హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్
Breaking News
టీమిండియా ఒక అద్భుతం.. అదే మా కొంపముంచింది: ఇంగ్లండ్ కెప్టెన్
Published on Fri, 06/28/2024 - 15:56
టీ20 వరల్డ్‌కప్-2024లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ ప్రయాణం ముగిసింది. గురువారం గయానా వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ చేతిలో 68 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన ఇంగ్లండ్.. ఈ మెగా టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది.
ఈ సెమీస్ పోరులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లీష్ జట్టు విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లో కెప్టెన్ రోహిత్ శర్మ(57), సూర్యకుమార్ యాదవ్(47) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.
అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బౌలర్ల దాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తిప్పేశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ తలా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.
వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(25) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో భారత్ ఫైనల్ చేరగా.. ఇంగ్లండ్ స్వదేశానికి పయనమైంది. ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించాడు.
అదే మా కొంపముంచింది: బట్లర్
ఈ మ్యాచ్‌లో భారత్ మాకంటే అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్‌లో భారత్‌కు అదనంగా 20 నుంచి 25 పరుగులు సమర్పించుకున్నాము. బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్‌పైనా కూడా భారత బ్యాటర్లు అద్బుతంగా ఆడారు. కాబట్టి కచ్చితంగా ఈ విజయానికి వారు అర్హలు.
గత వరల్డ్‌కప్(2022) కంటే ఇక్కడ పరిస్థితులు పూర్తిగా విభిన్నం. ఇటువంటి పరిస్ధితుల్లో కూడా భారత్ తమ మార్క్ చూపిస్తోంది. నిజంగా భారత బ్యాటర్లు బాగా ఆడారు. వర్షం పడిన తర్వాత పిచ్ కండిషీన్స్ ఇంతగా మారతాయని ఊహించలేదు. భారత్ అద్బుతంగా ఆడి అంచనా వేసిన స్కోర్ కంటే ఎక్కువగా సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఎటువంటి ప్రభావం చూపలేదు. మా స్పిన్నర్లు రషీద్, లివింగ్ స్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తున్నప్పడు మొయిన్ అలీతో బౌలింగ్ చేసి ఉంటే బాగుండేది. కానీ మేము అలా చేయలేదు.
ఇది కొంతవరకు ప్రభావం చూపిందని నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికి ఈ టోర్నీలో మా మా బాయ్స్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. నిజంగా చాలా గర్వంగా ఉందని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో బట్లర్ పేర్కొన్నాడు.
Tags