రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం

Published Mon, Jul 8 2019 7:37 AM

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టనుంది. వైఎస్సార్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో ప్రారంభమయ్యే రైతు దినోత్సవ కార్యక్రమాలు సాయంత్రం వరకూ కొనసాగుతాయి. ప్రభుత్వ సంస్థలతో పాటు వైఎస్సార్‌సీపీ రైతు విభాగం, పలు రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా రైతు దినోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

Advertisement