ఈ ఘటనకు టీటీడీ చైర్మన్, ఎస్పీ, ఈవోనే కారణం: రోజా
Breaking News
ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం
Published on Wed, 01/08/2025 - 17:07
జీవితం ఎపుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. జీవితం పట్ల దృక్పథం మారి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీన్నివిధి లిఖితం అంటారేమో. ఆగ్రాకు చెందిన 13 ఏళ్ల రాఖీ సింగ్ కథ వింటే ఎవరికైనా ఇలానే అనిపించకమానదు.
ఆగ్రాకు చెందిన రాఖీ సింగ్ అనే బాలిక కేవలం 13 ఏళ్ల వయసులోనే ప్రాపంచిక ప్రపంచానికి దూరంగా బతకాలని నిర్ణయించుకుంది. దైవ మార్గంలో నడిచేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈమె చిన్నప్పటినుంచీ ఐఏఎస్ అధికారి కావాలని కలలు కనేది. ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ శిబిరాన్ని ఆమె సందర్శించిన తరువాత ఆమె ఆలోచన మారిపోయింది. సాధ్విగా మారాలని నిశ్చయించుకుంది. ఆమె నిర్ణయానికి తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలిచారు. ఆమెను హృదయపూర్వకంగా సమర్థిస్తున్నామనీ, ఆశ్రమానికి తమ కుమార్తెను ఇష్టపూర్వకంగా ఇస్తున్నామని ప్రముఖ మహంత్ (మత నాయకుడు)తో తెలిపారు. ఈ కుంభమేళా తర్వాత మహంత్ కౌశల్ గిరి ఆశ్రమంలో భాగం అవుతుంది రాఖీ.
ఎవరీ రాఖీ సింగ్
ఆగ్రా జిల్లా దౌకి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సందీప్ సింగ్ ధాకార పెద్ద కుమార్తె రాఖీ. అఖారా సంప్రదాయం ప్రకారం ఆమె గౌరి అని పేరు పెట్టారు. జనవరి 19న 'పిండాన్' ఆచారాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత రాఖీ కుటుంబంలో ఇక భాగంగా ఉండదు. అఖారాలో సభ్యురాలిగా సాధ్విగా ఉంటుంది.
ఆగ్రాలో నివసిస్తున్న ఆమె కుటుంబం, ప్రముఖ హిందూ సన్యాసులలో ఒకటైన జునా అఖారాకు చెందిన మహంత్ కౌశల్ గిరి మహారాజ్‌తో కనెక్ట్ అయినప్పుడు రాఖీ ప్రయాణం ప్రారంభమైంది.గత మూడేళ్లుగా,తమ గ్రామంలో మహంత్ కౌశల్ గిరి భగవత్ కథా సెషన్లు నిర్వహించారు. ఈ సమయంలో రాఖీ, ఆమె కుటుంబంతో సహా, అతని బోధనల ద్వారా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ సెషన్లలో ఒకదానిలో రాఖీ తన గురు దీక్ష లేదా దీక్షను తీసుకుందట. అంతేకాదు ఆమె ఆధ్యాత్మిక మార్గానికి నాంది పలికింది ఆమె తల్లి రీమా సింగ్ . ఫలితంగా గౌరీ గిరిగా పిలువబడే రాఖీ పవిత్ర పరిత్యాగ ప్రక్రియ తరువాత కొత్త ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
కాగా 12 ఏళ్ల తర్వాత మహాకుంభ మేళా జనవరి 13 నుంచి మహా కుంభ మేళా జరగబోతోంది. ఈ మేళాకి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహా కుంభ మేళా.. ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. దేశవ్యాప్తంగా వేర్వేరు అఖారాల నుంచి అఘోరాలు, స్వాములు, రుషులు వస్తూన్నారు. ముఖ్యంగా కొన్ని అఖారాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అటల్ అఖారా, మహానిర్వాణి అఖారా, నిరంజని అఖారా, అశ్వాన్ అఖారా, జునా అఖారా ఇవన్నీ అలాంటివే. ఇవన్నీ మహా కుంభమేళాలో తమ క్యాంపులను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే.
Tags