హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్
Breaking News
వారెవ్వా బుమ్రా.. ఏమైనా బాల్ వేశాడా! దెబ్బకు సాల్ట్ ఫ్యూజ్‌లు ఔట్(వీడియో)
Published on Fri, 06/28/2024 - 01:28
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సంచలన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. తాజాగా ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా ఇంగ్లండ్‌తో సెకెండ్ సెమీఫైనల్లో బుమ్రా కళ్లు చెదిరే బంతితో మెరిశాడు.
ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను బుమ్రా అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన బుమ్రా బ్యాటర్లతో మైండ్ గేమ్స్ ఆడాడు. బుమ్రా తొలి రెండు బంతులను మొయిన్ అలీకి స్లో డెలివరీలగా సంధించాడు.
మొయిన్ రెండో బంతికి సింగిల్ తీసి సాల్ట్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతిని ఫుల్ పేస్‌తో బౌల్ చేశాడు. ఈ క్రమంలో నాలుగో బంతి స్లో డెలివరీగా వస్తుందని భావించిన సాల్ట్‌కు బుమ్రా ఊహించని షాకిచ్చాడు. బుమ్రా నాలుగో డెలివరీని ఫుల్ పేస్‌తో పర్ఫెక్ట్ ఆఫ్-కట్టర్‌గా బుమ్రా సంధించాడు.
దీంతో సాల్ట్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్బుతంగా కట్ అయి లెగ్‌స్టంప్‌ను గిరాటేసింది. దీంతో ఒక్కసారిగా సాల్ట్ షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tags