మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
బంగారం ధరలపై ఊరట..
Published on Fri, 02/07/2025 - 12:50
దేశంలో ఆగకుండా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Prices) కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. వరుసగా మూడో రోజులుగా దూసుకెళ్లి హ్యాట్రిక్ కొట్టిన పసిడి ధరలు నేడు (February 7) శాంతించాయి. దేశవ్యాప్తంగా పుత్తడి రేట్లు నిలకడగా కొనసాగుతున్నాయి.
ఇది చదివారా? రతన్ టాటా వీలునామాలో ఊహించని పేరు.. రూ.500 కోట్ల ఆస్తి ఆయనకే..
బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 79,300, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 86,510 వద్ద ఉన్నాయి.
ఇతర ప్రాంతాల్లో..
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.86,660 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.79,450 వద్ద ఉన్నాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,300 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,510 వద్ద కొనసాగుతున్నాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,07,000 వద్ద, ఢిల్లీలో రూ. 99,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Tags