టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌..?

Published on Mon, 06/24/2024 - 14:00

టీమిండియా వచ్చే నెలలో జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ కోసం టీమిండియాను త్వరలో ఎంపిక చేయనున్నారు. 20 మంది ప్రాబబుల్స్‌​ జాబితాను ఇదివరకే ఎంపిక​ చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి అని తెలుస్తుంది.

అయితే ఈ పర్యటనకు కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై గత కొద్ది రోజులుగా సందిగ్దత నెలకొంది. సెలెక్టర్లు సీనియర్లు రోహిత్‌, విరాట్‌, బుమ్రాలకు రెస్ట్‌ ఇవ్వాలని ముందే అనుకున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా లేక సూర్యకుమార్‌ యాదవ్‌లలో ఎవరో ఒకరు టీమిండియా సారధిగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతుంది.

తాజాగా ఈ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. బీసీసీఐకి చెందిన కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు శుభ్‌మన్‌ గిల్‌ జింబాబ్వే పర్యటలో టీమిండియా సారధిగా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. ఈ పర్యటనకు ఎంపిక చేసే జట్టులో టీ20 వరల్డ్‌కప్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌లు ఆవేశ్‌ ఖాన్‌, ఖలీల్‌ అహ్మద్‌, రింకూ సింగ్‌లతో పాటు ఐపీఎల్‌-2024 హీరోలు అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్‌, నితీశ్‌ రెడ్డి, తుషార్‌ దేశ్‌పాండే, హర్షిత్‌ రాణా ఉంటారని సమాచారం.

వీరితో పాటు టీ20 వరల్డ్‌కప్‌ రెగ్యులర్‌ జట్టులో సభ్యులైన సంజూ శాంసన్‌, యశస్వి జైస్వాల్‌ కూడా జింబాబ్వే పర్యటనకు ఎంపిక కానున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది ప్రచారమే అయినప్పటికీ మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 
 

Videos

హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్

సంకల్పంతో... సముద్రాన్నే వంచిన వీరుడి కథ..!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు: Harish Rao

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో జగన్ బర్త్ డే

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

ఫ్యాన్స్‌కు భారీ షాక్ నితీశ్రీ రెడ్డి ఔట్?

వైఎస్ జగన్ కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

జనరంజక పాలనకు కేరాఫ్ వైఎస్ జగన్

Photos

+5

భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి (ఫోటోలు)

+5

#AnasuyaBharadwaj : వావ్.. వాట్ ఏ లుక్.. అనసూయ (ఫోటోలు)

+5

World Saree Day 2024: సెలబ్రిటీల బ్యూటిఫుల్‌ శారీ లుక్స్

+5

కియా కొత్త కారు 'సిరోస్' ఇదే.. ఫోటోలు చూశారా?

+5

శ్రీకాకుళం : జోరువానలో శ్రీలీల చూసేందుకు అభిమానుల ఉత్సాహం (ఫొటోలు)

+5

భార్యకు రోహిత్‌ శర్మ బర్త్‌ డే విషెస్‌.. పోస్ట్‌ వైరల్‌

+5

ఏపీ అంతటా ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు (ఫొటోలు)

+5

పసుపు చీరలో ప్రగ్యా.. చూస్తే ఆహా అంటారేమో! (ఫొటోలు)

+5

సోనియా పెళ్లిలో బిగ్‌బాస్ 8 సెలబ్రిటీస్.. మొత్తం రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

మా నమ్మకం నువ్వే అన్నా..(ఫొటోలు)