మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
గూగుల్ పేలో ఆటోపే.. సింపుల్‌గా క్యాన్సిల్ చేయండిలా
Published on Fri, 02/07/2025 - 16:13
ఆన్‌లైన్ లావాదేవీలు వచ్చిన తరువాత.. దాదాపు చాలామంది గూగుల్ పే, ఫోన్ పే వంటివి విరివిగా ఉపయోగిస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్‌లు, ఈఎంఐ వంటివి చెల్లించడానికి వీటినే వాడేస్తున్నారు. దీనికోసం గూగుల్ పేలోని 'ఆటోపే' (Autopay) సెట్ చేసుకుంటారు. ఇది ఆటోమాటిక్ చెల్లింపులకు ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది ఆటోమాటిక్‌గా చెల్లించడానికి ఇష్టపడనప్పుడు 'ఆటోపే క్యాన్సిల్ చేసుకోవచ్చు.
గూగుల్ పేలో ఆటోపే ఎలా నిలిపివేయాలంటే?
➤గూగుల్ పే (Google Pay) యాప్ ఓపెన్ చేసిన తరువాత, ఎగువ భాగంలో కూడైవైపు కనిపించే మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి.
➤ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తరువాత ఆటోపే ఆప్షన్స్ కనిపించే వరకు కిందికి స్క్రోల్ చేయాలి.
➤ఆటోపే ఆప్షన్ కనిపించిన తరువాత.. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత లైవ్ ట్యాబ్ కింద యాక్టివ్ మ్యాండేట్‌ల జాబితా కనిపిస్తుంది. మీరు తీసివేయాలనుకుంటున్న ఆటోపే మ్యాండేట్‌పై క్లిక్ చేయండి.
➤ఆటోపే క్యాన్సిల్ చేయాలనుకున్నప్పుడు.. క్యాన్సిల్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
➤యూపీఐ ఎంటర్ చేయగానే ఆటోపే క్యాన్సిల్ అవుతుంది.
మళ్ళీ ఆటోపే సెట్ చేసుకోవాలంటే?
➤గూగుల్ పేలో మళ్ళీ ఆటోపే సెట్ చేసుకోవాలంటే.. మళ్ళీ యాప్ ఓపెన్ చేసి, ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి.. ఆటోపే ఆప్షన్స్ ఎంచుకోవాలి.
➤ఉదాహరణకు నెట్‌ఫ్లిక్స్ కోసం ఆటోపే ఆదేశాన్ని సెటప్ చేసి, తరువాత దానిని రద్దు చేసి ఉంటే.. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చెల్లింపు పద్ధతిగా మీ యూపీఐ ఐడీని తిరిగి ఎంటర్ చేయాలి. ఆ తరువాత యధావిధిగా ఆటోపే యాక్టివేట్ అవుతుంది.
ఇదీ చదవండి: పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరిక
ఆటోపే వల్ల ఉపయోగాలు
బిజీ జీవితంలో అన్నింటిని గుర్తుపెట్టుకోవడం కొంత కష్టమైన పని. ఏదైనా చెల్లింపులు లేదా ఈఎంఐ వంటి చెల్లించడంలో ఆలస్యమైతే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి జరిమానాల నుంచి తప్పించుకోవడానికి, సమయానికి చెల్లింపులు పూర్తి చేసుకోవడానికి ఆటోపే అనేది బెస్ట్ ఆప్షన్.
Tags