భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా ఫైన‌ల్.. అంపైర్‌లు వీరే! ఐరెన్ లెగ్‌లకు చోటు

Published on Fri, 06/28/2024 - 21:53

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2024లో ఫైన‌ల్ పోరుకు స‌మ‌యం అస‌న్న‌మ‌వుతోంది. జూన్ 29(శ‌నివారం) బార్బోడ‌స్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ ఫైన‌ల్ మ్యాచ్ కోసం అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అంపైర్‌ల జాబితాను ప్ర‌క‌టించింది.

ఈ టైటిల్ పోరులో న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గాఫ్నీ, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించ‌నున్నాడు. అదే విధంగా థ‌ర్డ్ అంపైర్‌గా రిచర్డ్ కెటిల్‌బరో, ఫోర్త్ అంపైర్‌గా రోడ్‌ టక్కర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

అయితే ఈ జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్‌లు రిచర్డ్ కెటిల్‌బరో, ఇల్లింగ్‌వర్త్ ఉండ‌టం భార‌త ఫ్యాన్స్ టెన్ష‌న్ ప‌డుతున్నారు. గ‌త నాలుగేళ్లలో ఐసీసీ టోర్నీల్లో వీరు అంపైర్‌లుగా వ్య‌వ‌హ‌రించిన నాలుగు నాకౌట్ మ్యాచ్‌ల్లో భార‌త్ ఓట‌మి పాలైంది. 

2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ఇల్లింగ్‌వర్త్, కెటిల్‌బరో ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ప‌రాజ‌యం పాలైంది. ఆ త‌ర్వాత 2021 డ‌బ్ల్యూటీసీ ఫైనల్‌లో, ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా ఉండగా, కెటిల్ బ‌రో టీవీ అంపైర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఈ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ చేతిలో భార‌త్ ఓట‌మి చ‌విచూసింది. 

అనంత‌రం 2023 డ‌బ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా ఇదే జ‌రిగింది. ఆసీస్ చేతిలో భార‌త్ ఓడిపోయింది. ఇక చివ‌ర‌గా వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2023లో కూడా వీరిద్ద‌రూ ఆన్-ఫీల్డ్ అంపైర్లగా వ్య‌హ‌రించారు. మ‌రి ఈసారి వీరిద్ద‌రూ ఫైన‌ల్ మ్యాచ్‌ అంపైర్‌ల జాబితాలో ఉండ‌డంతో ఏమి జ‌రుగుతుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
 

Videos

హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్

సంకల్పంతో... సముద్రాన్నే వంచిన వీరుడి కథ..!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు: Harish Rao

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో జగన్ బర్త్ డే

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

ఫ్యాన్స్‌కు భారీ షాక్ నితీశ్రీ రెడ్డి ఔట్?

వైఎస్ జగన్ కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

జనరంజక పాలనకు కేరాఫ్ వైఎస్ జగన్

Photos

+5

భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి (ఫోటోలు)

+5

#AnasuyaBharadwaj : వావ్.. వాట్ ఏ లుక్.. అనసూయ (ఫోటోలు)

+5

World Saree Day 2024: సెలబ్రిటీల బ్యూటిఫుల్‌ శారీ లుక్స్

+5

కియా కొత్త కారు 'సిరోస్' ఇదే.. ఫోటోలు చూశారా?

+5

శ్రీకాకుళం : జోరువానలో శ్రీలీల చూసేందుకు అభిమానుల ఉత్సాహం (ఫొటోలు)

+5

భార్యకు రోహిత్‌ శర్మ బర్త్‌ డే విషెస్‌.. పోస్ట్‌ వైరల్‌

+5

ఏపీ అంతటా ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు (ఫొటోలు)

+5

పసుపు చీరలో ప్రగ్యా.. చూస్తే ఆహా అంటారేమో! (ఫొటోలు)

+5

సోనియా పెళ్లిలో బిగ్‌బాస్ 8 సెలబ్రిటీస్.. మొత్తం రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

మా నమ్మకం నువ్వే అన్నా..(ఫొటోలు)