కార్తీ చిత్ర దర్శకుడు కన్నుమూత.. మూవీ ప్రమోషన్‌కు వెళ్తూ ఘటన

Published on Sat, 12/21/2024 - 14:29

ప్రముఖుల మరణాలు కోలీవుడ్‌లో దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. గురువారం ఉదయం ఫైట్‌ మాస్టర్‌ నటుడు కోదండరామన్‌ అనారోగ్యంతో మృతిచెందారు. అయితే ఇప్పుడు దర్శకుడు శంకర్‌దయాళ్‌ గుండెపోటుతో కన్నుమూశారు. ఈయ  నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన శకుని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. 2012లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 

చాలా గ్యాప్‌ తరువాత తాజాగా శంకర్‌దయాళ్‌ కుళందైగళ్‌ మున్నేట్ర కళగం పేరుతో చిత్రం చేశారు. హాస్యనటుడు సెంథిల్‌, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రా న్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులోభాగంగా  చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కారులో బయలుదేరిన దర్శకుడు శంకర్‌దయాళ్‌ గుండెపోటుకు గురయ్యారు. 

దీంతో వెంటనే యూనిట్‌ వర్గాలు స్థానిక కొళత్తూర్‌ ప్రాంతంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శంకర్‌దయాళ్‌ను పరిక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. దర్శకుడు శంకర్‌దయాళ్‌ మరణం కోలీవుడ్‌ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Videos

హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్

సంకల్పంతో... సముద్రాన్నే వంచిన వీరుడి కథ..!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు: Harish Rao

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో జగన్ బర్త్ డే

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

ఫ్యాన్స్‌కు భారీ షాక్ నితీశ్రీ రెడ్డి ఔట్?

వైఎస్ జగన్ కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

జనరంజక పాలనకు కేరాఫ్ వైఎస్ జగన్

Photos

+5

భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి (ఫోటోలు)

+5

#AnasuyaBharadwaj : వావ్.. వాట్ ఏ లుక్.. అనసూయ (ఫోటోలు)

+5

World Saree Day 2024: సెలబ్రిటీల బ్యూటిఫుల్‌ శారీ లుక్స్

+5

కియా కొత్త కారు 'సిరోస్' ఇదే.. ఫోటోలు చూశారా?

+5

శ్రీకాకుళం : జోరువానలో శ్రీలీల చూసేందుకు అభిమానుల ఉత్సాహం (ఫొటోలు)

+5

భార్యకు రోహిత్‌ శర్మ బర్త్‌ డే విషెస్‌.. పోస్ట్‌ వైరల్‌

+5

ఏపీ అంతటా ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు (ఫొటోలు)

+5

పసుపు చీరలో ప్రగ్యా.. చూస్తే ఆహా అంటారేమో! (ఫొటోలు)

+5

సోనియా పెళ్లిలో బిగ్‌బాస్ 8 సెలబ్రిటీస్.. మొత్తం రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

మా నమ్మకం నువ్వే అన్నా..(ఫొటోలు)