Breaking News

ఎయిర్‌టెల్‌ లాభాల ట్యూన్‌

Published on Fri, 02/07/2025 - 00:46

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌ (క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 5 రెట్లు పైగా దూసుకెళ్లి రూ. 16,135 కోట్లకు చేరింది.  గతేడాది (2023–24) ఇదే కాలంలో కేవలం రూ.2,876 కోట్లు ఆర్జించింది. ఇండస్‌ టవర్స్‌ బిజినెస్‌ కన్సాలిడేషన్‌ కారణంగా రూ. 14,323 కోట్లు ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది. 

రూ. 1,194 కోట్ల విదేశీ మారక లాభం అందుకుంది. మరోపక్క రూ. 128 కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ లభించింది. మొత్తం ఆదాయం సైతం 19% ఎగసి రూ. 45,129 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 37,900 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ. 233 నుంచి రూ. 245కు బలపడింది. ప్రస్తుత సమీక్షా కాలంలో ఎయిర్‌టెల్‌ దేశీ బిజినెస్‌ 25%జంప్‌చేసి రూ. 34,654 కోట్లను తాకింది. దాదాపు రూ. 7,546 కోట్ల అనూహ్య లాభాలు ఆర్జించింది.

ఫలితాల నేపథ్యంలో షేరు 2.5% క్షీణించి రూ. 1,620 వద్ద ముగిసింది.

 

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

పారిశ్రామికవేత్త.. గౌతమ్ అదానీ కొడుకు పెళ్లి (ఫోటోలు)

+5

హీరో నాగచైతన్య 'తండేల్' సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)