Breaking News

పార్లమెంట్‌ సమావేశాల్లో బిజినెస్‌ విశేషాలు

Published on Wed, 02/05/2025 - 08:40

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 26 వరకు 17,654 కంపెనీలు మూతబడ్డాయని, ఇదే వ్యవధిలో 1,38,027 సంస్థలు రిజిస్టర్‌ అయ్యాయని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్‌ మల్హోత్రా రాజ్యసభ(Parliament)కు రాతపూర్వకంగా తెలిపారు. 2023–24లో మూతబడిన సంస్థల సంఖ్య 22,044గాను, 2022–23లో 84,801గాను ఉంది. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్‌ నథ్వానీ అడిగిన ప్రశ్నకు గాను మంత్రి ఈ సమాధానం ఇచ్చారు.  

ఐదేళ్లలో 339 విదేశీ కంపెనీలు..

2020 నుంచి విదేశీ కంపెనీల రిజిస్ట్రేషన్‌ తగ్గుతున్నట్లు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్‌ మల్హోత్రా రాజ్యసభకు తెలిపారు. గత అయిదేళ్లలో 339 విదేశీ కంపెనీలు భారత్‌లో నమోదు చేయించుకున్నట్లు వివరించారు. 2020లో 90 విదేశీ కంపెనీలు రిజిస్టర్‌ చేసుకోగా ఆ తర్వాత నుంచి ఇది తగ్గుతూ వస్తోంది. 2021లో 75, 2022లో 64, 2023లో 57, 2024లో 53 సంస్థలు నమోదు చేసుకున్నాయి.

ఇదీ చదవండి: బ్యాంకుల్లోకి రూ.45 వేల కోట్ల డిపాజిట్లు

ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు 2,664

గతేడాది మార్చి ఆఖరు నాటికి వ్యక్తులు, విదేశీ రుణగ్రహీతలు మినహా ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసిన డిఫాల్టర్ల సంఖ్య 2,664గా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి రాజ్యసభకు తెలిపారు. విల్‌ఫుల్‌ డిఫాల్టర్లు క్రమంగా తగ్గుతున్నారని వివరించారు. 2021–22లో 160 డిఫాల్టర్లు పెరగ్గా 2023–24లో ఇది 42కి తగ్గినట్లు వివరించారు. ఉద్దేశపూర్వక ఎగవేతలను నిరోధించేందుకు, మొండిబాకీలను తగ్గించేందుకు ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)

+5

పొలిమేర భామ పోజులు చూశారా.. కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)