హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్
Breaking News
రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల చెక్ అందించిన మంత్రి
Published on Sat, 12/21/2024 - 18:29
తెలంగాణ అసెంబ్లీ వేదికగా తెలుగు నటీనటుల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. 'పుష్ప2' సినిమా విడుదలరోజు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఇప్పటికే రేవతి మరణించిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రేతేజ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
డిసెంబర్ 4న పుష్ప2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. వారి కుటుంబానికి తెలంగాణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించారు. శ్రీ తేజ్ తండ్రికి తన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి చెక్ అందించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంపు అనేది ఉండదని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ ఇస్తామని చెప్పిన రూ. 25 లక్షలు ఇప్పటికీ అప్పగించలేదని మంత్రి అన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ మాట నిలబెట్టుకోలేదని అన్నారు. రేవతి కుమారుడు శ్రీతేజ వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ఆయన అన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్ గారిని కలిసి 25 లక్షల రూపాయల చెక్కును కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరుపున అందించడం జరిగింది.
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ లను అడిగి తెలుసుకోవడం జరిగింది.
తన చికిత్సకు కోసం… pic.twitter.com/3EC5Agiowh— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 21, 2024
Tags