మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
మళ్ళీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Published on Fri, 02/07/2025 - 15:46
స్వల్ప లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మళ్ళీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 211.41 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 77,846.74 వద్ద, నిఫ్టీ 43.40 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 23,559.95 పాయింట్ల వద్ద నిలిచాయి.
టాటా స్టీల్, భారతి ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యు స్టీల్, ట్రెంట్, హిందాల్స్కో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ఐటీసీ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 6.25 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags