Breaking News

హిమాలయాల్లో రెస్టారెంట్‌ ప్రారంభించిన స్టార్‌ హీరోయిన్‌

Published on Wed, 02/05/2025 - 12:11

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut ) హిమాలయాల్లో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించారు.  ది మౌంటెన్ స్టోరీ (The Mountain Story) పేరుతో ఆమె కేఫ్‌, రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 14న    హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎంతో పాపులర్‌ అయిన వంటకాలతో తన రెస్టారెంట్‌ ప్రారంభం అవుతుందని ఆమె ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో  ఒక వీడియోతో పంచుకున్నారు.

రెస్టారెంట్‌ ప్రారంభించడం అనేది తన చిన్ననాటి కల అని కంగనా తెలిపారు. తన అమ్మగారి వంటగదిలో ఉన్నప్పుడే అందుకు తొలి బీజం పడిందని గుర్తుచేసుకున్నారు. ఆధునిక టచ్‌తో పాటుగా సాంప్రదాయ హిమాచల్‌ ఫుడ్‌ను అందించాలని తాను అనుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇది మీతో నాకున్న రిలేషన్ షిప్ స్టోరీగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.   రెస్టారెంట్ వీడియోను కూడా షేర్‌ చేయడంతో అందులోని ఇంటీరియర్‌ డిజైన్‌ గురించి అందరూ మెచ్చుకుంటున్నారు.  స్థానిక హిమాచలీ కళాఖండాలతో పాటు  సుందరమైన పర్వత దృశ్యంతో బహిరంగ సీటింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయని తెలుస్తోంది.

పుట్టిన ఊరు మనాలీలో కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించిన కంగనా తన ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని ఇలా తెలిపారు. 'పర్వతాలు నా ఎముకలు, నదులు నా సిరలు, అడవులు నా ఆలోచనలు, నక్షత్రాలు నా కలలు" అని రాస్తూ..  ఇన్‌స్టాగ్రామ్‌లో రెస్టారెంట్ చిత్రాలను కూడా ఆమె పంచుకున్నారు. చుట్టూ పర్వాతల మధ్యలో మంచు పడుతున్న వేళలో అక్కడి ఫుడ్‌ ఆస్వాదిస్తూ ఉంటే ఆ సంతోషానికి హద్దులు ఉండవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలో తప్పకుండా అక్కడికి వచ్చి రెస్టారెంట్‌లోని అన్ని వంటకాలను రుచి చూస్తామని, కంగనాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)

+5

పొలిమేర భామ పోజులు చూశారా.. కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)