హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్
Breaking News
ముంబై పడవ ప్రమాదం: అమ్మను కాపాడుకోలేక పోయా.. గౌతమ్ గుప్తా
Published on Fri, 12/20/2024 - 14:49
సాక్షి, ముంబై: ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో జరిగిన పడవ ప్రమాదం ఘటనలో అనేక మంది తమ ఆతీ్మయులను బంధుమిత్రులను కోల్పోగా మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. పర్యాటకులతో బయల్దేరిన నీల్‌కమల్ అనే పడవను నేవీ బోట్ ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులతోపాటు మొత్తం 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన ముంబైతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో బయటపడ్డ కొందరు మీడియాకు తెలిపిన వివరాలు అక్కడి పరిస్థితి ఎంత హృదయవిదారకంగా ఉన్నాయో చెబుతున్నాయి. చావు దగ్గరికి వెళ్లి బయటిపడిన వారు చెప్పిన వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం.
ప్రమాదంలో 14 నెలల చిన్నారి..
పడవ ప్రమాదంలో వైశాలి అడకణేతోపాటు వారి కుటుంబీకులు సురక్షితంగా బయటపడ్డారు. ముంబై కుర్లాలో నివసించే వైశాలి తన 14 నెలల కుమారుడిని రక్షించుకునేందుకు ప్రయతి్నంచింది. అనంతరం ఆమె సోదరుడు అంటే చిన్నారి మేనమామ తన భుజంపై ఆ పాపను సుమారు 30 నిమిషాలపాటు సముద్రం నీటిలో ఈదుతూ బయటపడ్డట్టు తెలిపింది. ‘నాతోపాటు మొత్తం ఎనిమిది మంది పడవలో ఎలిఫెంటా బయల్దేరాం. అయితే పడవలో బయల్దేరిన కొద్ది సేపటికి ఒక్కసారిగా ఓ నేవీ స్పీడ్ బోట్ వేగంగా చక్కర్లు కొడుతూ మా పడవను వేగంగా ఢీ కొట్టింది. ఢీ కొట్టిన తర్వాత అసలేం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కాలేదు. పడవ నడిపేవారు వెంటనే వారి వద్ద ఉన్న లైవ్‌జాకెట్లను అందరికీ అందించారు. కానీ చాలామంది ఉండటంతో కొందరికి మాత్రమే జాకెట్లు అందాయి. ఇది జరిగిన కొంత సమయానికి ఒకవైపు పడవ సముద్రంలోకి ఒరగడం ప్రారంభమైంది. దీంతో పడవ క్రమంగా మునగసాగింది. అరుపులు పెడ»ొబ్బలతో పడవలోని పరిసరాలు భయాందోళనలు రేకేత్తించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే మేమందరం సముద్రంలో పడిపోసాగాం. కొందరు పడవలోనే ఉండిపోయారు. అయితే తాము సముద్రంలో పడిపోగానే పడవను పట్టుకున్నాం. చావు ముందు ఉన్నాం. ఏం చేయాలో తెలియడంలేదు. నా చేతిలో 14 నెలల బాబు ఉన్నాడు. ఎలాగైనా బాబును బతికించుకోవాలని మనసులో అనుకున్నాను. అంతలోనే నా అన్న బాబుని తన భుజం పైకెత్తుకున్నారు. నీళ్లలో ఉండి ఒక చేత్తో పడవను మరో భుజంపై నా బాబును ఇలా సుమారు 30 నిమిషాలపాటు అలాగే ఉన్నాడు. ఇక మా మరణం తప్పదని అనుకునే సమయంలోనే రెండు మూడు పడవలు మావైపు వచ్చాయి. అనంతరం ఆ బోటులోని వారు మమ్మల్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇంకా ఐదు నిమిషాలు ఆలస్యమై ఉంటే మేమంతా చనిపోయేవాళ్లం’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు ఈ ఘటనలో ఓ ఇద్దరు విదేశీయులు కూడా తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పలువురిని కాపాడినట్టు వైశాలి మీడియాకు తెలిపారు.
అమ్మను కాపాడుకోలేక పోయా: గౌతమ్‌గుప్తా
ఈ పడవ సంఘటన సమయంలో అసలేం జరిగిందనేది ఈ ఘటనకు సంబంధించిన వీడియో తీసిన గౌతమ్‌గుప్తా మీడియాకు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఆయన తీసిన వీడియో ద్వారానే అందరికీ ప్రమాదం విషయం తెలిసింది. ముంబైలో నివసించే గౌతమ్ గుప్తా తన తల్లి రామాజీదేవి, చెల్లి రీతాలతో కలిసి ఎలిఫెంటా వెళ్లేందుకు నీల్‌కమల్ పడవలో బయల్దేరారు. పడవ పైభాగంలో కూర్చున్న గౌతమ్ పడవలో నుంచి సముద్ర ప్రయాణం దృశ్యాలని వీడియోతోపాటు ఫొటోలు తీశారు. అంతలోనే ఓ స్పీడ్ బోట్ సముద్రంలో చక్కర్లు కొట్టడం గమనించారు. ఆ స్పీడ్ బోటును వీడియో తీయసాగారు. ‘ఒక్కసారిగా వేగంగా ఆ పడవవైపు బోట్ రావడం చూశాను. కానీ అసలు ఊహించలేదు. ఆ స్పీడ్ బోటు వేగంగా మేమున్న పడవనే వేగంగా ఢీ కొడుతుందను కోలేదు. ఈ సంఘటన అనంతరం మేం ముగ్గురం నీటిలో పడిపోయాం. అనంతరం ఇతర బోటులోని కొందరు నన్ను మా చెల్లి రీతాను సురక్షితంగా బయటికి తీశారు. కానీ మా అమ్మ గురించి మాత్రం తెలియరాలేదు’ అంటూ బోరుమన్నారు.
ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి
పడవ ప్రమాదంలో కొందరు తెలుగువారు కూడా ఉన్నారని తెలిసింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అందించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌కు చెందిన నేవీ ఉద్యోగి ప్రవీణ్‌కుమార్ శర్మ (34) మృతి చెందారు. ప్రవీణ్ కుమార్ శర్మ నేవీలో బోట్ మెకానిక్‌గా 14 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
జీవితంలో పడవ ఎక్కను
ఘటనలో పలువురు తెలుగువారు మరణం అంచుల దాకా వెళ్లొచ్చి..ఎలిఫెంటా గుహలకు వెళ్లడానికి బోట్ ఎక్కాను. కానీ అదృష్టవశాత్తు బయటపడ్డానని అనిల్‌కుమార్ (35) ఓ మరాఠీ పత్రికకు తెలిపారు. ముంబైలో ఓ పని ఉండటంతో వచ్చానని, ఈ సందర్భంగా ఎలిఫెంటా కేవ్స్ చూద్దామని బయల్దేరినట్లు చెప్పారు. పడవ బయల్దేరిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగిందని, అయితే అదృష్టం కొద్దీ బయటపడ్డానన్నారు. ఇక భవిష్యత్‌లో తానెప్పుడూ పడవ ఎక్కనని చెప్పారు.
Tags