Breaking News

‘మోనాలిసా’ ఫొటోషూట్‌..ఆశ్చర్యపోతున్న ఫొటోగ్రాఫర్‌

Published on Tue, 02/04/2025 - 19:25

కోల్‌కతా:మహాకుంభమేళాలో పాపులర్‌ అయిన తేనేకళ్ల మోనాలిసా గురించి ఆసక్తికర విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల క్రితం 2022లో మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌ అహిళ్యాదేవికోటలో పరికర్మ అనే సినిమా చిత్రీకరిస్తున్నపుడు ఆ షూటింగ్‌ చూసేందుకు మోనాలిసా వచ్చింది. 

ఆకట్టుకునే కళ్లతో పాటు విలక్షణమైన మోనాలిసా ముఖ కవలికలు ఆ సినిమా యూనిట్‌ను ఆకట్టుకున్నాయి. ఆ సినిమాకు పనిచేసిన ఫొటోగ్రాఫర్‌ సంజీత్‌ చౌదరి మోనాలిసాను చూశారు. ఆమెలోని కట్టిపడేసే ఆకర్షణకు ముగ్ధులయ్యారు. వెంటనే మోనాలిసాతో ఫొటో సెషన్‌ చేయాలని డిసైడయ్యారు.  ఫొటోలు తీసకునేందుకు  మోనాలిసాను ఒప్పించారు. 

ఇంకేముంది షూటింగ్‌ భోజన విరామ సమయంలో మోనాలిసా ఫోజులను తన కెమెరాలో బంధించారు. సినిమా షూటింగ్‌ పూర్తయి కోల్‌కతాకు వచ్చిన వెంటనే మోనాలిసా ఫొటోలను సంజీత్‌ సోషల్‌మీడియాలో కూడా పోస్టు చేశారు.

అయితే ప్రస్తుతం కుంభమేళాలో పూసలమ్ముకునేందకు వెళ్లిన మోనాలిసా ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసి  ఫొటోగ్రాఫర్‌ సంజీత్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.మోనాలిసా రూపం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుందని ఫొటోగ్రాఫర్‌ అన్నారు.

కాగా, కుంభేళాలో వచ్చిన పాపులారిటీతో తాజాగా మోనాలిసాకు ఏకంగా బాలీవుడ్‌లో మూవీ ఆఫర్‌ కూడా వరించింది. ప్రముఖ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో తెరకెక్కించనున్న సినిమాలో మోనాలిసా కనిపించనుంది.అయితే  మోనాలిసాకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సినిమాలో నటించడం కోసం మేకప్ వేసుకుని వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూస్తే  మోనాలిసా ప్రస్తుతం ముంబయిలో ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా మోనాలిసా మేకోవర్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఏదేమైనా కుంభమేళా మోనాలిసా ఫేట్‌ను మార్చేసి బాలీవుడ్‌లో సినిమా ఆఫర్‌ వచ్చేలా చేసింది. 

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)

+5

పొలిమేర భామ పోజులు చూశారా.. కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)