టీడీపీ ఫేక్‌ కాల్స్‌ | Sakshi
Sakshi News home page

టీడీపీ ఫేక్‌ కాల్స్‌

Published Sun, May 12 2024 12:25 PM

టీడీపీ ఫేక్‌ కాల్స్‌

ప్రభుత్వంపై బురద జల్లుతూ

ప్రజలకు ఫోన్లు

స్పామ్‌ కాల్స్‌గా పేర్కొంటూ

బ్లాక్‌ చేస్తున్న వినియోగదారులు

అంబాజీపేట: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రభుత్వంపై టీడీపీ ఫేక్‌ కాల్స్‌ ద్వారా దుష్ప్రచారం సాగిస్తోంది. ప్రభుత్వ పనితీరు బాగోలేదని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఓటు వేయాలంటూ ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఊదరగొడుతోంది. పదేపదే ఫేక్‌ కాల్స్‌తో ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది. టీడీపీ సాగిస్తున్న ఊకదంపుడు ప్రచారంపై సెల్‌ఫోన్‌ వినియోగదారులు తమదైన శైలిలో తిరుగు సమాధానమిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాల్లో లోపాలంటూ ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సంభాషణలు చేయడంతో పాటు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా భూములు లాగేసుకుంటున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈవిధంగా ప్రతి వినియోగదారుకూ రోజుకు ఐదు నుంచి పది కాల్స్‌ టీడీపీ నుంచే వస్తున్నాయి. ఈ కాల్స్‌ మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ తదితర ప్రాంతాల నుంచి వస్తున్నట్టు కొంతమంది గుర్తిస్తున్నారు. టీడీపీ నుంచి వస్తున్న కాల్స్‌ను బ్లాక్‌ చేస్తూ వాటిని స్పామ్‌ కాల్స్‌గా పేర్కొంటూ వినియోగదారులు తిప్పికొడుతున్నారు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో కొత్త నంబర్లతో వస్తున్న ఈ ఫేక్‌ కాల్స్‌పై ఎన్నికల సంఘం దృష్టి సారించాల్సి ఉంది.

యూత్‌ ఓటింగ్‌లో

కుర్రాళ్లే అధికం

కొవ్వూరు: సాధారణంగా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉంటారు. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారిలో పురుష ఓటర్లే ఎక్కువగా ఉండటం విశేషం. యువతుల కంటే 7,317 మంది యువకుల ఓట్లు అధికంగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 18–19 ఏళ్ల ఓటర్లలో యువతులకంటే 2,971 మంది యువకులే అధికంగా ఉన్నారు. జిల్లా లో మొత్తం ఓటర్లు 16,23,149 మంది. వారిలో పురుషులు 7,92,317 మంది, కాగా మహిళలు 8,30,735 మంది, ఇతరులు 97 మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే 38,418 ఎక్కువగా ఉన్నారు. యువతలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా 18–29 మధ్య వయసు యువతుల ఓట్లు 1,59,686 కాగా, యువకుల ఓట్లు 1,67,003 ఉన్నాయి. యువతుల కంటే యువకుల ఓట్లు అత్యధికంగా రాజానగరం నియోజకవర్గంలో 2,149, అత్యల్పంగా నిడదవోలులో 315 ఓట్లు

ఉన్నాయి. కొవ్వూరులో 875, అనపర్తిలో 1,701, గోపాలపురంలో 753, రాజమహేంద్రవరం సిటీలో 1,706, రాజమహేంద్రవరం రూరల్‌లో 1,831 చొప్పున యువకుల ఓట్లు యువతుల కంటే అధికంగా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement