Breaking News

పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్‌ క్లారిటీ

Published on Tue, 02/04/2025 - 19:55

కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా తీసుకొస్తున్న.. తరుణంలో పాత పన్ను విధానం రద్దు చేసే అవకాశం ఉందని పుకార్లు పుడుతున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ.. పాత పన్ను విధానం రద్దు చేస్తారనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు. ఈ విషయాన్ని ఓ సమావేశంలో వెల్లడించారు.

పాత పన్ను విధానం ఔచిత్యం, ప్రణాళికల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ పన్ను వ్యవస్థ మొత్తం సరళంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పన్ను విధానం నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, దీనికోసం పాత పన్ను విధానాన్ని తొలగించాలనే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు.

మొత్తం పన్ను చెల్లింపుదారులందరూ.. కొత్త పన్ను విధానానికి మారాలని కోరుకుంటున్నారా? అని ఆర్థిక మంత్రిని అడిగినప్పుడు. పాత పన్ను విధానం రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా కొత్త ఆదాయ పన్ను చట్టం గురించి ప్రస్తావిస్తూ.. 1931లో తీసుకొచ్చిన పాత పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు చేపట్టినట్లు వెల్లడించారు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఫిబ్రవరి 7న ఏం జరగనుంది?.. అందరూ వెయిటింగ్

దేశ నిర్మాణం కోసం పన్ను చెల్లింపుదారులు చేస్తున్న సేవలను గౌరవించడానికి ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' చేసిన ప్రయత్నమే 2025 బడ్జెట్‌లో ఇచ్చిన పన్ను ఉపశమనం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. గత మూడు.. నాలుగు సంవత్సరాలుగా, మేము నిరంతరం పన్ను చెల్లింపుదారులతో నిమగ్నమై ఉన్నాము. ప్రభుత్వంపై వారి నమ్మకం చెక్కుచెదరకుండా ఉండటానికి, మేము అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు.

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)

+5

పొలిమేర భామ పోజులు చూశారా.. కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)