జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Breaking News
బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు..
Published on Thu, 04/20/2023 - 14:41
బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు ఓ ఐఐటీయన్. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆహార బ్రాండ్‌లలో ఒకటైన ‘బిర్యానీ బై కిలో’ అనే సంస్థను 2015లో విశాల్ జిందాల్ స్థాపించారు. అప్పటి నుంచి కంపెనీ వార్షిక ఆదాయం పెరుగుతూ వస్తోంది. అయితే దీంతోనే అతను సంతృప్తి చెందలేదు. వచ్చే రెండు మూడేళ్లలో రూ.1000 కోట్ల టర్నోవర్ సాధించబోతున్నాడు. బిర్యానీ బిజినెస్‌తో సక్సెస్ అయిన ఐఐటీయన్ కథ ఇది..
అనేక వ్యాపారాలు ఉన్న విశాల్ జిందాల్ స్వయంగా ఆహార ప్రియుడు. అందుకే ఆయనకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా బిర్యానీ వ్యాపారమంటేనే ఆయనకు మక్కువ. ఈ బిరియానీ వ్యాపారం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన భారతదేశంలోని ఖాన్సామా సంప్రదాయాన్ని పునరుద్ధరించడం. అంటే ఇక్కడ ప్రతి ఆర్డర్‌ను విడివిడి వండుతారు. వండిన బిర్యానీని మట్టి పాత్రల్లో కాల్చిన పిండి సహాయంతో ప్యాక్ చేస్తారు.
ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్..
ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ చేసిన విశాల్ జిందాల్ ఆ తర్వాత న్యూయార్క్‌లోని సిరక్యూస్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఫైనాన్స్ చదివారు. సింగపూర్‌కు చెందిన ఎకోసిస్టమ్ అడ్వైజరీ బోర్డులో జిందాల్ కూడా ఉన్నారు. ఇది అతని మొదటి కంపెనీ కాదు. గుర్గావ్‌లో కార్పెడియం క్యాపిటల్ పార్టనర్స్ అనే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌ను స్థాపించారు. ఫిడిలిటీ వెంచర్స్ వ్యవస్థాపకుడు అలాగే ఆ సంస్థకు ఎండీగా, అక్షయం క్యాపిటల్ సీఈవోగా ఉన్నారు. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?)
భారతీయ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థను ఆయనే స్థాపించి మిలియన్ డాలర్ల కంపెనీగా మార్చారు. ఇది అన్ని మెట్రో నగరాల్లో 100 మంది ఉద్యోగులు, కార్యాలయాలను కలిగి ఉంది. విశాల్ జిందాల్ అమెరికాలో 1994లో అమనో సిన్సినాటి అనే కంపెనీకి మార్కెటింగ్ అసోసియేట్‌గా పనిచేశారు.
‘బిర్యానీ బై కిలో’ సంస్థ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 300 కోట్ల ఆదాయం వస్తుందని ఆశించారు. అయితే ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో ఉంది. అయినప్పటికీ జూన్ నాటికి పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. కంపెనీకి రూ. 700-750 టిక్కెట్ సైజుతో రోజుకు 10,000 కంటే ఎక్కువ ఆర్డర్‌లు వస్తున్నాయి. ఈ కంపెనీకి అన్ని మెట్రో నగరాలతో సహా 45 కంటే పైగా నగరాల్లో 100కి పైగా అవుట్‌లెట్‌లు ఉన్నాయి. (కండోమ్స్ బిజినెస్: 50లక్షలనుంచి రూ. 43వేల కోట్లతో దడ పుట్టించిన బ్రదర్స్)
2022 ఆర్థిక సంవత్సరంలో వారు రూ. 135 కోట్లు, అంతకుముందు 2021 సంవత్సరంలో రూ. 65.6 కోట్లు ఆర్జించారు విశాల్ జిందాల్. వచ్చే రెండు మూడు ఏళ్లలో రూ.1000 కోట్ల టర్నోవర్‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం మార్కెటింగ్ వ్యయాన్ని కూడా పెంచాలనుకుంటున్నట్లు, మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్ కంటే పెద్ద వ్యాపారాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు విశాల్ జిందాల్ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థతో పేర్కన్నారు.
ఇదీ చదవండి: Mukesh Ambani Birthday: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా?
Tags