మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
ఎయిర్టెల్ లాభాల ట్యూన్
Published on Fri, 02/07/2025 - 00:46
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 రెట్లు పైగా దూసుకెళ్లి రూ. 16,135 కోట్లకు చేరింది. గతేడాది (2023–24) ఇదే కాలంలో కేవలం రూ.2,876 కోట్లు ఆర్జించింది. ఇండస్ టవర్స్ బిజినెస్ కన్సాలిడేషన్ కారణంగా రూ. 14,323 కోట్లు ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది.
రూ. 1,194 కోట్ల విదేశీ మారక లాభం అందుకుంది. మరోపక్క రూ. 128 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించింది. మొత్తం ఆదాయం సైతం 19% ఎగసి రూ. 45,129 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 37,900 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 233 నుంచి రూ. 245కు బలపడింది. ప్రస్తుత సమీక్షా కాలంలో ఎయిర్టెల్ దేశీ బిజినెస్ 25%జంప్‌చేసి రూ. 34,654 కోట్లను తాకింది. దాదాపు రూ. 7,546 కోట్ల అనూహ్య లాభాలు ఆర్జించింది.
ఫలితాల నేపథ్యంలో షేరు 2.5% క్షీణించి రూ. 1,620 వద్ద ముగిసింది.
Tags