Breaking News

‘చౌకగా పెట్రోల్‌.. ప్రజలకు రాయితీల్లేవు’

Published on Wed, 02/05/2025 - 14:01

మోదీ ప్రభుత్వం ఇథనాల్‌ మిశ్రమ(బ్లెండెడ్‌) పెట్రోల్‌ను తీసుకొచ్చిన నేపథ్యంలో పెట్రోల్‌ ధరను తగ్గించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సాకెత్‌ గోఖలే రాజ్యసభలో డిమాండ్‌ చేశారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లీటరుకు కనీసం రూ.9 చౌకగా లభిస్తున్నప్పటికీ వినియోగదారు నుంచి పూర్తి స్థాయిలో వసూలు చేస్తున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ప్రజలను మోసం చేస్తోందని, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును లాగేసుకుంటుందని విమర్శించారు. దాంతో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు కారణమవుతుందని దుయ్యబట్టారు.

‘మోదీ ప్రభుత్వం పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపాలని గతంలోనే ఆదేశించింది. ఇథనాల్ చౌకైనది మాత్రమే కాదు.. వాహన మైలేజీని కూడా గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇది బీఎస్‌-IV, పాత ఇంజిన్‌లను నాశనం చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లీటరుకు కనీసం రూ.9 చౌకగా లభిస్తోంది. కానీ ప్రజలు ఈ రాయితీ పొందడం లేదు. వాస్తవ ధరకే పెట్రోల్‌ కొనుగోలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం నిస్సందేహంగా ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దొచుకుంటోంది. దాంతో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు కారణం అవతుంది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను తప్పనిసరి చేస్తే మోదీ ప్రభుత్వం ధరలు తగ్గించాలి’ అని ఎంపీ తెలిపారు.

ఇథనాల్‌ పెట్రోల్‌పై భిన్నాభిప్రాయాలు

ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గ్రీన్‌ ఎన్విరాన్‌మెంట్‌ను ప్రోత్సహించడంలో భాగంగా గతంలో ప్రభుత్వం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలని నిర్ణయించింది. ఇథనాల్ పెట్రోల్ కంటే తక్కువ శక్తి కంటెంట్ కలిగి ఉంటుందని అభిప్రాయాలున్నాయి. ఇది వాహనం మైలేజ్‌ను 3-4% తగ్గిస్తుందని వాహన నిపుణులు చెబుతున్నారు. పాత వాహనాలకు ముఖ్యంగా బీఎస్-4 ఇంజిన్లు ఉన్న వాహనాలకు అధిక ఇథనాల్ కంటెంట్ ప్లాస్టిక్, రబ్బరు, అల్యూమినియం భాగాలకు హాని కలిగిస్తుందని తెలియజేస్తున్నారు. ఇది ఇంజిన్ పనిచేయకపోవడం, మన్నిక తగ్గడానికి దారితీస్తుందంటున్నారు.

ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర! తులం ఎంతంటే..

పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం వల్ల ముడి చమురు దిగుమతులపై తక్కువ ఆధారపడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం తెలుపుతుంది. ఇది ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది. ఇథనాల్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది. చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)

+5

పొలిమేర భామ పోజులు చూశారా.. కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)