హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్
Breaking News
ముత్యాలే డ్రెస్సులుగా!
Published on Fri, 12/20/2024 - 09:22
ముత్యాల ఆభరణాలు మనసును ఆహ్లాదంగా మార్చేస్తాయి. ముత్యాల వరసలతో చేసిన డ్రెస్సులు వేసుకుంటే.. వేడుకలలో హైలైట్‌గా నిలుస్తున్న ఈ స్టైలిష్ డ్రెస్సులను సెలబ్రిటీలే కాదు నవతరమూ కోరుకుంటోంది.వెస్ట్రన్, ఇండియన్ పార్టీ ఏదైనా ముత్యాల డిజైనరీ డ్రెస్సులను ధరిస్తున్నారు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.
సాధారణంగా ఆభరణాలలో చూసే ముత్యాలను డ్రెస్ డిజైనింగ్‌లో విరివిగా ఉపయోగిస్తున్నారు. అందుకే, ముత్యాలు ఇటీవల ఫ్యాషన్‌లో కీలకమైన అంశంగా మారాయి.
తెలుపు, సిల్వర్, వైట్ గోల్డ్ కాంబినేషన్‌లో ఉన్న మెటీరియల్‌పైన తెల్లని ముత్యాలను మరింత ఆకర్షణీయమైన ఎంపికగా డిజైనర్లు ఎంచుకుంటున్నారు. ఈ తరహా దుస్తులు స్వచ్ఛతకు, క్లాసీ లుక్‌కు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
శారీస్, స్కర్ట్స్ మీదకు టాప్స్‌గా ఉపయోగించే వాటిలో కోర్ జాకెట్స్, ష్రగ్స్, బ్లౌజ్ బ్యాక్ డిజైన్‌కి ఎక్కువ శాతం ముత్యాల వరసలను ఎంచుకుంటున్నారు.
లెహంగా, శారీ ఎంబ్రాయిడరీలోనూ జర్దోసీ, సీక్వెన్స్‌తోపాటు కాంబినేషన్‌గా ముత్యాల వరసలు విరివిగా కనిపిస్తున్నాయి.
వింటర్–సమ్మర్ పార్టీవేర్‌కి, ఇండోవెస్ట్రన్ స్టైల్స్‌కి చిన్న, పెద్ద ముత్యాలను ఉపయోగిస్తూ చేసే డ్రెస్ డిజైన్స్ ఆకర్షణీయమైన ఎంపికగా మారింది.
ముత్యాలతో చేసే డిజైన్స్ ఖరీదులో ఘనంగా ఉంటే వాటి స్థానంలో ఉపయోగించే వైట్ బీడ్స్‌తో రెప్లికా డిజైన్లు యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీనితో తక్కువ ఖరీదులోనూ ఈ తరహా డిజైన్స్ లభిస్తున్నాయి.
ఈ డిజైనరీ డ్రెస్సులే ఓ పెద్ద అట్రాక్షన్ కావడంతో మరే ఇతర ఆభరణాలు, హంగుల అవసరం ఉండదు.
(చదవండి: కృష్ణభక్తురాలిగా ఐపీఎస్ అధికారిణి .. పదేళ్ల సర్వీస్ ఉండగానే..)
Tags