
ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఆ రాష్ట్రంలో బీజేపీ కేవలం ఒక్క స్థానంలో గెలుస్తుందన్నారు.
ఇండియా కూటమి అభ్యర్థి ఉజ్వల్ రామన్‌కు మద్దతుగా ప్రయాగ్‌రాజ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి మాత్రమే బీజేపీ గెలుస్తుందన్నారు. మిగిలిన సీట్లులో తాము విజయం సాధించనున్నట్లు తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని, కాంగ్రెస్ దానిని కాపాడేందుకు కృషి చేస్తోందన్నారు.
అనంతరం, రైతులకు, నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు కొత్త చట్టాల్ని అమలు చేస్తామని అన్నారు. అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి.. గతంలో మాదిరిగానే సాయుధ దళాలలో రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment