Breaking News

ఆ బాధను ఎలా అధిగమించాలి..?

Published on Thu, 01/09/2025 - 10:51

డాక్టరు గారూ! నేనొక ప్రభుత్వ ఉద్యోగినిని. నా పిల్లలిద్దరూ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. 3 నెలల క్రితం 55 సంవత్సరాల నా భర్త సడెన్‌ హార్ట్‌ ఎటాక్‌తో మరణించారు. రాత్రి భోజనానికి తనకిష్టమైన కూర వండించుకుని తిన్నారు. ఉదయాన్నే నిద్ర లేచేసరికి పక్కనే విగత జీవిగా కనిపించారు. అప్పటినుంచి నాకు ఇంటికి రావాలంటేనే భయంగా ఉంటోంది. రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు. అలాగే నిద్రలో ఉలిక్కిపడి లేవడం, గట్టిగా ఏడవడం చేస్తున్నాను. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, విపరీతమైన భయం వేస్తున్నాయి. నాభర్త చనిపోవడానికి నా నిర్లక్ష్యమే కారణమేమోననే వేదన నన్ను కలచి వేస్తోంది. ఎంత సర్ది చెప్పుకుందామన్నా నావల్ల కావడం లేదు. ఈ బాధను అధిగమించే మార్గం చెప్పగలరా?
– శాంతిశ్రీ, విజయనగరం

మీరు అనుభవిస్తున్న ఈ వేదన, బాధ పూర్తిగా అర్థం చేసుకోగలను. మీ స్థానంలో ఉన్న వారికి ఇలాంటి లక్షణాలు ఉండటం చాలా సహజం. మీకున్న ఈ నిద్రలేమి, గుండెదడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప్యానిక్‌ ఎటాక్‌ని సూచిస్తున్నాయి. ఈ మానసిక స్థితి ఇటువంటి ట్రామాటిక్‌ సంఘటనకు సహజమైన ప్రతిస్పందన. సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్స్‌ని ముందుగా అంచనా వేయడం లేదా పూర్తిగా నివారించడం అసాధ్యం అని మీరు గుర్తించాలి. 

అందువల్ల మీరు వారిపై చూపించిన ప్రేమ, ఆప్యాయతలను పదే పదే గుర్తు తెచ్చుకోవడం ద్వారా మీలో ఉన్న గిల్ట్‌ ఫీలింగ్‌ తగ్గుతుంది. దగ్గరిలోని సైకియాట్రిస్ట్ట్‌ని సంప్రదించి, మైండ్‌ఫుల్‌నెస్‌ థెరపీ, కాగ్నిటివ్‌ థెరపీ తీసుకోవడం వలన మీ బాధ తగ్గడమే కాక మీ ఆలోచనలు మార్చడానికి, కోపింగ్‌ స్ట్రేటజీస్‌ పెంచడానికి సహాయపడుతుంది. 

అలాగే డీప్‌ బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజెస్, ధ్యానం, ప్రోగ్రెసివ్‌ మజిల్‌ రిలాక్సేషన్‌ వంటివి తప్పక సహాయపడతాయి. నిద్ర వచ్చినా రాకపోయినా నిద్ర షెడ్యూల్‌ పాటించడం చాలా ముఖ్యం. అవసరాన్ని బట్టి కొన్ని రకాల మందులు కూడా మీరు త్వరగా కోలుకోవడానికి సహకరిస్తాయి.
డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com)

Videos

పవన్ పరామర్శ కోసం గేమ్ ఛేంజర్ బాధిత కుటుంబాల పడిగాపులు

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

తవ్వేస్తాం.. దోచేస్తాం అంటున్న తెలుగు తమ్ముళ్లు!

తిరుపతి తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం: చిర్ల జగ్గిరెడ్డి

ఏసీబీ విచారణకు హాజరైన BLN రెడ్డి

రంగారెడ్డి జిల్లా మణికొండలో హైడ్రా కూల్చివేతలు

ఉద్యోగం పోవడం, ఫైనాన్స్ వేధింపులతో మహిళా వాలంటీర్ సూసైడ్

రజిని భర్త మాటలు వింటే కన్నీళ్లు ఆగవు

వైకుంఠ ద్వార దర్శనంలో YSRCP నేతలు

తిరుమల ఘటనపై మార్గాని భరత్ సీరియస్ రియాక్షన్

Photos

+5

వైకుంఠ ఏకాదశి.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

పండగొచ్చింది.. పల్లెబాట పట్టిన పట్నంవాసులు (ఫొటోలు)

+5

విజయవాడ : కమనీయంగా గోద, రంగనాథుల కల్యాణం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం (ఫొటోలు)

+5

తిరుపతి తొక్కిసలాట విషాదం.. పద్మావతి హాస్పిటల్ వద్ద దృశ్యాలు

+5

కడప : యోగి వేమన విశ్వవిద్యాలయంలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ అడ్డగింత (ఫోటోలు)

+5

తిరుపతి తొక్కిసలాట - క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫోటోలు)

+5

రెండో పెళ్లి.. ఫోటోలు షేర్‌ చేసిన నటుడు సాయికిరణ్‌ (ఫోటోలు)