హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్
Breaking News
మేకప్ వేసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చెయ్యకండి..
Published on Fri, 12/20/2024 - 09:40
మేకప్ అందంగా కనిపించడానికే కాదు ఆత్మవిశ్వాసాన్నీ కలిగిస్తుంది. అయితే, మేకప్ ఉత్పత్తుల ఎంపికలోనూ, వాడకంలోనూ సాధారణంగా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటిని నివారించడానికి సరైన అవగాహన ఉండాలి.
వాతావరణానికి తగిన విధంగా మేకప్ ఉత్పత్తులు సీజన్‌ని బట్టి వాడేవి ఉంటాయి. అందుకని, బ్రాండ్ అని కాకుండా ప్రొడక్ట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. వేడి, చలి వాతావరణానికి తగిన నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవాలి. దీంతో పాటు అవి తమ చర్మ తత్త్వానికి ఎలా ఉపయోగపడతాయో చెక్ చేసుకోవాలి. అందుకు ప్రొడక్ట్స్ అమ్మేవారే స్కిన్ టెస్ట్‌కి అవకాశం ఇస్తారు.
శుభ్రత ముఖ్యం
మేకప్ వేసుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. చాలా మంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. కానీ, అప్పటికే చర్మంపై పేరుకుపోయిన జిడ్డు, దుమ్ము కణాలు చేరుతాయి. ముఖం శుభ్రం చేయకుండా మేకప్ వేసుకుంటే బ్యాక్టీరియా ఎక్కువ వృద్ధి చెందుతుంది. దీనివల్ల కూడా ముఖ చర్మం త్వరగా పాడవుతుంది.
సాధారణ అవగాహన
లైనర్, ఫౌండేషన్, కాజల్.. ఇలా ఏ మేకప్ ప్రొడక్ట్ ఉపయోగించినా కొన్ని మిస్టేక్స్ సహజంగా జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు మేకప్ పూర్తిగా తీసేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఫౌండేషన్ అయితే బ్లెండింగ్ బాగా చేయాలి. ఎంత బాగా బ్లెండ్ చేస్తే లుక్ అంత బాగా వస్తుంది. బ్యూటీ ప్రొడక్ట్ ఎంత అవసరమో అంతే వాడాలి. లేదంటే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. మేకప్‌లో ఫేస్ షేప్, స్కిన్ టోన్, బాడీకి తగినట్టు కూడా మేకప్ ఉంటుంది. ఇందుకు ముందుగా నిపుణుల సూచనలు తీసుకోవచ్చు.
మరికొన్ని...
నాణ్యమైనవి, ఖరీదైనవి అని కాకుండా తమ స్కిన్ టోన్‌కి తగిన మేకప్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవాలి.
మేకప్‌కి ఒకరు వాడిన టవల్, బ్రష్, స్పాంజ్ వంటివి మరొకరు ఉపయోగించకూడదు. వాటిని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతనే తిరిగి వాడాలి.
రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్ తొలగించాలి. లేక;yతే స్వేదరంధ్రాలు మూసుకు;yయి, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది.
ఫౌండేషన్‌ని ఒకసారి ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే హెవీగా కనిపిస్తుంది. తక్కువ మొత్తాన్ని అప్లై చేసి, పూర్తిగా బ్లెండ్ చేయాలి.
మేకప్ ట్రెండ్స్‌ని అనుసరించడం కన్నా, తమ ముఖానికి నప్పే అలంకరణను ఎంచుకోవడం మేలు.
రోజంతా ఉన్న మేకప్ పైన మరొకసారి టచప్ చేయకపోవడమే మంచిది. మస్కారా వంటివి మరొక కోట్ వేయకుండా బ్రష్‌ను తడిపి, కనురెప్పలపై అద్దవచ్చు.
లిప్‌స్టిక్‌ను ఉపయోగించే ముందు లిప్ బ్రష్‌ను వాడితే, అలంకరణ నీటుగా వస్తుంది.
– శ్రీలేఖ, మేకప్ ఆర్టిస్ట్
Tags