మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
ఆకాశ ఎయిర్‌లో ప్రేమ్‌జీ ఫ్యామిలీ ఆఫీసు పెట్టుబడులు
Published on Fri, 02/07/2025 - 08:01
టెక్ దిగ్గజం అజీం ప్రేమ్‌జీ (Azim Premji), మణిపాల్ గ్రూప్ చీఫ్ రంజన్ పాయ్‌లకు చెందిన ఫ్యామిలీ ఆఫీసులు తాజాగా విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లో ఇన్వెస్ట్ చేశాయి. ఇందుకు సంబంధించి క్లేపాండ్ క్యాపిటల్ (రంజన్ పాయ్), ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ 360 వన్ అసెట్ తదితర ఇన్వెస్టర్ల కన్సార్షియంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆకాశ ఎయిర్ వెల్లడించింది.
ప్రమోటరు ఝున్‌ఝున్‌వాలా కుటుంబం కూడా మరింతగా మూలధనం సమకూర్చనున్నట్లు వివరించింది. ఎయిర్‌లైన్‌లో ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి ఇప్పటికే దాదాపు 40 శాతం వాటా ఉంది. కాగా పెట్టుబడి మొత్తం గురించి కానీ, ఎంత వాటాను విక్రయిస్తున్నది కానీ ఎయిర్‌లైన్ వెల్లడించలేదు. అయితే దాదాపు 125 మిలియన్ డాలర్లు సేకరించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
2023-24లో ఆకాశ ఎయిర్ నికర నష్టం రెండింతలు పెరిగింది. గత ఏడాది రూ.744 కోట్ల నుండి రూ.1,670 కోట్లకు చేరుకుంది. మరోవైపు దాని మొత్తం ఆదాయం 2022-23లో రూ.778 కోట్లతో పోలిస్తే 2023-24లో రూ.3,144 కోట్లకు చేరుకుంది. ఈ ఎయిర్‌లైన్‌లో ఝున్‌ఝున్‌వాలా కుటుంబంతో పాటు ముగ్గురు దూబే సోదరులు వినయ్ దూబే, సంజయ్ దూబే, నీరజ్ దూబే దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉన్నారు.
గత ఏడాది జనవరిలో, ఆకాశ ఎయిర్ అమెరికన్ విమాన తయారీ సంస్థ బోయింగ్‌తో 150 B737 మ్యాక్స్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇది గతంలో ఆర్డర్ చేసిన 76 మ్యాక్స్ విమానాలకు అదనం. 76 విమానాలలో 27 ఇప్పటికే ఎయిర్‌లైన్‌కు డెలివరీ అయ్యాయి.
Tags