భారత్‌లోకి గూగుల్‌ వాలెట్‌ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే? | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి గూగుల్‌ వాలెట్‌ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?

Published Wed, May 8 2024 9:11 PM

Google Wallet App Launched For Android Users In India

న్యూఢిల్లీ: గూగుల్ తన డిజిటల్ వాలెట్ అప్లికేషన్ గూగుల్ వాలెట్‌ను భారత్‌లో విడుదల చేసింది. గూగుల్‌ ఈ యాప్‌ను తొలిసారి 2022లో అమెరికాలో లాంచ్‌ చేసింది. రెండు సంవత్సరాల తర్వాత భారత్‌ వినియోగదారులకు పరిచయం చేసింది.  

గూగుల్‌ వాలెట్‌అంటే ఏమిటి?
గూగుల్‌ వాలెట్‌ వివిధ డిజిటల్ ఆస్తులను ఒకే అనుకూలమైన ప్రదేశంలో స్టోర్‌ చేసుకునేందుకు అనుమతిస్తుంది. యాప్‌లో బోర్డింగ్ పాస్‌లు, లాయల్టీ కార్డ్‌లు, ఈవెంట్ టిక్కెట్‌లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పాస్‌లు, గిఫ్ట్ కార్డ్‌లు ఇతర డిజిటల్‌ డాక్యుమెంట్లను  భద్రపరుచుకోవచ్చు.  

గూగుల్‌పేపై ప్రభావం 
గూగుల్ వాలెట్ లాంచ్‌తో గూగుల్‌ పే యాప్‌ పనిచేస్తోందా? అనే అనుమానాలపై గూగుల్‌ స్పందించింది. గూగుల్‌ వాలెట్‌ వల్ల గూగుల్‌ పే వల్ల ఎలాంటి ప్రతి కూల ప్రభావం చూపదని గూగుల్‌ స్పష్టం చేసింది.  

గూగుల్‌ పేకి, గూగుల్‌ వాలెట్‌కి మధ్య తేడా  
చెల్లింపు కార్డ్‌లను గూగుల్‌ వ్యాలెట్‌కు అనుసంధానిస్తే.. గూగుల్‌ పే పనిచేసే ఎక్కడైనా ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు చేయొచ్చు.  

ప్రధాన కంపెనీలతో భాగస్వామ్యం 
పీవీఆర్‌ ఐనాక్స్, ఫ్లిప్‌కార్ట్, ఎయిర్ ఇండియా, షాపర్స్ స్టాప్, ఇక్సిగోతో పాటు ఇతర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారతదేశంలో గూగుల్ వాలెట్ ప్రారంభించిన సందర్భంగా గూగుల్ ప్రకటించింది.

ఎక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి 
గూగుల్‌ వాలెట్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, లాయల్టీ కార్డ్‌లు, గిఫ్ట్ కార్డ్‌లను ఒక అనుకూలమైన ప్లాట్‌ఫారమ్‌లో నిల్వ చేయడానికి దాన్ని ఉపయోగించవచ్చు.
 

Advertisement
Advertisement