మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
విమానం ఆలస్యం..హీరో విజయ్ దేవరకొండ సహా పలువురి ఎదురుచూపులు
Published on Fri, 02/07/2025 - 14:50
సాక్షి,హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం(ఫిబ్రవరి7) ఉదయం 9 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన విమానం మధ్యాహ్నం 2 గంటల వరకు బయలుదేరలేదు. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే టేకాఫ్ కాలేదని స్పైస్‌జెట్ సంస్థ తెలిపింది. దీంతో ఆ విమానంలో వెళ్లాల్సిన వారంతా ఉదయం నుంచి విమానాశ్రయంలోనే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విమానంలో ప్రముఖ టాలీవుడ్ హీరో విజయదేవరకొండతో పాటు పలువురు ఇతర సినీ ప్రముఖులు ఐఏఎస్‌లు,ఐపీఎస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం ఎప్పుడు వెళుతుందో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారంతా స్పైస్‌జెట్ విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.30 వేలు పెట్టి టికెట్ కొన్నా తమకు ఈ ఇబ్బందులేంటని ప్రశ్నిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించేందుకు హైదరాబాద్ నుంచి చాలా మంది కుంభమేళాకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు శంషాబాద్ నుంచి విమానంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళుతున్నారు.
Tags