Breaking News

త్వరలో భారత్‌ సొంత జీపీయూ

Published on Wed, 02/05/2025 - 08:13

వచ్చే 3–5 ఏళ్లలో హై–ఎండ్‌ కంప్యూటింగ్‌ చిప్‌సెట్లయిన జీపీయూలను భారత్‌ సొంతంగా తయారు చేసుకోగలదని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ధీమా వ్యక్తం చేశారు. అలాగే దేశీయ ఫౌండేషనల్‌ ఏఐ (AI) ప్లాట్‌ఫాం పది నెలల్లో సిద్ధం కావచ్చని వివరించారు. దేశీయంగా మరో 3–4 రోజుల్లో మొత్తం 18,000 అధునాతన గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను (GPU) అందుబాటులోకి తేనున్నట్లు బడ్జెట్‌ రౌండ్‌టేబుల్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు.

ఇప్పటికే 10,000 జీపీయూలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఖరీదైన, అధునాతన కంప్యూటింగ్‌ మౌలిక సదుపాయాలు అవసరమయ్యే ఏఐ మోడల్స్‌ సాధారణంగా బడా సంస్థలకే పరిమితమయ్యే అవకాశం ఉందని, కానీ చిన్న స్థాయి అంకురాలు, పరిశోధకులు కూడా చౌకగా కంప్యూటింగ్‌ ఇన్‌ఫ్రాను ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుందని మంత్రి చెప్పారు. ఏఐ ఫౌండేషనల్‌ మోడల్‌ను రూపొందించేందుకు స్టార్టప్‌లు, పరిశోధకులు కీలకమైన మాథమెటికల్‌ అల్గోరిథంలకు సంబంధించిన పలు పరిశోధన పత్రాలను అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: బెదిరింపులకు భయపడి మూసేయలేదు

చాట్‌జీపీటీతో పోలిస్తే చిన్నవే అయినప్పటికీ పలు అంకుర సంస్థలు కొన్ని ఏఐ మోడల్స్‌ను ఇప్పటికే రూపొందించాయని, కృత్రిమ మేథ సహాయంతో రైల్వే శాఖ టికెట్ల కన్ఫర్మేషన్‌ రేటును 27 శాతం మెరుగుపర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు, దేశీ ఎల్రక్టానిక్‌ కంపెనీలు అత్యంత నాణ్యత, కచ్చితత్వంతో ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాలను సాధించాయని ఆయన చెప్పారు.   

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)

+5

పొలిమేర భామ పోజులు చూశారా.. కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)