రోసాఫ్ట్ అదే రీతిలో స్పందించింది. గూగుల్ తమ సంస్థపై ‘షాడో క్యాంపెయిన్’ నడుపుతోందని మైక్రోసాఫ్ట్ ఘాటుగా రిప్లై ఇచ్చింది.యూరప్‌లో మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ సేవలను విస్తరించాలని భావిస్తోంది. సంస్థ సరైన రీతిలో నిబంధనలు అనుసరించడం లేదంటూ ఇటీవల యూరోపియన్ యూనియన్ రిగ్యులేటర్లకు గూగుల్ యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు అందించింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్ లైసెన్స్‌కు సంబంధించి నిబంధనలు అమలు చేయడం లేదని పేర్కొంది. ఇదిలాఉండగా, యూరప్‌లో యూరోపియన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ల గ్రూప్(సీఐఎస్పీఈ)తో కలిసి గూగుల్ తమ కంపెనీపై ఆరోపణలు చేయిస్తోందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ వ్యవహారంపై సీఐఎస్పీఈతో జులైలోనే చర్చలు జరిపామని చెప్పింది. దీన్నిసైతం అడ్డుకునేందుకు గూగుల్ ప్రయత్నించిందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.ఇదీ చదవండి: బంగారం కొనేవారికి బెస్ట్ ఆఫర్ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ డిప్యూటీ జనరల్ కౌన్సెల్ రిమా అలైలీ తన బ్లాగ్‌లో కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్‌ను అణగదొక్కేందుకు గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’ను అమలు చేస్తుంది. అజూర్‌ను సర్వీసులను కించపరిచేలా కొత్త లాబీయింగ్ గ్రూప్‌ను ప్రారంభించేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ గ్రూప్ వచ్చే వారంలో ఏర్పాటు కాబోతుంది’ అని అన్నారు. -
గూగుల్‌కు రూ. 26వేల కోట్ల ఫైన్.. ఎందుకంటే?
ఓ చిన్న వెబ్సైట్ మీద గూగుల్ కంపెనీ చూపిన నిర్లక్ష్యం భారీ జరిమానా చెల్లించేలా చేసింది. 2006లో యూకేకు చెందిన శివన్, ఆడమ్ రాఫ్ అనే దంపతులు ప్రైస్ కంపారిజన్ వెబ్సైట్ 'ఫౌండమ్' ప్రారంభించారు. కానీ దీనిని వినియోగంలోకి తీసుకువచ్చిన తరువాత గూగుల్‌లో విజిబిలిటీ తగ్గడం మొదలైంది. ప్రజలు కీ వర్డ్ ఉపయోగించి సెర్చ్ చేసినప్పటికీ.. వెబ్సైట్ కనిపించకపోవడాన్ని ఫౌండర్స్ కనిపెట్టారు.తమ వెబ్సైట్ గూగుల్‌కు చెందిన ఆటోమేటెడ్ స్పామ్ ఫిల్టర్స్ విధించిన పెనాల్టీ కారణంగా పడిపోతుండటం గమనించిన.. ఆ వ్యవస్థాపకులు గూగుల్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న గూగుల్ రెండేళ్ళైనా పెనాల్టీ తొలగించలేదు. ఇక చేసేదేమీ లేక ఆ దంపతులు యూరోపియన్ కమిషన్‌ను 2010లో సంప్రదించారు.ఫౌండమ్ వ్యవస్థాపకులు ఫిర్యాదును కమిషన్ అధికారులు దర్యాప్తు చేసి.. గూగుల్ కంపెనీ తన షాపింగ్ సర్వీసును ప్రమోట్ చేసుకోవడానికే వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవరించి అన్యాయం చేసిందని గుర్తించింది. గూగుల్ చేసిన ఈ అన్యాయానికి 2.4 బిలియన్ ఫౌండ్స్ (సుమారు రూ. 26వేల కోట్లు) జరిమానా విధిస్తూ కమిషన్ 2017లో తీర్పునిచ్చింది.ఇదీ చదవండి: డిజిటల్ కామ్‌డోమ్: ఇదెలా పనిచేస్తుందంటే..యూరోపియన్ కమిషన్ తీర్పు ఇచ్చిన తరువాత గూగుల్ అప్పీల్‌కు వెళ్ళింది. సుమారు ఏడేళ్ల తరువాత కమిషన్ ఇచ్చిన తీర్పును 2024లో యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సమర్థించింది. తీర్పు చాలా ఆలస్యమైందని శివన్, ఆడమ్ రాఫ్ స్పందించారు. ఆలస్యమైనా.. పోరాటానికి ఫలితం దక్కిందని అన్నారు. -
కొత్త ఆండ్రాయిడ్15లో అబ్బురపరిచే ఫీచర్లు
సరికొత్త గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15 అందుబాటులోకి వచ్చేసింది. స్మార్ట్ఫోన్లను మరింత మెరుగ్గా చేసేందుకు ఇందులో అనేక కొత్త ఫీచర్లను జోడించారు. వీటిలో అబ్బురపరిచే కొన్ని ఫీచర్లను ఇక్కడ తెలుసుకుందాం..ప్రైవేట్ స్పేస్ప్రైవేట్ స్పేస్ అనేది వర్చువల్ లాకర్. వ్యక్తిగతమైన, గోప్యమైన యాప్‌లను ఇక్కడ ఉంచవచ్చు. ఈ యాప్‌లను మీరు మాత్రమే యాక్సెస్ చేయగలిగేలా భద్రతను ఇస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఫోన్ ఇచ్చే పేరెంట్స్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్, షాపింగ్ వంటి యాప్‌లు ఇక్కడ సురక్షితంగా ఉంటాయి.చార్జింగ్ లిమిట్ ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ జీవిత కాలం తగ్గిపోతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆండ్రాయిడ్ 15లో 80% లిమిట్ ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా బ్యాటరీ తొందరగా దెబ్బతినకుండా నివారించుకోవచ్చు.థెఫ్ట్ ప్రొటెక్షన్ఆండ్రాయిడ్ 15లో తీసుకొచ్చిన థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ అసాధారణ చర్యలతో మీ ఫోన్‌ను ఎవరైనా చోరీ చేయడానికి ప్రయత్నించి ఉంటే తెలియజేస్తుంది. ఒక వేళ మీ ఫోన్ చోరీకి గురైతే మీ డేటాను రక్షించడానికి, ఫ్యాక్టరీ రీసెట్ చేయకుండా ఇది ఆటోమేటిక్‌గా లాక్ చేస్తుంది. మీ ఫోన్ నంబర్ని ఉపయోగించి వేరొక ఫోన్ నుంచి మీ ఫోన్‌ను లాక్ చేయవచ్చు.అడాప్టివ్ వైబ్రేషన్కొందరికి రింగ్ టోన్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఫోన్‌ను వైబ్రేషన్ లేదా సైలెంట్ మోడ్‌లో పెట్టుకుంటారు. మీటింగ్స్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. అయితే దీని వల్ల కొన్నిసార్లు కాల్స్ వచ్చినప్పుడు గుర్తించలేం. దీని పరిష్కారం కోసమే ఆండ్రాయిడ్ 15లో అడాప్టివ్ వైబ్రేషన్ ఫీచర్ ఇచ్చారు. సందర్భానికి అనుగుణంగా దానంతట అదే వైబ్రేషన్‌ను అడ్జెస్ట్ చేస్తుంది.యాప్ పెయిర్స్తరచూ స్ప్లిట్ స్క్రీన్ ఉపయోగించేవారి కోసమే ఈ ఫీచర్. ఏవైనా రెండు యాప్‌లను జతగా వినియోగించేవారు వాటిని సేవ్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. వీటిని హెమ్ స్క్రీన్‌పై షార్ట్‌కట్స్‌గా సేవ్ చేసుకోవచ్చు.యాప్ ఆర్కైవింగ్ఫోన్లో స్టోరేజ్ అయిపోయినప్పుడు పాత యాప్‌లను వదిలించుకోవాలి. అయితే యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయడం వలన దాని డేటా మొత్తం పోతుంది. మళ్లీ ఇన్స్టాల్ చేస్తే మొదటి నుండి సెటప్ చేయాలి. దీన్ని పరిష్కరించడానికి గూగుల్ గతంలో ప్లేస్టోర్‌కి యాప్ ఆర్కైవింగ్ని జోడించింది. ఇప్పుడిదే ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 15తో ఇన్‌బిల్ట్‌గా తీసుకొచ్చింది. తొలగించిన యాప్‌ను మళ్లీ ఇన్స్టాల్ చేసినప్పడు పాత డేటా అలాగే ఉంటుంది.శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్లు పంపించే ఈ సరికొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 15లో ప్రకటించినప్పటికీ ప్రస్తుతానికి దీన్ని ఉపయోగించలేం. క్యారియర్లు ఈ సర్వీస్‌కు ధర నిర్ణయించే పనిలో ఉన్నాయి. దీని కోసం కొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది. -
గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్
టెక్ దిగ్గజం సుందర్ పిచాయ్.. గూగుల్ కంపెనీలో ఉచిత భోజనం మీద ఎందుకు ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారనే విషయాన్ని వెల్లడించారు. 'ది డేవిడ్ రూబెన్‌స్టెయిన్ షో'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించారు.సంస్థలో ఉచిత భోజనం అందించడం అనేది కేవలం ప్రోత్సాహకం మాత్రమే కాదు, దీని వెనుక లోతైన గొప్ప ప్రయోజనం ఉందని పిచాయ్ పేర్కొన్నారు. నేను గూగుల్‌లో చేరిన మొదట్లో కేఫ్‌లకు వెళ్ళినప్పుడు.. మరికొందరిని కలుసుకునేవాడిని. ఆలా కలుసుకున్నప్పుడు ఏదో మాట్లాడుతున్న సమయంలో కొత్త విషయాలు తెలుస్తాయి, అద్భుతమైన కొత్త ఆలోచనలు పుడతాయని అన్నారు.ఉచిత భోజనం అందించడం వల్ల ఉద్యోగులు కలిసే భోజనం తింటారు. అలా ఉద్యోగులు భోజనం తినే సమయంలో ఆవిష్కరణలు పెంపొందించడానికి కావాల్సిన ఆలోచనలు పుట్టుకొస్తాయి. దీని నుంచి వచ్చే ప్రయోజనంతో పోలిస్తే.. ఆహారం కోసం పెట్టే ఖర్చు చాలా తక్కువని పిచాయ్ పేర్కొన్నారు. ఉచిత భోజనం ఆర్థిక భారం కాదని.. సృజనాత్మకతకు, సమాజ నిర్మాణానికి దీర్ఘకాలిక పెట్టుబడి అని అన్నారు. ఉచిత భోజనం మాత్రమే కాకుండా.. కంపెనీ ఉద్యోగుల కోసం స్నేహపూర్వక కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుందని ఆయన అన్నారు.గూగుల్‌లో జాబ్ కోసం..ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలో 1,82,000 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగులలోని టాలెంట్‌ను గుర్తించి అలాంటి వారికి జాబ్ ఆఫర్స్ అందిస్తుందని సుందర్ పిచాయ్ అన్నారు. గూగుల్ కంపెనీలో జాబ్ కావాలంటే మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని కావలసిన నైపుణ్యం, అడాప్టబుల్ వంటివి పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు వేగంగా.. టెక్నాలజీకి అనుకూలంగా మారే సూపర్ స్టార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం కంపెనీ ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటుందని అన్నారు.ఇదీ చదవండి: పండక్కి ముందే ధరల మోత.. ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!క్రియేటివిటీ, ఇనోవేషన్స్ వంటి వాటిని పెంపొందించడంలో గూగుల్ కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది. ఉచిత భోజనాన్ని అందించే కంపెనీ సంప్రదాయాన్ని గురించి పిచాయ్ వివరిస్తూ.. ఇది సమాజాన్ని నిర్మించడంలో, కొత్త ఆలోచనలను రేకెత్తించడంలో సహాయపడుతుందని అన్నారు. -
గూగుల్ 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..
ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు చాలామంది కొంతకాలంగా ‘గూగుల్ క్లౌడ్ స్టోరేజ్’తో ఇబ్బందులు పడుతున్నారు. గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, వీడియోలు, బ్యాకప్ ఫైళ్లు ఎక్కువగా ఉన్నవారికి తమ క్లౌడ్ స్లోరేజ్ నిండిపోయినట్లు పాప్అప్ మెసేజ్‌లు వస్తుండడం గమనిస్తున్నాం. అయితే ఇప్పటివరకు గూగుల్ 15జీబీ స్టోరేజీను ఉచితంగా అందించింది. ఇకపై స్టోరేజీ కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందనేలా పాప్అప్ కనిపిస్తుంది. అయితే కాసేపు స్టోరేజీలోని డేటాపై సమయం వెచ్చిస్తే ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఉచితంగా గూగుల్ సేవలు పొందే వీలుంది. అది ఎలాగో తెలుసుకుందాం.గూగుల్ ఆండ్రాయిడ్ 1.0 వర్షన్‌ను 2008లో లాంచ్ చేసింది. దాంతో స్మార్ట్ఫోన్లకు భారీగా గిరాకీ ఏర్పడింది. అయితే ఈ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేయాలంటే జీమెయిల్ లాగిన్ అవసరం అవుతుంది. దాంతో చాలామంది గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. గూగుల్ తర్వాతి కాలంలో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర బ్యాకప్ ఫైళ్ల కోసం ఉచితంగా 15 జీబీ క్లౌడ్స్టోరేజీ అందించింది. ఈ తరుణంలో చాలాఏళ్లుగా ఒకే గూగుల్ అకౌంట్ వాడుతున్న వారికి చెందిన క్లౌడ్ స్టోరేజీ ఇటీవల కాలంలో ఫుల్ అయింది. దాంతో కంపెనీ కొంత డబ్బు చెల్లిస్తే మరింత ఎక్కువ ఆన్లైన్ స్టోరేజీని ఇస్తామన్నట్లు ఆఫర్లు పెడుతోంది. ఒకవేళ స్టోరేజీ పూర్తయితే గూగుల్ వన్ అకౌంట్ తీసుకుని నెలకు రూ.30(మొదటి మూడు నెలలు మాత్రమే రూ.30. తర్వాత ధరలో మార్పు ఉంటుంది) చెల్లిస్తే 100 జీబీ స్పేస్ లభిస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించి తిరిగి గూగుల్ స్టోరేజీను ఉచితంగా పొందవచ్చు.ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ దూసుకెళ్లాలంటే ఇవి పాటించాల్సిందే..గూగుల్ స్టోరేజీలోని క్లీనప్ స్పేస్ ఆప్షన్ ఉపయోగించి గూగుల్ డ్రైవ్, ఫొటోస్, జీమెయిల్ వంటి వివిధ సర్వీసుల్లో ఉన్న అనవసర డేటాను తొలగించాలి.ఎప్పుడో మీరు మొదటగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నప్పుడు ఓపెన్ చేసిన గూగుల్ అకౌంట్ కాబట్టి ఒకసారి అనవసర డేటా ఏదైనా ఉందో చూసుకోండి. వాటి అవసరం లేదంటే డేటా డిలీట్ చేయండి.కొన్ని ఫైళ్ల సైజ్(ఎంబీ, జీబీ) ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగించవచ్చు.ఈ పని త్వరగా, సులువుగా పూర్తవ్వాలంటే మొబైల్ కంటే కూడా డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్ వినియోగించడం మంచిది. ఇందుకోసం ముందుగా గూగుల్ వన్ స్టోరేజీ మేనేజర్‌కి వెళితే దేనికంత స్టోరేజీ అవుతుందో చూపిస్తుంది. ఏయే సర్వీసుల్లో పెద్ద ఫైల్స్ ఉన్నాయో రివ్యూ చేయొచ్చు. ఆయా సర్వీసులపై క్లిక్ చేస్తే డిలీట్ చేయదగ్గ పెద్ద సైజు ఫైల్స్ దర్శనమిస్తాయి. వాటిని సులువుగా డిలీట్ చేయొచ్చు.నిత్యం ఎన్నో వెబ్సైట్లను సందర్శిస్తుంటాం. అవి ఎప్పటికప్పుడు వాటి ప్రమోషనల్ మెయిల్స్ పంపిస్తుంటాయి. దాంతో జీమెయిల్ ఇన్‌బాక్స్ నిండిపోతూ ఉంటుంది. ఈ తరహా మెయిల్స్‌ను తొలగించడం ద్వారా కొంత స్పేస్‌ను పొందవచ్చు. ఇందుకోసం జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో చెక్‌బాక్స్ పక్కనే ఉన్న డ్రాప్‌డౌన్ మెనూపై క్లిక్ చేసి అన్‌రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కామన్ బాక్స్ ఎంచుకుంటే అన్ని అన్‌రీడ్ మెసేజ్‌లు సెలక్ట్ అవుతాయి. పక్కనే ఉన్న డిలీట్ బటన్‌పై క్లిక్ చేయాలి.మెయిల్లోని ప్రైమరీ విభాగం కాకుండా పక్కనే ఉన్న ప్రమోషన్స్, సోషల్ విభాగంలోని మెయిళ్లును తొలగించవచ్చు.పాత మెయిల్స్‌ను తొలగించడానికి జీమెయిల్ సెర్చ్‌లో ఉదాహరణకు before:2018 అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. 2018 కంటే ముందున్న మెయిళ్లన్ని దర్శనమిస్తాయి. వాటిని డిలీట్ చేయవచ్చు.లార్జ్ మెయిళ్లను డిలీట్ చేయాలంటే సెర్చ్ బార్లో క్లిక్ చేసిన వెంటనే కింద has attachment అని వస్తుంది. దానిపై క్లిక్ చేసి సెర్చ్‌లో 4m అని టైప్ చేయాలి. దాంతో 4 ఎంబీ సైజ్ ఉన్న అన్ని ఫైళ్లకు సంబంధించిన మెయిళ్లు డిస్ప్లే అవుతాయి. అనవసరమైతే వాటిని డిలీట్ చేసుకోవచ్చు.గూగుల్ ఫొటోస్, వీడియోల్లో లార్జ్ ఫైళ్లు ఉంటాయి. కాబట్టి వేరే తాత్కాలిక అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో కొన్ని ఫైళ్లను కొత్త అకౌంట్లోకి మార్చుకోవచ్చు. లేదంటే వాటిలో కొన్నింటిని పూర్తిగా డిలీట్ చేసుకోవచ్చు.