మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
బట్టతల అందమే..! చూసే విధానంలోనే ఉందంతా..
Published on Tue, 02/04/2025 - 14:19
కొందరూ బట్టతలను చాలా అవమానంగా చూస్తారు. అందులోనూ పెళ్లి అవ్వకమునుపే వస్తే ఆ బాధ మరీ వర్ణనాతీతం. కానీ కొందరూ బట్టతలే అందం అంటూ ఆత్మవిశ్వాసంగా ముందుకొచ్చి అందాలపోటీల్లో పాల్గొని స్ఫూర్తినిస్తున్నారు. కురులే సౌందర్య చిహ్నం అని చూసే రోజులు కాదివి అంటూ ధైర్యంగా ముందుకొస్తున్నారు. ఇక్కడ అలానే ఓ భారత సంతతి వధువు ఎలాంటి విగ్గులు ధరించకుండా పెళ్లి చేసుకుని నెటిజన్ల మనసులను దోచుకుంది.
అమెరికాకు చెందిన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ నీహార్ సచ్‌దేవా భారత మూలాలున్న అమ్మాయి. ఆమె అందానికి ఉండే ప్రమాణాలను సవాలు చేసేలా తన అసలైన రూపంతోనే పెళ్లి చేసుకుంది. ఆమెకు చిన్న వయసులోనే అలోపేసియా బారినపడింది. దీని కారణంగా బాధితులకు కురులు ఉండవు.
ఎందుకంటే అలోపేసియా(alopecia) అనేది రోగనిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్లపై దాడిచేసే పరిస్థితి. దీని ఫలితంగా జుట్టు ఘోరంగా రాలిపోతుంది. అయితే వివాహం వంటి కార్యక్రమాల్లో జుట్టు లేని అమ్మాయి/అబ్బాయి ఇద్దరు కూడా ఆ వేడుకల సంప్రదాయం రీత్యా విగ్గులు(wigs) ధరించే పెళ్లిచేసుకుంటారు. గానీ ఈ అమ్మాయి ఆ నిబంధనలను సవాలు చేసేలా ఆత్మవిశ్వాసంగా తానెలా ఉన్నానో అలానే పెళ్లి చేసుకుంటానంటూ ముందుకు వచ్చింది.
అలానే వివాహ దుస్తుల్లో బట్లతల(Bald)తోనే వివాహం(wedding) గ్రాండ్‌గా చేసుకుంది. తనను అలానే ఇష్టపడాలి అన్నట్లుగా పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లంతా ఆ అమ్మాయిని ఔను..! "బట్టతల అందమే" అంటూ ప్రశంసిస్తూ ఆమెకు మద్దతు పలికారు.
అంతేగాదు ఈ సమస్యను మనం ముందుగా మనస్పూర్తిగా అంగీకరిస్తే అవతివాళ్లు కూడా సహృద్భావంతో అంగీకరించగలుగుతారని అంటోంది కంటెంటట్ క్రియేటర్ నీహార్. ఆ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నీహార్ నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్‌గా మారాయి.
(చదవండి: కేన్సర్‌ని జయించి..ఇవాళ రూ. 39 లక్షల వ్యాపార సామ్రాజ్యం..!)
Tags