హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్
Breaking News
ఓటీటీలో 'విడుదల 2'.. ఫ్యాన్స్ కోసం ఎక్స్‌టెండెడ్ వెర్షన్ : వెట్రిమారన్
Published on Sat, 12/21/2024 - 16:23
విజయ్ సేతుపతి, సూరి లీడ్ రోల్స్‌లో నటించిన ‘విడుదల 2’ సినిమా డిసెంబరు 20న విడుదలైంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘విడుదల పార్ట్ 1’ చిత్రం 2023లో రిలీజ్ కాగా తమిళ్, తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వెట్రిమారన్ ‘విడుదల 2’ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ముఖ్య తారలుగా నటించారు. అయితే, ఈ రెండు చిత్రాల పూర్తి రన్ టైమ్ రివీల్ చేసి దర్శకుడు షాక్ ఇచ్చారు.
విడుదల-1 పూర్తి రన్‌టైమ్ 2గంటల 40 నిమిషాలు ఉంటే.. విడుదల -2 మాత్రం 2గంటల 50 నిమిషాలు ఉంది. అయితే, ఈ రెండు చిత్రాల పూర్తి రన్‌టైమ్ సుమారు ఎనిమిది గంటలు ఉందని తాజాగా దర్శకుడు వెట్రిమారన్ రివీల్ చేశారు. కానీ తాను ప్రేక్షకులు చూపింది కేవలం 5:30 గంటలేనని ఆయన పేర్కొన్నారు. 'విడుదల 2' ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను ఓటీటీలో విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. మరో గంట నిడివి గల ఫుటేజ్‌ను యాడ్ చేస్తామని వెట్రిమారన్ పేర్కొన్నారు.
'విడుదల 1'లో సూరి మెప్పించాడు. దీంతో కథంతా కానిస్టేబుల్ ఆయన కోణంలోనే సాగితే. అయితే, రెండో పార్ట్‌లో ఎక్కువగా ఉద్యమ ప్రయాణం నేపథ్యంలో సాగింది. పెరుమాళ్‌గా విజయ్ సేతుపతి సహజమైన నటనతో మెప్పిస్తారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో ఆయన పాత్ర తీరుకు మంచి మార్కులే పడ్డాయి.
Tags