మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
Maha Kumbh Mela అద్భుతమైన అనుభవం: నీనా గుప్తా ప్రశంసలు
Published on Fri, 02/07/2025 - 17:01
మహా కుంభమేళా 2025 (Maha KumbhMela2025) ఉత్తర ప్రదేశ్‌లోని మహాకుంభమేళా అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. దేశ,విదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాల ఆచరిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులతో సహా పలువురు రాజకీయ నాయకులు, క్రీడా, సినీరంగ ప్రముఖులు కూడా కుటుంబ సమేతంగా ప్రయాగరాజ్‌కు తరలి వెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర రాజకీయ నాయకులు కూడా పవిత్ర స్నానం ఆచరించారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెఖావత్ , అర్జున్ రామ్ మేఘ్వాల్ వంటి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇంకా నటి హేమా మాలిని, అనుపమ్ ఖేర్, భాగ్యశ్రీ, మిలింద్ సోమన్ వంటి నటులు, కవి కుమార్ విశ్వాస్, క్రికెటర్ సురేష్ రైనా, రెజ్లర్ ది గ్రేట్ ఖలీతో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కోవలో ఇపుడు బాలీవుడ్ నటి నీనా గుప్తా (Neena Gupta) చేరారు.
బాలీవుడ్ స్టార్స్ నీనా గుప్తా , సంజయ్ మిశ్రా మహా కుంభమేళాను సందర్శించి సంగంలో పవిత్ర స్నానం చేశారు. 2022 చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న వారి ప్రాజెక్ట్ వాధ్ 2 కోసం ఇద్దరూ ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. ఈ సందర్బంగా నీనా గుప్తా తన అనుభవాన్ని పంచుకున్నారు. తొలి సారి కుంభమేళాను సందర్శించాననీ, తనకు ఇంత తన జీవితంలో ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఇది తనకు చాలా ప్రత్యేకమైన అనుభవాన్నిచ్చిందని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల ఇప్పటికి నెరవేరిందనీ, ఇది "విశిష్ట అనుభవం" అని అభివర్ణించారు.
"నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం... చివరకు, ఈ రోజు పుణ్య కుంభ స్నానం చేసాను" అని చెప్పారు. అంతేకాదు ప్రభుత్వం ఇంత బాగా నిర్వహించడం కూడా తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చింది.
#WATCH | Prayagraj, UP | At #MahaKumbhMela2025, actor Neena Gupta says, "I have been wanting to come here for years... It was a unique experience... Finally, I took a dip today... The atmosphere here is crazy. I have never seen a bigger gathering in my life... I am impressed by… pic.twitter.com/kLHwVCbAL9
— ANI (@ANI) February 7, 2025
మరోవైపు చక్కటి వ్యవస్థీకృత ఏర్పాట్లు, భద్రత, పారిశుధ్యం. సౌకర్యాలు అన్నీ చాలా బావున్నాయి అంటూ నటుడు సంజయ్ మిశ్రా ప్రశంసించారు. రద్దీ తక్కువగా ఉంటుంది అనుకున్నాను..కానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉందంటూ తన అనుభవాన్ని పంచు కున్నారు.
గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద జరిగే మహా కుంభమేళా అత్యంత ముఖ్యమైందిగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి పోతాయని, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ్2025 ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఈ విశిష్ట కార్యక్రమం మరికొన్ని రోజుల్లో ముగియనున్న కారణంగా భక్తులసంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా
కాగా ఇటీవల పంచావత్ సిరీస్‌తో నటిగాతానేంటో నిరూపించుకున్ననటి నీనా గుప్తా. తనదైన నటనతో అనేక సినిమాల్లో ఆకట్టుకుంది. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ద్వారా కుమార్తె మసాబాకు జన్మనిచ్చింది. ఒంటరిగానే ఆమెను పెంచి పెద్దదాన్ని చేసింది. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్న మసాబా రెండో పెళ్లి చేసుకుని ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
Tags