LIVE: తిరుపతి ఘటనపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
Breaking News
హై-ఎండ్ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్స్ కొన్న హీరో వరుణ్ ధావన్ : ఎన్ని కోట్లో తెలుసా?
Published on Thu, 01/09/2025 - 11:29
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ఇది తన లేటెస్ట్ మూవీ ‘బేబీజాన్’ ఫ్లాప్ గురించి ఎంతమాత్రం కాదు. ముంబైలోని ఖరీదైన జుహూ ఏరియాలో రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సందడి చేస్తోంది. ఇంతకీ ఎవరి కోసం ఆ ఫ్లాట్లు కొన్నాడు. తెలుసుకుందాం ఈ కథనంలో..
ముంబైలోనిముంబైలోని అత్యంత ప్రీమియం జుహు ఏరియాలో ట్వంటీ అనే హై-ఎండ్ ప్రాజెక్ట్‌లో రెండు అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. వీటి ధర ఏకంగా రూ.86.92 కోట్లు. ఫ్యామిలీతో కలిసి ఒకటి భార్య నటాషా దలాల్ కోసం , మరోకటి తల్లి కరుణ్ ధావన్‌కోసం వీటిని సొంతం చేసుకున్నాడు.
ఈ ట్వంటీ అనే బిల్డింగ్ లోని ఏడో అంతస్తులో ఒక ఫ్లాట్‌ను నటాషా దలాల్‌తో కలిసి కొన్నాడు. దీని విస్తీరం 5112 చదరపు అడుగులు. ధర రూ.44.52 కోట్లు. ఇందులో నాలుగు కారు పార్కింగ్ స్థలాలున్నాయట. ఇక తల్లి కోసం ఇక అదే బిల్డింగ్ ఆరో అంతస్తులో తన తల్లి కరుణా ధావన్‌తో కలిసి వరుణ్ మరో 4617 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కొన్నాడు. దీని ధర రూ.42.4 కోట్లు. ప్రస్తుతం ఈ రెండూ ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. ఈ ఏడాది మే 31వ తేదీలోపు వీటిని అందజేయనున్నారని స్క్వేర్ యార్డ్స్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో అదరపు అడుగు విలువ రూ.60 వేల నుంచి రూ.1.3 లక్షల వరకు ఉంటుంది.
విలాసవంతమైన ప్రాజెక్ట్ గురించి మరింత చెప్పాలంటే, ఇది ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీల్లో పెద్ద డిమాండ్ ఉన్న ఏరియా. ఈ ప్రాజెక్ట్‌లో ప్రీమియం సౌకర్యాలతో 3BHK , 4BHK నివాసాలు ఉన్నాయి. అలాగే ముంబైలోని జుహులో అమితాబ్ బచ్చన్ కు రెండు బంగ్లాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కాజోల్, గోవిందా తదితర హీరోలకు కూడా ఇక్కడ ఇళ్లున్నాయి. ఇక బాంద్రాలో బాలీవుడ్ స్టార్‌హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆమిర్ ఖాన్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ లాంటివాళ్ల నివాసాలు కూడా ఇక్కడే ఉన్నాయి. (ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం)
వరుణ్ ధావన్ తన చిన్నప్పటి నుంచి తన తండ్రి, నిర్మాత డేవిడ్ ధావన్ ద్వారా బాలీవుడ్‌తో దగ్గరి సంబంధాలతో పెరిగాడు. అయితే ధావన్ కుటుంబం మధ్యతరగతి జీవితాన్ని గడిపింది. 1990లలో డేవిడ్ అనేక విజయాలను అందించినప్పటికీ. నిర్మాత జీవితం దర్శకుడి జీవితం కంటే చాలా భిన్నంగా ఉంటుందని స్వయంగా ఒకసారి చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా ఉన్నప్పటికీ తన తండ్రి పెద్దగా సంపాదించలేదన్నారు. అలా సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ నుంచి ముంబైలోని ఎలైట్ సెలబ్రిటీ హాట్‌స్పాట్‌లో రెండు లగ్జరీ రియల్ ఎస్టేట్లను కొనుగోలు దాకా వరుణ్ ఎదగడం విశేషమే మరి.
ఇదీ చదవండి : రూ. 25 లక్షల ఐటీ జాబ్ వదిలేసి.. ఆర్గానిక్ వైపు జాహ్నవి జర్నీ!
కాగా వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన మూవీ బేబీ జాన్. తమిళ బ్లాక్ బస్టర్ తేరి మూవీ రీమేక్‌గా దీన్ని తీసుకొచ్చారు. అయితే హిందీలో మాత్రం పెద్దగా సక్సెస్‌కాలేకపోయింది. కొత్త పెళ్లికూతురుగా పసుపుతాడుతో కీర్తి సురేష్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ‘బేబీ జాన్’ డిజాస్టర్ గా మిగిలి పోయింది.
Tags