Breaking News

నూతన ఐటీ చట్టంలో కొత్త పన్నులుండవ్‌

Published on Wed, 02/05/2025 - 03:46

న్యూఢిల్లీ: కొత్త ప్రత్యక్ష పన్నుల కోడ్‌(ఐటీ చట్టం) లో ఎలాంటి కొత్త పన్నులు ఉండబోవని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే(Tuhin Kanta Pandey) స్పష్టం చేశారు. అలాగే బడ్జెట్‌ 2025 ద్రవ్యోల్బణానికి ఆ జ్యం పోసేది కాదన్నారు. ద్రవ్యలోటు తగ్గింపుతో, ద్రవ్యోల్బణాన్ని పెంచని బడ్జెట్‌ను అందించినట్టు చెప్పారు. వృద్ధికి మద్దతునిచ్చే ద్రవ్య విధానానికి అనుగుణంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కూడా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా వడ్డీ రేట్లలో మార్పు ఉండొచ్చన్న సంకేతాన్నిచ్చినట్టయింది.

మీడియాతో మాట్లాడిన సందర్భంగా పలు అంశాలపై గందరగోళం, అయోమయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు పాండే. మూలధన లాభాల పన్ను లేదా సెక్యూరిటీల లావాదేవీల పన్ను పెంపు రూపంలో ఊహించనిది ఏదైనా ఉంటుందా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని తోసిపుచ్చారు. ప్రస్తుత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లోనే వారం వ్యవధిలో కొత్త ఆదాయపన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఇది పూర్తిగా కొత్త బిల్లు, తిరగ రాసిందంటూ దీన్ని పార్లమెంట్‌ ఆమోదించాల్సి ఉందన్నారు పాండే.

‘‘ఇది పన్ను రేట్లను మార్చదు. నిర్మాణాత్మకంగా పూర్తి మార్పునకు గురికానుంది. హేతుబద్దీకరణతోపాటు ప్రక్రియలను సులభంగా మార్చడం ఇందులో కనిపిస్తుంది. ఇందులో ఎన్నో సంస్కరణలు ఉంటాయి. వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుంది’’అని పాండే వివరించారు. ప్రస్తుత పన్ను చట్టంతో పోల్చితే సగమే ఉంటుందన్న ఆర్థిక మంత్రి 

ప్రకటనను గుర్తు చేశారు.  
వృద్ధి నిలకడగా కొనసాగాలంటే ద్రవ్యోల్బణంపై మంచి నియంత్రణ అవసరమని, రెండింటి మధ్య సమతుల్యం అవసరమన్నారు. ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ఈ నెల 5న ప్రారంభం కానుంది. 7వ తేదీన నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ సమావేశంలో రేట్ల కోత నిర్ణయం ఉంటుందా? అన్న ప్రశ్నకు.. పరిస్థితిని వారు తెలుసుకున్నారని, దీనిపై వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పాండే బదులిచ్చారు.

#

Tags

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)

+5

పొలిమేర భామ పోజులు చూశారా.. కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)