Breaking News

స్పెషల్‌ సాంగ్‌?

Published on Fri, 02/07/2025 - 02:52

‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే సామెత చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తుంటుంది. ఈ విషయంలో హీరోయిన్లు ఎప్పుడూ ముందుంటారు. ఓ వైపు హీరోకి జోడీగా నటించి, ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు స్పెషల్‌ సాంగ్స్‌లో నటించేందుకు పలువురు కథానాయికలు పచ్చజెండా ఊపుతుంటారు. ఇప్పటికే సమంత, తమన్నా, కాజల్‌ అగర్వాల్, పూజా హెగ్డే, శ్రుతీహాసన్, శ్రీలీల, రెజీనా, ఫరియా అబ్దుల్లా వంటి పలువురు కథానాయికలు ప్రత్యేకపాటల్లో చిందేశారు.

తాజాగా ఈ జాబితాలో హీరోయిన్‌ కృతీ శెట్టి కూడా చేరనున్నారని బాలీవుడ్‌ టాక్‌. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ బేబమ్మగా అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ ‘శ్యామ్‌ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, మనమే’ వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు. 

2024 జూన్‌ 7న విడుదలైన ‘మనమే’ సినిమా తర్వాత కృతీ శెట్టి తెలుగులో ఏ సినిమా కూడా కమిట్‌ కాలేదు. అయితే తమిళ చిత్రాలతో మాత్రం ఫుల్‌ బిజీగా ఉన్నారామె. ఇదిలా ఉంటే.. కృతీ శెట్టి బాలీవుడ్‌లో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నారని టాక్‌. అద్భుతమైన డ్యాన్స్‌ చేయడంలో ఆమెకు మంచి పేరుంది. అందుకేనేమో... ప్రత్యేకపాటలో మెరిసేందుకు సై అన్నారని టాక్‌. అయితే ఆమె ఏ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నారు? ఇందులో వాస్తవం ఎంత? అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

పారిశ్రామికవేత్త.. గౌతమ్ అదానీ కొడుకు పెళ్లి (ఫోటోలు)

+5

హీరో నాగచైతన్య 'తండేల్' సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)