Big Question: ప్రాణాలు తీసిన ప్రభుత్వ నిర్లక్ష్యం
Breaking News
పిడుగులాంటి వార్త..ఇలా అయితే కష్టమే..!
Published on Wed, 01/08/2025 - 18:29
ప్రస్తుత జీవన విధానం, కాలుష్యం కారణంగా తొందరగా జుట్టు నెరిసిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలు సర్వ సాధారణమైపోయాయి. ఒక ఏజ్ వచ్చాక బట్టతల కూడా కామనే అనే స్థితికి వచ్చేశాం. ఒకప్పుడూ బట్టతల అంటే బాధపడిపోయేవారు. కానీ ఇప్పుడూ టేకీటీజీ అంటున్నారు. కటింగ్ చేయించుకునే బాధ తప్పుతుంది, ఏ చిరాకు ఉండదు అనే స్థైర్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఇప్పుడు అదికాస్త ఢమాల్ అనేలా ఓ పిడుగులాంటి వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటో తెలిస్తే..వామ్మో ఇక జుట్టు ఉన్న మనిషి కనిపించడమే గగనమైపోదుందేమో అనిపిస్తుంది.
ఈ వింత పరిస్థితి మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని మూడు గ్రామాల నివాసితులకు ఎదురైంది. గత కొన్ని రోజులగా అక్కడ ఉన్న మహిళలు, పురుషులు జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారట. ఒక్క వారం రోజుల్లోనే చాలమందికి బట్టతల వచ్చేసిందట. మొదట్లో కొద్దిగా జుట్టు రాలడం మొదలై.. ఒక్క వారంలోనే ఇలా బట్టతలగా మారిపోతుందట.
ఇలా ఏ ఒక్కరికో ఇద్దరికో కాదు..దాదాపు అందరిది ఇదే పరిస్థితినే. ఇది దావానంలా వ్యాపించడంతో మూడు గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఈ గ్రామాన్ని సందర్శించారు. ఆరోగ్య శాఖ సర్వే ప్రకారం..అక్కడ సుమారు 50 మంది దాక ఈ సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందన్నారు అధికారులు.
ఇక సామూహికంగా అందరికి జుట్టు ఎందుకు రాలుతుందని పరీక్షించేందుకు వాళ్ల చర్మం, వెంట్రుకల నమునాలను సేకరించినట్లు తెలిపారు. ఈ పరిస్థితికి కారణం కలుషిత నీరు, ఏవైనా ఆరోగ్య సమస్యలు అయ్యి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే దీని గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోనే యత్నం చేయమని సూచించారు. తాము ప్రజల నుంచి సేకరించిన చర్మం, వెంట్రుకలను పరీక్షించి ఈ పరిస్థితికి గల కారణాన్ని నిర్థారించి, పరిష్కారిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు అదికారులు.
(చదవండి: పెళ్లి పాట్లు..!అంత ఈజీ కాదు మ్యాచ్ సెట్టవ్వడం..)
Tags