Breaking News

పుష్ప2 'అల్లు అర్జున్‌' యాక్షన్‌ సీన్‌పై హాలీవుడ్‌ కామెంట్స్‌

Published on Wed, 02/05/2025 - 11:23

అల్లు అర్జున్‌- సుకుమార్‌ల పుష్ప2(Pushpa 2 Movie) సినిమా ఓటీటీలో  కూడా సంచలన రికార్డ్స్‌ను క్రియేట్‌ చేస్తుంది. గ్లోబల్‌ రేంజ్‌లో సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి సత్తా చాటిన పుష్పరాజ్‌.. ఇప్పుడు రీలోడెడ్‌ వర్షన్‌ పేరుతో జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix ) స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇక్కడ కూడా పలు రికార్డ్స్‌ను క్రియేట్‌ చేస్తూ.. ప్రపంచ సినీ అభిమానుల చేత అల్లు అర్జున్‌ ప్రశంసలు అందుకుంటున్నారు.

పుష్ప2 ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వ్యూస్‌ పరంగా ట్రెండింగ్‌లో ఉంది. ఏడు దేశాల్లో నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకుంది. 21 దేశాల్లో టాప్‌-10లో ఉంది. పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‍, ఆస్ట్రేలియా,జపాన్‌, అమెరికా,దుబాయ్‌ వంటి దేశాల్లో ఈ చిత్రాన్ని ఎక్కువగా చూస్తున్నారు.  'పుష్ప అంటే నేషనల్‌ అనుకుంటివా.. ఇంటర్నేషనల్' అనే సినిమా డైలాగ్‌ నిజం అయ్యేలా బన్నీ చేశాడని అభిమానులు చెబుతున్నారు.  గ్లోబల్ రేంజ్‍లో  ఈ చిత్రం దుమ్మురేపుతుండటంతో టాలీవుడ్‌ పేరు వైరల్‌ అవుతుంది. ఓటీటీ వెర్షన్‌లో సినిమా నిడివి  3 గంటల 40 నిమిషాలు ఉంది.

హాలీవుడ్‌ నుంచి ప్రశంసలు
పుష్ప2 ఓటీటీలో చాలా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటంతో విస్తృతంగా ప్రేక్షకులకు చేరువైంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. దీంతో మన సినిమా గురించి హాలీవుడ్‌(Hollywood ) సినీ అభిమానులను మాట్లాడుకునేలా చేసింది. ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన సీన్‌..  అల్లు అర్జున్(Allu Arjun) చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తున్న 'జాతర' సీక్వెన్స్‌కు వారు ఫిదా అయ్యారు. క్లైమాక్స్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో కూడా బన్నీ అలాగే కనిపిస్తాడు. దీన్ని చూసిన అంతర్జాతీయ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.. చూస్తున్నంత సేపు గూస్‌బంప్స్‌ వచ్చాయని కామెంట్లు చేస్తున్నారు. అవెంజర్స్ వంటి‌ సినిమాలకు మించి యాక్షన్‌ సీన్స్‌లో అల్లు అర్జున్‌ దుమ్మురేపాడని వారు ప్రశంసలు కురిపించడం విశేషం.  ఇలాంటి సీన్స్‌ తీయడం హాలీవుడ్‌కు ఎప్పటికీ సాధ్యం కాదని వారు అంటున్నారు. 

ప్రస్తుతం వస్తున్న అమెరికన్‌ సినిమాలకంటే పుష్ప2 చాలా బెటర్‌ అంటూ వారు చెప్పడంతో పుష్ప2 రేంజ్‌ ఏంటో తెలుపుతుంది. భారీ బడ్జెట్‌తో తీస్తున్న మార్వెల్ వంటి సినిమాల్లో కూడా ఇంతటి సృజనాత్మకత లేదని అక్కడి రివ్యూవర్లు చెబుతున్నారు. జాతర ఎపిసోడ్‌లో బన్నీ చేసిన సీన్‌తో పాటు ఫైనల్‌లో చేసిన యాక్షన్‌ ఎపిసోడ్‌  చూసిన వారు.. అదంతా గ్రాఫిక్స్‌ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సినిమా ఎంట్రీలో జపాన్‌కు వెళ్లిన బన్నీ చేతులకు రెక్కలు లేకుండా అంత ఎత్తుకు ఎలా ఎగురుతున్నాడు..? అంటూ కొందరు విమర్శలు చేశారు. కొన్ని సీన్లు చూస్తుంటే హాలీవుడ్‌లో ఎప్పుడో ఆపేసిని కుంగ్‌ఫూ సినిమాలు గుర్తుకొచ్చాయిని కొందరు చెప్పారు. ఇలా పుష్ప2 గ్లోబల్‌ స్థాయిలో ఎక్కువగా పాజిటీవ్‌ టాక్‌తో దూసుకుపోతుంది.

 

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)

+5

పొలిమేర భామ పోజులు చూశారా.. కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)