గూగుల్‌ అనువాదం ఎఫెక్ట్‌.. పట్టాలెక్కిన ‘మర్డర్‌ ఎక్స్‌ప్రెస్‌’ | Sakshi
Sakshi News home page

గూగుల్‌ అనువాదం ఎఫెక్ట్‌.. పట్టాలెక్కిన ‘మర్డర్‌ ఎక్స్‌ప్రెస్‌’

Published Sat, Apr 13 2024 5:13 PM

Mistranslation By Railways Changed Train's Name To Murder Express - Sakshi

కొచ్చి: గూగుల్‌ అనువాదంతో బుక్కైన  రైల్వే అధికారులు సోషల్‌​ మీడియాలో తెగ ట్రోలింగ్‌ ఎదుర్కొంటున్నారు. కేరళలోని ఓ రైలు పేరు హటియా-ఎర్నాకులం అని హిందీ ఇంఘ్లీష్‌లో ఉండగా హటియాను అనువదించి మళయాలంలో హత్య(మర్డర్‌) అని అర్థం వచ్చేలా ‘కొలపతకం’ అని  బోర్డుపై రాశారు. దీంతో రైలు పేరు కాస్తా మర్డర్‌ ఎక్స్‌ప్రెస్‌గా మారిపోయింది.

ఈ వ్యవహారంలో రైల్వే అధారులపై సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రైలు నేమ్‌ ప్లేట్‌ను ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్‌ చేస్తూ ‘ష్‌..వారికి ఎవరూ చెప్పొద్దు’ అని ఒక నెటిజన్‌ సెటైర్‌ వేశారు. గూగుల్‌ అనువాదంపై పూర్తిగా ఆధారపడ్డ ఫలితం అని మరో నెటజన్‌ చురకంటించారు.

రైలు పేరు విషయంలో అనువాదం బెడిసికొట్టిన వ్యవహారంపై రాంచీ డివిజన్‌ సీనియర్‌ రైల్వే అధికారి స్పందించారు. ఇది తప్పుడు అనువాదం వల్ల వచ్చిన సమస్యని, తమ దృష్టికి రాగానే నేమ్‌ప్లేట్‌ సరి చేశామని తెలిపారు. రాంచీలోని హటియా నుంచి ఎర్నాకులానికి ఎక్స్‌ప్రెస్‌ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. 

ఇదీ చదవండి.. బోర్న్‌వీటాపై కేంద్రం కీలక ఆదేశాలు

Advertisement
Advertisement