Breaking News

ఓటీటీలో సెడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్‌ 'బేబీ జాన్‌'

Published on Wed, 02/05/2025 - 06:55

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్‌’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.  కాలీస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్‌ యాపిల్‌ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్‌ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 25న రిలీజ్‌ అయింది. అయితే బాక్సాఫీస్‌ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. బేబీ జాన్‌తో కీర్తి సురేష్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్‌ కాలేదు. దీంతో తన ఫస్ట్‌ సినిమానే డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

బేబీ జాన్‌ చిత్రం సడెన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే అదనంగా రూ. 349 రెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. వాలెంటైన్స్ డే నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేందుకు అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం హిందీ తమిళ్‌ వర్షన్‌లో మాత్రమే బేబీ జాన్‌ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌తో పాటు మరో 9 భాషలలో సబ్‌ టైటిల్స్‌తో చూడొచ్చు. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్‌ రీమేక్‌ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్‌ మ్యూజిక్  అందించారు.  ఈ చిత్రం   రూ. 60 కోట్ల గ్రాస్‌ మాత్రమే రాబట్టింది. నెట్‌ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో భారీ డిజాస్టర్‌ లిస్ట్‌లో బేబీ జాన్‌ చేరిపోయింది.

బేబీ జాన్‌  కోసం గ్లామర్‌ డోస్‌ పెంచిన కీర్తి
బేబీ జాన్‌ మూవీ సాంగ్‌లో కీర్తి సురేష్‌ కాస్త గ్లామర్‌ డోస్‌ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్‌ రోల్స్‌ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్‌ చేసినట్లు నెట్టింట వైరల్‌ అయింది. దీంతో సినిమాకు మరింత బజ్‌ క్రియేట్‌ అయింది. బేబీ జాన్ త‌ర్వాత బాలీవుడ్‌లో అక్క పేరుతో ఓ వెబ్‌సిరీస్‌లో కీర్తి సురేష్‌ నటిస్తోంది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కనున్న ఈ సీరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
 

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)

+5

పొలిమేర భామ పోజులు చూశారా.. కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)