హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్
Breaking News
రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?
Published on Sat, 12/21/2024 - 16:25
భారతీయ మార్కెట్లో '2025 రేంజ్ రోవర్ స్పోర్ట్' రూ.1.45 కోట్ల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. దేశీయ విఫణిలో తయారైన ఈ కారు ధర రూ.5 లక్షలు పెరిగింది. బ్రాండ్ ఇప్పుడు డైనమిక్ ఎస్ఈ వేరియంట్‌ను నిలిపివేసి.. స్థానికంగా తయారైన 'డైనమిక్ హెచ్ఎస్ఈ' వేరియంట్‌తో భర్తీ చేశారు.
2025 రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ.. 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 400 హార్స్ పవర్ అందిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ 351 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతాయి.
సాంటోరిని బ్లాక్, వారెసిన్ బ్లూ, ఫుజి వైట్, ఛారెంటే గ్రే, జియోలా గ్రీన్ అనే కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఆటో పార్కింగ్ అసిస్ట్, ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ ఆఫ్ రోడ్ క్రూయిజ్ కంట్రోల్, మెరిడియన్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ అండ్ హీటెడ్ రియర్ సీట్లు వంటి వాటిని పొందుతుంది.
కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్, లో స్పీడ్ మ్యాన్యువరింగ్ లైట్లు, డిజిటల్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లను పొందుతుంది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.
Tags