మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
సడెన్‌గా పులి ఎంట్రీ..ఛేజ్ చేసేంత దూరంలో రైతు! ట్విస్ట్ ఏంటంటే..
Published on Thu, 02/06/2025 - 17:25
ఒక్కోసారి ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. మనం ప్రమాదకరమైన ప్రదేశంలోకి వెళ్లకపోయినా ఊహించిన విధంగా ప్రమాదం మనల్ని వెతుక్కుంటూ వస్తే అదృష్టం ఉంటే తప్ప బయటపడటం అంత ఈజీ కాదు. అలాంటి సందర్భమే ఎదురైంది ఈ రైతుకి. తప్పించుకునే అవకాశం లేని విత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఆ టైంలో జరిగిన గమ్మత్తైన తమాషా ఆ రైతుకి భూమ్మీద నూకలున్నాయనే దైర్యాన్ని ఇచ్చింది.
ఏం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని పిలిభిత్(Pilibhit)లో ఒక రైతు బైక్‌పై కూర్చొని మరో వ్యక్తితో ఏదో సీరియస్‌గా మాట్లాడుతుంటాడు. ఇంతలో గడ్డిపొదల నుంచి నెమ్మదిగా పులి(Tiger) నక్కి నక్కి వస్తుంటుంది. దీన్ని ఆ ఇరువురు వ్యక్తులు గమనించరు. అయితే పులి మాత్రం దాక్కుంటూ వారిని సమీపిస్తుంటుంది. అమాంతం దాడి చేసేంత దూరంలోకి సమీపించేత వరకు గమనించరు ఆరైతు, సదరు వ్యక్తి.
ఆ తర్వాత అంత దగ్గరగా పులిని చూసి స్టన్నైపోతారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని ఎలాగైనా తప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో బైక్‌ని వెనక్కి తిప్పేందుకు రెడీ అవుతాడు. చెప్పాలంటే పులి వారిపై దాడి చేసేంత దగ్గరలోనే ఉన్నారు వాళ్లు. కానీ ట్వీస్ట్ ఏంటంటే ఆ ఉన్నటుండి పులి దాడి చేయకుండా నెమ్మదిగా కూర్చొని అలా సేద తీరుతుంటుంది.
నిజానికి దాడి చేసేలా సైలెంట్‌గా నక్కి వచ్చింది కాస్తా ఒళ్లు విరుచుకుంటూ కూర్చొంటుంది. దీంతో ఆ ఇద్దరు బతికిపోయంరా బాబు అనుకుంటూ అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి(Indian Forest Service (IFS)) షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
A farmer and a tiger encounter. This is what coexistence looks like. From Pilibhit. pic.twitter.com/4OHGCRXlgr
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 3, 2025
(చదవండి: రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్ని జస్ట్ రూ. 875లకే అమ్మకం..!)
Tags